30, ఏప్రిల్ 2024, మంగళవారం

శతరుద్రీయము-48*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.              *శతరుద్రీయము-48*

(వ్యాఖ్య: శ్రీ తురుమెళ్ళ మాధవ కుమార్)

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

*చతుర్థానువాకము - 2 వ యజుస్సు*


*నమకనామాని : ఓం స్తేనానాంపతయే  నమః*



*నమ ఉగణాభాయస్తృగ్ం హతీభ్యశ్చవో నమః!*


ఓ రుద్రులారా! ఉత్కృష్ట గణరూపములుగల సప్తమాతృకల యందున్న మీకు నమస్కారము, హింసించుటకు సమర్థులయిన ఉగ్రదేవతా మూర్తులగు మీకు నమస్కారము♪.


*వివరణ:*

బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండా అను ఈ అమ్మవార్లు సప్తమాతృకలు♪. 


వీరి రూపములోనున్నది రుద్రుడే.  

ఇఱువది యేడు రథములు, 

ఇఱువదియేడు ఏనుగులు, 

ఎనభై ఒక్క గుఱ్ఱములు, 

నూటముప్పది యైదుగురు కాలిబంట్లు 

కలిగిన సేనా సమూహాన్ని *గణము* అంటారు. 


ఇటువంటి గణములు అనేకములు గలిగిన దేవతలు కాబట్టి *ఉగణములు* అన్నారు.


(రేపు.... చతుర్థానువాకం 3 వ యజుస్సు)


                                                                    *సశేషం.....*

        ❀┉┅━❀🛕❀┉┅━❀


*సేకరణ:* శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: