12-15-గీతా మకరందము
భక్తియోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః హరామర్షభయోద్వేగైః
ముక్తో యస్స చ మే ప్రియః.
తా:- ఎవనివలన ప్రపంచము ( జనులు) భయమును బొందదో, లోకమువలన ఎవడు భయమును బొందడో, ఎవడు సంతోషము, క్రోధము, భయము, మనోవ్యాకులత- మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు.
వ్యాఖ్య:-' లోకాన్నోద్విజతే - సత్యమార్గమున జనువాడు ప్రపంచము యొక్క నిందాస్తుతులకు ఏ మాత్రము జంకగూడదు. నిర్భయుడై ముందుకు సాగిపోవలెను. (Be fearless) విగతభీః - అని యొకతూరి భగవానుడు సెలవిచ్చిన విషయమును జ్ఞాపకమునందు ఉంచుకొనవలెను.
"హర్షామర్షభయోద్వేగైః "- హర్షము (సంతోషము} మంచిదే అయినను ఆవేశములకు లోనై, స్తోత్రములకు ఉప్పొంగిపోవుటయు, నిందలకు క్రుంగిపోవుటయు కూడదనియు, ఆ ప్రకారము ద్వంద్వములకు లోబడక, నిర్వికారుడై సమభావముగలిగి యుండవలెననియు తెలుపుటయే యగును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి