పొద్దునే లేచి కాఫీ తాగుతుంటే మా బాబాయ్ పేపర్ లోనుండి తల పైకెత్తి నన్ను పిల్చాడు...
*ఒరే అబ్బాయ్...ఏమిట్రా ఈ ఒకట్ల గోల(1,1,1...),మా చిన్నప్పుడు ఒక పరీక్షల్లో ఒకే ఒక ఒకటి వుండేది, ఇప్పుడు ఏమిట్రా, అందరూ 1,1,1,....వేస్తున్నారు,కొంచం విడమర్చి చెప్పరా* అన్నాడు.
బాబాయ్ పూర్తి గా తెలుసుకొనిదే ఏది వదలడు,బాబాయ్ కి నిద్రపట్టదు,తిన్నది అరగదు.
బాబాయ్ కి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను.
ఇంతలోనే మరల అరిచినంత పని చేశాడు,*ఏమిట్రా పొద్దునే ఆ పరధ్యానం*...
ఇంకా తప్పదు అని మొదలెట్టాను...*బాబాయ్, నీ కిష్టమైన భోజన పరిభాష లో ఒకట్ల(1,1,1,1...) గురించి చెప్తాను.కోప్పడకూడదు* అన్నాను.
*బాబాయ్ వెంటనే చెప్పరా బడుద్ధాయ్....అంటూ నవ్వాడు*
నీ ఫ్రెండ్స్ నలుగుర్ని మన ఇంటికి భోజనానికి పిలిచావు అనుకో,*పిన్ని* వాళ్ళందరికీ చక్కటి భోజనం వండి వార్చింది,అనుకో.
1) *ముద్ద పప్పు,కాచిన నెయ్యి అన్నం తో ఇద్దరు మొదలు పెట్టారు,అప్పుడు పప్పు తో ప్రారంభించడం లో ఒకరు ఫస్ట్(1), ఫస్ట్ ర్యాంక్*
2)పిన్ని చేసిన గుత్తి వంకాయ కూర ముగ్గురు *మారు అడిగారు, వంకాయ కూర మారు అడిగిన వాళ్ళలో ఒక ఆయన ఫస్ట్(1st ర్యాంక్)*
3) దప్పలం జుర్రుతూ అప్పడాలు కరకరా నలుగురు నమిలారు.
పెద్ద శబ్దం చేస్తూ నమలడం లో నువ్వు ఫస్ట్ ర్యాంక్(1).
4) గడ్డ పెరుగు విస్తట్లో వేస్కుని ఆస్వాదించడం లో సుబ్బయ్య మామయ్య ఫస్ట్,కాబట్టి ఆయనది ఫస్ట్ ర్యాంక్(1)
5) *ఇంకా ఏదో చెప్పబోతుంటే బాబాయ్ అడ్డంపడి,చాలు,చాలు,ఇంకేమి చెప్పకు ..నాకు పూర్తిగా అర్థం అయింది అని ... మరల పేపర్లో తలదూర్చాడు.*
నేను గుండెలనిండా గాలి పీల్చి,బాబాయ్ కేసి విజయ దరహాసంతో చూసి,చెప్పుల్లో కాలు పెట్టాను.
ఇంతలో మా *ఆవిడ* వంటిట్లో నుండి కేకేసింది...ఏమండీ మన చింటుగాడు నిన్న స్కూల్ లో రెండో ఎక్కం చూడకుండా రాయడం లో ఫస్ట్(1 ర్యాంక్) వచ్చాడు, పాపాయి బెంచి లో కూర్చున్న నలుగురు పిల్లల్లో ఫస్ట్ అంట (1) ఫస్ట్ ర్యాంక్.
*పరీక్ష వ్రాసిన అందరి పిల్లలకు ఫస్ట్ ర్యాంక్ రావాలి*.
సర్వేజనా,సమస్త జీవ,ప్రాణి కోటి సర్వావస్థల యందు సుఖీభవ...
మూర్తి, సీనియర్ ఫిజిక్స్ లెక్చరర్, కాలమిస్ట్,9985617100
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి