|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️
ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐
𝕝𝕝శ్లో𝕝𝕝 *రణత్క్షుద్రఘణ్టానినాదాభిరామం*
*చలత్తాణ్డవోద్దణ్డవత్పద్మతాలమ్।*
*లసత్తున్దిలాఙ్గోపరివ్యాలహారం*
*గణాధీశమీశానసూనుం తమీడే॥*
~శ్రీగణేశభుజఙ్గస్తోత్రమ్
𝕝𝕝తా𝕝𝕝
మ్రోగుచున్న చిరుగవ్వల సవ్వడిచే మనోహరుడు, తాళముననుసరించి ప్రచండతాండవం చేయుచున్న పాదపద్మములు కలవాడు, బొజ్జపై కదులుతున్న సర్పహారములు కలవాడు, ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.
శుభోదయం🙏
అల్లసాని వారి చమత్కారమ్!
"అంకముఁ జేరి శైలతయా స్తన దుగ్ధము లానువేళ బా
ల్యాంక విచేష్ఠ తొండమున నవ్వలి చన్గబళింపఁ బోయి ఆ
వంకఁగుచంబు గానకహివల్లభ హారముఁగాంచి వేమృణా
ళాంకుర శంక నంటెడు గజాస్యునిగొల్తు నభీష్ఠసిధ్ధికిన్;
-పీఠిక -మనుచరిత్రము.
భావము; "బాలగణపతి తల్లియొడిలోకెక్కి చనుబ్రాలు తాగుతూ, మరొకవంకనున్న స్తనమును నోటబెట్ట ప్రయత్నించి ,అవైపు(కుడివైపు)స్తనమును గానక వ్రేలాడు సర్పమును తామర తూడుగా భ్రమించి నోట దాని నందుకొనజూచుచున్నాడట! అట్టి బాలగణపతిని నాకోరిక దీర్ప సేవింతును".-అని
విశేషములు:
బాలురు తల్లిపాలుద్రాగుచు, నొకచేతితో తాముగుడుచుచున్న స్తనమును పుణుకుచు,వేరొకచేత నవతలివైపు స్తనమును పుణుకుట సహజము.
పార్వతి ఒడిలో నిడుకొని బాలగణపతికి చనుగుడుపసాగినది.అతడూరకుండునా ? బాలుడాయె, వెర్రిపనులకు ప్రయత్నించుచున్నాడు.ఏమాప్రయత్నము? అటువైపు చన్నుకొరకు వెదకులాడు చున్నాడు.పాపమాతల్లి యర్ధనారీశ్వరి.ఆమెతనువున ఎడమ భాగమునస్త్రీత్వము,కుడివైపు పరమేశ్వరత్వము.)అనగా పురుషత్వము)
ఆభాగమున మనగణపతి తడవులాట. అట స్తనము లేదుసరిగదా సర్పహారములు వ్రేలాడుచున్నవి.పాపము!బాలుడుగదా పాములనియెరుగక వానిని నోట బెట్టు చున్నాడట.
వీడెంతవెర్రిబాలుడు? అట్టిగణపతి నాకభీష్ఠప్రదాతయగుత! అనుచున్నాడుకవి.
ఇదియొక కల్పన!
దీనిమూలముగా ఆదిశక్తి పార్వతి యర్ధనారీశ్వరి యగుట సూచన!
బాలుర వింత చేష్ఠలను నివరించుట,
అను నవియే ప్రయోజనములు.
పాములను తామరతూడులుగా భ్రమపడుట ఇది భ్రాంతి మదలంకారము.
ఏనుగులకు తామరతూడులాహారము.
కనుక సహజోక్తి.
బాలురచేష్ఠల ప్రదర్శనముచే,బాలురు భ్రమపడుటయు,వారిస్వభావమే! స్వభావోక్తి,
అను నలంకారములిందుగలవు. స్వస్తి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి