ॐ వినాయక చవితి శుభాకాంక్షలు
సందేశం 3/11
అగజానన పద్మార్కం
గజానన మహర్నిశం
అనేకదం తం భక్తానామ్
ఏకదంతముపాస్మహే ॥
- అనే శ్లోకం చాలా కాలంనుండి ఆనవాయితీగా వస్తున్నది.
అగజ ఆనన పద్మ అర్కమ్
గమించనిది కొండ. అట్టి మంచుకొండ కూతురు పార్వతి. పార్వతి ముఖపద్మానికి సూర్యునివంటి వాడని అర్థం.
సూర్యుని పోలిన వినాయకుని చూచినంతనే అగజానన పద్మము వికసిస్తుంది.
గజాననం అహర్నిశం ఉపాస్మహే
- వినాయకుని రేయింబవలూ ఉపాసిస్తాను అని అర్థం.
రేయింబవలూ ఉపాసనచేయటం మనదేశంలోనే సాధ్యం.
అనేకదం తం భక్తానామ్
అనేకదం- తమ్ - భక్తానామ్
- అని విడదీయాలి.
అంటే, భక్తులను స్వామి అనేక విధాలుగా అనుగ్రహిస్తాడు.
దంతం - విశేషం
ఒక్కొక్క ప్రాణికి ఒకొక్క విషయమునందెక్కువ ప్రీతి.
చమరీమృగం తోక అంటే,
నెమలికి తన పింఛమే
బంగారం.
ఏనుగునకు దంతాలంటే ప్రాణం .దేహం ఎలాగున్నా ఏనుగు తన దంతాలను మాత్రం తెల్లని కాంతులు వెదజల్లుతూ ఉండేటట్లుగా కాపాడుకుంటుంది.
గజాననుడు - భారతం
కానీ గజాననుడు తాను అందం చందం గౌరవం వీటి అన్నింటికీ మూలాధారమైన ప్రాణప్రదమైన దంతాన్ని, చటాలున పెరికి మహాభారత రచనా సందర్భంలో కలముగా చేసికొన్నాడు.
న్యాయం ధర్మం విద్య - వీటికొరకు ఎంతటి త్యాగమైనా చేయవచ్చునని ఈయన ఈ పనితో నిరూపించారు.
దైవానికి ఉపకరణం నిమిత్తమాత్రమనిన్నీ, విద్యావ్యాప్తికి సత్యం జ్ఞానం ధర్మం, ఇవి వ్యాపించడానికి ఉత్కృష్టమైన ఎట్టి దేహావయవమునైనా త్యాగం చేయవచ్చుననీ నిరూపణకే ఈ మహామహుడు మహాభారతం వ్రాశాడని గోచరమవుతున్నది .
వినాయకుడు ప్రణవ స్వరూపి.
వినాయకుడు విఘ్నవినాశకుడు.
ఆయన అనుగ్రహబలం ఉంటే అంతా అనుకూలమే.
గిరిరాజసుతా తనయుడు
లోకంలో పనులు అన్నీ విఘ్నం లేకుండా జరగాలంటే వినాయకుని అనుగ్రహబలం మనందరికీ కావాలి.
అందులకే త్యాగరాజస్వామి
"గిరిరాజసుతా తనయా" అని గానం చేశారు.
గిరిరాజసుతా తనయ
(త్యాగరాజ కీర్తన)
----------------
పర్వతరాజైన హిమవంతుడి కుమార్తె - పార్వతియొక్క పుత్త్రుడా!
మంచి దయ కలిగినవాడా!
దేవేంద్రుడు మొదలైనవారిచేత అర్చించబడే పాదద్వయం కలిగినవాడా!
గొప్ప ఏనుగు ముఖం కలిగినవాడా!
నన్ను రక్షించుము.
గణపతీ!
శ్రేష్ఠులకు శ్రేష్ఠుడా!
శుభాన్ని కలుగజేసేవాడా!
వేదములనే సముద్రానికి చంద్రుడా!
(చంద్రుడిని చూచి సముద్రం ఘోషిస్తూ ఉప్పొంగుతుంది - వేదాలు భగవంతుడిని స్వరసహితంగా స్తుతిస్తాయి)
చేతి కంకణముగా పాములరాజును కలవాడా!
ఆటంకాలను అడ్డుకొనేవాడా!
శంభువు కుమారుడా!
త్యాగరాజుచేత స్తుతింపబడేవాడా!
కీర్తన
గిరిరాజసుతాతనయ! సదయ! ॥గిరి॥
సురనాథముఖార్చిత పాదయుగ! - పరిపాలయ మామిభరాజముఖ! ॥గిరి॥
గణనాథ! పరాత్పర! శంకరా(ఆ) - గమవారినిధి రజనీకర!
ఫణిరాజకంకణ! విఘ్ననివారణ! శాంభవ! శ్రీత్యాగరాజనుత! ॥గిరి॥
https://youtu.be/yUeG8JxyHMM
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి