త్యాగరాజకృతి ఒక పెనుతుఫానువంటిది.
పల్లవి గానంచేయగానే రసికహృదయంలో భావోదయంతో ఒక అల్పపీడనం ఏర్పడుతుంది.
అనుపల్లవితో భావోద్వేగంపెరిగి ఒక తుఫానుగా మారుతుంది.
చరణంలోని సంగతులతో, నెరవులతో అది ఒక ప్రభంజనంగా మారి భావశబలతతో రసికహృదయతీరాలలో రసవృష్టి కురిపిస్తుంది.
కృతి అంతముకాగానే ఆ తుఫాను తీరందాటి భావప్రభంజనంతో కూడిన రసవృష్టి ఆగిన తరువాత భావశాంతి కలుగుతుంది....
త్యాగరాజకృతిలో ఈ భావోదయము, భావోద్వేగము, భావశబలత, భావశాంతి కలిగించగలవారే నిజమైన, అత్యుత్తమ కళాకారులు.
అటువంటివారికి రసహృదయులంతా "దాసోహమ్" అంటారు....
-- ఆలమూరు విజయభాస్కర్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి