*2028*
*కం*
రోగము లేనట్టి తతుల
రోగులనట ఛీదరించు రుగ్మత నున్నన్
రోగము తానొందగ నను
రాగము కోరుదురు జనులు రయమున సుజనా.
*భావం*:-- ఓ సుజనా! రోగము తనకి లేనప్పుడు రోగులను చీదరించుకున్ననూ తనకు రోగం వచ్చినప్పుడు మాత్రం వెంటనే అనురాగం కోరుకుంటారు. (తతి= సమయం/తరుణం).
*సందేశం*:-- రోగులను చూసి జాలిపడకపోయినా అసహ్యించుకోకుండా ఉంటే మనకు రోగం వచ్చినప్పుడు కనీసం అనురాగం పంచేజనులు దగ్గర కు రాగలరు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి