26, అక్టోబర్ 2023, గురువారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 75*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 75*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


నరేంద్రుడు ఒక రోజు శ్రీరామకృష్ణుల గదిలోకి వెళ్లి. "అందరికీ ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతున్నాయి. నాకు మటుకు ఎందుకు ఏదీ లభించడం లేదు? నాకు కూడా ఏదైనా లభించాలి" అన్నాడు. "సరే, నీకు ఏం కావాలి?" అని శ్రీరామకృష్ణులు అడిగారు. అందుకు నరేంద్రుడు, "మూడు నాలుగు రోజులు అవిచ్ఛిన్నంగా సమాధి స్థితిలోనే లీనమై ఉండిపోవాలి.  ఏదో ఆహారం నిమిత్తం అప్పుడప్పుడు మనస్సు క్రిందికి దిగి రావాలి" అన్నాడు. 

 

ఆ మాటలు విని శ్రీరామకృష్ణులు, "నువ్వొక అవివేకివి. ఇదా ఉన్నత స్థితి? ఇంతకన్నా అత్యున్నత స్థితి ఉంది. 'ఉన్నవన్నీ నువ్వే' అని నువ్వే పాడతావు కదా! ఆ స్థితిని నువ్వు అనుభవించవచ్చు. కాని అంతకు ముందు నీ కుటుంబానికి అవసరమైన ఏర్పాట్లు చేసి రా" అన్నారు.


మర్నాడు నరేంద్రుడు ఇంటికి వెళ్లాడు. చదువు, తిండి విషయాలలో ఏమీ పట్టించుకోకుండా ఉంటున్నందుకు తల్లి అతణ్ణి గట్టిగా మందలించింది. కుటుంబానికి ఏమైనా చేయాలని మళ్లీ చదువు మీదకు దృష్టి సారించాలనుకొన్నాడు. నరేంద్రుడు. కనుక అమ్మమ్మ ఇంటికి వెళ్లి చదువుకోనారంభించాడు. పుస్తకం చేతిలోకి తీసుకోవడమే తరువాయి ఎక్కణ్ణుందో భయోద్వేగం వచ్చి అతణ్ణి ఆవహించింది. తాను ఏదో తప్పు చేస్తున్నట్లుగా అతడికి అనిపించింది. ఏమను కొన్నాడో ఏమో హఠాత్తుగా పుస్తకాలను అట్లే విసిరివేసి పరుగెత్తసాగాడు. 


ఏదో ఒక శక్తి అలా పరుగెత్తించినట్లుగా ఆవేశంలో అతడు పరిగెత్తాడు. పరుగు వేగంలో చెప్పులు, ఇతర వస్తువులు దారిలో చెల్లాచెదరుగా అక్కడక్కడా పడి పోయాయి. దారిలో ఉన్న గడ్డివామును మోదుకోవడంతో ఒళ్లంతా గడ్డిపరకలే! అందుకు తోడు జోరున వాన! పిచ్చిపట్టిన వాడిలా అతడు పరుగెత్తాడు. చివరికి ఆగింది కాశీపూర్ లో. 


నరేంద్రుడు తిన్నగా మేడ మీద ఉన్న శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లాడు. అప్పుడు ఆయన నిద్రపోతున్నారు. భరించరానంత గొంతు నొప్పితో బాధపడుతున్నారు. రాత్రి దాదాపు తొమ్మిది గంటలకు ఆయన నిద్రలేచారు. లేవ గానే నరేంద్రుణ్ణి గురించే మాట్లాడారు: “నరేంద్రుని పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంది. ఒకప్పుడు అతడు సాకార భగవంతుణ్ణి విశ్వసించేవాడు కాడు. ప్రస్తుతం చూడు, భగవదనుభూతి కోసం ఎంత తల్లడిల్లిపోతున్నాడో!".🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: