18, సెప్టెంబర్ 2023, సోమవారం

బసవ పురాణం - 34 వ భాగము

 🎻🌹🙏బసవ పురాణం - 34 వ భాగము


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌷గోవూరుబ్రహ్మయ్య కథ


🌸గోవూరు బ్రహ్మయ్య అనే భక్తుడు ఒక జైనునితో వాదించి ఓడించాడు. జైనుడు ‘ఈ వాదాలెందుకు? ఈ మర్రి చెట్టును కాలిస్తే బతికిస్తావా?’ అన్నాడు. 


🌿సరేనని బ్రహ్మయ్య చిరునవ్వు నవ్వాడు. జైనుడు మర్రిచెట్టును కాల్చాడు. బ్రహ్మయ్య దానిపై భస్మం చల్లి బతికించి జైనులందరినీ ఓడించాడు.


🌷తేడర దానయ్య


🌸పొట్ల చెరువు అనే నగరంలో ఏడు వందల జైనవసదులున్నాయి. ఇరవై వేలమంది జైనులు అందులో వున్నారు. భల్లహడనే నగర పాలకునికి జైనా చార్యుడే గురువు సింహభల్లహుని భార్య సగ్గలదేవి. 


🌿ఆమె శివభక్తురాలు. గురువు తేడర దాసయ్య. భర్త చెప్పినా వినక గురువును పాదపూజకై పొట్లచెరువు పిలిపించింది.దాసయ్యకూ జైనులకూ శాస్తవ్రాదం జరిగింది. అందులో దాసయ్య సమస్త సిద్ధాంతాలు ఖండించాడు. ‘


🌸రామనాధుడే’ కర్త వేదాల ప్రకారం ఏకమేవ రుద్రో’ అనీ ‘లింగమధ్యే జగత్సర్వ’మనీ ‘లింగబాహ్యాత్పరం నాస్తి’ అనీ ఉన్నది కాబట్టి ‘ఈశ్వరుడే పరదైవం’ అని ప్రతిపాదించాడు. 


🌿ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే ఈ కుండలో ఈశ్వరుడున్నాడు పట్టుకో’’ అని జైనులు ఒక కుండలో నాగు పామును పెట్టి తెచ్చారు. తేడర దాసయ్య శివనామస్మణ చేసి కుండలో చేయి పెట్టి పామును పైకి తీశాడు. 


🌸సర్పం స్ఫటికలింగమై పైకి వచ్చింది. ఆ లింగాన్ని ఉత్తరేశ్వరుడనే పేర అక్కడే ప్రతిష్ఠ చేసి బల్లహునితో సహా సమస్త ప్రజలనూ శైవంలో చేర్పించాడు.


🌷హిరియ నాచయ్య కథ


🌿మారుడిగ అనే చోట హిరయ నాచయ్య అనే భక్తుడు ఉండేవాడు. అక్కడ పదిహేడు వందలమంది జైనులు విజృంభించి శివాలయాన్ని పడగొట్టి పూజారిని హింసించారు.


🌸అది చూచి నాచయ్య పదిహేను వేల లింగాలను బండ్లకెత్తించి పనె్నండు వేల శివభక్తులతో వచ్చి మారుడిగలో దిగి యుద్ధానికి సిద్ధమైనారు. 


🌿అందులో పదముగ్గురు తేరసులు అనేవారు నాచయ్యకు వదనం చేసి తమ తలలు తామే తరుక్కొని చేత బట్టుకొని జైనులపై పడ్డారు. జైనులు చిందర వందర అయినారు.


🌸జైన వసతులన్నింటిలోనూ లింగ ప్రతిష్ఠలు చేసి తిరిగి తమ తలలు తాము యధాస్థానంలో ఉంచుకొని తమ నాయకుడైన నాచయ్య మహిమను ప్రదర్శించారు.


🌷సోమన్నగారి కథ


🌸హుళిగఱ అను నగరంలో సోమన్న అనే శివభక్తుడున్నాడు. త్రికాల శివస్పర్శ అతని నియమం. ఒకనాడు కన్నులు కనబడక శివస్పర్శ చేయలేక భుజింప కూర్చొని యుండగా జైనులు వచ్చిరాశివాలయానికితీసుకుపోతాము’ 


🌿అని చేయి పట్టుకొని వెళ్లి జైన విగ్రహానికి మోకరిల్లజేయించి ‘జినుడు ప్రత్యక్షమైనాడులే!’ అన్నారు నవ్వుతూ. సోమన్న రోషంతో ‘మూర్ఖులారా! వంచన చేస్తారా?’ అని బలవంతంగా కన్నులు తెరిచి చూచాడు. 


🌸జిన విగ్రహం పగిలి నడుమ లింగం ఆవిర్భవించింది. జైనులు భయభీతులైనారు. లింగాన్ని సోమేశుడనే పేర నాటినుండీ అంతా పిలవసాగారు.


🌷వైజకవ్వ కథ


🌿పూర్వం వైజకవ్వ అనే భక్తురాలు ఉండేది. ఆమె భర్త జైనుడు. జైనులకోసం వంటలు చేయించాడు. ‘ఒక్క లింగ ప్రాణి అయినా తినకుండా వంటలు వ్యర్థమవుతున్నాయే


🌸అని వైజకవ్వ దుఃఖిస్తూ ఉండగా శివుడు శివముని రూపంలో వచ్చి వైజకవ్వ వంట ఆరగించాడు. అది చూచి జైనులు మండిపడి వైజకవ్వ మొగుడితో చెప్పారు.


🌿అతడు ‘జైనులకు పెట్టకుండా ఒక శివుడికి పెట్టావా?’ అని కోపగించి భార్యను కొట్టసాగాడు. కానీ వైజకవ్వను శివుడు కాచాడు. ఆమెపైన పడే దెబ్బలన్నీ జైనులపైబడి జైనులు ప్రాణాలు విడవసాగారు.


🌸‘్భర్త శైవేతరుడైనప్పుడు అతనిని విడవడమే ధర్మం’ అని భావించి వైజకవ్వ శివుణ్ణి ప్రార్థించి పురుషునిగా మారిపోయింది. వైజకనాథుడనే పేర ప్రసిద్ధుడైనాడు.


🌷షోడ్డలదేవు బాచయ్యగారి కథ


🌿షోడ్డలదేవు బాచరసు అనే భక్తుడు బిజ్జలుని కొలువులో ఉండేవాడు. శివరాత్రికి సౌరాష్ట్రం పోవాలని సంకల్పించి ప్రభువుతో చెప్పగా ‘చాలు చాలు నీవు పోతే ధాన్యం పని ఎవరు చూస్తారు?’ అని రాజు మందలించాడు. 


🌸గత్యంతరం లేక బాచరసు ‘నేను రాలేను ప్రభూ. నీవే రా’ అని ప్రార్థించాడు. సౌరాష్ట్ర లింగం ధాన్యపుగాదెలోప్రత్యక్షమైంది...సశేషం...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

కామెంట్‌లు లేవు: