18, అక్టోబర్ 2022, మంగళవారం

గోమాత మహత్యం

 🎻🌹🙏*🙏 గోమాత మహత్యం గురించి శివుడు పార్వతిదేవికి చేప్పిన మాటలు 🙏*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


*గోవును పూజించిన సర్వపాపములు నశించును… గోమాత నందు ఎంత మంది దేవతలు ఉన్నరో మీకు తెలుసా…?*


ఓకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక ముట్లు, అంటు కలిపిన దోషం, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్ఠింపగా దయామయుడగు పరమశివుడు. 


” ఓ పార్వతీ! గోమాత నందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వపాపములు నశించును. ఆ గోమాతనదు పాదములు ఋణ పితృ దేవతలు, గొలుసులు, తులసి దళములు, కాళ్ళ లో సమస్త పర్వతాలు, మారుతీ కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్య చంద్రులు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉండును. 


ఉదరమున పృధ్వీ దేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక, సనంద, సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్య కిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంత్కోటి దేవతలు పిరుదుల యందు పితరులు, కర్రి కావేరిబోలు, పాదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు,సప్త సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద ధూళి సమస్త పుణ్య నదులు, తీర్థములు కన్నా గొప్పది.


కావున ఓ పార్వతీ ! ఈ గోమాహాత్మ్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మ హత్యా మహా పాతకములన్నియు తొలగును. ప్రతి అమావాస్యనాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలగును. నిత్యము సంధ్య వేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, సెనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము నిచ్చును. 


గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించి నట్లగును. గోమాతను దర్శించి గో ప్రదక్షిణంH చేయవలెను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో పుణ్యం లభిస్తుంది” అని బోధించాడు.


” శ్రీ కృష్ణ పరమాత్మ” గోవును ఎంతో భక్తి తో శ్రద్ధ తో సేవకుడిగా చూసుకొనే వాడు. మహా జనులారా గోవును పూజించిన ముక్తిని  పొందెదరు.

🙏🏻🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

మహర్షుల చరిత్రలు..

 *మన మహర్షుల చరిత్రలు..*


*🌹ఈరోజు 52. భృగు మహర్షి గురించి తెలుసుకుందాము..🌹*


☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁


☘️భృగు మహర్షి ఈయన ప్రస్తావన ఆది పర్వము ప్రథమాశ్వాసములో వస్తుంది.


🍁బ్రహ్మదేవుని హృదయమునుంచి జన్మించినవాడు భృగువు. ఈయన నవ బ్రహ్మలలో ఒకడుగా పేరు పొందాడు. 


☘️విష్ణుమూర్తి అవతారం పరశురాముడు కూడ ఈ వంశమే . భృగుమహర్షి ఖ్యాతిని పెళ్ళి చేసుకుని ధాత విధాతల్నీ శ్రీ అనే కూతుర్నీ , ఉశన వల్ల యశనుడనే కొడుకునీ , పులోమ వల్ల చ్యవనుడినీ పొందాడు . యశనుడంటే ఎవరోకాదు రాక్షస గురువు శుక్రాచార్యుడే .


🍁భృగుమహర్షి భార్య పులోమని ఒక రాక్షసుడు ఎత్తుకు పోవాలని ఆమె ఎక్కడ వుందని అగ్నిదేవుణ్ణి అడిగాడు . అగ్ని భృగుమహర్షి ఆశ్రమంలో వున్న ఈమే పులోమ అని చెప్పాడు . 


☘️రాక్షసుడు పులోమని ఎత్తుకుపోతుంటే ఆమె గర్భంలో వున్న పిల్లాడు కిందపడిపోయాడు . భృగుమహర్షి అగ్ని దేవుణ్ణి ఇదంతా జరగడానికి కారణం నువ్వే కాబట్టి ఏది కనిపిస్తే దాన్ని తింటూ సర్వభక్షకుడిగా వుండమని శపించాడు .


🍁 అగ్నిదేవుడు బ్రతిమాలుకుంటే సర్వభక్షకుడివైనా అందరితో గౌరవించబడతావు వన్నాడు .

పూర్వం దేవతలు రాక్షసుల్ని స్వర్గలోకంలో లేకుండా గెంటేవారు .


☘️ రాక్షస గురువు శుక్రాచార్యుడు శివుణ్ణి మెప్పించి సంజీవిని తెస్తానని వెళ్ళాడు . ఇదే సమయంలో దేవతలు రాక్షసుల్ని చంపెయ్యడం మొదలు పెట్టారు .


🍁 భృగుమహర్షి భార్య ఉశన దగ్గరకు వెళ్ళి తమను కాపాడమని శరణు కోరారు రాక్షసులు . ఇంద్రుడితో సహా దేవతలందర్ని స్తంభించిపోయేలా శపించింది ఉశన . 


☘️కొంతమంది దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించారు . స్త్రీని చంపడం పాపం కదా భయపెడదామనుకున్నాడు విష్ణుమూర్తి . ఈ లోపునే ఉశన విష్ణుమూర్తినే శపించాలని అక్షరం అనబోయేలోగా విష్ణుమూర్తి ఆవిడ కంఠంలో బాణం వేశాడు . 


🍁వెంటనే ఆమె చనిపోయింది . భృగు మహర్షి వచ్చి ఇదంతా చూసి ఒక స్త్రీని చంపావు , నీకు ఇంత అహంకారమా ? అని భూలోకంలో మనిషివై పుడుతూ మరణిస్తూ సుఖదుఃఖాలనుభవిస్తావని విష్ణుమూర్తిని శపించాడు .


☘️మంత్రజలంతో ఉశనని బ్రతికించాడు . నేనిచ్చిన వరాలో నన్నే శపిస్తావా ? అన్నాడు విష్ణుమూర్తి . నిన్ను శపించడం ఎవరితరం ? దుష్టుల్ని శిక్షించడానికి , శిష్టుల్ని రక్షించడానికి అవతారం ఎత్తడానికి నన్ను ఉపయోగించుకున్నావు . 


🍁నీ అవతారం వల్ల దర్మసంస్థాపన అవుతుందిలే అన్నాడు భృగు మహర్షి . భృగు మహర్షి శక్తిని చూసి మిగిలిన ఋషులు ఆశ్చర్యపోతూ ముక్కు మీద వేలేసుకున్నారు . 


☘️సరస్వతీ నదీ తీరంలో మహర్షులందరూ కలిసి ఒక యాగం చేస్తుండగా వాళ్ళల్లో ఒకళ్ళకి ఒక సందేహం వచ్చేసింది . వెంటనే త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవాళ్ళు అని భృగు మహర్షిని తేల్చి చెప్పమన్నారు .

        

🍁ఒకసారి మునులందరి మధ్య త్రిమూర్తులలో అధికుడెవరు అనే చర్చ వచ్చింది. ఆ విషయం తెలుసుకురమ్మని అందరూ భృగుమహర్షిని పంపారు.

          

☘️భృగువు ముందు బ్రహ్మ దగ్గరకి వెళ్లాడు. ఆయన సృష్టి క్రార్యక్రమంలో ఉండి చూచి చూడనట్లు ఉపేక్షించాడు. భృగువు కోపంలో పూజకి అనర్హుడివి అని బ్రహ్మను శపించి అక్కడ నుండి కైలాసంకు వెళ్లాడు. 


🍁అక్కడ శివపార్వతులు నృత్యంచేస్తూ భృగువును చూచీ చూడనట్ల ఉన్నారు. శివుని కేవలం నీ లింగమునకు మాత్రమే అభిషేకం జరుగును అని శపించి వైకుంఠంకు వెళ్లడు. 


☘️అక్కడ కూడా విష్ణువు కళ్లు మూసుకొని తనను గౌరవించలేదని  గుండెలమీద తన్నాడు భృగుడు 


🍁వెంటనే విష్ణుమూర్తి లేచివచ్చి నువ్వు రావడం చూడలేదు క్షమించమన్నాడు . నీపాదాలకున్న నీళ్ళు తగిలి నా పొట్టలో వున్న లోకాలు పవిత్రమయ్యాయి . 


☘️నీ పాదం నా భుజాలకి అలంకారమైంది . నువ్వు రావడం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను అన్నాడు - విష్ణుమూర్తి . 


🍁 అప్పుడు విష్ణువు వినయంతో భృగువుకు అతిధి మర్యాదలు చేసి కాళ్లు నొక్కుతూ ఆయన పాదంలో ఉన్న కన్నును నొక్కివేశాడు. ఆయన అహంకారం పోయి విష్ణువుని స్తుతించాడు.


☘️అందరిలోకి విష్ణువే గొప్ప అని నిర్ణయించి మునులకు తెలియచేశాడు. అందరూ విష్ణువుని పూజించటం మొదలుపెట్టారు.

    

🍁యవనాశ్వడనే రాజు పిల్లలు లేక బాధపడి భృగుమహర్షి ఆశ్రమంకు వచ్చాడు. భృగుమహర్షి ఆ రాజుతో పుత్రకామేష్టి యజ్ఞం చేయించాడు.


☘️మంత్రజలం జాగ్రత్త పెట్టమని బ్రాహ్మణులకిచ్చాడు .

అందరూ నిద్రపోతున్న సమయంలో రాజుకి దాహం వేసి ఆ నీళ్ళు తాగేశాడు . భృగు మహర్షికి ఆ విషయం తెలిసి నీ భార్య తాగాల్సిన మంత్రజలం నువ్వే తాగావు , కొడుకుని కూడా నువ్వేకంటావు అన్నాడు .


🍁 తర్వాత వంద సంవత్సరాలకి రాజు ఎడమభాగం చీల్చుకుని గొప్ప తేజస్సుతో ఏడుగురు చక్రవర్తుల్లో ఒకడైన మాంధాత పుట్టాడు .


☘️ఒకసారి వింధ్యపర్వత ప్రాంతంలో బాగా కరువొచ్చింది . పితృదేవతలకి ఏమీ పెట్టలేని స్థితిలో భృగు మహర్షి కైలాస పర్వత ప్రాంతానికి వచ్చి ఆశ్రమం కట్టుకుని వున్నాడు .


🍁 పులి మొహంతో భార్యను తీసుకుని ఒక విధ్యాధరుడొచ్చి నాకు ఈ ముఖం ఎలా వచ్చిందో తెలియదు , ఇది పోయే మార్గం చెప్పమని బ్రతిమాలుకున్నాడు .


☘️నువ్వు ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు తలస్నానం చేశావు ,  ఆ కీడు ఇలా చేసిందన్నాడు భృగు మహర్షి .


🍁మాఘమాసంలో స్నానం చేశాక నువ్వు మళ్ళీ మామూలుగా అవుతావని చెప్పాడు . 

ఆతను మాఘస్నానం చేసి మామూలు ముఖం పొంది భృగువుకు నమస్కరించి వెళ్లాడు.


☘️భృగువు చెప్పినట్లు శివుని గురించి తపస్సు చేసి పరశురాముడు భార్గవాస్త్రం‍ను సంపాదించుకున్నాడు. భృగుమహర్షి  జ్యోతిశాస్త్రమును రచించాడు. 


🍁ఆ గ్రంథమే భృగు సూత్రములనే పేర ప్రసిద్ధికెక్కింది. ఈయన స్మృతి ఒకటి ఉంది. ఈయన ధర్మ ప్రవక్తగా విలసిల్లాడు. తపశ్శక్తిచే బ్రహ్మత్వాన్ని పొందాడు.


☘️భృగు మహర్షి ధర్మశాస్త్ర ప్రవక్తగా పేరు పొందాడు . ఈయన జ్యోతిష శాస్త్రం రాశాడు . దాంట్లో ఎనిమిది అధ్యాయాలున్నాయి . సృష్టికోసం బ్రహ్మతో సృష్టించబడి చివరకి బ్రహ్మలోనే అయిపోయాడు భృగు మహర్షి .


🍁ఇదండీ మనము తెలుసుకున్న భృగు మహర్షి చరిత్ర రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి..


సేకరణ: కె.వి. రమణమూర్తి వాట్సాప్ పోస్ట్. 

☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁

క్షౌరకర్మను గురించి

 

క్షౌరకర్మను గురించి శాస్త్రము ఒక క్రమపద్ధతిని నిర్దిష్టపరచినది.

మనలో చాలామంది ఆదివారం సెలవు అని ఆదివారం నాడు  క్షౌరకర్మ (Hair Cutting) కు వెళుతుంటారు.  నిజానికి ఆదివారం పనికిరాదని చాలామందికి తెలియదు.  ఏ ఏ వారాలు ఏ ఎ తిధులు క్షౌరకర్మను ఆచరించాలని మన శాస్త్రాలు తెలుపుతున్నాయో తెలుసుకుందాం. 

ఈ క్రింది తిధుల యందు క్షుర కర్మ నిషేధం. అవి.

ఏకాదశీ, చతుర్దశీ, అమావాస్య, పూర్ణిమా, సంక్రాంతి, వ్యతిపాతము, విష్టి (భద్రా) ఇత్యాదులయందు, మరియు వ్రతదినములయందు, శ్రాద్ధదినముల యందు, 

ఇక వారములు మంగళ,, శనివారములయందు క్షౌరకర్మ పనికిరాదు. ఆదివారము క్షౌరము చేయించుకొనుటవలన ఒకమాసము ఆయువును, శనివారము క్షురకర్మ చేయించుకొనుటచేత ఏడుమాసములు ఆయువును, భౌమవాసరము (మంగళవారము) వలన ఎనిమిది మాసముల ఆయువును, ఆయా దినములకు చెందిన అభిమాన దేవతలు క్షీణింపచేయుదురు. ఇదేవిధముగా బుధవారము క్షౌరము చేయించుకొనుటచే ఐదు మాసముల ఆయుర్దాయమును, సోమవారము వలన ఏడుమాసముల ఆయువును, గురువారమువలన పదిమాసముల ఆయుష్యమును, శుక్రవారమువలన పదునొకండు నెలల ఆయువును, ఆయా దినములయొక్క అభిమానదేవతలు వృద్ధి చేయుదురు. గృహస్థులు మరియు ఒకే ఒక పుత్రుడు గలవారలు సోమవారమునాడు చేయించుకొనగూడదు. అట్లే విద్యను, లక్ష్మిని కోరుకొనెడువారలు క్షురకర్మ చేయించుకొనుట పనికిరాదు. అని ఈవిధముగా గూర్చి గర్గాదిమహర్షులు వచించియున్నారు. 

ఇక బ్రాహ్మణుల క్షౌర విధిని పరిశీలిద్దాం.

  ప్రతి బ్రాహ్మణుడు శిరో ముండన (గుండు)  శిఖదారణ    చేయించుకోవలెను     .

   కేవలం పితృ కర్మలను ఆచరించేటప్పుడే శిఖ ధరించటం ఆనవాయతీగా అనుకుంటున్నాము.  . పౌరోహితం చేసే బ్రాహ్మణోత్తములు విషయం ప్రతి బ్రాహ్మణుడికి తెలపాల్సిన అవసరం వున్నది. . ఎలాంటి కర్మలు చేస్తే ఎలాంటి ఫలితాలు చేకూరుతాయి అన్నది మన మహర్షులు శోధించి సాధించి మనకు ఒక చక్కటి జీవన విధానాన్ని ఏర్పాటు చేశారుకేవలం మనం వారిని అనుసరించివాటిని ఆచరించి తరించటమే మన కర్తవ్యము

ఈ విషయములను గీత ప్రెస్ వారి ప్రచురణ "నిత్యకర్మ - పూజా ప్రకాశిక " అను గ్రంధము నుండి సేకరించపడినవి . బ్రాహ్మణులు ఆచరించవలసిన అనేక విషయములను అందు ప్రస్తావించబడెను.  ఆ గ్రంధము ధర వెరసి రూ . 150/- వలసిన వారు గీతాప్రెస్ పుస్తక బండారం నుండి ఖరీదు చేయవచ్చు. సికిందరాబాదు రెయిల్వేస్టేషన్ ప్లాట్ఫారం నెం 1 నందు స్టాలు కలదు. 

 





 

అన్నదాన సత్రములు

 అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్య అన్నదాన సత్రములు  & Contact phone nos.

శ్రీశైలం

8333907784

8333907787

కాశీ

8333907790

8333907791

రామేశ్వరం

8333907793

04573-222156

భద్రాచలం

8333907796

8333907795

మహానంది

8333907803

8333907802

షిర్డీ

8333907800

8333907798

అలంపూర్

8333907806

8333907805

త్రిపురాంతకం

8333907794

యాదాద్రి

8333907815

08685-299909

విజయవాడ(వృద్ధాశ్రమం)

8333907807

8333907813

కర్నూల్ ( శంకర మఠం)

8333907783

8333907808

అరుణాచలం

8333907813.

Rs.3000/- permenant yearly oneday అన్నదానం.

Rs 15000/- permenantly yearly 5 days అన్నదానం.

రాస 30000/- permenantly daily అన్నదానం.

Rs 1500/- only one day అన్నదానం లేదా oneday sweet.

అన్నీ దానములలో అన్నదానం గొప్పది.దీనిని సద్వినియోగం చేసుకొందాం.బ్రాహ్మణులకు చేయూత నిస్తాం.

అయ్యప్పదీక్షలో

 *అయ్యప్పదీక్షలో ఆధ్యాత్మిక రహస్యాలు.*

✍️ శ్రీ D. V. R. భాస్కర్, సీనియర్ జర్నలిస్ట్, సాక్షి, హైదరాబాద్. 

🕉️🌹🌹🌹🌹✡️🔯🌻🌻🌻🌻🕉️


💫 అయ్యప్ప దీక్షలోని భాగాలైన నల్లని వస్త్ర ధారణ, మాల ధారణ, చన్నీటి స్నానం, విభూతి, చందనాలతో అలంకరించుకోవడం మొదలైన ఆచారాలన్నింటిలోను అనంతమైన ఆధ్యాత్మిక, ఆరోగ్య, వేదాంత పరమైన రహస్యాలున్నాయి. 


💫 *ఒంటిమీద భస్మధారణ ఈశ్వర సంకేతంగా భాసిస్తుంటే, నుదుటపై మెరిసే తిరునామం విష్ణుమూర్తిని నుతించేలా చేస్తుంది.*


💫 *ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసం దక్షిణాయనంలో ప్రారంభమయ్యే అయ్యప్ప పూజ - విష్ణువుకు ఇష్టమైన ఉత్తరాయణం మార్గశిరంతో ముగుస్తుంది.*

 

💫 అయ్యప్పస్వామి వారి పద్దెనిమిది మెట్లను *‘పదునెట్టాంబడి’* అని అంటారు. ఈ పదునెనిమిది మెట్లలో ఒక్కో మెట్టుకూ ఒక్కో దేవత వుంటుంది. మోక్ష సామ్రాజ్య కైవసానికి ఈ మెట్లు ఉపకరణాలు అని శాస్త్రం. ఈ సోపానాలపై పద్దెనిమిదిమంది దేవతలను ఆవాహన చేశారు. 


🙏 *"ఎనిమిది మంది దిక్పాలకులు, నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అవిద్య, విద్య, జ్ఞానం, అజ్ఞానం" అన్నీ కలిపి మొత్తం పద్దెనిమిది మెట్లుగా ఇక్కడ వున్నాయి. వీటన్నింటిని దాటుకొని వెళితేనే జ్ఞానస్వరూపుడైన ఆ భగవంతుని దర్శనం సులభం అవుతుంది.*

 

💫 ఈ ఆలయంలో స్వామి ప్రతిష్టుడైన సందర్భంగా, *మృదంగ, భేరీ, కాహళ, దుంధుబి, తుంబుర, మద్దెల, వీణ, వేణువు, నూపుర, మట్టుక, డిండిమ, ఢమరుక, ఢక్క, ధవళ, శంఖ, పరుహ, జజ్జరి, జంత్ర అనే పద్దెనిమిది వాద్యాలు మోగించారు.*  ఇదీ ఈ మెట్లకున్న నియమ ప్రాముఖ్యం. 


💫 నలభై రోజులు దీక్ష చేసినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కడానికి అర్హులు. ఎంతో నిష్ఠలతో ఈ మెట్లు దాటాలి. అప్పుడే ఆ ఆనందరూపుని దర్శించుకోగలం. ఈ మెట్ల క్రింద ఎంతో మహిమాన్వితమైన, పవిత్రమైన యంత్రస్థాపన జరిగింది. యంత్ర ప్రతిష్ట ఎంతో పునీతమూ, శక్తిమంతమూ కాబట్టే వాటిని ఎంతో భక్తి విశ్వాసాలతో, నియమ నిష్టలతో దాటాలి.


💫 *అయ్యప్ప దీక్షకు చన్నీటి స్నానం, భూ-శయనం, పాదచారులై నడవడం, ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం, మద్యమాంసాదులు, మసాల దినుసులు వంటి తామసకారకాలైన పదార్థాలను త్యజించడం వంటి నియమాలు పాటించాలి.*


💫 ఆ స్వామి దీక్షను చేపట్టే వారు గురుస్వామి ద్వారా తులసి, రుద్రాక్ష మాలలను ధరిస్తారు. రెండుపూటలా చన్నీళ్ళ స్నానం ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాక, మనసును ప్రశాంతంగా ఉంచి భగవధ్యానానికి తోడ్పడుతుంది. తులసి, రుద్రాక్షల లోని స్వాభావిక ఔషధ గుణాలు అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతాయి మరియు రక్తపోటు, మధుమేహం మొదలైన ఎన్నో రోగాల అదుపుకు ఉపకరిస్తాయి.

 

💫 దీక్షా సమయంలో పాటించే ఆహారనియమం శరీరాన్ని అదుపులో ఉంచి, చెడు కోరికలను దూరం చేస్తుంది. మనోనిశ్చలత, జ్ఞానశక్తి దేహానికి బలాన్ని ఇస్తాయి కాబట్టే ఆ అయ్యప్ప భక్తులకు కఠినమైన బ్రహ్మచర్యాన్ని దీక్షలో ఓ భాగంగా విధించారు. చెప్పులు తొడగరాదనే నియమం వెనుక ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. ఇందువల్ల భక్తులకు కష్టాలను సహించే శక్తి కలుగుతుంది. నలభై ఒక్క రోజులు పాదరక్షలు లేకుండా నడిస్తే పాదాల క్రింద చర్మం మొద్దుబారి అడవులలో సునాయాసంగా నడిచే వీలు వుంటుంది. 


💫 అయ్యప్ప దీక్షలో నలుపు రంగు వస్త్రాలను ధరిస్తారు. నలుపు తమోగుణాన్ని సూచిస్తుంది. *అన్ని వర్ణాలను తనలో లీనం చేసుకునే నలుపు పరమాత్ముని లయకారక తత్వం.* నల్లరాళ్ళను కూడా కరిగించగలిగే నరదృష్టి దోషాన్ని హరిస్తుంది. రంగురంగుల బట్టలపై మమకారం ఉండకూడదనటానికే నలుపు దుస్తుల ధారణ ముఖ్యోద్దేశం.

 

💫 అయ్యప్ప భక్తులు నొసటన తప్పనిసరిగా చందనం, విభూతి ధరిస్తారు. అయ్యప్ప విభూతి అన్నిటినీ మించిన దివ్యఔషధం. పంబా తీరంలో వంట చేసిన 108 పొయ్యిల నుంచి భస్మాన్ని సేకరిస్తారు. ఇలా సేకరించిన బూడిదను జల్లించి స్వామికి అభిషేకించగానే దానికి ఎనలేని శక్తి కలిగి సర్వరోగ నివారిణిగా తయారై ప్రాణదాతగా ఉపయోగపడుతుంది. అటువంటి మహిమాన్వితమైన విభూతి, గంధం ధరించడం వల్ల చక్కటి వర్చస్సు, మనోబలం కలుగుతాయి. అంతేకాక వాత, పిత్త, కఫం వంటి రోగాలు దరిచేరవు.

 

💫 40 రోజుల అయ్యప్ప దీక్షను ముగించుకొన్న స్వాములు శబరిమల యాత్రకు ఇరుముడితో బయలుదేరతారు. ఇరుముడిలో రెండు భాగాలు వుంటాయి. ముందు భాగంలో పూజాసామాగ్రి, వెనుక భక్తునకు కావలిసిన వస్తువులు, తినుబండారాలు ఉంటాయి. 


💫 ముందు భాగంలో ఉండే ఆవునెయ్యి భక్తుని ఆత్మతో సమానం. కొబ్బరికాయ దేహంతో సమానం. అనగా భక్తులైన వారు ఆత్మతో సమానమైన నేతితో స్వామికి అభిషేకం చేసి (ఆత్మార్పణ గావించి) దేహం వంటి కొబ్బరికాయను స్వామి సన్నిధిలోగల హోమగుండంలో వేయాలి. 

 

💫 *కామ క్రోధాలను వీడి, కొబ్బరికాయలో ఉన్న మోహమనే నీళ్ళను త్రోసి, జ్ఞానమనే నెయ్యిని పోసి, భక్తి నిష్ఠలనే ఇరుముడులను వేసి నలభై ఒక్క రోజులు స్వామి తలపులతోనే కఠినమైన జపం చేయాలి. అంటే శరీరం మీద మోహాన్ని విడిచి భగవంతునికే అంకితం చేయాలని అర్ధం.* 


💫 వెనుక భాగంలో ఉన్న తినుబండారాలు మానవుని ప్రారబ్దకర్మలు. ఎవరి ప్రారబ్ధాన్ని వారే మోసుకొని పోవాలి, వారే అనుభవించాలి. స్వామి సన్నిధికి చేరుకొనేసరికి తినుబండారాలు అయిపోవాలి. అంటే స్వామి సన్నిధికి చేరుకున్న భక్తుడు ప్రారబ్ధకర్మను వదిలివేయాలని అర్ధం. 


💫 ఆవునెయ్యి శక్తికి సంకేతం. స్వామి వారికి అభిషేకించిన నేతిని సర్వరోగ నివారిణిగా సేవిస్తే తప్పనిసరిగా సత్ఫలితం చేకూరుతుంది. ఆవునెయ్యి సహజంగానే చాల పవిత్రమైంది, ఆరోగ్యమైంది. ఆవునేతిని కొబ్బరికాయలో నింపి స్వామివారిని అభిషేకించగానే దానికి ఎనలేని మహిమ వస్తుందని భక్తుల నమ్మకం.

 

💫 శబరి సన్నిధానంలో వెలిగించే కర్పూరం మన చుట్టూ ఉండి హాని కలిగించే సూక్ష్మక్రిములను నాశనం చేసి, వాతావరణం కలుషితం కాకుండా కాపాడి అయ్యప్పలకు కవచంగా తోడ్పడుతుంది. శబరిమల భక్తులకు ఏ వ్యాధులు సోకవు. వీరి నియమనిష్ఠలే వారిని సర్వరోగాల నుండి రక్షించి కాపాడుతాయి. 


💫 ఎరుమేలి నుండి ఒంటిమీద ఆచ్చాదన లేకుండా ఇరుముడిని తలపై దాల్చి అడవుల్లో నడిచి వెళుతుంటే అక్కడ వుండే ఎన్నో రకాల ఔషధ వృక్షాల నుంచి వచ్చే మలయ మారుతాలు శరీరాన్ని తాకి రోగనిరోధక శక్తిని కలిగిస్తాయి. అక్కడ పారే సెలయేళ్ళు, *అళుదానది, పంబానది* కూడా ఎన్నో వనమూలికల మీదుగా ప్రవహించడం వల్ల వాటిలో స్నానం చేస్తే శరీర రుగ్మతలు తొలగుతాయి.

 

💫 యోగపట్టం ధరించిన దివ్యాసనాలతో వుంటాడు అయ్యప్ప స్వామి. అన్ని యోగరహస్యాలు స్వామి మూర్తిలోను, తత్సన్నిధి కోసం జీవుడు చేసే యాత్రలోనూ ప్రస్ఫుటమవుతాయి. 


💫 పూర్ణ సంఖ్య అయిన 18, పరిపూర్ణతను సాధించిన జ్ఞానానికి సంకేతం. అటువంటి జ్ఞానాన్ని సాధించడమే 18 మెట్లు ఎక్కడం. మాల ధరించిన రోజు నుంచి భక్తులు ప్రతిరోజు రెండు పూటలా స్వామిని అర్చించి, నలభై ఒక్క రోజులు అయ్యప్ప వ్రతదీక్షాపరులై  నియమనిష్ఠలతో తలపై ఇరుముడిని ధరించి అడవిలో ప్రయాణించి శబరిమలై చేరుకొని అష్టాదశ సోపానాలు అధిరోహించి, హరిహర పుత్రుని దర్శించి సాయుజ్యాన్ని పొందుతారు.


🙏 *స్వామియే శరణమయ్యప్పా..*🙏


*సేకరణ:* ఆధ్యాత్మిక భక్తిప్రపంచం - ఈ సమూహంలో చేరడానికి *జైశ్రీరామ్* అని 7013672193 కి WhatsApp చేయండి.

🕉️🌹🌹🌹🌹✡️🔯🌻🌻🌻🌻🕉️

నాడు... నేడు

 గతంలో సంసారం ' *చీకట్లోనే* ' జరిగేది. జీవితాలు వెలుగులో ఉండేవి..నేడు సంసారం వెలుగులోకి వచ్చి జీవితాలు *చీకట్లో* మగ్గుతున్నాయి..!!


కప్పుకోవాల్సిన వాటిని *చూపిస్తూ* , చూపించాల్సిన అందమైన ముఖాన్ని *కప్పేస్తున్నారు* ..!!


నాడు కొందరికే *మందు, విందు* అలవాటు ఉండేవి.

నేడు *కొందరే వీటికి దూరం* ..!!


నాడు కష్టమొస్తే, కుటుంబంలోని *పెద్దలు ధైర్యం చెప్పేవారు* ..!!

నేడు కొన్ని కుటుంబాలలో కలహాలకు *పెద్దలే కారణమౌతున్నారు* ..!!


నాడు తినడానికి *శ్రమించి* సంపాదించే వాళ్ళం..

నేడు కదల కుండా కూర్చుని సంపాదిస్తూ..

తిన్నది *అరగడానికి వాకింగ్* అంటూ శ్రమిస్తున్నాం..!!


నాడు పండ్లు, పాలు *తీసుకుని* బలంగా బోలెడు మంది సంతానాన్ని కని పోషించాము..!!

ఇప్పుడు *సంసారం చేయడానికే* *మందులు* మింగుతున్నారు..!!

ఇంక *పిల్లలెక్కడ* ...

అందుకేగా అన్ని చోట్లా..

 *సంతాన సాఫల్యకేంద్రాలు* ..!!


గతంలో అందరూ *హార్డవేర్ ఇంజనీర్లే..* 

 *మనసు మాత్రం సాఫ్టు* ..!!

ఇప్పుడు *అంతా 'సాప్ట్ వేర్* ఇంజనీర్లే'.. *మనసు మాత్రం హార్డ్..!!* 


అప్పుడు *వైద్యుడు ఇల్లిల్లూ తిరిగి* వైద్యం చేసేవాడు.. అమృతాంజనానికే జబ్బులు తగ్గేవి..!!

ఇప్పుడు *తలకాయనొప్పికే ఇళ్ళమ్ముకునేంత* 

ఖర్చు అవుతోంది..!!


నాడు *దొంగలు 'నట్టింట్లో' పడి* దోచుకెళ్ళేవారు..

నేడు దొంగలు *దొరల్లాగా 'నెట్ ఇంట్లో'* దోచేస్తున్నారు..!!


ఒకప్పుడు *చదువులేనోడు దొంగ* గా మారేవాడు (గతిలేక)...

ఇప్పుడు *దొంగతనాలు చేయడానికే కొత్త కోర్సులు చదువు* తున్నారు సైబరు నేరగాళ్ళు..!!


అప్పుడు *అప్పు చేయాలంటే తప్పు* చేసినట్లు బాధపడే వాళ్ళం..

ఇప్పుడు క్రెడిటు కార్డు మీద అప్పుతో *కొనుక్కోడమే క్రెడిటు* గా ఫీలౌతున్నాం..!!


ఒకప్పుడు పాలు, పెరుగు అమ్మి, *సొమ్ము చేయలేక వాటిని తాగేవాళ్ళం..!!* 

ఇప్పుడు *రెడీ మేడ్* చపాతీలు , పొంగలి, *కూరతో* సహా కొనుక్కొచ్చుకొని తింటున్నాం..!!


చైనా నుండి ఒకనాడు *పింగాణీ* వస్తువు లొచ్చేవి..!!

నేడు తినే కంచం నుంచి *ప్లాస్టిక్ బియ్యం తో సహా అక్కడినుంచే* ..!!


ఇదేనా మనం సాధించినది *పురోగతా* ............?

లేక మనకు మనం తెచ్చుకున్న *అధోగతా* ....?


ఈ *పోస్ట్ కి మనకి సంబంధం ఏంటిలే అనుకోకు..!! ఇలా ఉన్న వాళ్ళ మధ్యలోనే కదా మనం బతుకుతోంది... కాస్త ఆలోచించండి...PLEASE.....!!*

కుండలి శక్తి

 యోగ శాస్త్రం లో ( కుండలి శక్తి ) అనేది 

ఒక అనిర్వచనీయమైన శక్తి అని సవివరము గా విశదీకరించింది. 

మానవ శరీరంలోవెన్నెముక లో 

సప్తచక్రాలు ఉంటాయి. కుండలి శక్తిమానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది.


మూలాధారం లో దాగివున్న ఈ కుండలిని శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలిని యోగ. ఈ కుండలిని యోగ ద్వార గతజన్మ పాపా భారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాటే వీలున్నది.


కుండలిని యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలిని శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.శరీరంలోని ప్రాణశక్తి గతి శక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితి శక్తి పాము వలే చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది.యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేయవచ్చు.

 1

 

అరిషడ్వర్గాలను జయించినప్పుడే...

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కుండలిని శక్తిని జాగృతం చేయడానికి ముందు దేహ శుద్ధి, నాడీ శుద్ధి, మనో శుద్ధి మరియు బుద్ధి శుద్ధి ఎలా జరగాలో బోధిస్తుంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైన ముని ప్రవక్తిమై అనేక రూపాలలో కర్మసిద్ధంతం విసదీకరించారు. కర్మఅంటే మానసికముగా గాని, శారీరకముగాగాని చేసినది.

 2

అవన్నీ కర్మ ఫలాలే

ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా, స్వంతముగా అనుభవించాలి. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే పరిమితము విద్యుక్త ధర్మాన్ని వదిలి వేయడం పాపంగానే పరిగణించ బడుతుంన్నది .


 3

 

కర్మ ఫలం మీద అధికారం లేదు..

కర్మచేయడం మీదే మనుష్యులకు అధికారం ఉంటుంది. కాని కర్మ ఫలం మీద మీకు అధికారం లేదు.అంటే సత్కర్మ లేక పాప కర్మ ఆచరించేది మానవుడే.కనుక గత జన్మలలో చేసిన పాప పుణ్య కర్మలు అనుభవింగా మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తుంది.కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి.మంచి కర్మలకి మంచి ప్రతిఫలం మరియు చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి! పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ చేసే ప్రతి పని కర్మయే.

 4

కర్మ అంటే ఏమిటి.

నిద్రించడం, శ్వాసించడం, ధ్యానింనించడం, తపస్సు, మౌనం, భుజించడం, ఉపవసించడం కర్మయే. జీవించి ఉన్న ప్రాణి కర్మ చేయకుండా ఉండ లేరు. మనిషి మరణించిన తరువాత కూడా కర్మ అనేది కొనసాగుతుంది. మనిషి మరణించిన తరువాత మరణించిన వ్యక్తి కొరకు అతడి పుత్రులు పుత్ర సమానులు నిర్వహించేవే కర్మకాండలు.పాపం నశించే వరకూ ఆత్మ ప్రయాణం సాగుతుందని ఆ కర్మఫలితమైన పుణ్య పాపాలను అనుభవించడానికి జీవుడు అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటాడు.

 5

కర్మ పల్లే పాపపుణ్యాలు

జీవుడు భౌతిక శరీరాన్ని వదిలి పోయే సమయంలో పాపపుణ్యాలను, వాసనలను వెంట తీసుకు వెడాతాడని వివరిస్తుంది. పాపపుణ్యాలు కర్మ చేయడం వలననే సంభవిస్తుంది. అంటే. అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు.లోక హితమును కోరుతూ కర్మలను ఆచరిస్తూ తద్వారా వచ్చే ఫలాన్ని భగవత్ప్రసాదితంగా అనుభవించవచ్చన్నది దీని సారాంశం.


భగవంతుని ఆధీనంలో కర్మఫలం

మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి . భవంతుడిని ధ్యానించి గతజన్మ పాపా భారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాట వీలున్నదని యోగ శాస్త్రం బోధిస్తుంది. మనిషి తన విద్యుక్త కర్మలను నిష్కామముగా చక్కగా ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చన్నది ఆద్యాత్మిక దృష్టితో యోగ శాస్త్రం వివరిస్తుంది. సత్కర్మాచరణ మానవులకు సుఖాన్ని, స్వర్గాన్ని ఇవ్వగలదని దుష్కర్మలు మానవునికి కష్టాలను నరకాన్ని ఇవ్వగలదని యోగ శాస్త్రాలు బోధిస్తుంది.

.

భార్య

 **భార్య ఇంటికి ఆభరణం!!* 

(నేడు ప్రపంచ వివాహ దినోత్సవం)

* భరించేది భార్య,

* బ్రతుకు నిచ్చేది భార్య,

* చెలిమి నిచ్చేది భార్య 

* చేరదీసేది భార్య 

* ఆకాశాన సూర్యుడు    లేకపోయినా...

ఇంట్లో  భార్య లేకపోయినా...

అక్కడ జగతికి వెలుగుండదు,

ఇక్కడ ఇంటికి వెలుగుండదు. 

* భర్త  వంశానికి సృష్టికర్త 

* మొగుడి అంశానికి మూలకర్త,

*కొంగు తీసి ముందుకేగినా...

* చెంగు తీసి మూతి తుడిచినా...ముడిచినా..

తనకు లేరు ఎవరు సాటి 

* ఇల లో తను లేని ఇల్లు...  కలలో....

ఊహకందని భావన...

* బిడ్డల నాదరించి...

* పెద్దల సేవలో తరించి

* భర్తని మురిపించి..

మైమరపించి...

* బ్రతుకు మీద ఆశలు పెంచి... 

* చెడు ఆలోచనలు త్రుంచి...

* భ్రమరం  లా ఎగురుతూ...

* భర్త ను భ్రమల నుండి క్రిందకు దించుతూ...

* కళ్ళు కాయలు కాచేలా...

* భర్త  జీవితాన పువ్వులు పూచేలా చేసిన

**జీతం లేని పని మనిషి.* 

 *జీవితాన్ని అందించే మన* *మనిషి* ... 

ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం 

ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప. 

అదే  భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం💐

17, అక్టోబర్ 2022, సోమవారం

రతన్ టాటా యొక్క దేశభక్తి

 "మీరు సిగ్గులేని వారు కావచ్చు,నేను కాదు" - రతన్ టాటా 

కానీ ఇందులో విచిత్రం ఏంటంటే ఆ దేశద్రోహి మంత్రి ఎవరు మీకేమన్నా తెలుసా

ఇది జస్ట్ చిన్న ఉదాహరణ మాత్రమే టాటా గారు అన్నారు కాబట్టి తెలిసింది 


26/11 ముంబై దాడులకు కొన్నినెలల తరువాత భారత్ మరియు విదేశాల్లో ఉన్న తమ హోటళ్ళన్నీ రీమోడలింగ్ చేయడం కోసం అతి పెద్దవైన టెండర్లను టాటా కంపెనీ ఆహ్వానించింది. కొన్ని పాకిస్తానీ కంపెనీలు కూడా టెండర్లు వేసాయి.


ఆ కాంట్రాక్టు తాము దక్కించుకునేందుకు చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా, ఇద్దరు పాకిస్తానీ పారిశ్రామికవేత్తలు ఎలాంటి అపాయింట్ మెంటూ లేకుండా రతన్ టాటాను కలిసేందుకు బొంబాయిలో ఉన్న బొంబాయి హౌస్ (టాటా హెడ్ ఆఫీస్) కు వచ్చారు.


అక్కడి ఆఫీసులో, వారిద్దరూ రతన్ టాటాను కలవడం కోసం చాలా సేపు నిరీక్షించారు. అలా వారు కొన్నిగంటల పాటు నిరీక్షించిన తరువాత సిబ్బంది వచ్చి, సార్ చాలా బిజీగా ఉన్నారు, అపాయింట్ మెంట్ లేనివారినెవరినీ కలవలేరు అని చెప్పి వెళ్ళిపోయారు.


దాంతో నిరాశ చెందిన వారిద్దరూ హస్తినకు వెళ్ళి, పాకిస్తాన్ హైకమీషన్ ద్వారా అప్పటి కాంగ్రెస్ మంత్రిని

కలిసి విషయం వివరించారు.


ఆ వెంటనే ఆ కాంగ్రెస్ మంత్రి రతన్ టాటాకు ఫోన్ చేసి ఆ పాకిస్తానీలిద్దరినీ కలవాలని, వారి టెండర్లను పరిశీలించాలని ఒకింత గట్టిగా అడిగారు.


అప్పుడు రతన్ టాటా "మీరు సిగ్గు లేని వారు కావచ్చు, నేను కాదు" అని చెప్పి ఫోన్ పెట్టేసారు.


ఆ తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం టాటా సుమోలను దిగుమతి చేసుకోవడం కోసం ఆర్డరు ఇచ్చింది.


అయితే రతన్ టాటా ఒక్క సుమోను కూడా పాకిస్తాన్ కు పంపడానికి అంగీకరించలేక, ఆ ఆర్డరును తిరస్కరించారు.


అదీ రతన్ టాటా యొక్క దేశభక్తి.


ఆయన దేశభక్తి ముందు డబ్బూ మరియు వ్యాపారం కూడా చిన్నదే.


 

3 దోషములు/పాపములను చేశాను

 *నేను 3 దోషములు/పాపములను చేశాను. నన్ను క్షమించు” అని ప్రాధేయ పడ్డారు శ్రీ ఆది శంకరాచార్యులు  వారు.*


🥦🥦🥦🥦🥦🥦🥦

        

శ్రీ ఆది శంకరాచార్యుల వారు , శిష్యులతో కాశి విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు.


గంగా నదిలో స్నానము చేసి, దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి, విశ్వేశరుని ఎదుట


“నేను 3 దోషములు/పాపములను చేశాను. నన్ను క్షమించు” అని ప్రాధేయ పడ్డారు.


ఇది విన్న శిష్యులు “ఆచార్యులవారు, ఏమి పాపము లు చేశారని ప్రాయశ్చిత్త పడుతున్నారు ?” అని అనుకున్నారు.


ఒక శిష్యుడు, ఏమిటి ఆ పాపము నేను తెలుసుకోవాలి అని ఆచార్యుల వారిని అడిగాడు. దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు.


1. “నేను భగవంతుడిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను. సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేశ్వరుడిని చూడడానికి మటుకు కాశి నగరానికి వచ్చాను. అంటే మనసా వాచా కర్మణా నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను.


అది నేను చేసిన మొదటి దోషం. 


2. తైత్త్రియ ఉపనిషద్ లో “యతో వాచో నివర్తన్తే , అప్రాప్య మనసా సః ” భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు” ఇది తెలిసి కూడా శ్రీ కాశి విశ్వనాధ అష్టకం వ్రాశాను. ఇది నేను చేసిన రెండవ తప్పు. 


3. నిర్వాణ శతకం లో

“న పుణ్యం న పాపం, న సౌఖ్యం న దుఃఖం. న మంత్రో న తీర్తం, న వేదా న యజ్ఞః

అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త. చిదానందరూపం శివోహం శివోహం“ అని వ్రాశాను. 


అర్థము :

నాకు పాప పుణ్యములు, సుఖ దుఃఖములు లేవు. మంత్ర జపములు తీర్థసేవలు , వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థము, భోజనము, భోక్త (భుజించేవాడు) నేను కాదు!నేను చిదానంద స్వరూపుడను, శివుడను, శివుడను!


ఇంత వ్రాసికుడా నేను తీర్థయాత్రలు చేస్తున్నాను అంటే నేను వ్రాసినవి, చెప్పినవి నేనే పాటించటంలేదు. అందుకనే నేను చేసిన ఈ మూడు తప్పులని మన్నించమని ,ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను.


నీతి :


మన ఆలోచన, తీరు, మాటా అన్ని ఒకే లాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి కథ మనకి తెలియజేస్తోంది.


*బయట ప్రపంచం మన పని తీరుని మట్టుకే చూస్తుంది. భగవంతుడు మాత్రం మన పని వెనక సంకల్పాన్ని , ఉద్దేశాన్ని కూడా చూస్తాడు.*


*“మనస్ ఏకం , వచస్ ఏకం , కర్మణ్యేకం!”*


ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధితో, ఆచరించి మనకు చూపించిన యధార్ధమైన మార్గము.

వృతాసుర వృత్తాంతము

 Srimadhandhra Bhagavatham -- 45 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


వృతాసుర వృత్తాంతము


ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక పెద్ద సభను తీర్చి ఉన్నాడు. ఆ సభకి అశ్వనీ దేవతలు వచ్చారు. యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులు వచ్చారు. ఎందరో పెద్దలు వచ్చారు. వీరందరూ అక్కడ నిలబడి ఉండగా అప్సరసలు సేవిస్తూ ఉండగా ఇంద్రుడు సముచితమయిన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అందరూ ఇంద్రుని సేవించేవారే తప్ప ఇంద్రుడి చేత సేవింపబడే వారు ఆ సభలో లేరు. గురువులకు ఒక వరుస ఏర్పాటు చేయబడింది. ఇటువంటి సభ నడుస్తూ ఉండగా ఇంద్రుడు కించిత్ అహంకారమును పొంది ఉన్నాడు. అంతమంది తనను సేవిస్తూ ఉండగా తాను చాలా గొప్పవాడినన్న భావన ఆయన మనస్సులో బయలుదేరింది. తానంత గొప్పవాడు అవడానికి కారణమయిన గురువు కనపడినా లేస్తాడా అన్నది అనుమానమే. అహంకారపు పొర కమ్మింది. మహాపురుషుడైన బృహస్పతి సభలోకి విజయం చేస్తున్నారు. ఇంద్రుడు చూశాడు. చూసి వస్తున్నవాడు బృహస్పతి అని సాక్షాత్తుగా తన గురువని తెలుసు. కానీ ఒక మాట అనుకున్నాడు. ఇంతమంది నన్ను సేవిస్తున్నారు. నేను లేచి నిలబడి ఎదురు వెళ్ళి నమస్కారం చేసి తీసుకువచ్చి ఆసనము మీద కూర్చోబెట్టడము ఏమిటి? అనుకున్నాడు. గురువు వస్తుంటే చెయ్యవలసిన మర్యాద ఒకటి ఉన్నది. ఇంద్రుడు ఆ మర్యాద చెయ్యలేదు. గురువు వస్తూ సభామంటపంలోకి వచ్చి రెండడుగులు వేసి చూశాడు. ఇంద్రుడు ఎవరో వస్తున్నాడులే అన్నట్లుగా కూర్చొని ఉన్నాడు. వెంటనే బృహస్పతి అనుకున్నాడు.

బృహస్పతికి మనస్సులో కించిత్ బాధ కలిగింది. గురువు వస్తుంటే లేచి నిలబడని కారణం చేత ఇంద్రునికి కలిగిన మద వికారమును తొలగించాలని అనుకుని తిరిగి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు సభ ఆపలేదు. సభ నడిపించాడు. సభ అంతా అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. ఇంద్రుడు మనసులో ‘అరెరే, ఇంతమంది నన్ను సేవించడానికి కారణం ఈశ్వరానుగ్రహం. అటువంటి ఈశ్వరానుగ్రహాన్ని నాకు తెచ్చి పెట్టినది గురువు బృహస్పతి. గురువు సభకు వస్తుండగా సింహాసనాధిష్టి తుడయిన రాజు లేవకూడదని చెప్పినవాడు, అధర్మంతోమాట్లాడిన వాడు. ఇంద్రుడనయిన నేనే చెయ్యకూడని పని చేశాను. నా వలన ఘోరాపచారం జరిగింది. ఖచ్చితంగా ఇది నన్ను కట్టి కుదిపి తీరుతుంది. దీనిని మా గురువులే ఆపాలి’ అని గబగబా పరుగెత్తుకుంటూ గురువుగారి ఇంటికి వెళ్ళాడు.

తనపట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఇంద్రుని మనస్సులో వస్తున్న భావజాలమును బృహస్పతి తన గృహమునందు కూర్చుని తెలుసుకుంటున్నాడు. ఇంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకోగానే అతనికొక పాఠము చెప్పాలని తన యోగశక్తితో ఇంద్రుడికి దొరకకుండా అంతర్ధానము అయిపోయాడు. ఇంద్రుడు వచ్చాడు. ఎక్కడా గురువుగారి దర్శనం అవలేదు. ఖిన్నుడై ఐరావతం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ‘అయ్యో! గురువుగారు ఎక్కడా దొరకలేదు. గురువుగారి పట్ల అపచారం చేశాను. గురువులకు క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నాను’ అని అనుకుంటున్నాడు. ఈ మాట వినవలసిన వాళ్ళు విననే విన్నారు. అదే ఉత్తర క్షణ ఫలితం అంటే. ఈయన మాటలను రాక్షసుల గూఢచారులు విన్నారు. వెంటనే పరుగుపరుగున వెళ్ళిపోయి రాక్షసులకు నివేదన చేశారు. ఇవాళ ఇంద్రునికి బృహస్పతి అనుగ్రహం తొలగిపోయింది. బృహస్పతికి ఆగ్రహం కలిగింది. గురువు ఆగ్రహం ఎవరిమీద కలిగిందో వాడిని పడగొట్టేయడము చాలా తేలిక. ఇంద్రుడు గడ్డిపోచ. మనం యుద్ధమునకు వెళ్ళడం కేవలం నిమిత్తం. ఇంద్రుడు ఓడిపోయి తీరుతాడు. మనం యుద్ధానికి బయలుదేరుదాం’ అన్నారు. రాక్షస సైన్యం అంతా వచ్చేశారు. బ్రహ్మాండమయిన పోరు జరుగుతోంది. ఇంత బలవంతులయిన దేవతలు కూడా గడ్డిపోచల్లా ఎందుకూ పనికిరాకుండా ఓడిపోయి వెళ్ళిపోతున్నారు. రాక్షసులకు ఇప్పుడు గురుబలం ఉన్నది. వీళ్ళు దేవతలే కావచ్చు, గురుబలం లేదు. అందుచేత వీరు ఓడిపోయారు. అమరావతిని రాక్షసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇంద్రాదులు భయపడి బ్రహ్మగారి దగ్గరకు పరుగెత్తారు. “అయ్యా, కనీ వినీ ఎరుగని విడ్డూరం. కొన్ని సంవత్సరములు పోరాడాం. మాకు ఓటమి తెలియదు. నిన్న బృహస్పతిగారికి కోపం వచ్చి సభలోంచి వెళ్ళిపోయారు. అమరావతి పోయింది. ఉత్తరక్షణంలో నేను రాజ్య భ్రష్టుడను అయిపోయాను. దేనిమీద కూర్చుని వీళ్ళందరూ నావాళ్ళు అనుకుని గౌరవింపబడ్డానో వాళ్ళ ఎదుటనే ఇంద్రుడు చేతకాని వాడయి ఓడిపోయాడు అనిపించుకుని తిరిగి వచ్చేశాను. దీనికంతటికీ కారణం నేను బృహస్పతిని అవమానించడమే అని అనుకుంటున్నాను. మాకు జీవితం ఎలా గట్టెక్కుతుంది’ అని అడిగాడు. బ్రహ్మగారు – మీరు అమృతం త్రాగామని, మరణం లేదని సంతోషపడుతున్నారు. మీరు పుట్టినప్పటి నుండి మహానుభావుడు బృహస్పతి బ్రహ్మవిద్యా నిపుణుడై అంతటా ఈశ్వరుడిని చూస్తూ తనకోసమని కాకుండా మహాత్యాగియై మీకందరికీ ఈ సుస్థిరమయిన స్థానములను కల్పించాడు. మహాపురుషుడిని ఎలా గౌరవించాలో మీకు చేతకాలేదంటే మీరు ఇవాళ మదించి ఉన్నారు. మీరు సింహాసన భ్రష్టులయ్యారు’. బ్రహ్మగారే తలచుకుంటే ఒకసారి బృహస్పతిని ప్రార్థన చేసి పిలువగలరు. గురువుపట్ల ఆయన చూపించిన మర్యాద గమనించాలి. ‘మీకు దేనివలన రాజ్యము పోయినది? మీకు బాగా ఎరుక కలిగిందా?' అని అడిగారు. వాళ్ళు ‘ బుద్ధి వచ్చింది. మాకు గురువుల అనుగ్రహం కావాలి’ అని చెప్పారు.

గురువు గారి అనుగ్రహం గురువుగారి నుంచే వస్తుంది.

బ్రహ్మగారు దేవతలతో ‘గురుస్థానం ఖాళీగా ఉండకూడదు. అందాకా మీకొక అభయం ఇస్తున్నాను. మీరు ఒక గురువును ఆశ్రయించి గురువు అనుగ్రహమును పొందండి. ఆచార్య పురుషునిగా ఉండడానికి ఎవరు అర్హుడో వారి పాదములు పట్టుకోండి' అన్నారు. వాళ్ళు మాకేం తెలుసు. మీరే సెలవివ్వండి’ అని అడిగారు. బ్రహ్మగారు ‘త్వష్ట అనే ప్రజాపతికి ఒక కుమారుడు ఉన్నాడు. వరుసకి ఆయన మీకన్నా చాలా చిన్నవాడు. కానీ ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని. మీరు అటువంటి మహాపురుషుని సేవించి గురుపదవియందు కూర్చోపెడితే ఆయన అనుగ్రహం చేత ఆయన ఆశీర్వచనం చేత మరల రాజ్యసంపదలు పొందగలరు. మీరు వెళ్ళి త్వష్ట ప్రజాపతి కుమారుడయిన విశ్వరూపుని ప్రార్థన చేయండి’ అన్నారు. అంతే వీళ్ళందరూ విశ్వరూపుని ఆశ్రయించారు.

విశ్వరూపుడిని ప్రార్థన చేశారు. ‘ మాకు గురువు అంటే ఎవరో తెలిసింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి, పరతత్త్వానికి, గురువుకి తేడా లేదు. ఒకటే అయి ఉంటాడు. బ్రహ్మగారి రూపమే తండ్రిగా ఉంటుంది. తండ్రి ఉపదేశము చేస్తే బ్రహ్మోపదేశమే! సోదరుడు ఇంద్రుని రూపములో ఉంటాడు. అన్నగారిని సేవిస్తే దేవేంద్రుని సేవించినట్లు. అమ్మ భూదేవి రూపం. తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు సాక్షాత్తు రాశీభూతమయిన దయా స్వరూపములు. తన భావమే ధర్మ స్వరూపము. అభ్యాగతుడు అగ్నిదేవుని రూపం. సర్వభూతములు కేశవుని రూపములు. నీకు మేముతండ్రుల వరుసఅవుతాము. ఎందుకంటే నువ్వు త్వష్ట ప్రజాపతి కుమారుడవు. కానీ ఇవాళ నీలో వున్న జ్ఞానమును మేము గుర్తించాము. నీయందు గురుత్వమును చూసి నిన్ను పరతత్త్వంగా చూసి నీ పాదములకు మా శిరస్సు తాటించి నమస్కరిస్తున్నాము. మాకు ఆచార్యత్వాన్ని వహించి మళ్ళీ దేవేంద్రాది పదవులు వచ్చేటట్లుగా అనుగ్రహాన్ని కటాక్షించు’ అన్నారు.

ఆయన గురుపదవిని స్వీకరించి వచ్చాడు. వస్తూనే ఆయన ఒక మహోత్కృష్టమయిన పని చేశాడు. రాక్షసులకు ఇవాళ ఇంత శక్తి ఎక్కడనుంచి వచ్చిందని బేరీజు వేశాడు. వారు ఆ శక్తిని శుక్రాచార్యుల వారి అనుగ్రహమునుండి పొందారని గ్రహించాడు. దేవతలకు ఎంత శక్తి వస్తే ద్విగుణీకృత ఐశ్వర్యమును ఇంద్రుడు పొంది రాక్షసులను చంపగలడో లెక్క గట్టాలి. ఇది లెక్క గట్టడానికి ఆ తేజస్సును గణించగల శక్తి ఇక్కడ ఉండాలి. అదీ ఆచార్యపదవి అంటే. అదీ గురుత్వం అంటే! ఇంద్రుని కూర్చోబెట్టి నారాయణ కవచం ఉపదేశము చేసి ఒక మాట చెప్పాడు. ‘ఇంతకూ పూర్వం ఈ నారాయణ కవచమును ‘కౌశికుడు’ అనే బ్రాహ్మణుడు ఉపదేశము పొందాడు. ఆయన ఎడారిలో తిరుగుతూ ఉండగా నారాయణ కవచమును ఉపదేశము తీసుకుని దానినే ధ్యానం చేస్తూ ప్రాణములను విడిచిపెట్టేశాడు. ఆ నారాయణ కవచము తేజస్సు ఆయన అస్థికలకు పట్టేసింది. ఆయన ఆస్థి పంజరము ఆ ఎడారిలో ఇసుకలో పడిపోయి ఉండిపోయింది. చిత్రరథుడు అనే గంధర్వుడు ఆకాశమార్గంలో భార్యలతో కలిసి విమానంలో వెళ్ళిపోతున్నాడు. ఆ విమానం ఎడారిలో పడిపోయి ఉన్న అస్థిపంజరము దగ్గరకు వచ్చింది. రాగానే దానిని దాటడం మానేసి ఆ విమానం క్రింద పడిపోయింది. అందులోంచి గంధర్వుడు భార్యలతో బయట పడిపోయాడు. అకస్మాత్తుగా విమానం భూమిమీద పడి పోయిందేమిటని తెల్లబోయాడు. ఈ సమయములో ఒక మహానుభావుడు వాలఖిల్యుడనే మహర్షి అక్కడికి వచ్చి ‘నీ విమానం పడిపోవడానికి కారణం నారాయణ కవచము ఉపదేశము తీసుకుని సశాస్త్రీయంగా ఉపాసిన చేసిన ఒక మహాపురుషుడు కౌశికుడనే బ్రాహ్మణుడు, ఇక్కడ ధ్యానంలో శరీరము విడిచి పెట్టాడు. ఆ కవచ ప్రభావము అస్థికలకు ఉండిపోయింది. ఎవరూ ఆ అస్తికలను దాటి వెళ్ళలేరు. నీవు ఆ అస్తికలను తీసి మూటగట్టి వాటిని దగ్గరలో ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనము చేసి తదనంతరం నువ్వు స్నానం చేసి ఆచమనం చేసి మరల వచ్చి విమానం ఎక్కితే నీ విమానం కదులుతుంది’ అన్నాడు. ఆ చిత్రరథుడు ఎముకలనన్నిటిని ఏరి మూటగట్టి తీసుకువెళ్ళి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి, స్నానం చేసి, ఆచమనం చేసి వచ్చి విమానం ఎక్కాడు. విమానం ఆ ప్రదేశమును దాటి వెళ్ళింది. ఈ నారాయణ కవచమునకు ఉన్న శక్తి అంత గొప్పది. నీకు ఉపదేశం చేస్తున్నాను స్వీకరించు అని ఆ నారాయణ కవచమును ఉపదేశము చేసాడు. శుక్రాచార్యుల వారు రాక్షసులకు ఇచ్చిన శక్తి కన్నా ఇంద్రుడి శక్తి ఎక్కువయి గురువుల అనుగ్రహము కలిగింది. రాక్షసులను అందరినీ ఓడించి మరల అమరావతిని స్వాధీనము చేసుకుని ఎంతో సంతోషముగా కాలం గడుపుతున్నాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

సోమరితనం

 ఒక బిచ్చగాడు పొద్దున్నే రోడ్డు పైన కూర్చుని భగవంతుడిని పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు.


ఆ దారినే ఆ దేశపు రాజుగారు గుఱ్ఱం మీద వెళుతు 

ఈ కేకలన్నీ విన్నాడు..


" ఏమైంది నీకు ! ఇంత పొద్దున్నే భగవంతుడిని తిడుతున్నావు ! అన్నాడు.


" మీకెమిటి ! మహారాజులు ! మిమ్మల్ని భగవంతుడు ఒక రాజు గారి కుమారుడిగా పుట్టించాడు ! మీరు చక్కగా మహారాజు అయిపోయారు....

నా ఖర్మ ఇలా ఉంది..ఒక రూపాయి కూడా లేని

దరిద్రుడిగా పుట్టించాడు.. చూడండి..

దేవుడికి ఎంత పక్షపాతమో! అన్నాడు..


మహారాజు చిరునవ్వు నవ్వాడు,

" అయితే భగవంతుడు నీకేమి ఇవ్వలేదు !! 

చిల్లిగవ్వ కూడా ఇవ్వ లేదు అంతేగా ! "" అన్నాడు.

" నిజం చెప్పారు మా రాజా ! " అన్నాడు బిచ్చగాడు.

" సరే అయితే ! నీకు పది వేల వరహాలు ఇస్తాను .

నీ అరచేయి కోసి ఇస్తావా ! అన్నాడు రాజుగారు.

" భలేవారే ! అర చేయి లేక పోతే ఎలా ! " అన్నాడు ఆ బిచ్చగాడు.

" సరే ! నీ కుడి కాలు మోకాలి వరకు కోసుకుంటాను... ఒక లక్ష వరహాలు ఇస్తాను..ఇస్తావా ! " అన్నాడు రాజుగారు.

" ఎంత మాట ! ఆ గాయం మానడానికి ఎంత కాలం పడుతుందో ఏమిటో ! ఇవ్వను ! "అన్నాడు బిచ్చగాడు.

" అన్నింటినీ కాదంటున్నావు....... 

ఆఖరిగా అడుగుతున్నా...... పది లక్ష ల వరహాలు ఇస్తాను... నీ నాలుక కోసి ఇస్తావా! అన్నాడు రాజుగారు.

" అమ్మో! మీరు నా జీవితాన్ని ఆడిగేస్తున్నారు. 

ఇవి లేకపోతే నేను ఎలా జీవించను ?? అన్నాడు బిచ్చగాడు.

" ఓహో ! అయితే నువ్వు పేదవాడివి కాదన్నమాట !!

నీ దగ్గర పదివేల కన్నా విలువైన అరచేయి, 

లక్ష రూపాయిల కన్నా విలువైన కాళ్ళు, 

పది లక్షల కన్నా విలువైన నాలుక ......

ఇంకా ఎంతో విలువైన శరీర అవయవాలు 

ఉన్నాయి కదా ......??

మరి ఇంత విలువైన శరీరాన్ని 

నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతుడికి 

పొద్దున్నే నమస్కారం పెట్టకుండా నిందిస్తావా !!

ఈ శరీరాన్ని ఉపయోగించి 

 లోకానికి సేవ చేసి పొట్ట పోసుకో ! 

అందరూ అదే చేస్తున్నారు...ఫో ఇక్కడనుండి.! 

అన్నాడు రాజుగారు.

సోమరితనం మనిషిని మరింత నాశనం చేస్తుంది.

ఎదుటి వారిని చూసి ఏడవడం కాదు. 


ఆ విధంగా పైకి ఎదగడానికి కష్ట పడి పని చేయాలి. అటువంటి ఆలోచన మనసులో బలంగా ఉండాలి.

మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. 

అంతే తప్ప కస్టపడడానికి సిగ్గు పడితే 

జీవితం నాశనం అవుతుంది.

సోమరితనం 

మనిషిని మరింత చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది... జీవితంలొ గొప్ప వ్యక్తి గా ఎదగడానికి కృషి చేయాలి.

శుద్ధమైన మనస్సుకు

 శ్లోకం:☝️

*ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం*

 *యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై |*

*తం హ దేవం ఆత్మబుద్ధిప్రకాశం*

*ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ||*


భావం: ఆబ్రహ్మకీట పర్యంతం సృష్టికి ఆధారభూతమైనదియు, శుద్ధమైన మనస్సుకు మాత్రమే ప్రకాశించేదియు, వేదరూపంలో జ్ఞానాన్ని ప్రసరింపజేసే ఆ సర్వోత్కృష్ట తత్త్వమును ముముక్షువునైన నేను ఆశ్రయిస్తున్నాను.🙏

భావం చెప్పకుండా కేవలం భావన మాత్రమే చేయాల్సిన శ్లోకం!