8, సెప్టెంబర్ 2024, ఆదివారం

ఋతుస్సుదర్శనః

 👆 శ్లోకం 

ఋతుస్సుదర్శనః కాలఃపరమేష్ఠీ పరిగ్రహః|

ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః||


ప్రతిపదార్థ:


ఋతు: - కాలరూపమై తెలియబడు ఋతువులై భాసించువాడు.


సుదర్శన: - భక్తులకు మనోహరమగు దర్శనము నొసంగువాడు.


కాల: - శతృవులను మృత్యురూపమున త్రోయువాడు.


పరమేష్ఠీ - హృదయగుహలో తన మహిమచే ప్రకాశించువాడు.


పరిగ్రహ: - గ్రహించువాడు.


ఉగ్ర: - ఉగ్రరూపధారి


సంవత్సర: - సర్వజీవులకు వాసమైనవాడు.


దక్ష: - సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో నిర్వర్తించువాడు.


విశ్రామ: - జీవులకు పరమ విశ్రాంతి స్థానము అయినవాడు.


విశ్వదక్షిణ: - అశ్వమేధయాగములో విశ్వమునే దక్షిణగా ఇచ్చినవాడు.

కామెంట్‌లు లేవు: