This book was published in 1916 by Benaras Hindu University...Not available now. All the copies got destroyed. One copy was available in the library of California University, which has been digitised by Microsoft. It is a beautiful introduction to Hinduism, without any school affiliations. It is especially suited to youth. You may go through at leisure. It has 304 pages and share it further with your known younger generation kids. This is a rare book on “Sanatana Dharma” - Please READ and share it to our youth group as much as possible... https://kponline.in/sanatana-dharma/#pdf-sanatana-dharma/8/
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
29, మే 2023, సోమవారం
ఎవరు సంతోషంగా ఉంటారు?’*
‘ *ఎవరు సంతోషంగా ఉంటారు?’*
తన భోజనాన్ని తాను వండుకునేవారు, అప్పులు లేనివారు, దూరతీరాలకు ప్రయాణించని వారు సంతోషంగా ఉంటారు.
మనిషి ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ ఉండటంలోని ఆనందం మరి దేనిలోనూ రాదు. పాశ్చాత్యులు అధికంగా సంపాదించడం ద్వారా తమ జీవిత సమస్యలకు పరిష్కారాలు వెదుకుతుంటే, భారతీయులు ఉన్నదానితో సంతృప్తిగా జీవించడంలోనే తమ జీవిత సమస్యలకు పరిష్కారం కనుగొంటున్నారు అంటారు స్వామి వివేకానంద.
సహజంగా మనిషి ఆనందస్వరూపుడు.
అతడికి గతంతోను, భవిష్యత్తుతోను సంబంధం ఉండదు. ఉన్నచోట, ఉన్నక్షణంలో సంపూర్ణంగా జీవించడమే ఆనందానికి మార్గమని గ్రహిస్తాడు.
అతడు వర్తమానంలోని ప్రతి క్షణాన్నీ సంపూర్ణంగా ఆస్వాదిస్తాడు.
ఆనందస్వరూపుడైన వ్యక్తి ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ ఏదో ప్రత్యేకత ఉందని తెలుసుకుంటాడు.
అందుకే ప్రతి వస్తువుపట్లా సమభావం, సమదృష్టి కలిగి ఉంటాడు.
మానవ జన్మ లభించడమే ఒక వరం. అలాంటి జన్మను సార్థకం చేసుకోవడానికి మనిషి ప్రయత్నించాలి.
మనిషి లోకోత్తర ధర్మాలైన దానం, పరోపకారం, సేవ వంటి దైవీ గుణాలు అలవరచుకుని ఆర్తులను ఆదుకున్నప్పుడే శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాడు.
మానవసేవ మధురమైన పరిమళం లాంటిది. ప్రతి మనిషీ ఇతరుల వెతలను దూరం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడు లభించే సంతోషం వర్ణనాతీతం.
ఆ సేవే మనిషికి మరిచిపోలేని అనుభూతిని, ఆనందాన్ని ఇస్తుంది.
మనిషిని మహానుభావుడిని చేస్తుంది!
శుభోదయం . మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
భార్య - భర్త!*
*భార్య - భర్త!*
భార్య గురించి, భార్యాభర్తల సంబంధం గురించి మహాస్వామి వారు...
వేదము ప్రతిపాదించిన శాస్త్రకర్మలు చేసితీరవలసిందే. ఇందుకోసం మానవుడు బ్రహ్మచర్యాశ్రమము తరువాత వేరొకరి సహాయం తీసుకొనవలసిందే.
ఆ సహాయకురాలు నీకు భగవంతుడు ఇచ్చిన బహుమానం. అది ఎప్పటికి నీనుండి విడదీయలేని ఆస్తి.
ఆమె ఉపయోగం నీకు కేవలం వండిపెట్టడానికి, నీఇంద్రియాలకు తృప్తి నివ్వడానికి మాత్రమే కాదు. ఆమెను “ధర్మ-పత్ని”, “యజ్ఞ-పత్ని” అని శాస్త్రాలు కొనియాడాయి. కేవలం ధర్మాచరణకు ఆమె భర్తతో ఉండాలి. భర్తకు అటువంటి ధర్మానురక్తి కలిగించడం ఆమె కర్తవ్యం.
ధర్మపత్నిగా ధర్మాచరణయందు ఆయన పక్కన ఉండాలి. మానవాళి సంక్షేమానికి చేసే యజ్ఞయాగాది క్రతువులందు ఆమె భర్తను అనుగమిస్తూ ఆయనకు సహాయం చెయ్యాలి.
ఆమె తన భర్తకు కేవలం వంట చేసి, అతని ఇంద్రియాలకు సుఖాన్ని ఇచ్చినా ఆమె ప్రపంచ క్షేమాన్ని కోరుకున్నట్టే. అది ఎలాగంటే ఆమె కేవలం తన భర్తకు మాత్రమే వంట చెయ్యదు. ఆమె చేసిన వంట వల్ల అతిథులు, అన్నార్తులు, పశుపక్ష్యాదులు కూడా ఆధారపడతాయి. ఇలా ఆమె వల్ల ‘అతిథిసేవ’ ‘వైశ్వేదేవము’ కూడా జరుపబడతాయి.
ఆమెకు పుట్టిన పిల్లలు కేవలం తన భర్తకు ఇచ్చిన సుఖానికి ప్రతిఫలములు కాదు. ఆమె వైదిక ధర్మాన్ని పెంపొందించడానికి వారిని కంటుంది. కుమారుల పెంపకం కూడా భవిష్యత్ ధార్మిక ప్రయోజనాలకోసమే. ప్రపంచంలోని ఏఇతర ధర్మము వివాహ వ్యవస్థకి ఇంతటి లక్ష్యం ఆపాదించలేదు.
మన సనాతన ధర్మంలో స్త్రీపురుష సంబంధం కేవలం ప్రాపంచిక విషయ సుఖాలకోసం కాదు. ఆ పవిత్ర సంబంధం వల్ల ఆత్మోన్నతి, మానవ ఉద్ధరణ లభిస్తాయి.
వేరే మతాల్లో కూడా దేవుని సాక్షిగానే వివాహాలు జరుగుతాయి కాని మన వివాహ వ్యవస్థ అంత ఉన్నతమైన వ్యవస్థ కాదు వారిది.
మన సనాతన ధర్మంలో వివాహం, భర్తను ఉత్తమ స్థితికి తీసుకునివెళ్ళి భార్యకు పరిపూర్ణత్వాన్ని ప్రసాదించడమే.
ఇంతటి మహోన్నత వ్యవస్థ వేరే సంప్రదాయాలలో లేదు. వేరే దేశాలలో స్త్రీ పురుష సంబంధం కేవలం కుటుంబం లేదా కేవలం సామాజిక ఒప్పందం మాత్రమే.
కాని ఇక్కడ మనవారిది ఆత్మ సంబంధం. కాని ఈ సంబంధం కూడా ప్రాపంచిక విషయాలనుంచి ఆత్మను దూరం చేసి ఆత్మోన్నతి పొందేది అయ్యుండాలి. ఇందులో విడాకులు అన్న పదానికి తావు లేదు. అది తలవడం కూడా పాపమే.
మూడు ముఖ్యమైన సంస్కారములు కలగలిసి వివాహము అనే సంప్రదాయం ఏర్పడింది. మొదటిది వేదాధ్యయనం అవ్వగానే పురుషునికి ఒక తోడు, సహాయకురాలు ఏర్పాటు చెయ్యడం. ఈ తోడు కేవలం ఇంటి అవసరాలు తీర్చడం కోసమే కాకుండా పురుషుని వైదికధర్మాచరణకు తోడ్పాటునివ్వడం.
రెండవది మంచి వ్యక్తిత్వం మంచి నడవడిక గల ఉత్తమ సంతానాన్ని కనడం. వారి వల్ల ఆ వంశపు వైదికసంస్కృతి పరిఢవిల్లుతుంది. మంచి వ్యక్తులుగా ఎదిగి సంఘానికి మేలుచేసే సంతానం అవుతారు.
మూడవది స్త్రీకి ప్రాపంచిక ఉనికినుండి విముక్తినివ్వడం. ఆత్మోన్నతి పూర్తిగా పొందని భర్తని అతని కర్మానుసారం భార్య నడిపిస్తుంది. అలా చేయడం వలన ఆమె పూర్తిగా భర్తకు అంకితమై అతనికంటే పైస్థాయిని పొందుతుంది.
నాలుగవది పైమూడు విషయాలకోసం విచ్చలవిడి ఇంద్రియ సుఖాలను అణిచివేయడం.
కాని ఇప్పుడు మనం పై మూడింటిని మరచిపోయాము. మిగిలినది నాలుగవది ఒక్కటే శారీరక సుఖం లేదా ఇంద్రియ సుఖం. ఎల్లప్పుడూ అసత్యమైన ఈ శరీరమును సుఖింపచేయడం.
మీరు నా సలహా పాటించి శాస్త్రము చెప్పిన ఉన్నతమైన ఆదర్శాలకొరకు సశాస్త్రీయ వివాహము చేసుకొన్న ఆత్మోన్నతి తప్పక పొందెదరు.
https://kutumbapp.page.link/XEoAarQUMdnfdtxg7?ref=F4LTY
నాగమల్లి పుష్పములు*
*నాగమల్లి పుష్పములు*
శివలింగ వృక్షం శివుడి జటాజూటాకృతి లో వెంట్రుకలు విప్పారినట్లుగా ఉంటుంది. ఈ చెట్టుకి పూచే పుష్పములు కొమ్మలకి పూయకుండా వెంట్రుకలలాంటి జడలకు పూస్తాయి. పువ్వు పైభాగాన నాగపడగ కప్పినట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి.అందుకే ఈ పుష్పాలను శివలింగపుష్పాలని, నాగమల్లిపుష్పాలని, మల్లికార్జునపుష్పాలని పిలుస్తారు. ఈ పుష్పాలు అద్భుతమైన సుగంధ పరిమళాన్ని కలిగి ఉంటాయి.ఆ పరమేశ్వరుడు ఈ శివలింగ పుష్పం రూపంలో కొలువై ఉన్నాడని భక్తులు భావిస్తారు. ఈ శివలింగ పుష్పాలు శివుడికి, మరియు సమస్త దేవతలకి ప్రీతికరమైన పుష్పాలు. ఈ పుష్పాలతో పూజ చేయడం శివభక్తులకి ఒక వరం. శివలింగ పుష్పాలతో ఆ పరమేశ్వరుని పూజ చేసినవారు జన్మరాహిత్యం పొంది చివరకు కైవల్యం పొందుతారని శివపురాణం లో ఉన్నది.
*శివలింగ వృక్షం*
శివలింగ వృక్ష శాస్త్రీయ నామం కౌరౌపిటా గియానెన్సిస్. ఆంగ్ల పరిభాషలో కేనన్ బాల్ ట్రీ అంటారు.
ఇది దక్షిణ అమెరికాలోను, దక్షిణ భారతదేశంలోను కనిపిస్తుంది. ఈ వృక్షాన్ని నాగలింగ వృక్షమని కూడా అంటారు.
హృదయరంజకంగామాటలాడటంనేర్చుకో
శుభోదయం🙏
మనోహరంగా మాట్లాడటం
ఒకకళ!!
మాటలచేత దేవతలు మన్ననచేసి వరంబులిచ్చెదర్
మాటలచేత భూపతులు మన్ననచేసి ధనంబు లిచ్చెదర్
మాటలచేత కామినులు మగ్నతచెంది సుఖంబు లిచ్చెదర్
మాటలు నేర్వకున్న అవమానము, న్యూనము, మానభంగమున్;
-చిలకమర్తి లక్ష్మీనరసింహం!
మనమాట మనజీవితానికి చక్కనిబాట.దాన్ని చక్కగా వాడటం నేర్చుకోవాలి.లేకపోతే కష్టమే!
లోక వ్యవహారమంతామాటమీదే!నోరుమంచిదైతే ఊరుమంచిదౌతుంది.ఇత్యాదిగా సామెతలెన్నో.లోకమెరిగిన కవితనఅనుభవాన్ని రంగరించి మనకుచెప్పిన మంచిమాటలీపద్యంలోచోటుచేసికొన్నాయి.
మంచిమాటల చేతనే
(స్తోత్రాదులు)దేవతలు వరాలిస్తారు.మాటలవలననేరాజులుమన్ననచేసిమాన్యాలిస్తారు.మాటలకుపొంగిపోయేమానినులుపరవశమందిసుఖాలు ప్రసాదిస్తారు.
కాబట్టి మిత్రమా!మంచిగా హృదయరంజకంగామాటలాడటంనేర్చుకో!
సరిగామాటలాడటం రాకపోతే, అందరిలో అవమానింపబడతావు.చిన్నతనంతప్పదు.ఆపైపరితాపంతప్పదు.
కాబట్టి మధురంగా మాటలాడటం నేర్చుకో!
అని సందేశం!!!🙏🙏
ఎన్నో విధాల శ్లేషలు
వసుచరిత్రలోని
శబ్దచమత్కారాలు!!
శుక్తిమతీ వర్ణనం!
శబ్ద చమత్కారాలకు పుట్టినిల్లు 'వసుచరిత్ర' శుక్తిమతిని నదిగా, స్త్రీగా వర్ణించే పద్యం
లో చక్కటి శ్లేష వైచిత్రి గోచరిస్తుంది.
జీవనమెల్ల సత్కవి నిషేవిత మాశయమెల్ల నచ్ఛతా
పావనతా, గభీరతల పట్టు ప్రచారములెల్ల విశ్వ ధా
త్రీ వలయ త్రికాల ఫల దేశిక ముల్నవ కంబు లెల్ల ము
క్తావళి విభ్రమాస్పదము, లానది పెంపు నుతియింప శక్యమే
అర్థము:--ఆమె జీవితమంతా కవుల పొగడ్తలతో నిండింది. ఆశయాలన్నీ
స్వచ్ఛత,పావనత,గాంభీర్యానికి నిలయం.ఆమె నడవడిక,భూమండలానికి మూడు లోకాలలోనూ శుభఫల సూచకం.ఆమె అందం
జీవన్ముక్తుల్ని కూడా మోహ విభ్రాంతుల్ని చేసేది. ఇది స్త్రీ పరమైన అన్వయం.
నదీపరంగా చూస్తే నీటిపక్షులతో(జీవనమంటే జలమనీ,కవులంటే నీటి పక్షులని
అర్థం వుంది.)
జల పక్షులు స్వచ్చమైన,పవిత్రమైన, లోతైన,జలాశయాలతో కూడినవి.ముత్యాల
సమూహానికి ఆధారభూతమైన శంఖాలతో ప్రవేశించేవి. ఇందులో సమాసోక్త అలంకారం వుంది. సంస్కృత,తెలుగు భాషా శ్లేషలు,మిశ్రమ భాషా శ్లేషలు,సంధిలో శ్లేషలు,జాతీయాల్లో శ్లేషలు యిలా ఎన్నో విధాల శ్లేషలు ప్రయోగించాడు భట్టుమూర్తి.
------------------- స్వస్తి--👏👌
*ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 74*
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 74*
'ఈ పావురం ఎవరిది ... ఎక్కడి నుంచి వచ్చింది ... ?' అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు చంద్రుడు.
చాణక్యుడు పావురాన్ని దోసిట్లోకి తీసుకుని దాన్ని వాత్సల్యంగా చుంబిస్తూ "చంద్రా ..! కాలం కలిసి వస్తే అన్ని శుభాలే ఎదురవుతుంటాయి.." అన్నాడు.
చంద్రుడు మరింత ఆశ్చర్యంతో "ఎదురొచ్చిన శుభం ఏమిటి, ఆర్యా...?" అని అడిగాడు.
చాణక్యుడు పావురం రెక్కచాటు నుంచి చిన్న లేఖా పత్రాన్ని తీసి చంద్రుని మీదికి విసురుతూ "నువ్వే చూడు..." అన్నాడు. చంద్రుడు ఆ పత్రాన్ని మడత విప్పి సందేశాన్ని చదువుకుని ఆనందంతో "గురుదేవా ! తమకి పుత్రికోదయమయ్యింది" అని చెప్పాడు.
చాణక్యుడు ముసిముసిగా నవ్వుతూ "ఆ కాశీ పురాధీశ్వరి నా ఇంట అవతరించిందన్నమాట. సంతోషం" అంటే గబగబా చేతి వేళ్ళమీద గణికం, గ్రహస్థానాలు, గతులు లెక్కించి "శుభం ... మదీయ పుత్రిక నామదేయం ... అన్నపూర్ణ..." అంటూ అప్పుడే అప్పడికక్కడే ఏ ఆర్బాటాలూ లేకుండా తన కుమార్తెకి 'అన్నపూర్ణ' అని నామకరణం చేశాడు చాణక్యుడు.
చంద్రగుప్తుడికి ఆ శుభవార్త ఎంత సంతోషాన్ని కలిగించిందో, అంత విచారాన్ని కలిగించింది. అతడు బాధతో తలదించుకుంటూ "గురుదేవా... ! నావల్ల కదా తమరు యీ సంతోష సమయంలో భార్యపుత్రికలకు దూరంగా వుండిపోయారు" అన్నాడు వేదనతో.
చాణక్యుడు వాత్సల్యంగా అతని భుజం తట్టి "చంద్రా ! మమతలూ.. మమకారాలూ మానవ సహజం వాటికి స్పందించడం, సుఖదుఃఖాలను అనుభవించడం మానవ నైజం. నేనూ వాటికేమీ అతీతుడ్ని కాను... కానీ, వీటన్నిటికంటే ముఖ్యమైనది ధర్మం... ధర్మపరిరక్షణామార్గంలో మమతానురాగాలను పాటించకూడదని సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి బోధించాడు. కనుక దూరంగా వున్న వాళ్ల గురించి విచారించడం మాని స్వ ధర్మాచరణకు తలోగ్గినవాడే నా దృష్టిలో మనిషి. నేనే ఆ మార్గాన్నే అనుసరిస్తున్నాను" చెప్పాడు భావోద్వేగంతో. చాణక్యుని ధర్మాచరణ దృక్పధానికి చేతులు జోడించి నమస్కరించాడు చంద్రగుప్తుడు.
ఇక చంద్రగుప్తునికి వివాహ ముహూర్తం నిశ్చయమైంది. పాంచాల భూపతి పురుషోత్తముడు సపరివార సమేతంగా వెంటరాగా చంద్రుని తోడ్కోని సింహపురానికి చేరుకున్నాడు చాణక్యుడు. నగర పొలిమేరలలోనే సింహాపురాధీశ్వరుడు విజయవర్మ వియ్యాలవారికి రాజోచిత లాంఛనాలతో స్వాగత సత్కారాలు జరిగాడు.
పండితులు నిర్ణయించిన శుభముహూర్తానికి విజయవర్మ తన రాజ్యంతో సహా తన కుమార్తె శాంతవతిని చంద్రగుప్తునికి సాలంకృత కన్యాదానం మొనరించాడు. 'దేవ దుంధుబులు మ్రోగుతున్నాయా' అన్నట్లు మంగళతూర్యనాదాలు మిన్నుముట్టాయి.
ఇరుపక్షాల వారికీ ఏకైక పెద్ద దిక్కుగా నిలిచి చాణక్యుడు అంతటా తానే అయి ఆ శుభకార్యాన్ని కన్నుల పండువుగా జరిపించాడు. వివాహానంతరం చంద్రగుప్తుడు, శాంతవతితో కలిసి సింహపురి సింహాసనం మీద పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, నూతన వధూవరులకు కానుకగా తన పాంచాల రాజ్యాన్ని వేద మంత్రయుక్తంగా సమర్పించాడు.
"సింహపుర, పాంచాల రాజేంద్రుడు శ్రీ శ్రీ శ్రీ చంద్రగుప్త మౌర్యుల వారికీ... జై ..." అంటూ నినాదాలు మిన్నుముట్టాయి.
(ఇంకా ఉంది)...
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
అన్నం
అన్నము గురించి సంపూర్ణ వివరణ -
* అన్నం అగ్నిదీపనం చేయును .
* మలమూత్ర విసర్జనకారిగా ఉండును.
* చక్కగా వండి గంజివార్చిన అన్నం శరీరం నందు వేడిని కలిగించును. శరీరముకు హితము చేయును . మంచి పథ్యముగా ఉండును.
* బియ్యము కడగక గంజివార్చబడని అత్తెసరు అన్నం పైత్యమును చేయును . శుక్రమును వృద్ధిచేయును . కఫానికి కారణంగా ఉండును.
* బియ్యమును వేసి పాకము చెయ్యబడిన అన్నం రుచికరంగా ఉండి కఫాన్ని హరించును . తేలికగా ఉండును.
* పప్పు , మాంసాదులు వేసి వండిన అన్నము గురుత్వము చేయును . శుక్రమును వృద్ధిపరచును. కఫమును పుట్టించును .
* బెల్లము మొదలగు మధురరసములతో కలిసి మధురాన్నం గురుత్వం చేయును . శుక్రాన్ని వృద్దిపరచును. వాతజ్వరమును హరించును .
* మెంతి,మజ్జిగతో చేర్చిబడిన అన్నం గ్రహణి, మూలరోగం , అలసట పొగొట్టును.మరియు జీర్ణకారి.
* అతివేడి అన్నం బలమును పొగొట్టును. సమశీతోష్ణ స్థితిలో ఉన్న అన్నం తినుట మంచిది .
* రెండుమూడు రోజులు నుంచి ఉన్న అన్నం పాచి అన్నం రోగాలను పుట్టించును .
* వరి అన్నం రుచి పుట్టించును . సర్వరోగ హరమైనది . నేత్రాలకు హితము చేయును . జఠరాగ్నిని పెంచును. హృదయమునకు మేలుచేయును. శుక్రవృద్ధి , శరీర ధారుడ్యం కలుగచేయును . పథ్యకరం అయినది. దాహాన్ని తగ్గించును .
* శరీరానికి కాంతిని ఇచ్చును. మూత్రవృద్ధి చేయును . తేలికగా ఉండును. ముడిబియ్యపు అన్నం అగ్నిదీప్తి కలిగినవారికి మంచి శ్రేష్ఠమైనదిగా
ఉండును .
* సన్నరకం బియ్యపు అన్నం దీపనకారిగా ఉండి దోషములను పోగొట్టును . ప్రశస్తమైనది , రోగములను హరించును .
* మినపపప్పు గాని నువ్వుల గాని చేర్చి వండిన అన్నమును పులగం అందురు. బలమును కలుగచేయును . మలమును బంధించును . పెసరపప్పు , కందిపప్పు , శనగపప్పు వగైరా బియ్యముతో చేర్చి వండిన అన్నం శుక్రమును మరియు బలమును పెంచును . పుష్టిని కలిగించును. మలమును విసర్జింపచేయును . వాతాన్ని హరించును . పిత్తమును మరియు కఫాన్ని పెంచును.త్వరగా జీర్ణం అవ్వకుండా ఉండును.
* పాలలో బియ్యం , చెక్కర వగైరా కలిపి వండినదానిని పాయసం అనియు క్షీరాన్నం అనియు పరమాన్నం అని కూడా అంటారు. పాయసం త్వరగా జీర్ణం కాదు. బలమును , ధాతుపుష్టిని చేసి మలమును బంధించును .
ఇప్పుడు పప్పుల గుణములు కూడా మీకు వివరిస్తాను.
పెసరపప్పు వాతమును , కడుపు ఉబ్బరమును కలిగించును. పొట్టు తీసిన పెసరపప్పు మధురంగా ఉండును. దేహకాంతిని కలుగచేయును . గుల్మము , ప్లీహము,కాస , అరుచి , పిత్తము , ప్రమేహరోగము , గళ రోగమును హరించును .
కందిపప్పు రుచిగా ఉండి మలబద్దకం, కుష్టు , జ్వరం , అతిసారమును హరించును . శనగపప్పు కడుపుఉబ్బరం కలుగచేయును . ఉలవపప్పు కఫపిత్తరోగములను , గుల్మొదరం , మూలవ్యాధి , వాతం , క్రిమిరోగం , కాసరోగం , ఆమవాతంను హరించును . అలసందపప్పు
మధురంగా ఉండును. బలమును వృద్దిచేయును.
కొందరు పొట్టుతీసిన పెసరపప్పు , పొట్టుతీయని కందిపప్పు విషతుల్యం అందురు. కారము మరియు కమ్మదనం కలిగిన పదార్థముల యందు పైత్యమును , పులుసు , వగరు కలిగిన పదార్థముల యందు శ్లేష్మము , తీపు మరియు చప్పదనం కలిగిన పదార్థముల యందు వాతము కలదని ఋషుల యొక్క అభిప్రాయం . కావున శరీరతత్వము మరియు రోగమును గుర్తించి పథ్యం పెట్టవలెను.
మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
తెలుసుకోవడం కష్టం.
.
_*సుభాషితమ్*_
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*విపత్తౌ కిం విషాదేన*
*సమ్పత్తౌ హర్షణేన కిమ్।*
*భవితవ్యం భవత్యేవ*
*కర్మణో గహనా గతిః॥*
-సూక్తిసుధానిధిః
తా𝕝𝕝
ఆపదలలో దుఃఖించడం ఎందుకు, సంపదలలో సంతోషించడం ఎందుకు? ఏది జరగనున్నదో అది జరిగితీరుతుంది....కర్మగతిని(ఏ కర్మ ఎపుడు ఏ ఫలం ఇస్తుందో) తెలుసుకోవడం కష్టం.
ఆవు
1) ఆవు పంచకం ఒక్కసారి తీసుకుంటే అన్ని పాపములు తొలగి పోతాయి
ఆవు పాలు + ఆవు పెరుగు+ ఆవు నెయ్యి+ఆవు మూత్రం+ ఆవు పేడ
2) ఆవుకు ప్రదక్షిణము చేయడం = అమ్మ వారికి ప్రదక్షిణము చేయడం
3) ఆవు గొంతు తాకితే ఎంతో పుణ్యం
4) ఆవు తోకతో చిన్న పిల్లలకు దిష్టి తీయవచ్చు
5) ఎండ పెట్టిన ఆవు పేడతో విభూతిని /భస్మం తయారు చేస్తారు
6) ఆవు విభూతిని /భస్మమును తలపై చల్లుకుంటే స్నానం చేసిన పలితం వస్తుంది
7) ఆవు గోరచనముతో గుడిలో దీపం వెలిగిస్తారు
8) ఆవు కొమ్ముతో శివుడికి అభిషేకము చేస్తారు
9) పుట్టిన రోజున ఆవు పాలు+నల్ల నూగులు+బెల్లం కలిపి తీసుకోవాలి
10) అలా చేస్తూ సప్త చిరంజీవుల పేర్లు స్మరిస్తే మళ్ళీ పుట్టిన రోజు జరుపుకుంటారు
11) ఆవుకు ఎదైనా తినిపిస్తే, అది అమ్మ వారికి పెట్టిన పలితం వస్తుంది.
అంత గొప్పది ఆవు
ఆవుకు అంత శక్తి ఉంది
కవితా విన్యాసం*
*00000000000000000*
*సున్న పై ములుగు విశ్వ నాధ శాస్త్రి గారి కవితా విన్యాసం*
*00000000000000000*
*0* కి విలువెంత అని *పంతుల్ని* అడిగితే
*సున్నా* కి విలువేంటి? *శూన్యం* అంటాడు!
*0* లేకుండా
*పంతులూ* లేడు! ఏ *పండితుడూ* లేడు!
*అంకెల* దరిజేరి అది విలువలను పెంచు!
పదముల దరిజేరి పదార్థములనే కూర్చు!
*సున్న* ప్రక్కన *0* చేరి *సున్నం* అయ్యె!
*అన్న* ప్రక్కన *0* చేరి *అన్నం* అయ్యె!
*ఆంధ్రా* లో *అన్నబియ్యం* కూడా కిలో *రెండు* అయ్యె!
*పది* మధ్యలో దూరి
*పంది* గా మారె!
*నది* మధ్యలో దూకి
*నంది* గా మారె!
ప్రతి *కొంప* లోనూ
అది తిష్ట వేసింది!
*0* లేనట్టి *సంసారమే* లేదు!
*కాంగి* లోనూ దూరె!
*దేశం* లోనూ దూరె!
*కమలం* లోనూ దూరే !
అది *రాజకీయం* కూడా నడుపుచుండె!
*పంచాయతీ* నుండి *పార్లమెంటు* వరకూ అది మెంబరై ఉండ!
*గుండుసున్నా*
అని ఎగతాళి చేయకు
*గూండా* గా మారి రుబాబు చేయు!
*ఆరంభము* న *0*! *అంత* మందున *0*!
*జననం* లో *0*!
*మరణం* లో *0*!
*శూన్యం* లో *0*! *అనంతము* లో *0*!
*ఇందూ*, *అందూ*
అను సందేహమేల!
*అండ*, *పిండ*, *బ్రహ్మాండము* లలో *0*!
*సత్యం*,
*శివం*,
*సుందరం*
అన్నింటిలోనూ అది అలరారుతోంది!
*0* తోటే ఉంది
*అందం*! *ఆనందం*!
*జీవితం* లో చివరకి మిగిలేది *0* !
*గోవిందా*! *ముకుందా*! *శంభో*! *శంకరా*!
*సున్నాలు* గలవే ఈ భగవన్నామాలు అన్నీ!
*ఏడుకొండల* వాడా! *వెంకట* రమణా!
నీకు నామాలతో పాటు అందు *సున్నాలు* లేవా!
తిరుపతిలో ఎక్కు ప్రతి *కొండ* లోనూ *0*!
తిరిగి దిగి వచ్చు ప్రతి *గుండు* లోనూ *0*!
ఇంత మహిమ గల *0* -
మరి *గుడి* లోను లేదని, *బడి* లోను లేదని
దిగులెందుకన్నా!
*గుడి* లోన జేరి *గుండి* గా,
*బడి* లోన జేరి *బండి* గా మారడం దాని *అభిమతం* కానే కాదన్నా!
కనుక గుడి *గంట* లో చేరి, బడి *గంట* లోనూ చేరి
మోత మోగిస్తోందన్నా!
ఆ మోత *నాదం* లోనూ *0*!
*కాలం* తోటే అది పరుగులిడుతోంది!
ప్రతి *గంట*,
ప్రతి *దినం*,
ప్రతి *వారం*,
ప్రతి *పక్షం*,
ప్రతి *మాసం*,
ప్రతి *సంవత్సరం*,
అన్నిటా ఉండి *కాలచక్రo* ను అది తిప్పుతోంది!
*వారం*, *వర్జ్యం* అంటూ, *గ్రహం* - *గ్రహణం* అంటూ
*పంచాంగం* అంతా *సున్నా* ల మయమే!
*దేహం* తోటే అది అంటిపెట్టుకుని ఉండె!
*కంటి* లోనూ *0*!
*పంటి* లోనూ *0*!
*కంఠం* లో *0*!
*కండరం* లో *0*!
*చర్మం* లో *0*!
*రక్తం* లో *0*!
*దాహం* లో *0*!
*మోహం* లో *0*!
*రాగం* లో *0*! *అనురాగం* లో *0*!
*సరసం* లో *0*!
*విరసం* లో *0*!
*కామం* లో *0*!
*క్రోధం* లో *0*!
*నరనరం* లో అది *జీర్ణించుకు* ని పోయె!
*రోగం* లో *0* ! దానికి చేసే *వైద్యం* లో *0*!
*అంగాంగము* న *0* అంటిపెట్టుకుని ఉండ
*దేహం* తోటే అది దహనమగుననిపించె!
తీరా చితా *భస్మం* చూడ అందు కూడ కనిపించె!
మన గతులనే మార్చివేసి అదిi *గంతు* లేస్తోంది!
*"జైహో సున్నా*
*జయ జయహోసున్నా" ౦*
అదృష్టవంతులు
*60 దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు* ఎందుకంటే 100 కి 11 మంది మాత్రమే 60 దాట గలుగుతున్నారు. ఏడు మంది మాత్రమే 65 దాటి 70 చేర గలుగు తున్నారు.
మీరు ఆనందంగా ఉండడానికి పది చిట్కాలు
1. దప్పిక అనిపించినా లేకున్నా *నీరు తాగుతూ ఉండాలి*. రోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి.
2. ఆడతారో, తిరుగుతారో, నాట్యం చేస్తారో మీ ఇష్టం కదులుతూ ఉండండి. లేకపోతే కీళ్ల న్నీ బిగుసుకుపోతాయి .
3 . బ్రతకడానికి తినండి తినటానికి బ్రతకకండి పిండి పదార్థాలు బాగా తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తినండి. ముఖ్యంగా *రాత్రిపూట పిండి పదార్థాలు బాగా తగ్గించాలి*.
4. *వీలైనంత వరకు నడవండి* లేదా సైక్లింగ్ చేయండి 100 నుంచి 200 మీటర్ల దూరం వాహనం వాడకండి, నడవండి. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఎలివేటర్ వాడొద్దు రైల్వేస్టేషన్లలో ఎస్క లేటర్లు వాడొద్దు వాహనాలు వాడొద్దు. *మెట్లు ఎక్కండి రాంప్ పై నడవండి*.
5. కోపం తగ్గించండి. తక్కువ మాట్లాడండి. మీ నివాస ప్రాంతంలో *" కోప నిషేధ స్థలం "* బోర్డు పెట్టండి. అది మీకు కోపం రాకుండా ఉంచుతుంది. మీ చుట్టూ ఉన్నవారికి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది.
6. ధనం పై వ్యామోహం వదిలిపెట్టండి జీవనానికి అవసరమైనంత వరకు మాత్రమే సంపాదించాలి డబ్బు వెంట మీరు పరిగెత్తకండి డబ్బు మీ వెంట పరిగెత్తాలి .
7 మీరు కోరుకున్నది దక్కకపోతే బాధపడకండి. నిన్ను నీవు దూసించుకో వద్దు. దానిని మర్చిపోండి.
8 *డబ్బు, తెలివి, సౌందర్యం, అధికారం, కులం, పదవి వీటి వల్ల అహంకారం పెరుగుతుంది*. దీనిని *వదిలిపెట్టాలి* దీనికోసం పై వాటిపై నియంత్రణ సాధించాలి. వినయంగా ప్రజలతో ప్రేమగా ఉండాలి. ఆనందంగా నవ్వుతూ గడపాలి అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు.
9. తెల్ల జుట్టు గురించి ఆందోళన వద్దు. *కాళ్లు అనుమతించి నంతకాలం యాత్రలు చేయండి* ఆనందంగా ఉండండి తెల్లజుట్టు వార్దక్యానికి సంకేతం కాదు.
10. అందరితో స్నేహంగా కలిసి మెలిసి ఉండండి ఒక్కోక్కప్పుడు చిన్నవారే మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు . నేను పెద్దవాడిని *అందరు నాకు నమస్కరించాలి, గౌరవించాలి అని ఆశించకండి* నిశ్శబ్దంగా ఉన్న వారిని కూడా ఆప్యాయంగా పలకరించండి.
ఈ 10 చిట్కాలు పాటించండి.
గమనించండి మీ జీవితం ఎంత హాయిగా, ఆనందంగా, యవ్వనంగా గడిచిపోతుందో చూడండి ఒకే 🙏🙏🙏
చిట్టికథ
*చిట్టికథ*
ఒక మహారాజు వేటకు వెళ్లి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవడంతో దారిలో ఒక చీరలు నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి సేద తీరుతాడు
వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి మర్యాదలు చేసారు.అలసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో వారు ఉన్నారు .
రాజు లేవగానే చీర నేసే అతన్ని చూసాడు
అతడి చేతికి ఒక తాడు కట్టి ఉండడం గమనించాడు రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగగా ఆ వ్యక్తి రాజు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం పని చేస్తూనే ఇవ్వడం మొదలు పెట్టాడు
ఉయ్యాలలో బాబు నిదుర పోతున్నాడు బాబు కదిలినప్పుడల్లా ఈ తాడు లాగితే బాబు నిదుర పోతాడు అని చెప్పాడు .
అతనికి దగ్గటరలో ఒక కట్టె కనిపించింది రాజుకి.
అదేందుకు అని అడిగాడు రాజు
బయట నా భార్య ధాన్యాలను వెళ్ళింది పక్షులేవైనా వస్తే ఈ కట్టె కు కట్టిన నల్లగుడ్డ ఊపితే అవి వెళ్లిపోతాయి అని బదులిచ్చాడు ఆ వ్యక్తి .
ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకుని ఉండడం గమనించాడు రాజు అదెందుకు అని అడిగాడు.అందుకు ఆ వ్యక్తి
ఇంట్లో ఎలుకలు బెడద ఎక్కువగా ఉంది. అవి వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్లిపోతాయి అన్నాడు
ఆ ఇంటి కిటికీలో ఓ నలుగురు వ్యక్తులు కనిపించారు రాజుకి.
వాళ్ళు ఎవరు అని అడిగారు ??
పని చేస్తున్నది నా చేతులే కదండి నా నోరు ఏ పని చేయట్లేదు అందుకు నాకు వచ్చిన కొన్ని పాటలు వాళ్లకు నేర్పిస్తాను వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పాడు .
రాజు మళ్ళీ సందేహంగా ఆలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోటం ఎందుకు ఇంటి లోపలకు రావొచ్చుగా అని అడిగారు అందుకు ఆ వ్యక్తి
నేర్చుకుంటున్నది నోటితోనే... కాళ్ళు ఊరకనే ఉంటాయి కదండి! పాట నేర్చుకుంటూ వాళ్ళు కుండలు తయారు చేయడానికి మట్టిని తొక్కుతుంటారు అని బదులిచ్చాడు .
రాజుకి చాల ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలడా అని !!
అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు.ఇంతే కాదండి నా భార్య కాస్త చదువుకున్నది తాను బయట పనులకు వెళ్లి వస్తుంది వెళ్లే ముందు పలకలో ఓ పది పదాలు రాసిపెట్టి వెళ్తుంది. అన్ని అయ్యాక అవి నేర్చుకుంటుంటాను అని బదులిచ్చాడు .
రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని .
సోమరిగా తిరిగేస్తున్న వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి అనే పట్టుదల రావటానికి.
నేర్చుకోవాలి అనే జిజ్ఞాస, సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన ఉంటే మనిషికి ఏదైనా సాధ్యమే.
🌷🌷🌷🏵️🏵️🏵️🏵️🏵️
🌹🌹🌹🌹🌹🛟🛟🛟 ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు All India Arya Vysya Sangam చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి
https://kutumbapp.page.link/?efr=1


