📚 ఆలోచనాలోచనాలు 🧠 ***** మహా సముద్రం తాడిచెట్టంత అలలతో చెలియలి కట్టను తాకుతున్నది. హోరుమనే ధ్వనితో చెవులు చిల్లులు పడేంత ధ్వని మార్మ్రోగుతున్నది. తుంటరి పిల్లవాడొకడు ఒక రాయిని చేతబట్టి సముద్రం పైకి విసిరాడు. ఏం జరుగుతుంది? - - - - - ఏమీ జరగలేదు. విసరబడిన రాయి నీళ్ళ అడుగుకు వెళ్ళింది. ఎంత? మన కంటికి కనుపించనంతగా! మన వ్యక్తిత్వాలు గూడా సాగరమంత ఉన్నతంగా వుంటే అల్పులు ఎన్ని విమర్శలు, ఎంత కాలం చేసినా సాగరంపైకి విసరబడిన రాళ్ళలాగే అదృశ్యమౌతాయి. ***** కొత్తగా ఒక రైలు పెట్టె స్టేషన్ లో నిలచివుంది. దానిని మెల్లగా ప్రయాణించే పాసింజర్ ట్రైన్ తో కనెక్ట్ చేశారు. అది నెమ్మదిగా, ఊరూరు ఆగుకుంటూ పెళ్లి నడకలతో ముందుకు సాగిపోతూ వుంటుంది. దానినే ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు కలిపారు. తక్కువ స్టేషన్లలో ఎక్కువ వేగంతో పరుగెడుతుంది. కాదు! దానిని కొత్తగా ప్రవేశపెట్టిన"" వందే భారత్"" స్పెషల్ ట్రైన్ తో కనెక్ట్ చేశారు. బుల్లెట్ లాగా దూసుకపోతుంది. రైలు పెట్టెలో ఆ గొప్పతనం లేదు. దానికి మార్గదర్శనం గావించే "" రైలు ఇంజన్"" బట్టి దాని వేగం మారుతున్నది. మనం కూడా అంతే! మనం ఆదర్శంగా ఎంచుకొన్న మహనీయుల జీవిత లక్ష్యాలను బట్టి మన గమ్యాలు మారిపోతుంటాయి. అందుకనే మహనీయుల స్ఫూర్తి గాథలను మననం చెయ్యాలి. ***** రెండు చెవులున్నాయి. వాటి ద్వారా విన్నావు గాబట్టి, అవి నిజమని నమ్మాల్సిన అవసరం లేదు. మత గ్రంథాల్లో పేర్కొనబడివుందనో, గురువులో, పెద్దవాళ్ళో చెప్పారని గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. సాధారణంగా పైనున్న నీళ్ళే క్రిందికి ప్రవహిస్తూవుంటాయి. కొంచెం వివేకంతో పరిశీలించు. కార్యకారణ సంబంధాలను వెదకు. నీ ఆలోచనావిధానం పదిమందికి ఉపయోగపడుతుందని నమ్మకం కలిగితే దృఢంగా ఆచరణలోకి తీసుకొనిరా! నీ ఆచరణకు తగినట్లుగ నీ జీవితవిధానాన్ని మార్చుకో! నువ్వెవరికి తలవంచాల్సిన పని లేదు.--- గౌతమ బుద్ధ. ***** హృదయంలో నైతిక పరివర్తన ఉంటే- - - మనిషి ప్రవర్తన అందంగా ఉంటుంది. వ్యక్తిలో ప్రవర్తన అందంగా ఉంటే - - - ఇంటిలో ప్రేమ, శాంతి, సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంటిలో ప్రేమ, శాంతి, సంతోషాలు నెలకొంటే - - - దేశంలో క్రమశిక్షణ, పరోపకారభావాలు వర్థిల్లుతాయి. దేశంలో క్రమశిక్షణ, పరోపకారభావాలు పరిఢవిల్లితే - - - ప్రపంచం అంతటా శాంతి, సౌభాగ్యాలు వర్థిల్లుతాయి. ---- స్వామి వివేకానంద. ***** వేదిక మీద ప్రసంగం చాలా గొప్పగావుంది. కానీ దానిలో వ్యక్తులను మార్చగల శక్తి లేనప్పుడు అది సారహీనం. మాట్లాడటం అనేది భావనల మార్పిడి కొరకేగాని , కాలక్షేపానికి, కరతాళధ్వనుల మూల్యం పొందటానికైతే కాదు. నీవు మాట్లాడే మాటలలో ఏదైనా సందేశాత్మక విషయం ఉంటే నీ ముందున్న జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పు; వివరించు. ఇవేవి లేకపోతే మౌనాన్ని ఆశ్రయించు. నీ మౌనం ప్రజలకు వెయ్యి భావనలను ప్రేరేపించగలదు. ***** వ్యక్తి లో ఒక ఆలోచనను నాటు --- అది ఒక పనిగా ఎదుగుతుంది. పనిని నాటుకొంటూ పో--- అది అలవాటుగ మారుతుంది. అలవాట్లను నాటుకొంటూ పోతుంటే ---- అవి వ్యక్తిత్వాలను రూపుదిద్దుతాయి. వ్యక్తిత్వాల ద్వారా తలరాతలు మారతాయి. కాబట్టి మన తలరాతలను సరిదిద్దుకోగలిగేది మనమే! పైన ఎక్కడో అజ్ఞాతంగా ఉండే దేవతలు కాదు. మీలో అణగివున్న నైపుణ్యం, ఆశయం, స్ఫూర్తి, ఆలోచనాధారలను తడిసి , ఆపై బాగా ఆరనివ్వండి. ఎంతకాలం? మీలోని దౌర్బల్యం , బలంగా మారేంతవరకు, మీలో దాగివున్న "చీకటి" తెల్లబోయి " వెలుతురు" గా మారేంతవరకు.----- ~~~~~~~~~~~~~~~~~~~. Sharpen your mind! 1* What comes once in a minute , twice in a moment, but never in a thousand years? 2* What can you hold in your right hand, but never in your left hand? 3* What has four fingers and a thumb, but is not living? (For proper answers you have to wait 24 hours only.). ~~~~~~~~~~~~~~~~~~~. అర్థబేధము గల పదములు. 1* విదురుడు= భారతము లోని వ్యక్తి (ధృతరాష్ట్రునికి సోదరుడు) విధురుడు= భార్య గతించిన వ్యక్తి. 2* శరీరము = దేహము శరీరాము = కంఠస్వరము. 3* షష్టి = అరువది. షష్ఠి = ఆరవ తిధి. 4* సజ్జ = పూలబుట్ట. సెజ్జ = పాన్పు (పడక) 5* సతము = ఎల్లప్పుడు. శతము = నూరు(వంద) * * * * * * * * * * * * * * * * * * * * పదాలు --- పర్యాయపదాలు. 1* అంక ; --- అంచల, బరి, మయి, మేను, వంక, వైపు. 2* అంకిలము ; ---- మొలక, మొక్క, మోటిక, మొట్టిక, మొటిక. 3* అంకుశము ;---- తోత్రము, వైణుకము, సృణి, అంకుసము. 4* అంగడి;---- దుకాణము, విపణి, పచారము, మణిగ. 5* అంగారకుడు;---- ఆరుడు, వక్రుడు, భౌముడు, కుజుడు. తేది 26--10--2023, గురువారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి