ॐ నర్మదానదీ పుష్కరాలు - మహేశ్వర్
నర్మదా నదీ పుష్కరాలు రేపటి నుంచీ ప్రారంభమవుతున్నాయి కదా!
నర్మదా నది ప్రత్యేకత
మూడు సంవత్సరాలు సరస్వతిలోనూ,
ఏడు రోజులు యమునా నదిలోనూ,
ఒక్కరోజు గంగానదిలోనూ స్నానం చేయడం వల్ల పుణ్యం వస్తుందంటారు.
కానీ నర్మదానదిని చూస్తేచాలు పాపాలన్నీ పటాపంచలవుతాయట.
గంగానది కూడా ఏడాదికి ఒకసారి నర్మదానదిలో స్నానంచేసి, తన పాపాలను (తనలో భక్తులు స్నానంచేయడం ద్వారా భక్తులపాపాలను) కడిగివేసుకుంటుంది.
గంగ నర్మదలో స్నానం చేసినరోజుని 'గంగాసప్తమి' అంటారు.
మహేశ్వర్
ఇది క్షిప్ర - నర్మద నదుల మధ్యప్రదేశంలో, నర్మదానది ఉత్తరతీరంలో, కార్తవీర్యార్జున క్షేత్రంగా పిలువబడుతూంటుంది.
మహేశ్వర్ - ప్రముఖ దేవాలయాలు
శ్రీ రాజరాజేశ్వర, కాశీ విశ్వనాథ, అహిల్యేశ్వర, జ్వాలేశ్వర, బాణేశ్వర, కాలేశ్వర, కాదంబేశ్వర, సప్తమాతృక మొదలైన దేవాలయాలు ప్రసిద్ధిచెందినవి.
ఈ పుష్కరంలో అన్నదానం
శ్రీవేంకటేశ్వర బ్రాహ్మణ నిత్యాన్నదాన ట్రస్ట్, ద్వారకా తిరుమలవారు,
ఈ మహేశ్వర్ క్షేత్రానికి వచ్చిన భక్తులకు
1/5/2024 నుండీ 12/5/2024 వరకూ
అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి