16, జూన్ 2023, శుక్రవారం

తెలిసినది కాదు తెలియనిది కాదు

  తెలిసినది కాదు తెలియనిది కాదు 

మన మహర్షులు వారి అత్యంత గొప్ప మేధ శక్తితో మనకు భగవంతుని స్వరూపాన్ని ఆవిష్కరింప చేశారువారు పేర్కొన్న జ్ఞ్యాన బాండాగారం మనకు ఉపనిషత్తుల రూపంలో లభ్యమవుతున్నది. అతి సామాన్యమైన విషయంతో అనన్తమైన బ్రహ్మ పదార్ధాన్ని తెలుసుకోవటం కొరకు  అసామాన్యమైన జ్ఞ్యానం కలిగి  ఉండాలి  

భగవంతుడు: మన మహర్షులు భగావంతునికి క్రింది లక్షణాలు ఉంటాయి అని చెప్పారు

1) త్రిగుణాతీతుడు. మనుషులమైన మనము సత్వ, రజో, తమో గుణాలలో ఏదో ఒక గుణం కలిగి ఉంటాము. కొన్ని సందర్భాలలో ఒక గుణం ఇంకొక గుణంతో మిళితమై లేక అధిగమించి గోచరించవచ్చు. ఏది ఏమైనా గుణాలలో మాత్రమే మనిషి కనపడతాడుకానీ భగవంతునికి రకమైన గుణం ఉండదు అంటే ఆయనకు రాగ ద్వేషాలు వుండవు

2) కాలాతీతుడు: భూమి మీద వున్న ప్రతిదీ అది నిర్జీవమైనది కావచ్చు లేక జీవమైనది కావచ్చు ఒక కాలంలో ఉద్బవించి (జన్మించి) కొంత కాలం వుండి  తరువాత నశించి పోతుంది. ఉన్నంతకాలం మార్పు చెందుతూ ఉంటుంది. కానీ భగవంతుడు కాలములో లేడు ఆయన త్రికాలలో ఉంటాడు అంటే భూతకాలంలో వున్నాడు, వర్తమానంములో వున్నాడు భవిష్యత్తులో ఉంటాడు. అందుకే భగవంతుని నిత్యుడు అని అన్నారు

3) రూప రహితుడు: మనకు భూమి మీద ప్రతిదీ ఏదో ఒక రూపంలో కనబడుతూ వున్నది. అందుకే మనం వాటిని గుర్తించగలుగుతున్నాము. కానీ భగవంతుడు రూపం లేకుండా ఉంటాడు. అందుకే ఆయన కాలంలో లేడు

4) నామరహితుడు: అంటే పేరులేని వాడుఏదైనా రూపం ఉంటేనే పేరు ఉంటుందిరూపమేలేనప్పుడు ఇక పేరు అనే సమస్యే లేదు

5) భగ కలిగిన వాడుమనము అదృషవంతుడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, బలవంతుడు అనే మాటలు అంటూ ఉంటాముఅంటే ఏది ఉంటే వానికి ఉన్నదాని ప్రక్కన వంతుడు అని పెట్టి అది  కలిగినవాడుగా మనం పేర్కొంటాముఉదా : ధనం వున్నవానిని ధనవంతుడు అని అదృష్టం వున్నవానిని అదృష్టవంతుడు ఇలా మనం ఉపయోగిస్తూవుంటాము. మరి భగవంతుడు" అంటే ఎవరు? భగ అనే ఆరుగుణాలు వున్నవాడు క్రింది శ్లోకాన్ని చుడండి

"మాహాత్మ్యస్య సమగ్రస్య ధైర్యస్య యశస శ్రియఃజ్ఞాన వైరాగ్యయేశ్చైవ షణాం - భగ, ఇత్యుక్త భగోzస్యాస్తీ తి భగవాన్ " అని శాస్త్ర నిర్వచనం .అంటే

1) మాహాత్మ్యం 2) ధైర్యం 3) యశస్సు4) సంపద5) జ్ఞానం 6) వైరాగ్యం ఆరింటిని షడైశ్వైర్యాలు అంటారు.వీటికే "భగ" అని పేరు. ఆరు ఐశ్వైర్యాలను సంపూర్ణంగా కలిగి ఉండడం వల్లనే "భగవంతుడు" అని పేరు.

భగ అనే ఆరు లక్షణాలు భూమిమీద వున్న జీవకోటికి కానీ, మానవులకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వుండవుమనం ఒక్కొక్క లక్షణాన్ని పరిశీలిస్తే విషయం తెలుస్తుంది.  

1) మాహాత్మ్యం  పవిత్రత వల్ల మాహాత్మ్యం సిద్ధిస్తుంది." పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం" అని వేదశాస్త్ర పురాణేతిహాసాలు దేవుడిని కీర్తిస్తున్నాయి.దేవుడు "సంపూర్ణ పవిత్ర స్వరూపుడు" కాబట్టి సంపూర్ణ మాహాత్మ్యం కలిగి ఉంటాడు.అనుభవ పూర్వకంగా చూసుకున్నా మనం విషయంలో పవిత్రంగా ఉంటామో విషయంలో మాహాత్మ్యం సిద్ధిస్తుంది. ఉదాహరణకు...తల్లిదండ్రులు తమ సంతానం విషయంలో ఎలాంటి కల్మషం లేని పవిత్రతతో ఉంటారు.కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులకు తమ దీవెనలు ఫలించగలిగే మాహాత్మ్యం సిద్ధిస్తుంది..... ఇలా విషయంలో మనం పవిత్రతను కలిగి ఉన్నామో విషయంలో ' మాహాత్మ్యం' ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు!ఎక్కడ మాహాత్మ్యం ఉంటుందో అక్కడ నమస్కార యోగ్యత ఏర్పడుతుంది.నమస్కారం వల్ల అవతలి వ్యక్తి మాహాత్మ్యాన్ని - ఆశీర్వాదాన్ని మనం స్వీకరించ గలుగుతాము.అందుకే పవిత్రంగా జీవించే సాధువులకూ, మహాత్ములకూ, బ్రాహ్మణులకూ, పెద్దలకు నమస్కరించే పద్ధతి సనాతన ధర్మం లో సాంప్రదాయ సిద్ధంగా వస్తూ ఉంది.

2) ధైర్యం ఇక ధైర్యం దేనివల్ల కలుగుతుంది.భయం లేకపోవడం వల్ల.భయం ఎలా పుడుతుంది?ప్రధానంగా 50% భయాలు అజ్ఞానం వల్లనే కలుగుతాయి. ఎక్కడ తెలియనితనం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది.అది తెలిసిన తర్వాత భయం పోతుంది.ఇక మిగతా భయాలు మనకున్న ఆరోగ్యం - ఆయుస్సు - సంపదలు - పరివారం - అధికారం - కీర్తి - సౌఖ్యం ...మొ॥ ఐశ్వర్యాలు ఎక్కడ నశించి పోతాయో అనే కారణం నుండి పుడుతాయి.

ఇక దేవుడు వేదస్వరూపుడు.అంటే జ్ఞానస్వరూపుడు.ఇక అతనికి అజుడని పేరు.అంటే పుట్టక లేని వాడు .అలాగే అచ్యుతుడు.. అంటే నాశనం లేనివాడు.శ్రీధరుడు అంటే సమస్త ఐశ్వర్యాలను ధరించినవాడు.కాబట్టి సంపూర్ణ ధైర్యం అనెడి ఐశ్వర్యం అతనిని సేవిస్తూ ఉంటుంది.

3) యశస్సుయశస్సు అంటే స్వచ్చమైన కీర్తి ."క్రియాశీలత వల్ల కీర్తి... నిష్క్రియత్వం వల్ల అపకీర్తి " ఏర్పడుతుంది.నీరు నిరంతరం ప్రవహిస్తూ క్రియాశీలంగా ఉండడం వల్ల " నది "లా మారి అందరిచే పూజించబడుతూ "కీర్తి"ని పొందుతుంది.ఆగిపోయిన నీరు " నిష్క్రియత్వం" వల్ల మురికి గుంటలా మారి అందరిచే అసహ్యించబడుతూ.. అపకీర్తిని పొందుతుంది.మనష్యుల పరిస్థితి అయినా అంతే! విషయంలో మనిషి క్రియాశీలతను కలిగి ఉంటే విషయంలో కీర్తి లభిస్తుంది.ఉదాహరణకు.. చదువు విషయంలో క్రియాశీలతను కలిగి ఉన్న వ్యక్తికి విద్య విషయంలో కీర్తి లభిస్తుంది.ధన సంపాదన విషయంలో క్రియాశీలతను కలిగి ఉన్న వ్యక్తికి ధనవంతుడనే కీర్తి లభిస్తుంది..... ఇలా విషయంలో క్రియాశీలత ఉంటుందో విషయంలో సహజంగానే కీర్తి లభిస్తుంది.ఇక సంపూర్ణ క్రియాశీలుడైన ఈశ్వరున్ని యశస్సు అనెడి ఐశ్వర్యం నిరంతరం సేవిస్తూ ఉంటుంది.

4) సంపద సంపద అంటే సమృద్ధి, సాధించబడినది అనే రెండు అర్థాలు.తృప్తి పరిచేది - అవసరాలను తీర్చేది సంపద.సంపద రెండు రకాలుగా సృష్టించబడుతుంది.

i)ఇతరుల అవసరాలను నెరవేర్చగలిగే శక్తి పెరుగుతున్న కొద్ది సంపద సృష్టి జరుగుతూ ఉంటుంది.ఒక కూలి నుండి బిల్ గేట్స్ వరకు ఎవరినైనా గమనించండి. వారు ఇతరుల అవసరాలను ఎంతగా నెరవేరుస్తూ ఉంటారో అంతగా వారి వద్ద సంపద వృద్ధి పొందుతూ ఉంటుంది.శారీరకంగా - మానసికంగా -బౌద్ధికంగా - ఆథ్యాత్మికంగా ..... రకంగానైనా ఇతరుల అవసరాలను తీర్చగలిగే శక్తే, శ్రీమంతుడు కావడానికి ప్రధాన కారణం.
ఇక రెండవది
ii)
క్రియాశక్తి వల్లలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపమని పురాణాలు వర్ణిస్తున్నాయి.సంపద అనేది శ్రమకు ప్రతిఫలం . శ్రమించడం వల్ల కూడా సంపద సృష్టి జరుగుతుంది.శ్రమించే తత్వం పెరుగుతూ తనలో ఉన్న ఇచ్చాశక్తినీ... జ్ఞాన శక్తిని క్రియా రూపంలోకి మార్చడం వల్ల సంపద సృష్టించబడుతూ వుంటుంది. రెండు రకాలుగా కాకుండా ఇతరుల చే సృష్టించబడిన సంపదను కొల్లగొట్టేవారు కొందరుంటారు. వీరు ఇహ-పర లోకాలలో పతనం చెందుతారని శాస్త్రం చెబుతుంది.ఎందుకంటే....సంపద అంటే డబ్బు - బంగారం కాదు. అవి సంపదకు బదులుగా వినియోగించే వినిమయాలు మాత్రమే!ఒక దేశంలోని డబ్బుకు మరో దేశంలో విలువ ఉండదు. అలాగే భూలోకంలో ఉండే వినిమయాలు మరో లోకంలో చెల్లబడి కావు.కానీ, ఇతరుల అవసరాలను తీర్చగలిగే నెైపుణ్యశక్తి.... క్రియాశక్తి జీవుడు లోకంలో ఉన్నా సంస్కార రూపంలో వెన్నంటి ఉండి అతన్ని ఐశ్వర్యవంతుడు గా నిలుపుతుంది.

ఇక సమస్త సృష్టి అవసరాలు తీర్చడం వల్లా.., సంపూర్ణ క్రియాశీలత్వం వల్ల ఈశ్వరున్ని సంపద అనెడి ఐశ్వర్యం సేవిస్తూ ఉంటుంది.

5) జ్ఞానంఈశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వం - సర్వశక్తిమత్వమే సర్వజ్ఞత్వానికి కారణమౌతుంది.తత్వశాస్త్ర దృష్ట్యా జ్ఞానం అనేది పొందబడేది ... కోల్పోయేది కాదు. అది ఎప్పుడూ ఉండేది. అది ఆత్మ స్వరూపంగా ఉంటుంది.దాన్ని మనకున్న ఏకాగ్రతను బట్టి కొంచెం కొంచెంగా అనుభవంలోకి తెచ్చుకుంటాము.ఒక వ్యక్తిలో ఉన్న ఏకాగ్రత శక్తిపైన అతని జ్ఞానం ఆధారపడి ఉంటుంది. విషయంలో ఏకాగ్రత చూపుతాడో విషయ సంబంధ జ్ఞానం లభిస్తుంది.ఏకాగ్రత సంపూర్ణ స్థాయికి చేరినపుడు సంపూర్ణ జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. అలాంటి వ్యక్తులను ఆత్మజ్ఞానులు అంటాము. వారి వ్యక్తిగత చైతన్యం విశ్వ స్థాయికి ఎదగడం వల్ల వారికి కూడా సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది. విశ్వంలోని సమస్త నియమాలను సృష్టించి ఒక నియతిని ఏర్పాటు చేయడం వల్ల ఈశ్వరునికి నియంత అనే మరో పేరుంది. నియమాలపై ఏకాగ్రత నిలిపి పరిశోధించడాన్నే మనం శాస్త్ర విజ్ఞానం అంటున్నాము.ఇలా సర్వవ్యాపకుడు - విశ్వరూపుడు - నియంత అయిన పరమాత్మను జ్ఞానం అనెడి ఐశ్వర్యం సదా సేవిస్తూనే ఉంటుంది.

6) వైరాగ్యంసంతృప్తితో కూడిన త్యాగమే వైరాగ్యం.ఈశ్వరునికి నిరంజనుడని పేరు.అంటే దేనికీ అంటకుండా కేవల సాక్షి మాత్రంగా ఉండే వైరాగ్య సంపన్నుడని అర్థం.వైరాగ్యం అనేది సమృద్ధిని దాటిన స్థితి.హిమాలయాల్లో "పరుసవేది " అనే మూలిక ఉంటుందట. వేరుతో లోహాన్ని ముట్టినా లోహం బంగారంగా మారుతుందట. అలాంటి పరుసవేది ని కలిగి ఉన్న వ్యక్తి గుట్టలు గుట్టలుగా బంగారాన్ని ప్రోగుచేస్తాడా? వేరును మాత్రం దగ్గరుంచుకుని అవసరమున్నంత వరకే వాడుకుంటాడు. అతనికి ధనాన్ని సంపాదించాలనే కోరిక - ఆశ వంటివి ఏమీ ఉండవు.అంటే ధన విషయంలో వైరాగ్యం లభించినదన్న మాట!అసంతృప్తితో - అశక్తతతో వచ్చేది వైరాగ్యం కాదు. అది లేమితనం - బలహీనత.ఒక నపుంసకుడు సన్యాసిగా మారితే అది వైరాగ్యం కాదు.ఒక నిజమైన పురుషుడు సన్యాసిగా మారితేనే అది నిజమైన వైరాగ్యం.మన దేశంలో చాలా మంది మిథ్యా వైరాగ్య సంపన్నులు ఉంటారు. నాకు ధనం మీద ఆశ లేదు అంటుంటారు. మళ్లి కష్టపడకుండా - తేరగా ధనం వస్తే సంతోషిస్తారు. ఒక కోటి రూపాయలు కష్టపడి సంపాదించి దానిపై బంధం లేకుండా సంతృప్తితో దానం చేయగలిగితే అది వైరాగ్యం అవుతుంది.వైరాగ్యం అనేది తేలికగా వచ్చే ఐశ్వర్యం కాదు. అది ఇంతకు ముందు చెప్పినట్లు సమృద్ధిని దాటిపోయిన స్థితి.ఎవరో కొందరు వివేకానందుడు లాంటి మహాత్ములు మాత్రమే నిజమైన వైరాగ్య సంపన్నులుగా ఉంటారు.

ఇక దేవునిది అన్ని విషయాల్లో సమృద్ధిని దాటిన స్థితి.కాబట్టి వైరాగ్యం అనెడి ఐశ్వర్యం అతడిని నిరంతరం సేవిస్తూ ఉంటుంది.ఇలా ఆరు ఐశ్వర్యాలను కలిపి 'భగ' అని పేరు. వీటిని కలిగి ఉండడం వల్ల భగవంతుడని పేరు.మనలో కూడా ఆరు ఐశ్వర్యాలు అంశ మాత్రంగా ఉంటాయి. మన ప్రవర్తనను బట్టి ఆయా ఐశ్వర్యాలు వృద్ధి పొందుతాయి.

భూమిమీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఆరు ఐశ్వర్యాలు వారి వారి ప్రారబ్ధఫళంగా అంశమాత్రంగా కలిగి వుంటారు. ఉదాహరణకు సంపద అనే ఐశ్వర్యం తీసుకున్నామనుకోండి కొందరు వారి దైనందిక జీవనం గడపటానికి వలసినంత సంపద కూడా లేకుండా ఉంటే మరి కొందరు చాలా సంపద కలిగి అనేక భవనములు, వాహనములు ఇత్యాదివి కలిగి భూమిమీద పొందగల అనేక భోగాలు అనుభవిస్తూ ఉండవచ్చుకానీ ఇలాంటి ఐశ్వర్యవంతులు ఎవరు కూడా భూమిమీద శ్రేష్ఠమైన ఐశ్వర్యవంతులు అని చెప్పలేము ఎందుకంటె ఒకరిని మించిన ఐశ్వర్యం ఇంకొకరికి ఉండిఉండవచ్చుఅలా కాదు ఫలానా వాడు భూమిమీద ఉన్న ఐశ్వర్యవంతులలో శ్రేష్ఠుడు అని అంటే అతనుకూడా శ్రేష్ఠుడు అని చెప్పటానికి వీలులేదు ఎందుకంటే అతనికంటే తక్కువ ఐశ్వర్యవంతులుగా వున్న వారి ఐశ్వర్యాలు కలిపితే ఐశ్వర్యం ఇతని ఐశ్వర్యం కన్నా ఎక్కువగా ఉంటుందివెరసి ఏదో ఒక స్థాయిలో మాత్రమే ఐశ్వర్యం కలిగి ఉండగలరు. అదేవిధంగా భగవంతుని ఆరు గుణాలను మానవులు ఏదో కొంత స్థాయిలో మాత్రమే కలిగి వుంటారుకానీ భగవంతునితో సమానంగా కానీ పొతే పడే స్థాయిలో కానీ ఎవ్వరు ఉండలేరుకానీ వారికి కలిగిన ఐశ్వర్యతోటె విఱ్ఱవీగుతు తన అంతటి వాడు ఏరే ఎవ్వరు లేరని అహంభావంతో ఉండివారి పతనాన్ని వారే ఆహ్వానిస్తారు.  

ఇలా సర్వ సంపన్నుడు ఐన భగవంతుని తెలుసుకోవటం ఎలా

సామాన్య మానవులు కలిగిన సంపదలకు ఒక అవధి వున్నది కాబట్టి అది హాద్దు కలిగి వున్నదిఅంతేకాకుండా సంపద కేవలం ఒక్క భూమి మీద ఒక ప్రాంతంకు మాత్రమే పరిమితి కలిగి వున్నదికాబట్టి మనం ఐశ్వర్యవంతుని, అతని ఐశ్వర్యాన్ని చూడగలుగుతున్నాము. మరి చరాచర సృష్టి మొత్తము భగవంతుని సంపదే వున్నది అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే అది  మనం కంటితో కాంచగలిగేది కాంచలేని సంపద, అటువంటి  సంపద కలిగిన ఐశ్వర్యవంతుని చూడటం ఎలాఎప్పుడైతే మనం కంటితో చూడలేని సంపద అని అన్నమో అప్పుడే ఐశ్వర్యవంతుడు కూడా కంటితో చూడలేని వాడని అర్ధం అవుతుంది. అదేవిధంగా ఇతర గుణాలకు కూడా అనువర్తించుకోవచ్చు. వెరసి తేలింది ఏమిటంటే షడ్గుణవంతుడైన వాడు మన కంటికి కనిపించటానికి అవకాశం లేదు ఎందుకంటె మనం చరాచర జగత్తులో చూసేది ప్రతిదీ ఏదో ఒక అవధిని కలిగి వున్నదిఆకార విషయానికి వస్తే ఒక మనిషి 5 నుంచి 6 అడుగుల ఎత్తులోవుండి ఉంటాడు అంటే అతని ఎత్తుకు ఒక అవధి వున్నదిఅదే విధంగా త్రిగుణాలలో ఏదో ఒక గుణం కలిగి ఉంటాడు అంటే అతని గుణాలకు ఒక అవధి  వుంది. అంతేకాకుండా భూమిమీద యేదోకొంత సంపద కలిగి ఉంటాడు అంటే సంపదకు అవధి వుంది. అలాగే దేర్యం కూడా ఒక హాద్దులో ఉంటుందికాబాట్టి భగవంతుడు మానవరూపంలో లేడు, ఉండటానికి వీలులేదు

భగవంతుడు ఉన్నట్లు ఎందుకు నమ్మాలి: ఇది చాలామంది మందిలో మెదిలే ప్రశ్నఅవును నిజమే మన కంటికి కనబడని భగవంతుని ఉన్నట్లు ఎందుకు నమ్మాలి. దానికి సరైన వివరంకావాలి. మన మహర్షులు వారి అనంత మేధాసంపత్తితో చక్కటి వివరం ఇచ్చారు.

ఒకటి ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటమే ప్రమాణం.

ప్రమాణము అంటే ఒక విషయం యొక్క సత్యాసత్యాలను నిర్ధారించుకోవడం. హిందూ సాంప్రదాయంలో అందుకు వివిధ పద్ధతులు వివరించబడ్డాయి. అవి:

1.     ప్రత్యక్ష ప్రమాణం: ప్రత్యక్ష ప్రమాణం అంటే స్వయంగా గ్రహించడం. నీవు రామారావుని చూసావు అంటే అతని ఉనికిని నీ నేత్రాలు తెలుసుకొన్నాయి అది ప్రత్యక్ష ప్రమాణంమనం పురాణాలలో వింటూవుంటాము  అతని భక్తికి మెచ్చి భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు అని అంటే దాని అర్ధం ఇంద్రియ గోచరము కానీ భగవంతుడు ఇంద్రియ గోచరుడు అయ్యాడు అని విషయంమీద అనేక సందేహాలు ఉత్పన్నం అవుతాయి దానికి కారణం సాధకునికి సాధనలో పటుత్వం లేకపోవటమే. ముముక్షువులకు సాధనలో తీవ్రత పెరుగుతువుంటే అతనికి కలిగే సందేహాలు వాటంతట అవే నివారణ అవుతాయి.

2.     అనుమాన ప్రమాణం: పొగను గమనించి నిప్పు ఉండవచ్చునను కోవడం అనుమాన ప్రమాణం. అరణ్యంలో దూరంగా మనకు పొగ కనిపించిందంటే అక్కడ నిప్పు వున్నదని తెలుసుకోవచ్చుఅంతే కాదు అరణ్యంలో నిప్పు ఉండటానికి అవకాశం లేదు ఎందుకంటె అరణ్యంలో వృక్షాలు, జంతువులూ మాత్రమే ఉంటాయిజంతువులకు నిప్పుని తయారుచేసే జ్ఞ్యానం ఉండదు కాబట్టి తప్పకుండా అక్కడ మనుషులు వుండివుంటారు అనేది కూడా మనకు అనుమాన ప్రమాణంతో తెలుసుకోవచ్చు.

3.     శబ్ద / ఆప్తవాక్య ప్రమాణం: తాను నమ్మే ప్రమాణ గ్రంథంలో ఉన్నందువలన గానీ, తను విశ్వసించే వారెవరైనా చెప్పినందువలన గానీ అంగీకరించడం శబ్ద / ఆప్తవాక్య ప్రమాణం.

4.     ఉపమాన ప్రమాణం: ఏదైనా ఒక ఉపమానాన్ని చెప్పి ఒప్పించడం ఉపమాన ప్రమాణం.

5.     అర్థాపత్తి ప్రమాణం: వాచ్యంగా చెప్పక పోయినప్పటికీ ధ్వనివల్ల విషయాన్ని బోధపరచడం అర్థాపత్తి. ఫలానా వ్యక్తి పగలు భోజనం చేయడం లేదు అంటే అతడు రాత్రి భోజనం చేస్తున్నాడనుకోవచ్చు.

6.     అనుపలబ్ధి ప్రమాణం: ఒక వస్తువు కోసం ఒకరు మిగతా అందరితో పాటు వరుసలో నిలుచున్నాడు. కాని, అతని వంతు రాకముందే సరకు అయిపోయింది. సరకు అయిపోయి నందువల్ల తనకు వస్తువు దొరకలేదని తెలియడం అనుపలబ్ధి ప్రమాణం.

7.     సంభవ ప్రమాణం: రోజు ఏకాదశి అయితే నిన్న దశమి, మొన్న నవమి అని చెప్పకపోయినా తెలియడం సంభవ ప్రమాణం.

8.     ఐతిహ్య ప్రమాణం: ఏదైనా వస్తువును చూసినప్పుడు, దానిని గురించి గతంలో తాను విన్న విషయాలు జ్ఞాపకానికి వచ్చి తదనుభూతి కలగడం ఐతిహ్య ప్రమాణం.

మనకు ప్రత్యక్ష జ్ఞ్యానం లేకపోయినను ఒక విషయాన్నీ తెలుసుకొనే విధానమే పైన పేర్కొనిన ప్రమాణాలు. భగవంతుని కూడా మనం ఇందులో ఏదో ఒక లేక ఒకటికన్నా ఎక్కువ ప్రమాణాల వలన ఆయా సమయాలలో తెలుసుకోగలం. నాకు ఒక కోరిక ఎన్నో రోజులనుండి తీరటం లేదు అప్పుడు ఎవరో చెప్పారు నీవు సతయనారాయణస్వామి వ్రతం ఆచరించు నీ కోరిక నెరవేరుతుంది అని వెంటనే నేను స్వామి వ్రతం చేసాను నా కోరిక తీరింది. ఇక్కడ మన కంటికి ఏది కనిపించటం లేదు కానీ కార్యం  నెరవేరింది. అప్పుడు నేను నా కోరిక తీరటానికి స్వామే కారణమ్ అయన అనుగ్రహంతోటే నాకు ఫలితం వచ్చింది అని నమ్ముతాను. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే భగవంతుని లీలలు మనకు ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము అని

కార్య కారణ సంబంధం

మన కంటిముందు ఒక కార్యము (పని) కనబడుతూ వున్నది అంటే దానికి కారణమైన కారకుడు వుండివుండాలి అనేది  కార్య కారణ సంబంధం :నీ కంటిముంది ఒక చక్కటి కట్టడం కనపడుతున్నది అది చాలా పురాతనమైనదిదానిని ఎవరు కట్టారో నీకు తెలియదుకానీ అది ఎవరో కట్టి వుంటారు అన్నది మాత్రం ప్రమాణం ఎందుకంటె నీ ముందు కార్యం (పని అంటే నిర్మాణం) కాన పడుతూవున్నది. అంటే అది నిర్మించిన పనివాడు కూడా వుంది ఉంటాడు. అదే విధంగా నీకు పర్వతాలు, నదీనదాలు, సాగరాలు, ఎడారులు, కనపడుతూ వున్నాయి అంటే అవి ఒక కార్యం (పని) అటువంటప్పుడు కార్యం చేసిన కారకుడు అంటే నిర్మాత వుంది ఉండాలి కదా అటువంటి నిర్మాతనే కార్యకర్తగా భగవంతునిగా మన మహర్షులు ఆవిష్కరించారు

నియతి నియంత:

మనం నిత్యం కార్యాలయాలలో కొన్ని నియమాలను చూస్తూవుంటాం అవేమిటంటే ఉదయం 10. గంటలకు కార్యాలయంలోకి ఉద్యోగులు రావటం, 1 గంట దాకా పనిచేయటం, తరువాత భోజన విరామం తరువాత మరల సాయంత్రం 5 గంటలవరకు పనిచేయటంఇలా నియమాలను సారంగా ఉద్యోగులు పనిచేయటం ఒక నియతి అంటే ఒక క్రమ పద్దతిమరి క్రమ పద్దతిని నియమించింది ఎవరు అంటే అది యాజమాన్యం అంటే ప్రభుత్వంప్రభుత్వం ఆదేశాలను జారీ చేస్తే అన్ని కార్యాలయాలు పద్దతి ప్రకారంగా పనులు చేస్తుంటాయి. అంటే ఇట్లా ఉన్న నియతికి కారణం ప్రభుత్వం అని మనకు తెలుస్తున్నదిఎప్పుడైతే నియతి కనిపిస్తున్నాదో అప్పుడు నియంత  ఉన్నట్లు మనకు జ్యోతకమవుతున్నది

మనం   ప్రకృతుడిలో  రోజు అలాంటి నియతినే చూస్తూవున్నాము. రోజు నీవు ఒక విత్తును నాటావు అది ఒక నాలుగు రోజులలో మొలకెత్తి మొలకగా కనిపిస్తున్నది, తరువాత చెట్టుగా మారి దానికి మొగ్గలు, పూలు, కాయలుగా రోజుకొక విధంగా రూపాంతరం చెంది చివరకు ఒకరోజు నశించిపోతుంది. దృగ్గోచరం నీవు నేను రోజు చూస్తున్నాము

వర్షపు నీరు ప్రవహించి పల్లానికి వెళుతున్నాయి, అవి ఒక వాగుగా, నదిగా మారి చివరకు సముద్రాన్ని చేరుకుంటున్నాయి. మనకు వేసవి కాలం తరువాత, వర్షాకాలం ఆతరువాత శీతాకాలం మరల వేసవికాలం ఒక క్రమపద్ధతిలో వస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక నియతి వున్నది

ఇంకొక విషయం ప్రకృతికి కొన్ని నియమాలు వున్నాయి అవి ఆకాశంలో నీళ్లు లేవు కానీ మేఘాలు వర్షితున్నాయి, నిప్పు ముట్టుకుంటే కాలుతున్నది, భూమికి ఆకర్షించే గుణం వున్నది. చంద్రుడు తన కళలతో విరాజిల్లుతున్నాడు సూర్య చంద్రులు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నారు. ప్రతిరోజూ రాత్రిపగళ్ళు ఏర్పడుతున్నాయి. ఇలాంటివన్నీ నియతులేఇంతక్రమపద్ధతిలో కాలచక్రం ఎలా నడుస్తున్నది అంటే దానిని నడిపే కర్త ఎవరో ఒకరు ఉండాలి కర్తే భగవంతుడు.. 

భగవంతుని తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానం మరి అది పొందటం ఎలా

ముందుగా మనం బౌతికంగా వున్నవిషయాలను తెలుసుకుందాము.  

తెలిసిన విషయాలు

ప్రతి మానవుని జ్ఞ్యానం ఒక పరిమిత స్థాయికి మాత్రం చేరుకొని ఉంటుంది. జ్ఞ్యానం అంటే తెలిసిన విషయాలు అని సాదారణ అర్ధం చెప్పుకుందాం. నిజానికి బౌతికంగా కనిపించే వస్తువులమీద కూడా ప్రతివానికి ఒక పరిమితమైన జ్ఞ్యానమే ఉంటుంది. సంపూర్ణ జ్ఞ్యానం ఒక్కరికే ఉండదు కొంతమంది జ్ఞ్యానవంతుల జ్ఞ్యానాన్ని సమీకరిస్తేనే సంపూర్ణ భౌతిక జ్ఞ్యానం కలుగుతుంది

ఉదాహరణకు ఒక కారుని తీసుకుందాము. మీ ఇంట్లోని బాలునికి నీ కరుగురించి కలిగిం జ్ఞ్యానం ఏమిటనే మీ కారుని గుర్తించటం కారులో నీతో ప్రయాణం  చేయటం. అదే నీకు కారుని నడపటం వరకు మాత్రమే జ్ఞ్యానం వుందిదానికి రిపేరు వస్తే బాగుచేయటానికి రిపేరరు వద్దకు తీసుకొని వెళ్ళాలి, అతనికి కూడా కొంతవరకే జ్ఞ్యానం ఉంటుంది. దానిని తయారుచేసిన వారందరి సంపూర్ణ జ్ఞ్యానాన్ని సమీకరిస్తేనే కారుకి సంబందించిన సంపూర్ణ జ్ఞ్యానం లభించదు. భౌతికమైనదే ఇంత జటిలంగా ఉంటే ఆధ్యాత్మికమైనది ఇంకా యెంత కఠినంగా ఉంటుంది

ప్రతి మనిషికి కలిగిం జ్ఞ్యనం రెండు రకాలుగా చెప్పవచ్చు ఒకటి అతనికి కలిగిన జ్ఞ్యానం రెండవది అతను పొందవలసిన జ్ఞ్యానం మొదటిది తనకు కలిగిన జ్ఞ్యానం అంటే ఒక మనిషి తానూ పంచేంద్రియాలద్వారా తెలుసుకున్న జ్ఞ్యానం, అది తన స్వన్తంగా తెలుసుకున్నది, గ్రంథపఠనం వలన తెలుసుకున్నది, గురువులద్వారా శ్రవణం చేసి తెలుసుకున్నది కావచ్చుఏది ఏమైనప్పటికి ప్రతిదీ ఇంద్రియాలకు లోబడినది, జగత్తులో కనిపించేది, వినిపించేది, అనుభవంలోకి వచ్చేది మాత్రమే అవుతుందికానీ అంతకుభిన్నంగా మాత్రం ఉండటానికి వీలులేదు. తెలిసినదానిని జ్ఞ్యానం తెలియనిదానిని అజ్ఞ్యానం అని మనం అంటామునీకు జ్ఞ్యానంగా వున్నది ఇంకొకరికి అజ్ఞ్యానంగా ఉండవచ్చు అదేవిధంగా నీకు అజ్ఞ్యానంగా వున్నది ఇంకొకరికి జ్ఞ్యానంగా గోచరించవచ్చువెరసి భూమిమీద వున్నవారికి ఒక్కొక్కరికి ఒక్కోక పరిధిలో జ్ఞ్యానం ఉంటుంది అన్నది సత్యం. భూమిమీద వున్న మానవుల అందరి జ్ఞ్యానాన్ని మనం ఒక సంపూర్ణ జ్ఞ్యానంగా అంటే ఇక్కడ అన్ని శాస్త్రాల జ్ఞ్యానం అనుకుంటే అందులో ఒక మనిషికి  తెలిసిన జ్ఞ్యానాన్ని అతని జ్ఞ్యానంగా తెలియని జ్ఞ్యానాన్ని అజ్ఞ్యానంగా పరిగణిస్తున్నాము. ఇది మన భౌతిక మైన సాదారణ ఆలోచన. అంటే ప్రతి మనిషికి ఉన్న అజ్ఞ్యానాన్ని తొలగించుకోవాలంటే దానికి సంబందించిన జ్ఞ్యానవంతుని ద్వారా శిక్షణపొంది జ్ఞ్యానవంతుడు  అవవచ్చు. అంటే ఒక మనిషికి తెలియని జ్ఞ్యానాన్ని మనం ఒక గురువునుంచి పొందవచ్చు అని అనుకుంటాము. ఒక్క మాటలో చెప్పాలి అంటే దేనిగురించి ఐనా అజ్ఞానం ఉందంటే దానికి సంబందించిన జ్ఞ్యానం ఉన్నవారి వద్దనుండి పొందవచ్చు అంటే ఒక విష్యంగూర్చిన జ్ఞ్యాననఁ ఉంటె నీకున్న జ్ఞ్యానంములోనన్న లేక నీకున్న అజ్ఞ్యానంలో నయినా ఉండి  ఉండాలి తత్భిన్నంగా ఉండటానికి వీలులేదు

ఇది చదువుతుంటే అర్ధం ఐనట్లే అనిపిస్తుంది అర్ధంకానట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటె మనం ఇప్పుడు తెలుసుకునే జ్ఞ్యానం బ్రహ్మ జ్ఞ్యానానికి సంబంధించింది అంటే జ్ఞ్యానం తెలుసుకుంటే మరొకటి తెలుసుకొనవసరంలేదో అదే బ్రహ్మ జ్ఞ్యానం. దీనిని అర్ధంచేసుకోవటానికి సునీత సూక్ష్మ ఆవగాహన కలిగి ఉండి శ్రర్ధ, అకుంఠిత దీక్ష సంపూర్ణంగా తెలుసుకోవాలనే జిగ్న్యాస కలిగివుంది ఇతర విషయాలమీద మనస్సు పోకుండా ఏకాగ్రత చిత్తం కలిగి ఉండాలి. విషయవాంఛలకు లోనయివుండే మనస్సు ఏకాగ్రతను ఏర్పరచుకోవడం చాలా కష్టం. సాధారణ మానవులకు దైవ చింతన అనేది కేవలం దైవభక్తి వరకు మాత్రమే పరిమితం అయివుంటుందిఅదికూడా నేటి సమాజంలో అనేక దొంగగురువులు, దొంగ సాధువులు  తారసపడుతున్నారువారు వారి ఆధ్యాత్మికతలో ఏమాత్రం అభివృద్ధి సాధించకపోయినా కొన్ని మహిమలు అవి ఏరకంగా వస్తాయో ఇక్కడ వివరించనవసరంలేదు ఎందుకంటె అవి సాధనావల్ల, సిద్దించిన సిద్దులు కావు కాబట్టి వాటికి ప్రచారం ఎక్కువగా వుంది అందరిని తాను మహిమాన్వితుడనని నమ్మించటం చాలా తేలిక . రోజుల్లో అటువంటి బాబాలు, స్వామీజీలు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నారు, సాధారణ ప్రజల్ని మోసగిస్తూ వాళ్ళ పబ్బం  గడుపుకుంటున్నారు. కాబట్టి ముముక్షువులు జాగరూకతకలిగి ఉండాలి

ఇక విషయానికి వస్తే బ్రహ్మ జ్ఞ్యానం భూమిమీద వున్న జ్ఞ్యానం కాదు కాబట్టి అది గురువులద్వారా పొందేది కాదు. ఎవరైనా నేను సద్గురువును నీకు ఆత్మా జ్ఞనాన్ని ఉపదేశిస్తాను అంటే నమ్మవలదుఅది కేవలం సాధకుడి అకుంఠిత దీక్షతో సాధించేది మాత్రమే

సాధకుడు తన సాధనతో ప్రారంభంలో కొన్ని శక్తులు వస్తాయి అవికేవళం తాత్కాలికమేనవి మాత్రమే కానీ సంపూర్ణ దీక్షతో నిరంతన సాధనతో సాధకుడు సమాధి స్థితికి చేరుకున్న తరువాత అష్టసిద్ధులు  వస్తాయి. అష్ట సిద్దులు లభించిన తరువాత సాధకుడు వాటిని దుర్వినియోగం చేయకుండా తన సాధనను ఇంకా ఇంకా కొనసాగిస్తే అప్పుడు మాత్రమే అనిర్వచనమిలేం మోక్షం లభిస్తుంది

ఓం తత్సత్,

 ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ 

వారాహీనవరాత్రులు

 *వచ్చే సోమవారము నుండి వారాహీనవరాత్రులు*


వారాహీ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు. ఆషాడ మాసంలో అమ్మవారిని వారాహీ మాతగా ఆరాధిస్తుంటారు. వారాహి మాత అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి అనుకూలమైన రోజులు. 2023లో జూన్ 19వ తేదీ నుండీ 27 వతేదీ వరకూ వారాహీ నవరాత్రులు వచ్చాయి. ఈ నవరాత్రుల ప్రత్యేకతలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. గుప్త నవ పర్వదినాలలో అమ్మవారి ఆరాధనతో సంపద, ధైర్యం ఆ తల్లి ప్రసాదిస్తుందని నమ్మకం.


భూ దేవి స్వరూపిణి, లక్ష్మీ స్వరూపిణి, వరాహ స్వామి స్త్రీ రూపం వారాహి మాత. అమ్మవారు నాగలిని ధరించి కనిపిస్తుంది. భూమిని చదును చేసుకొని విత్తులు నాటే ఈ సమయంలో వారాహీ రూపంలో అమ్మవారిని పూజిస్తే పంటలు బాగా పండుతాయని విశ్వాసం. భూమాత దయ ఉంటే పంటలు బాగా పండుతాయి. రైతు క్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది. వారాహి మాతను పూజిస్తే మనకు రక్షణ కలిగించే దేవతగా మారుతుంది. శత్రు సంహారం జరుగుతుంది. వారాహి మాత మంత్రం సిద్దిస్తే జరగబోయేది ఏంటో కల రూపంలో మనకు ముందుగానే తెలుస్తుందని పెద్దలు చెబుతుంటారు. వారాహీ దేవి ఆయుర్వేద వైద్య దేవిగా కూడా కొలుస్తారు.


వారాహీ పూజనూ సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తరువాత చేయాలని శాస్త్రం చెబుతోంది. లడ్డూలను లాంటి పదార్దాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పూజించాలి. భూమిలో దొరికే గడ్డలు, చిలకడదుంపలు , దానిమ్మలూ నైవేద్యంగా పెడితే మరీ మంచిది. నీలిరంగు పువ్వులతో పూజ విశేష ఫలితాలను కలిగిస్తుంది. ముఖ్యంగా రేవతి నక్షత్రం రోజు విశేష పూజను ఆచరిస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది..వారాహి దేవిని శ్రీ విద్యా సంప్రదాయంలో పూజించే విధానం కూడా ఉంది కానీ అది శ్రీవిద్యా ఉపాసకులు మాత్రమే చేయగలడం సాధ్యం. సాధారణ పద్దతిలో ప్రతి ఒక్కరు ఈ తల్లిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు.

మీ 

శ్రీశర్మద 

8333844664

పుత్రులు

 *పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు.*


1) పూర్వ జన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి, అది తీసుకోకుండానే మరణించిన వాడు, తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు.

2) తాను పూర్వ జన్మయందు బాకీపడిన అప్పును (ఋణాన్ని) చెల్లించుటకు పుత్రుడుగా జన్మిస్తాడు.

3) పూర్వ జన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు.

4) పూర్వ జన్మలో తనకు ఒకడు అపకారం చేసాడు. దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసినవాడికి పుత్రునిగా జన్మిస్తాడు.

5) పూర్వ జన్మలో తాను అనుభవించిన సేవ - సుఖములకు బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు.

6) పూర్వ జన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో, ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రునిగా జన్మిస్తాడు.

7) ఏమీ ఆపేక్షించనివాడు కూడా పుత్రునిగా జన్మించి, తన విధులను తీరుస్తాడు.

ఇలా పుత్రులుగా జన్మించినవారు కర్మానుసారముగా తమ పనులు పూర్తికాగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో, ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య - భర్త - సోదరుడు - పనిమనిషి - ఆవు - కుక్క మొదలైన పశువులు కూడా కర్మరుణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు. ఋణము తీరగానే వదిలి వెళ్ళడమో, పరలోకానికి చేరడమో జరుగుతుంది.

*శ్రద్ధ కలిగి ఉండటమే ధర్మం

 .

                     _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*కాయక్లేశైశ్చ బహుభిః*

*న నైవార్థస్య రాశిభిఃl*

*ధర్మః సమ్ప్రాప్యతే సూక్ష్మః*

*శ్రద్ధా ధర్మోsద్భుతం తపఃll*

                 ~నారద పురాణమ్


తా𝕝𝕝 డాంబిక ఆచారాలతో శరీరాన్ని కష్టపెట్టుకున్నంత మాత్రాన, ధనాదులు రాశులుగా ఉన్నా, సూక్ష్మమైన ధర్మాచరణ తేలిక కాదు....

*శ్రద్ధ కలిగి ఉండటమే ధర్మం.... అదే గొప్ప తపస్సు*......

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 92*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️



*పార్ట్ - 92*


"నా ప్రియాతి ప్రియమైన మాగధులకు.... 


మీ అందరి ఆదరాభిమానాలను చూరగొన్న మీ మహారాజు మహానందుడు స్వహస్తాలతో రాస్తున్న ఆఖరి బహిరంగ లేఖ... ప్రియాతి ప్రియమైన నా ప్రజలారా... మా పూర్వులు మగధ ప్రజలను తమ కన్న బిడ్డల కంటే మిన్నగా ప్రేమించారు. పాలించారు. మేము వారి మార్గాన్నే అనుసరించామని మీకు తెలుసు, మా తదనంతరం మా వారసుడు కూడా మా పూర్వీకుల మార్గాన్నే అనుసరించాలని మా ఆకాంక్ష... కానీ.... 


నేను చేరదీసి అభిమానించిన విషవృక్షం దాన ఫలాలు యిప్పుడు నా ప్రజల మీద విషం కక్కుతున్నాయని విని చాలా విచారించాను. మహాపద్ముడు, రాణి సునంద కలిసి చేసిన ద్రోహం కారణంగా నేను 'దీర్ఘరోగి' నన్న ముద్రతో ఏకాంత దుర్గంలో బంధీనయ్యాను. మీ మహారాణి మురాదేవి తప్ప నాకు దిక్కూ తోడూ ఎవ్వరూ లేని దుస్థితిలో అసలు నా పరోక్షంలో రాజ్యంలో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియ లేదు. చెప్పేవారూ లేరు. కానీ నిజాన్ని ఎల్లకాలం దాచలేరు. అది నివురుగప్పిన నిప్పులాంటిది. 


నాకు ఎట్టకేలకు నిజం తెలిసింది. మహాపద్ముడు 'పవిత్రమైన నందవంశాన్ని' కళంకితం చేస్తూ తనకీ సునందకి పుట్టిన సంతానానికి పేర్ల చివర 'నంద' నామదేయాన్ని చేర్చాడని విని కృంగిపోయాను. పరమ పవిత్రమైన మా నందవంశాన్ని అపవిత్రం చేస్తూ యీ 'సంకరనందులు' నవనందులు అనే పేరుతో దుష్టపాలన గావిస్తూ మా వంశానికి మాయని మచ్చ తెస్తున్నారని తెల్సుకుని బాధతో, పగతో, ప్రతీకారేచ్చతో రగిలిపోయాను. 


కానీ, వార్ధక్యం మీదపడి నిర్బంధంలో వున్న నేను, ఒకవేళ చెరసాల నుంచి బైటపడ్డా నందల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి తగిన శక్తి, సామర్థ్యం నాకు లేదని గ్రహించాను. అంతే కాదు. మగధ సింహాసనాన్ని అధిష్టించడానికి సమర్ధుడైన వారసుడు కూడా లేడు. అందుకే.... మీ మహారాణి మురాదేవిని ప్రార్థించి, ఆమెని ఒప్పించి, ఈ వయస్సులో... కేవలం... మగధ సింహాసనానికి... సక్షత్రియుడైన నందవంశ వారసుడిని ఇవ్వాలన్న ఏకైక సంకల్పంతో... మురాదేవిని కూడి పురుష సంతానాన్ని పొందాను. 


నా ప్రియమైన మగధ ప్రజలారా ! నాకు వారసుడు పుట్టాడు .... అతడికి 'చంద్రగుప్తుడు' అని నేనే నామకరణం చేశాను. అమావాస్య చీకటిలా ముగియబోతున్న నా జీవితంలోకి వెన్నెల వెలుగులా ప్రవేశించిన నా చంద్రుని గుర్తించడానికి ఆధారాలు, గుర్తులు - చంద్రుని వామపాదంలో వజ్రరేఖ... కనుపాపల్లో మత్సరేఖలు చేతుల్లో చక్రాంకితాలు, ఇంకా వీపు వెనక ఎడమ భాగాన పైన చాణు మాత్రపు అంటే శెనగ గింజంత నల్లని పుట్టుమచ్చ... వీటి ఆధారంతోనూ, యీ లేఖద్వారా, మురాదేవి ద్వారా మీరు నా చంద్రగుప్తుని గుర్తించగలరు. 


నాకింక జీవితేచ్చ లేదు. నా తదనంతరం సర్వసమర్థుడైన పాలకుడు మీకు లభించాలని నా ఆశ. నవనందుల వల్ల నా వంశం కలుషితమైంది. అందుచేత నా జీవితలక్ష్యాన్ని నెరవేర్చడానికి దీక్ష వహించిన త్యాగమయి మహారాణి ముర పేరిట... ఇహ నుంచీ నా వంశము మౌర్య వంశంగా గుర్తించబడాలని నా ఆకాంక్ష... చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి నేను కన్న కలలు తీర్చగలడని నా నమ్మకం. 


నా ప్రియాతిప్రియమైన ప్రజలారా .... బిడ్డలారా .... 


నా బిడ్డడు చంద్రుడు మీ వాడు... మీలో ఒకడు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడగలడు. అట్లే మీరూ అతడికి అండగా నిలువ గలరని నా ప్రగాఢ విశ్వాసం. దుష్టనందుల శకం అంతరించి, మౌర్యవంశ శకం ప్రారంభమైతేనే యీ లేఖ వెలుగుచూస్తుంది. యీ లేఖ మీ ముందుకు వచ్చిందంటే... నందులు అంతరించారని, నా పగతీరిందని అర్థం... పగ తీరడానికి సహకరించిన వారెందరో... వారందరికీ నా కృతజ్ఞతాభి వందనాలు తెలియజేసుకుంటూ.... 


మౌర్య సామ్రాజ్య ఛత్రఛాయలో మాగదులు శాంతి, సౌభాగ్యాలతో అలరారగలరనీ చంద్రగుప్త మౌర్యునికి అనుక్షణం బాసటగా నిలవగలరనీ ఆశిస్తూ.... ఆకాంక్షిస్తూ.... 

        మీ 

మహానందుడు.... 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌺🌹🌺

యజ్ఞవల్క్యుడు

 🎻🌹🙏సూర్యభగవానుని శిష్యుడు.....!!

      

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿గొప్ప జ్ఞానిగా పేరుపొందిన సకలుని పుత్రుడు వైశంపాయనుడు. ఈయన వేదవ్యాసుని శిష్యుడు. సకల

వేదవేదాంగాలలో  నిష్ణాతుడు.


🌸ఒకనాడు వైశంపాయనుడు తన శిష్యులతో " ఈనాడు మనం అందరం భయం లేకుండా  యజ్ఞయాగాదులు ప్రశాంతంగా చేసుకోగలగడానికి కారణం  మిధిలా నగరాన్ని  పాలిస్తున్న జనక మహారాజు కనుక మీరు  రోజుకు ఒకరు చొప్పున  ఆ మహారాజు భవనానికి వెళ్ళి మంత్రాక్షింతలతో మహారాజును వారిని ఆశీర్వదించి రావాలి"  అని ఆదేశించాడు.


🌿గురువుగారి ఆనతి ప్రకారం  శిష్యులు అందరూ ఒక్కొక్క రోజు  మహారాజుని ఆశీర్వదించి రాసాగారు.


🌸వైశంపాయనుని శిష్యులలో ఒక శిష్యుడు మహాజ్ఞాని. అతను

మహావిష్ణువు ఆనుగ్రహంతో జన్మించినవాడని పురాణ గ్రంధాలు కీర్తిస్తున్నాయి.  


🌿ఈయన జనకుని ఆశీర్వదించే రోజు వచ్చినది. అతను జనక మహర్షి భవనానికి వెళ్ళాడు.

కాని  ఆ సమయాన మహారాజు  అక్కడ  లేకపోవడంతో

మంత్రాక్షింతలను అక్కడి  మండపంలో  వేసి వెళ్ళిపోయాడు.


🌸 జనకమహారాజు తిరిగి వచ్చి చూసేసరికి  ఆశ్చర్యకరంగా ఆ మండపమంతా విరిసిన పరిమళ పుష్పాలతో కళకళలాడుతూ కనిపించింది. ఆ శిష్యుని అక్షితల ప్రభావం వలన పుష్పవనంగా మారిన ఆ ప్రాంతం మహారాజు మనసుని ఉత్సాహభరితం చేసింది. 


🌿అక్షంతలు జల్లి  వెళ్ళిపోయిన ఆ జ్ఞానిపై జనకమహారాజు కి ప్రత్యేకమైన అభిమానం కలిగింది. ఇంక మీదట  "నిత్యము జ్ఞానసిధ్ధి పొందిన ఆ శిష్యుడే వచ్చి మంత్రాక్షింతలతో  ఆశీర్వదించేలా ఏర్పాట్లు చేయమని

జనకమహారాజు వైశంపాయనుని కోరాడు.


🌸కాని  జ్ఞానియైన ఆ శిష్యుడు  గురువుగారు మొదట ఏర్పాటు చేసిన 

పధ్ధతి ప్రకారం నిత్యం ఒక్కొక్క శిష్యుడుగా వెళ్ళి

ఆశీర్వదించడమే సముచితమని

చెప్పాడు. 


🌿ఈ విధంగా నడచుకోవడం  మహారాజు మాటను అతిక్రమించి నట్లు కాదని వినయంగా తెలిపి  తోటి శిష్యులకు సమంగా అవకాశాలు కలిగించాడు.


🌸తర్వాతి కాలంలో  ఈ శిష్యుడే జనక మహారాజుకు బ్రహ్మవిద్యను ఉపదేశించినట్లు  పురాణ గ్రంధాలు తెలుపుతున్నవి. ఆవిధంగా ఆయన బోధించిన కాలంలో జనకపురి ఆశ్రమాన్ని  కణ్వమహర్షి.

ఈయన ఆ  జ్ఞాన శిష్యుని ప్రధమ శిష్యుడు. 


🌿ఆయనే శ్రీ మన్నారాయణుని అంశయైన యజ్ఞవల్కుడు.

భూలోకంలో  ఈయన అవతరించడమే

ఒక అద్భుతం. 


🌸భరతఖండంలో ఉత్తర భాగాన

వర్ధమానపురం వున్నది. ఇక్కడే సకలుడు అనే ఋషి నివసించేవాడు. ఆయనకి సునంద అనే పుత్రిక, వైశంపాయనుడనే పుత్రుడు 

వున్నారు. 


🌿సరస్వతీ దేవి అంశ  అయిన సునందని బ్రహ్మరధుడు వివాహం చేసుకున్నాడు.

చాలాకాలం దాకా వీరికి సంతానం కలుగలేదు. ఆయన 

శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ

తపస్సు చేశాడు. 


🌸బ్రహ్మరధుని తపస్సు కి మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. బ్రహ్మరధుడు 'సద్గుణవంతుడు ,  సకలశాస్త్రపారంగతుడైన,  ఒక పుత్రుని ప్రసాదించమని నారాయణుని

వరం కోరాడు. 


🌿నారాయణుడు అనుగ్రహించాడు.

కాలక్రమంలో సునందా దేవి గర్భవతి అయినది.కాని ప్రసవం కాలేదు. 

నెలలు నిండాయి. సంవత్సరాలు గడిచాయి.  అయినా ప్రసవం

మాత్రం జరుగలేదు. గర్భంలోని శిశువుని కారణమడుగగా, 

శ్రీ మన్నారాయణుని అనుగ్రహం నాకు లభిస్తేనే జన్మిస్తాను"

అనే మాటలు వినపడ్డాయి.


🌸బ్రహ్మరధుడు తిరిగి తపస్సు చేశాడు. ఐదు సంవత్సరాల గర్భవాసానికి తరువాత మహావిష్ణువు అనుగ్రహంతో బిడ్డ క్షేమంగా జన్మించాడు. శతభిషా నక్షత్రం, ధనుర్లగ్నం  కూడిన శుభదినమున శ్రీ మన్నారయణుడే అవతరించాడు. ఇదే యజ్ఞవల్క్యుని అవతార దినం.


🌿పెద్దలు ఆ పిల్లవానికి పెట్టిన పేరు "సానందరుడు'' మహర్షులు పరమానందంతో

యజ్ఞవల్క్యుడని పిలుస్తారు.

దేవగురువైన బృహస్పతి   నాలుగు వేదాలు, సకల విద్యలు , సకల కళలు యీయనకు నేర్పి ఉపనయనం చేశాడు.


🌸పిదప వేద వ్యాసుని వద్ద వేదాధ్యయనం చేశాడు యజ్ఞవల్క్యుడు. ఋగ్వేదమును యజుర్వేదమును,  59 భాగాలు అభ్యసించాడు. తన తల్లి సోదరుడైన వైశంపాయన మహర్షి వద్ద

జ్ఞానయోగమును అభ్యసించాడు. 


🌿వైశంపాయనుని వద్ద శిష్యునిగా వున్న సమయంలో  జనకుని అనుగ్రహించిన సంఘటనలు జరిగాయి.


🌸వేదాలలో ప్రధాన భాగాలు అభ్యసించిన పిదప 15 భాగాలు మిగిలి వున్నవి ఆ భాగాలు

సూర్యభగవానునికి మాత్రమే తెలుసు . 

యజ్ఞ వల్క్యుడు  గాయత్రీ దేవిని

ఉపాసించి తపస్సు చేశాడు.


🌿 గాయత్రీ దేవి సూర్యభగవానుని ద్వారా మిగిలిన భాగాలు నేర్చుకునేటేందుకు సహాయం చేసినది.

అనేక కఠోర పరీక్షల  తరువాత సూర్యదేవుడు యజ్ఞవల్క్యుని తన శిష్యునిగా చేసుకొన్నాడు. తనకి తప్ప మరి ఎవరికి తెలియని యజుర్వేద రహస్యాలను నేర్పేడు.


🌸యజ్ఞవల్క్యుడు  గృహంలో నివసిస్తూనే తన శిష్యులకు శుక్ల యజుర్వదమును, వేదాలను నేర్పేరు.


🌿" యజ్ఞ వల్క్య స్మృతి'  అనే గ్రంధాన్ని వ్రాశారు. ఈనాటి చట్ట ప్రమాణాలు, మొదలైన విజ్ఞానమును తెలిపే ఆది గ్రంధంగా వున్నది...స్వస్తీ...🚩🌞🙏🌹🎻

ఈ రోజు పద్యము:

 192వ రోజు: (శుక్ర వారము) 16-06-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


అతి బాల్యమలోనైనను,

బ్రతికూలపు మార్గములఁబ్రవర్తింపక స

ద్గతిమీఱ మెలఁగ నేర్చిన

నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా!


 ఓ కుమారా!  ఎవడు లోకమునందు చిన్నవాడుగా నుండి ఉన్నప్పటికిని, విరుద్దముగా  నడవక మంచిమార్గమున నడచుచుండునో వాడు లోకమున సుఖముగా జీవింపగలడు. 


ఈ రోజు పదము. 

కుటుంబము (Family): అజవంజము, ఇంటిపట్టు, కాపురము, భావము, లోకయాత్ర, నిడిమట్టు, సంసారము, సంసృతి, సమసారము, సువిద్రితము.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 92*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️



*పార్ట్ - 92*


"నా ప్రియాతి ప్రియమైన మాగధులకు.... 


మీ అందరి ఆదరాభిమానాలను చూరగొన్న మీ మహారాజు మహానందుడు స్వహస్తాలతో రాస్తున్న ఆఖరి బహిరంగ లేఖ... ప్రియాతి ప్రియమైన నా ప్రజలారా... మా పూర్వులు మగధ ప్రజలను తమ కన్న బిడ్డల కంటే మిన్నగా ప్రేమించారు. పాలించారు. మేము వారి మార్గాన్నే అనుసరించామని మీకు తెలుసు, మా తదనంతరం మా వారసుడు కూడా మా పూర్వీకుల మార్గాన్నే అనుసరించాలని మా ఆకాంక్ష... కానీ.... 


నేను చేరదీసి అభిమానించిన విషవృక్షం దాన ఫలాలు యిప్పుడు నా ప్రజల మీద విషం కక్కుతున్నాయని విని చాలా విచారించాను. మహాపద్ముడు, రాణి సునంద కలిసి చేసిన ద్రోహం కారణంగా నేను 'దీర్ఘరోగి' నన్న ముద్రతో ఏకాంత దుర్గంలో బంధీనయ్యాను. మీ మహారాణి మురాదేవి తప్ప నాకు దిక్కూ తోడూ ఎవ్వరూ లేని దుస్థితిలో అసలు నా పరోక్షంలో రాజ్యంలో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియ లేదు. చెప్పేవారూ లేరు. కానీ నిజాన్ని ఎల్లకాలం దాచలేరు. అది నివురుగప్పిన నిప్పులాంటిది. 


నాకు ఎట్టకేలకు నిజం తెలిసింది. మహాపద్ముడు 'పవిత్రమైన నందవంశాన్ని' కళంకితం చేస్తూ తనకీ సునందకి పుట్టిన సంతానానికి పేర్ల చివర 'నంద' నామదేయాన్ని చేర్చాడని విని కృంగిపోయాను. పరమ పవిత్రమైన మా నందవంశాన్ని అపవిత్రం చేస్తూ యీ 'సంకరనందులు' నవనందులు అనే పేరుతో దుష్టపాలన గావిస్తూ మా వంశానికి మాయని మచ్చ తెస్తున్నారని తెల్సుకుని బాధతో, పగతో, ప్రతీకారేచ్చతో రగిలిపోయాను. 


కానీ, వార్ధక్యం మీదపడి నిర్బంధంలో వున్న నేను, ఒకవేళ చెరసాల నుంచి బైటపడ్డా నందల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి తగిన శక్తి, సామర్థ్యం నాకు లేదని గ్రహించాను. అంతే కాదు. మగధ సింహాసనాన్ని అధిష్టించడానికి సమర్ధుడైన వారసుడు కూడా లేడు. అందుకే.... మీ మహారాణి మురాదేవిని ప్రార్థించి, ఆమెని ఒప్పించి, ఈ వయస్సులో... కేవలం... మగధ సింహాసనానికి... సక్షత్రియుడైన నందవంశ వారసుడిని ఇవ్వాలన్న ఏకైక సంకల్పంతో... మురాదేవిని కూడి పురుష సంతానాన్ని పొందాను. 


నా ప్రియమైన మగధ ప్రజలారా ! నాకు వారసుడు పుట్టాడు .... అతడికి 'చంద్రగుప్తుడు' అని నేనే నామకరణం చేశాను. అమావాస్య చీకటిలా ముగియబోతున్న నా జీవితంలోకి వెన్నెల వెలుగులా ప్రవేశించిన నా చంద్రుని గుర్తించడానికి ఆధారాలు, గుర్తులు - చంద్రుని వామపాదంలో వజ్రరేఖ... కనుపాపల్లో మత్సరేఖలు చేతుల్లో చక్రాంకితాలు, ఇంకా వీపు వెనక ఎడమ భాగాన పైన చాణు మాత్రపు అంటే శెనగ గింజంత నల్లని పుట్టుమచ్చ... వీటి ఆధారంతోనూ, యీ లేఖద్వారా, మురాదేవి ద్వారా మీరు నా చంద్రగుప్తుని గుర్తించగలరు. 


నాకింక జీవితేచ్చ లేదు. నా తదనంతరం సర్వసమర్థుడైన పాలకుడు మీకు లభించాలని నా ఆశ. నవనందుల వల్ల నా వంశం కలుషితమైంది. అందుచేత నా జీవితలక్ష్యాన్ని నెరవేర్చడానికి దీక్ష వహించిన త్యాగమయి మహారాణి ముర పేరిట... ఇహ నుంచీ నా వంశము మౌర్య వంశంగా గుర్తించబడాలని నా ఆకాంక్ష... చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి నేను కన్న కలలు తీర్చగలడని నా నమ్మకం. 


నా ప్రియాతిప్రియమైన ప్రజలారా .... బిడ్డలారా .... 


నా బిడ్డడు చంద్రుడు మీ వాడు... మీలో ఒకడు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడగలడు. అట్లే మీరూ అతడికి అండగా నిలువ గలరని నా ప్రగాఢ విశ్వాసం. దుష్టనందుల శకం అంతరించి, మౌర్యవంశ శకం ప్రారంభమైతేనే యీ లేఖ వెలుగుచూస్తుంది. యీ లేఖ మీ ముందుకు వచ్చిందంటే... నందులు అంతరించారని, నా పగతీరిందని అర్థం... పగ తీరడానికి సహకరించిన వారెందరో... వారందరికీ నా కృతజ్ఞతాభి వందనాలు తెలియజేసుకుంటూ.... 


మౌర్య సామ్రాజ్య ఛత్రఛాయలో మాగదులు శాంతి, సౌభాగ్యాలతో అలరారగలరనీ చంద్రగుప్త మౌర్యునికి అనుక్షణం బాసటగా నిలవగలరనీ ఆశిస్తూ.... ఆకాంక్షిస్తూ.... 

        మీ 

మహానందుడు.... 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌺🌹🌺

ఎందుకు చింత?

 శ్లోకం:☝️

*ఏకవృక్షే సమారూఢా*

 *నానావర్ణవిహంగమాః ।*

*ప్రభాతే దీక్షు గచ్ఛన్తి*

 *తత్ర కా పరివేదనా ॥*

  (చాణక్య నీతి, 10/15)


భావం: అనేక రంగుల పక్షులు ఒక చెట్టుపై కూర్చుని ఉదయాన్నే తలో దిక్కుకు ఎగిరిపోతాయి, దీని గురించి ఎందుకు చింత?

వేదాలు సమస్తం జ్ఞానానికి మూలం ఈ

 వేదం 90% శాతం మంది భారతీయులకు అసలు ఆ పదం గాని, అవి ఎన్నో కూడా తెలియదు..

మనం మరిచిపోయింది.. వేదాలనే కాదు.. ఒక మహా జాతి వైభావాన్ని..

వేదాలు సమస్తం జ్ఞానానికి మూలం ఈ మాట నేను చెప్పటం లేదు.. విదేశీయులు చెప్తున్నారు.. జర్మనీ పార్లమెంట్ చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ చెప్తుంది..

ఎవడైనా వాగుతున్నాడా?? వేదాలను గురించి పిచ్చి పిచ్చిగా ?? మీ ముందు?? అయితే వాడిని ఒకటి పీకి.. ఈ పోస్ట్ చూపించండి...

శ్రీ బ్రహ్మ శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి !!

జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు" శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి"

ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖాలుగా, నాలుగు రూపాల్లో అవగతమవుతుంది.

ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఈ నాలుగు శాస్త్రాల్లో అభినివేశం ఉండాల్సిందే. అంత అభినివేశం, ప్రతిభ ఉన్నవారుగా ఇరవయ్యో శతాబ్దంలో పేరుపొందిన వారు దండిభట్ల విశ్వనాథశాస్త్రి. అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్‌ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు!

రాజమహేంద్రవరం లో వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన - ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయాలు చూపుతూ ఓ చోట ఓ భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేమిటో చెప్పమని అడిగారట. తనకు తెలియదని ఆ రాయబారి అనడంతో వెంటనే జర్మనీ అధికారులు దండిభట్ల విశ్వనాథశాస్త్రి అని చెప్పి ఆయనకు జర్మనీలో గొప్పపేరు ప్రతిష్టలు రావడానికి కారణమేమిటో కూడా చెప్పారు.

తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారింది. జర్మనీలో కెయిజర్‌ ప్రభుత్వం పతనమైంది. ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థికమాంద్యం నెలకొంది. ఆ యుద్ధంలో బందీలయిన వేలాదిమంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్‌. ఆయన ఆ అవమానాన్ని దిగమింగు కోలేకపోయారు. ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతన్నది ఆయన విశ్వాసం. ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించాలని ఆయన నాజీ పార్టీ స్థాపించారు. జర్మనులను దేశభక్తితో ఉత్తేజితం చేశారు. వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించారు. అలాగే కొత్త మారణాయుధాల అన్వేషణ ప్రారంభించారు.అప్పటికే సంస్కృత భాషాధ్యాయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకొన్నారు. భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయంలో మారణాయుధాల రహస్యాలున్నాయని ఆయన గ్రహించారు.

ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేశారు. ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకొన్న ఆ వాఞ్మయం నుంచి జర్మన్లు అబ్ధిపొందడానికి గట్టిచర్యలు హిట్లర్‌ తీసుకొన్నారు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాఞ్మయం నుంచి విడమరిచి చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్‌ ప్రతినిధులు ఆయనకోసం అన్వేషణ ప్రారంభించారు.

దండిభట్ల విశ్వనాథశాస్త్రి నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ, తమ ఇంటికి వచ్చేవారితో చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకొనేవారు కాదు. ఓ రోజు ఆయన విశాఖపట్నం సమీపానున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్లవలసి వచ్చింది. కాలినడకన వెళ్తోన్న సమయంలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన్ని సమీపించారు. వాదోపవాదాలకు తావులేకుండా ఆయన్ని అక్కడినుంచి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత కలకత్తాకు తీసుకువెళ్లారు. కతకత్తాలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. చివరకు ఆయన్ని జర్మనీ తీసుకెళ్లారు. దండిభట్ల జర్మనీ చేరుకొన్న సమయం ఎటువంటిదంటే రెండో ప్రపంచ యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేస్తున్న తరుణం!

బాంబులు తయారుచేసి రాశులు పోస్తున్నారు. అయితే నిల్వచేసే సమయంలో ఏమాత్రం వత్తిడి కలిగినా అవి పేలిపోతుండడంతో విపరీతమైన నష్టం సంభవించింది. అలా పేలకుండా నిల్వఉంచే మార్గం వారికి తోచలేదు. దండిభట్ల విశ్వనాథశాస్త్రి యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు. దాంతో దండిభట్ల పేరు మారు మోగింది. ఇక అప్పట్నించీ ఆయన పూజ్యపాదులయ్యారు.

తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనులకు పంచి పెట్టారు. ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి తనవంతు సహకారం అందించారు. జర్మనీకి వెళ్లిపోయిన తర్వాత దండిభట్ల తిరిగి భారతదేశానికి రాలేక పోయారు.

దండిభట్ల జర్మనీకి వెళ్లిన చాలాకాలం వరకు కూడా వారి సతీమణికి మూడువందల రూపాయల సొమ్ము ప్రతినెలా అందింది. అయితే చాలా కాలం తర్వాత నెలకు తొంభైరూపాయలు మాత్రమే వచ్చేవి. అంటే దండిభట్ల జీవించి ఉన్నంతకాలం ఆమెకు మూడువందల రూపాయలవంతున అంది, ఆయన మరణం తర్వాత కుటుంబపింఛనుగా తొంభై రూపాయల వంతున అందింది. మరి కొంత కాలానికి అదికూడా ఆగిపోయింది!

అంటే వారు అప్పటికే పరమపదించి ఉంటారని ఆయన మిత్రులు, శిష్యులు అభిప్రాయపడటం గమనార్హం.

దండిభట్ల దేశానికి దూరమైన తర్వాత దేశం, రాష్ట్రం అన్నీ ఆయన్ని మరచి పోయాయి! అయితే జర్మనులు మాత్రం ఆయన్ని తమవాడుగా, మాననీయుడిగా, మహనీయుడిగా ఇప్పటికీ నిలుపుకోవడం విశేషం.

ఇప్పటికి జర్మనీలో విదేశాంగ శాఖ కార్యలయంలో, పార్లమెంట్ లో దండిభట్ల వారి చిత్రం ఉంటుంది..

అది మన జ్ఞాన సంపద, అది మన జాతి వైభవం.. అటువంటి వేదాలను, వేదా విజ్ఞానాన్ని నాశనం చెయ్యాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇప్పటికి.. గుర్తుపెట్టుకో భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన జ్యొతి..

ఇప్పుడు కూడా టాప్ అంతా విదేశంలొ

స్క్రాప్ అంతా మనదేశంలో..

పెరటిమొక్క వైద్యానికి పనికి రాదన్నట్టు మన సంస్కృతి, సాంప్రదాయ సిద్ధం గా ఉండే వేదాల విలువ పరాయి దేశం వాడు చెపితేగాని మనకు తెలియవు.. మన యోగా గురించి పాశ్చాత్యులు చెపితే గాని మనం నమ్మలేదు

మనకు వీపు ఉందనే విషయాన్ని మన వెనకవాడు చెపితేగాని మనం నమ్మే పరిస్థితి లో లేము..

మన భారతదేశ ఔన్నత్యం ను ప్రపంచానికి చాటిన ఈ మహానుభావుని గురించి చదువుతుంటే

ప్రతి భారతీయునికి ఛాతీ గర్వంతో ఓ ఇంచు పెరుగుతుంది.

భజగోవిందం

 ॐ                 भज गोविन्दं

                    భజగోవిందం 

                 (మోహముద్గరః) 

            BHAJA GOVNDAM   

 

      (श्रीमच्छंकरभगवतः कृतौ 

       శ్రీమచ్ఛంకరభగవత్పాద కృతం 

           BY SRI ADI SANKARA)


                           శ్లోకం :24/31

                   SLOKAM :24/31

                    

శ్రీ సురేంద్రులు 


त्वयि मयि चान्यत्रैको विष्णुः,

व्यर्थं कुप्यसि मय्यसहिष्णुः।

भव समचित्तः सर्वत्र त्वं,

वाञ्छस्यचिराद्यदि विष्णुत्वम्॥२४॥

                    ॥भज गोविन्दं॥ 


త్వయి మయి చాన్యత్రైకో విష్ణు:

వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు: |

భవ సమచిత్తః  సర్వత్ర త్వం

వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం ||24|| 

                    ॥భజ గోవిందం॥ 


    నీలోను, నాలోను, ఇతరులలోను ఉన్నది ఏకమైన సర్వవ్యాపక చైతన్యమే. 

    సహనం లేనివాడివి కనుక నాపై కోపగించుకుంటున్నావు. 

    నీవు బ్రహ్మత్వం (మోక్షం) ను పొందగోరితివా! 

    అంతటా - అన్నివేళలా సమబుద్ధిని కలిగి ఉండు. 


అనువాదం 


కుపితు డగుటేల నాపై నోరిమి నశించి 

నీలోన నాలోన నన్య జీవులలోన 

విశ్వమే తానైన విష్ణువే సూక్ష్మమున 

నుండ, నన్నిట సమదృష్టి 

                 నిను ముక్తు జేయు. 


    तुममें, मुझमें और अन्यत्र भी सर्वव्यापक विष्णु ही हैं, 

    तुम व्यर्थ ही क्रोध करते हो, 

    यदि तुम शाश्वत विष्णु पद को प्राप्त करना चाहते हो 

    तो सर्वत्र समान चित्त वाले हो जाओ॥२४॥ 


    Lord Vishnu resides in me, in you and in everything else, 

    so your anger is meaningless. 

    If you wish to attain the eternal status of Vishnu, 

    practice equanimity all the time, in all the things. 


https://youtu.be/ImWKhB_PMiw 


                          కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

            భద్రాచలం

కొల్హాపూర్ ... మహలక్ష్మీ అమ్మవారు

 *కొల్హాపూర్ ... మహలక్ష్మీ అమ్మవారు*





అష్టాదశ శక్తిపీఠాలలో 7వ శక్తి పీఠం.. 

మనం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళినా ఇలా దర్శనం చేసుకోలేము...

అమ్మవారి అభిషేకం.. హారతి... అర్చన... అలంకారాలు అద్భుతంగా తీసారు.. 

🙏🙏🙏🙏🙏🙏


ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షించగా,

 నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన కరములతో పైకి ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే పేరు వచ్చిందని చెబుతారు. 


ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత కాగా, శివుడు నీరుగా, విష్ణువు రాయిగా, మహర్షులు ఇసుకగా, దేవతలు చెట్లుగా, మూడున్నర కోట్ల తీర్థాలూ సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటారని, 


అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచ మహాపాతకాలు సైతం ప్రక్షాళనమవుతాయంటారు.

 

*కొల్హాపూర్ క్షేత్రాన్ని కరవీర నగరమని, ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని స్తుతించారని పద్మ, స్కాంద, దేవీభాగవతాలు ప్రస్తావించాయి.*

విజయవిలాసము

 తాసైరింపకపర్ణయుండఁగ,భవద్గర్భంబునందాల్చి, తే

జోసహ్యున్                               శరజన్ముఁగాంచి,యలనీహారక్షమాభృత్కుమారీ

సాపత్న్యముఁగన్న మోహపు పురంధ్రీరత్నమౌదీవ,కా

దేసర్వజ్ఙుఁడు నిన్ను నేల తలపైనెక్కించుకో? జాహ్నవీ!


           అనుపమానమైన ఈపద్యరత్నం 

చామకూరవేంకటకవిరచించిన "విజయవిలాసము"-అనుప్రబంధములోనిది.

         వేంకట కవిది ఒకవిలక్షణమైన కవితా శైలి.అచ్చతెనుగు మాటల మోహరింపుతో ప్రతిపద్యంలోను చమత్కారాన్ని రుచిచూపటం ఈకవిలోని ప్రత్యేకత!

           ప్రస్తుత పద్యం అర్జునతీర్థయాత్రారంభమున గంగానదీ తీరమునకు జేరిన సందర్భములోనిది.

గంగమ్మతల్లి విశిష్టతను దెలుపుట యిందలివిషయము.


           "అమ్మా!గంగమతల్లీ!తనతేజమును భరింపనోపక పార్వతియుండ.,నీవు పరమశివుని తేజమును కడుపునమోసి కుమారస్వామిని గని,పరమశివుని వంశమును నిల్పి యాతని ప్రేమను జూరగొన్నావు.లేకున్న హిమవత్పర్వత రాకుమారియగు పార్వతియుండగా సర్వజ్ఙుడగు శివుడు నిన్నేలతలపై కెక్కించుకొనును?సర్వథానీవుఆమెకన్నమిన్నవే!"-ననిపొగడుచున్నాడు.


           ఈపొగడ్తలో నొకతెగడ్త యున్నది.

గంగ పార్వతికన్నమిన్న యనిచెప్పుట.

మరిశంకరునిశరీరమున వామార్ధమునాక్రమించిన పార్వతిమాటయో? ఆమె పర్వత రాకుమారి.అంతేగాదు.తపస్సుచేసి శివునిభర్తగాచేసికొన్నది.అందుకేకవి"అపర్ణ"యనియు-నీహారక్షమాభృత్కుమారీ"-యనియు, పెద్దసమాసమునుపార్వతినిగురించిచెప్పి.ఆమెగొప్పతనమునువెల్లడించినాడు.గంగను "జాహ్నవి"-యని చిన్నమాటతో సరిపెట్టినాడు.అనగా నొకసామాన్యమైన వనితగాసూచనచేసినాడు.

                         కానీ యామె శివుని వంశమును నిలబెట్టినదౌట,శివునిదృష్టిలో పార్వతికన్న మిన్నయైనది.అందుచేతనే 

"సర్వజ్ఙుడైన"(అన్నియునెరిగినవాడు)శివుడు గంగను నెత్తినెక్కించు కొన్నాడనికవి సమర్ధింపు.

            లోకమున పురుషున కనేకమందిభార్యలున్నను,తనకు సంతతినిచ్చిన భార్యయెడనే యతనికభిమానము యెక్కువగా నుండుటమనముచూచుచున్నదేగదా!


అర్ధములు:-


అపర్ణ-పార్వతి, తేజోసహ్యుడు-పట్టరానితేజముగలవాడు.శరజన్ముడు-రెల్లుపొదలలోపుట్టినవాడు.సాపత్న్యము-సరిపత్నులగుట(సవతులగుట)

మోహపుపురంధ్రి-ముద్దులభార్య,

అలంకారము-కావ్యలింగము.🌷🌷🙏🙏👌

నిగమ శర్మ అక్క

 నిగమ శర్మ అక్క !!


(శ్రీ పాండురంగ మాహాత్మ్యం.. తెనాలి రామకృష్ణ కవి.)

👉విశ్లేషణ :-  చొప్పకట్ల సత్యనారాయణ .

💥💥💥💥

తెలుగు సాహిత్యంలో కొన్ని పాత్రలు  అక్షర, రూపాన్ని

సంతరించుకున్నాయి.

అలాటి పాత్రలలో "నిగమ శర్మ అక్క" పాత్ర చిరస్మరణీయం!

తెనాలి రామకృష్ణుడా పాత్రను తీర్చిదిద్దిన విధానంప్రశంసనీయం.


ప్రబంధయుగంలో వెలసిన గ్రంధాలలో అపురూపమైనది

పాండురంగ మాహాత్మ్యం..

నిగమ శర్మోపాఖ్యానము అందొక కథ.

పరమ నిష్ఠారిష్ఠుడును, మహాపండితుడును, శ్రోత్రియ బ్రాహ్మ

ణోత్తముని కొమరునిగానిగమశర్మ యుదయిచెయించినాడు.

వేదాది సర్వ విద్యలను నేర్చినాడు.ఉపవీతుడైన యనంతరము

వివాహితుడయినాడు.

విధివశమున వానికి దుర్జన సాంగత్యమలవడినది.

దానివలనసర్వభ్రష్ఠుడైనాడు. జూదమాడుట,వ్యభిచరించుట,

పానము, యిత్యాది సర్వదుర్గుణముల కేలిక యైనాడు.

ఈవ్యసనములకు వలసిన ధనమునకై స్వగృహముననే చౌర్యమారంభించినాడు .

మాన్యములను తెగనమ్మసాగినాడు."భ్రష్టస్య కావాగతిః" యనురీతిగా

సంచరించుచుండినాడు.. తల్లి యిదియంతయు నెరింగియు పుత్ర

వ్సామోహమున భర్త కెరిగింపకుండెను. వారి భ్రష్టాచారములు

మితిమీరిన దశలో పాపమాగృహస్థునకు

పుత్రునినిర్వాకము,యితరులవన తెలసినది. 

ఆబ్రాహ్మణగృహస్తునకు అంతకుమున్నె యొక కుమార్తెగలదు.

ఆమెయే నిగమశర్మయక్క! ఆమెకంతకుముందే పెండ్లియయినది.

పిల్లలుకూడా. అదిగో ఆమెమాటపై నిగమ శర్మకు అమితగౌరవమట!

.

అందువలన అతనిని సరిదిద్దుటకు ఆమెను బిలిపించినారు.

పుట్టినింటి మమకారము పెనవైచుకొన్న ఆయతివ యరుదెంచి,

తమ్ముని రాకకై యెదురు చూడసాగినది. రేయంతయు జూదమాడి,

తెల్లవారువేళకు దొడ్డిగుమ్మము నుండి నిగమశర్మ

గృహప్రవేశమొనరించినాడు. యెందుకు వచ్చెను? చద్దియన్నమును

భుజించిపోవుటకు. వానియదృష్టముపండినది. రావడమేతడవు అక్క

కన్నులలో బడినాడు. ఆమెప్రేమగా నతనిని చేరబిలిచి

కడుపునిండుగా కుడువబెట్టి,పసిబాలుడగు తనయెడ బిడ్డను

యెత్తుకొన నిచ్చి, పసికూనను యొడిలోనిడుకొని చనుగుడుపుచు

, తమ్మునకిట్లు ధర్మోపదేశముచేయ నుపక్రమించినది.

ఇక్కడ కవి యామెనోటివెంట బలికించిన మూడుపద్యములూ

ఆణిముత్యములే! వినుడు-

శా: ప్రారంభించిన వేదపాఠములకున్ ప్రత్యూహ మౌనంచునో,

యేరా!తమ్ముడ! నన్ను జూడఁజనుదేవెన్నాళ్ళనో నుండి?, చ

క్షూరాజీవ యుగంబు వాచె నిన్ కన్గోకున్కి, నీబావయున్

నీరాకల్ మది గోరు "చంద్రు పొడపున్ నీరాకరంబున్బలెన్".

...

యేరా! తమ్ముడూ!యేమిటి? వేదపాఠములకు

అంతరాయమౌతుందనాయేమి,,,యింతకాలమైనా మాయింటికే

రావడంలేదు?

( నీపనికిమాలినపనులేవోనాకుతెలియదనుకున్నావా?

అనివ్యంగ్యం)కన్నులురెండూ నీకోసంయెదురు చూసి

వాచిపోయాయిరా! నేనేకాదు మీబావగారుకూడా 'చంద్రునికోసం

యెదురుచూచే సరోవరంలా,యెదురు చూస్తున్నారనుకో!

యిక్కడ కవి మనయింట మామూలుగా యెలామాట్లాడుకుంటామో

అలాగే రచించటం గొప్పవిషయం! యెంతైనా కవిగదా చివర ఒక

మెరపు మెరిపించాడు.

"నీరాకల్ మదిగోరు చంద్రు పొడుపున్

నీరాకరంబున్వలెన్"_- అంటూ 'నీరాక-నీరాక; ఛేకానుప్రాసము.ఛేకుడు-విదగ్ధుడు అంటే నేర్పరి అనియర్ధం.

తెలివైనవారుఒపుడుగాకార్యసుఘటితమైనమాటలు మాటలాడగలరు. నిగమశర్మయక్క చక్కనిమాటనేర్పుగలయిల్లాలు.

ఆమెమాటలకుపక్రమించింది.ఇలా,

(యింక రెండవ పద్యం చూద్దాం!) ఇందులోఅతడుచేసిన, చేస్తున్న పనులకు

నిగమశ్మకు మందలింపు,ఈవిధంగా,


శా: వీరావేశముఁదాల్చి సర్వ ధనమున్ వెచ్చింతు గాకేమి,! ము

క్కారుంబండు నఖండ సేతువృతముల్ కాశ్మీరఖండంపు కే

దారంబుల్ఁ దెగనమ్మగాఁజనునె? నిర్దారుండవే? వెన్క నె

వ్వారున్ లేరె సహోదరాదులు? కులధ్వంసంబు నీకర్హమే?


ఈపద్యంలో తమ్మునిపైకోపం,అయ్యోవీడు పాడౌతున్నాడే అనేబాధ,

సంస్కరించకపోతే యెలాగ అనేతపన, యిలాపుట్టింటి ఆడబిడ్డకు

కలిగే ఆవేశ కావేశాలు అన్నీ కవిరంగరించి ముద్దగాచేశాడు.

యీఆడబడుచేగాదు,పుట్టింటి బాగుగోరే యే ఆడబడుచైనా

అలాగే ఆలోచిస్తుందనుకుంటాను.

యేరా! వీరావేశంతో ఒళ్ళెరుగక, డబ్బంతా విచ్చలవిడిగా

ఖర్చుచేస్తునావట? ముక్కారు పంటలు పండే మాన్యాలను

తెగనమ్ముతున్నావట? నీ వెనక పెళ్ళాంఉందిరా! ఆమెకేదిదారి?

నీవెనుక నున్న మాగతేమిటి?తమ్ములున్నారుకదా వారిమాటేమిటి?

యీవిధంగా కుల ధ్వంసం చేయటం నీకుతగునా? అని నిగ్గదీసింది.

చివరకు మా కొంపలో యిలాపుట్టావేమిరా! అంటోంది.

శా: శ్రీ లాలిత్యము, నిత్య శుధ్ధియు, గుణోత్సకంబునున్ గల్గి, యు

ద్వేల స్ఫూర్తి దలిర్చు, తండ్రి యను నబ్ధిన్ చంద్రుడైఁ దోచినన్

బోలుంగాక ,భవాదృశుండితరుఁడై కన్పట్టినన్ జెల్లునే?

" సాల గ్రామ ఖనిన్ జనించునె గదా జాత్యల్ప పాషాణముల్";

మాయింట చెడఁబుట్టావుగదరా!

యెంత పవిత్రమైన వంశమిది.నీవలన పాడైపోయినదిగదా!

నీతండ్రి సర్వసంపదలకు నెలవైనవాడు,మహానిష్ఠాగరిష్ఠుడు,

సద్గుణ శీలుడు. అట్టివానికడుపున

నికృష్టుడవైననీవుజన్మించుట,"పరమ పవిత్రమైన

"సాలగ్రామగని"లో పనికిరాని "రాయి"వలె ఐనదిగదరా!

 యనుచున్నది. ఈపద్యమున కవి నిగమశర్మ

తండ్రికి సముద్రునితో పోలికను జెప్పినాడు.

సముద్రుడు లక్ష్మిని కుమార్తెగా లాలించినవాడు,

(శ్రీలాలిత్యము)జలములకు నిత్యశుధ్ధిగలదుగదా(అదేనిత్యశుధ్ధత)

రత్నాకరుడు సముద్రుడు అదిగుణోత్సకత.;

(నిగమ శర్మతండ్రి- డబ్బున్నవాడగుట,నిష్ఠాగరిష్ఠుడగుట,

సద్గుణవంతుడగుట;ఇట్లు సాగరమునకు నిగమశర్మతండ్రికి పోలికలు.)

 వీరిద్దరిలో ఉద్వేల స్ఫూర్తియుగలదు,

సముద్రంపరంగా యెత్తైన కెరటాలు, ని:తండ్రిపరంగా మంచిపేరు

ప్రతిష్ఠలుకలిగి ఉండుట.

ఈవిధంగా తండ్రి సముద్రుడైతే, మరి కొడుకేంగావాలి? ఆసముద్రున

కుదయించిన చంద్రుడు కావాలిగదా! వీడు

అలాకాలేదు.పనికిమాలినవాడయ్యాడు. అదే ఆమెబాధ!

చూశారా మానవ మనస్తత్వాలను మధనంచేసితీసిన కావ్య సుధారసం!

ఇదిగో ఇదండీ "పాండురంగ విభుని పద గుభనం! 

                   సెలవు .

                                        స్వస్తి!

.

*రోగ నిరోధక మంత్రాలు,...సాధనలు* ..

 


*రోగ నిరోధక మంత్రాలు,...సాధనలు* ..


ఈ రోగ నిరోధక మంత్రాలు కూడా ఉంటాయి అని ఇప్పుడు వారు ఎగతాళి చేయవచ్చు, కానీ  నిజం రోగ  నిరోధక మంత్రాలు కచ్చితంగా ఉంటుంది , అసలు మంత్రం అనేది ఎలా నిర్మించ బడినది ఒకదానికి ఒకటి ఒక ఫార్ములా లాగా పనిచేసే విధంగా నిర్మించ బడినది, మంత్రం చదివే టప్పుడు ఆ శబ్దనికి ప్రతిస్పందించే ప్రకృతిలోని కొన్ని శక్తులు మన శరీరాన్ని ఆకర్షిస్థాయి..అప్పుడు మనకు రోగ నిరోధక శక్తి మనో ధైర్యం, బలం లభిస్తుంది..


ఒకప్పుడు వైద్యులు ఔషధం తో పాటు ఒక మంత్రం కూడా ఇచ్చే వాళ్ళు ఔషధం సేవించే టప్పుడు ఆ మంత్రాన్ని చదివి ఔషధం తీసుకోమని చెప్పే వాళ్ళు, తెలు మంత్రం పాము మంత్రం తో ప్రాణాలు నిలుపుకున్న పల్లె ప్రజలు ఉన్నారు.. ఇప్పుడు అలాంటి కొన్ని మంత్రాల గురించి తెలుసుకుందాము...


1. నారాణీయం (ఇది గురువాయురు కృషుడి గురించి రాసిన వేయి పద్యాల అద్భుతమైన వర్ణన ) ఈ శ్లోకాలు జబ్బుతో ఉన్న వారు కానీ లేక వారి కోసం ఎవరు చదివినా భయంకరమైన  ప్రాణాపాయ జబ్బులు, కాన్సర్, దీర్ఘకాలిక రోగాలు నశించి పోతుంది ఒకసారి ఆ పుస్తకం తెచ్చుకుని ప్రయత్నం చేయండి, కృషుడి పైన పద్యాలు వాటి అర్థాలు ఎంతో భక్తి భావనతో భావోద్వేగాలు కలిగిస్తుంది... చక్కటి ఆరోగ్యం ఆలోచన కలిగిస్తుంది..


2. వైద్యనాద్ స్త్రోత్రం శివయ్య గొప్ప వైద్యుడు కూడా   పురాణ కాలం నుండి వైద్యంకోసం శువుని ఆరాధించే వారు, చర్మ వ్యాధులు ఇన్ఫెక్షన్ తో బాధపడే వారు ప్రదోష కాలంలో ఈ వైద్యనాద్ స్త్రోత్రం, శివ స్త్రోత్రలు పారాయనఁ ప్రతి రోజు చేయాలి, సోమవారం నాడు శివునికి వాయుప్రతిష్ఠ చేసిన లింగానికి వారి చేత్తో అబీషేకం చేయాలి, ఆరుద్ర నక్షత్రం రోజు ప్రదోష కాలం లో మట్టితో శివలింగాన్ని చేసుకుని, బియ్యం పిండి, గంధం, విభూది వీటితో ఒక్కో దానితో ఓం నమః శివాయ అని 108 సార్లు అర్చన చేసి, నైవేద్యం పెట్టి వైద్యనాద్ స్త్రోత్రం పఠించి  హారతి ఇవ్వాలి ,కాసేపు  ధ్యానం చేసి ప్రసాదం భక్తిగా స్వీకరించాలి.. సంకల్పంతో మీకు ఆరోగ్యం ప్రసాదించ మని వేడుకోవాలి, ప్రసాదం తినే టప్పుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుని తినాలి.. తర్వాత మీరు చేసిన మట్టి శివలింగాన్ని ప్రవహిస్తున్న నీటిలో కలపాలి చెరువు అయినా పర్వాలేదు... అలా నిమర్జన చేయడంలోనే మీకు మీ బాధ నుండి చాలా ఉపశమనం లభిస్తుంది.. ఇలా ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు చేస్తూ రావాలి మీకు పూర్తి ఆరోగ్యం లభించాక శివాలయంలో అభేషేకం చేయించండి...


3. చిన్న చిన్న వి తరచూ వచ్చే జ్వరాలు , కీళ్ల నొప్పులు, ఊబకాయం , తిన్నది అరగక పోవడం, ఓల్లుకు పట్టక పోవడం, తరచు నీరసం లాంటి కారణం తెలియని రోగాలు మంచి ఉపాయం హనుమంతుడి గుడి ప్రదర్శన, హనుమాన్ చాలీసా రోజు చదవడం....


4. రాహుకాలం  లో దుర్గ దేవి, సుబ్రహ్మణ్యస్వామి , కళభైరవ స్వామి శ్లోకములు చదువుతూ ఉన్నా అకారణంగా వచ్చే భయాలు, నిద్రలో ఉలిక్కి పడటం, తరచు క్రిందపడటం ఇలాంటి బాధలు ఉండదు,.


5. ఏ ఔషధం సేవిస్తున్న "ఓం నమో భగవతే వాసుదేవాయా " అని సేవిస్తే ఆ మందు మీకు బాగా పనిచేస్తుంది.....


6.మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి ఆలోచన వస్తుంది మంచి జీవితం ఉంటుంది ఎవరికి భారం కాకుండా ప్రాణం పోవాలి చివరి రోజుల్లో... అంటే రోజూ ఐదు తులసి ఆకులు తినండి, కాసేపు తులసికి దగ్గరగా కూర్చింది తులసి మొక్క ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది, రేఖీ, విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే గుణం తులసికి ఉంది , ఇలాగే ఆవు కూడా అవకాసం ఉన్న వారు కాసేపు గోసాలలో గడపండి..

{వైద్యం చేయించు కుంటూ ఇవి పాటిస్తే త్వరగా గుణం ఉంటుంది మానవ ప్రయత్నం మానకూడదు దైవ బలం వదులు కొకూడదు.

                              స్నస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👌