19, డిసెంబర్ 2023, మంగళవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


ఋత్విక్కులుగా వచ్చిన మునీశ్వరుల మనస్సులు విలవిలలాడాయి. పసిబాలుణ్ణి బలి ఇవ్వడానికి

చేతులు రాలేదు. నరకవలసిన విప్రుడు నేను ఈ ఘాతుకం చెయ్యలేనంటూ కత్తి విసిరేసి వెళ్ళిపోయాడు.

హరిశ్చంద్రుడు అవాక్కయ్యాడు. ఏమి చెయ్యడానికీ తోచలేదు. సభాసదులారా ! తరణోపాయం చెప్పండి

అని అభ్యర్థించాడు. సభలో కలకలం బయలుదేరింది.

అజీగర్తుడు లేచి, మహారాజా! నేను చేస్తాను, వేతనం రెట్టింపు ఇప్పించు, నేను నిరుపేదను.

నాకు ధనం కావాలి. నీకు పని అవ్వాలి అన్నాడు. హరిశ్చంద్రుడు సరే అన్నాడు. నూరుగోవులు

ఇస్తానన్నాడు. అజీగర్తుడు కత్తి అందుకున్నాడు. కొడుకును చంపడానికి సిద్ధపడిన తండ్రిని చూసి జనాలు

ఆశ్చర్యచకితులయ్యారు. హాహాకారాలు చేశారు. వీడు తండ్రి కాదు, పిశాచమంటూ నిందించారు.

మహాపాపీ క్రూరుడా! డబ్బుకోసం కక్కుర్తిపడి కన్నకొడుకును అమ్ముకోవడమేకాక, స్వయంగా

చంపుకోడావికీ సిద్ధమయ్యావా ? ఏం సుఖపడతావ్ ఈ డబ్బుతో. కొడుకంటే ఎవరు ? ఏమి చెబుతోంది

వేదం ? ఆత్మావై జాయతే పుత్రః అంగాద్వై వేదభాషితమ్. ఎంత పాపాత్ముడివిరా అని నలుగురూ

నాలుగు మాటలూ అన్నారు. సభ అంతా కోలాహలమైపోయింది.

అంతలోకీ విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. పరిస్థితి అర్థమయ్యింది. హృదయం ఆక్రోశించింది.

కామెంట్‌లు లేవు: