సామజవరగమన
సామజవరగమన..అంటే అర్ధం ఎంత మందికి తెలుసు, కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా , ఒక పాట హోరెత్తి పోయింది . అదే సామజవరగమన చాలా మందికి ఈ పాట నోటికి కంఠస్తా వచ్చి ఉంటుంది , అలానే ఈ పాట చాలా మందికి బాగానే అర్థమయ్యి ఉంటుంది ... కానీ చాలా మందికి ""సామజవరగమన" అంటే ఏంటో తెలీదు..
సామజవరగమన ' అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది... ' సామజ ' అనగా " ఏనుగు " అని ..' వరగమనా ' అనగా " చక్కని నడక " అని అర్థం ... అలానే సామవేదం అనగా సంగీతం! .. మన భారతీయ సంగీతానికి మూలం సామవేదం! " సామజవరగమన " అంటే ఏనుగు లా గంభీరంగా , హుందాగా , ఠీవిగా నడిచేవారు అని అర్థం ..
మరి అసలైన " సామజవరగమన " ఎవరు ...
అసలైన " సామజవరగమన .." శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు ..". వాల్మీకి తన రామాయణం లో 'అరణ్యవాసం'లో ఒకచోట రాముడిని "గజవిక్రాంతగమను"డంటారు ... అంటే ఏనుగులా హుందాగా నడిచే వాడు అని ... ఇదే అర్థం వచ్చేలా త్యాగరాజు తన కీర్తనలో ' సామజవరగమన ' అంటూ శ్రీరాముణ్ణి స్తుతించారు ..
చాలా మంది " సామజవరగమన " అంటూ పాడేస్తున్నారు .... కానీ వారికి అసలు ఇది దేవుని కీర్తన అని కూడా తెలీదు .. దాని అర్థం ఏంటో తెలీదు ... వారికి చెప్పేందుకైనా సామజవరగమన కీర్తన , దాని అర్థం ఒకసారి తెలుసుకుందాం ..
సామజవరగమనా ! సాధుహృత్సారసాబ్జపాల ! కాలాతీతవిఖ్యాత ! ॥ సామజ॥
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల ! దయాలవాల ! మాంపాలయ ! ॥
వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా।
స్వీకృత యాదవకులమురళీ !
గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥
ఈ కీర్తన త్యాగ రాయ కీర్తనలన్నిటిలో ప్రసిద్ధి పొందినది .. ఈ కీర్తన లో ని ప్రతి పదం శ్రీ కృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుంది ... కీర్తన అర్థం ... ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో , మునులు మానవుల హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరీ! నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చే కొనియాడ బడతావు .. సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది .. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే , గుణమునకు , దయకు ఉదాహరణ నీవే .. నన్ను కూడా నీవే నడిపించాలి...
సామవేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల , ప్రకాశిస్తూ .. గోవులని రక్షిస్తూ .. మురళి గానంతో అందరిని ఆనంద పరుస్తూ ..ఈ త్యాగరాజ వందనములను అందుకో...
ఇదీ సామజవరగమన కు సంబంధించిన అసలు భావం!
ఓం నమః శివాయ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి