14, సెప్టెంబర్ 2023, గురువారం

యమునా నదీ హర్షము

 



యమునా నదీ హర్షము 

--------------------------------------


మ: ముదితా! యేతటినీ పయః కణములన్ మున్ వేణు వింతయ్యె నా

నది సత్పుత్రుని గన్న తల్లి పగిదిన్ నందంబుతో నేఁడు స

మ్మద హంసధ్వని పాటగా వికచ పద్మశ్రేణి రోమాంచ మై 

యొదవన్ తుంగ తరంగ హస్త నటనోద్యోగంబుఁ గావింప దే!


ఇరువురు గోపికలు పరస్పరం యమునాతీరంలో కృష్ణుని బృందావన విహార సోయగాన్ని చూస్తో మాటలాడిన రీతిగా పోతన వర్ణించినతీరు అనన్య సామాన్యమైనది.


సఖీ చూశావా! తన నీటితో పెరిగి కృష్ణుని చేతికెక్కి భువన మోహనమైన రాగాలను వినిపించుచున్న ఈ వంశిని జూచి ప్రయోజకుడైన కొడుకును జూచి సంబరపడే తల్లివలె హంసనాదములనే పాటతో వికసిత పద్మములను రోమాంచముతో పైకెగసిపడే కెరటములనే హస్తములతో యమున నాట్యం చేస్తున్నది. అని భావం!


పెరిగి పెద్దవాడై ప్రయోజకుడైన కొడుకును చూస్తే యేతల్లికి ఆనందం కలుగదు? అలాంటి ఆనందం యమునకు ఆవంశిని జూస్తే కల్గినదట! ఇంత మొలకగా తనగట్టున మొలచి, తన నీటితో నింతింతై యెదిగి కృష్ణయ్య చేతిలో మురళిగా మారింది. అలామారి యతనిచే పూరిపఁ బడి జగన్మోహనకరమైన రాగా లాపన చేస్తుంటే దానిని చూచి అంతులేని యానందం యమునకు కలుగదా మరి!


ఆనందం కలిగినప్పుడు దానిని రక రకాలుగా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక్కడ యమున హంసధ్వనియే పాటగా( హంసధ్వని రాగంకూడా ఉంది. ఉల్లాసంగా హుషారుగా పాడుకుంటానికి అనువైనది) వికసించిన పద్మ సముదాయమే రోమాంచముగా ( సంతోష సమయంలో శరీరంలోని కేశములు నిక్క బొడచుట రోమాంచము) యెత్తైన కెరటములనే హస్తముల చాలనచే నాట్యం చేసే ప్రయత్నం చేస్తోందట!


రాగ తాళాను గుణ్యముగా నటన మాడుట నాట్యవిధానము. దానికనుగుణ మైన ప్రవృత్తి యమునా నదిలో సాక్షాత్కరింపజేసి పోతన యీ ఘట్టాన్ని అతి మనోహరంగా తీర్చి దిద్దినాడు. వస్తువునకు తగిన ప్రకృతి ప్రకృతకి తగిన వర్ణనము వర్ణనమునకు తగిన భావములు భావములకు తగిన పదములు పదములకు తగిన కూర్పు అందుకు తగిన పద్యములయల్లిక పోతన కవితా విెశిష్టతకు ప్రతీకలు!


ఇంత సుందరమైన సుమధురమైన వర్ణనా సామర్ధ్యము పోతనకు దైవదత్తమైనవరము. అందుచేతనే కాబోలును ఆంధ్రదేశమున పోతన భాగవతమున కున్న ప్రచారము సంస్కృత భారతమునకు కనిపించదు. 

మిత్రులారా! భాగవతం చదవండి! చదివించండి!

                         స్వస్తి!

జ్యోతిష్యాలయం

 శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం

    గురూజీ సహదేవ రాజు సెల్ :9948381552

   ఈ భూప్రపంచం మీద సమస్య లేని వాళ్ళు ఎవరు ఉండరు

   )1విద్య

   2)ఉద్యోగం

   3)వ్యాపారం

   4)భార్య భర్తల మధ్య గొడవలు

   5)పుత్రసంతానం

   6)ప్రేమ సమస్యలు

   7)ఎన్ని సంబంధాలు వచ్చిన పెళ్లి ముడి పడకపోవడ

   8)ధనము కలసి రాకపోవడం

   10)కుటుంబ సమస్యలు

   11)ఆర్థిక సమస్యలు

   13)స్త్రీ వశీకరణం

   14పురుష వశీకరణం

   15)శని దోషం నాగదోషం నరదిష్ఠి

   16)ఇంట్లో మనశాంతి లేకపోవడం మీ కుటుంబంలో దెయ్యాల సమస్యలు ఉంటే చెడు కర్మలు ఉన్నా గురూజీ చక్కటి పరిష్కరం చెప్పగలరు

   ఎదో సరదాగా ఆడుకుందామని :::చేపి చేయొద్దు సమస్య ఉంటే ఫోన్ చేయండి

   సర్వేజన సుఖినోభవంతు

   నమ్మకంతో ఫోన్ చేయండి

   సర్వ సమస్యలకు పరిష్కరం చేయబడును పూజారి లక్ష్మణ్ రాజు

   సెల్ : 9150206445

జ్యోతిష్యం

 ⚜️

   || జ్యోతిష్యం చెప్పబడును ||


మహిషాసురమర్ధిని జ్యోతిష నిలయం 


√నమ్మినవారు దురం కావటం👬


√నిందలూ, అవమానాలు రావటం


√ఇతరులు అపార్థం చేసుకోవడం


√వివాహాం ఆలస్యంగా అవ్వటం👰🤵


√ఉద్యోగం సమస్య 👮


√పిల్లల పుట్టకపోవడం🤱🤰


√వ్యక్తిగత  జతక సమాచారం కోరకు


⚜️[8074538053]⚜️


••••••••ఓం శ్రీ మాత్రే నమః••••••••••


✓వ్యాపార వశీకరణ లేక నష్టం


✓రావల్సిన ఆస్థి, ధనం రాకపోవడం


✓భార్యా భర్తలు మధ్య వశీకరణ👫


✓విద్యా, విదేశి ప్రయణం, ఉద్యొగం 


✓కుటుంబ సభ్యుల  మధ్య విబేధాలు👨‍👩‍👦‍👦


✓అరోగ్య సమస్యలకు 


✓ప్రేమా సమస్యలకు 💏


ఇటువంటి  సమస్యలకూ ప్రత్ర్యకం గా 


చేయబడును ⚜8074538053⚜


🌷ఉన్నదీ వున్నట్లు గా చెప్పబడును🌹⚜8074538053⚜


👉.మీరు అనేక మంది జ్యోతిష్యులను సంప్రదించి నిరాశ చెంది ఉన్నారా అయితే చివరగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి పూర్తి పరిష్కారం లభిస్తుంది దయచేసి టైం పాస్ కోసం సరదా కోసం కాల్ చేయకండి మేము కోరేది కూడా మీ మంచి గురించే..  📲📲[[8074538053]]

జాతకంలో ప్రమాదకర స్థానాలు*

 లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం

శ్రీనివాససిద్ధాంతి9494550355


*జాతకంలో ప్రమాదకర స్థానాలు*


కాలపురుష చక్రంలోని కొన్ని ప్రత్యేకమైన స్థానాలలో కొన్ని గ్రహాలు స్థితి పొంది ఉన్నప్పుడు అది ప్రమాదకరమైన స్థానంగా పరిగణింపబడుతుంది. ఈ స్థానాలలోని గ్రహాల దశ వచ్చినప్పుడు ఆ దశా కాలమంతా చాలా ఇబ్బందులను జాతకుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రమాదకరమైన సంఘటనలు  జరుగుతాయి. ఆ గ్రహం పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది.

ఉదాహరణకు రవి భగవానుడు మేషం లో స్థితి పొందినప్పుడు ప్రమాదకరమైన స్థితి అని చెప్పాలి ఇది రెండు విధాలుగా బాధిస్తుంది. లగ్నంలో రవి ఉన్న కారణంగా లగ్నము బలహీనమైపోతుంది.రవి భగవానునికి స్వక్షేత్రమైన పంచమ స్థానం కూడా రిస్క్ లో పడుతుంది. సాధారణంగా రవి మేషం లో ఉచ్చ స్థితిని పొంది ఉన్నాడు అని భావిస్తాము కానీ ఇది ప్రమాదకరమైన స్థితి. సింహలగ్నంలో పుట్టిన జాతకులకు రవి మేషం లో ఉన్నప్పుడు లగ్నాధిపతి భాగ్య స్థానంలో ఉచ్చ పొందినాడు అనుకుంటాము. కానీ పూర్తి వ్యతిరేక ఫలితాలను రవి భగవానుడు  ఇస్తారు. ఇదేవిధంగా కర్కాటకంలో చంద్రుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తారు. కాలపురుష చక్రం ప్రకారం నాలుగో స్థానం బలహీనమైపోతుంది మరియు ఏదైనా లగ్నంలో జన్మించిన వారికి లగ్నం నుండి కర్కాటకంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆస్థానం కూడా రిస్క్ లో పడుతుంది. ఉదాహరణకు మిధున లగ్న జాతకులకు ద్వితీయంలో చంద్రుడు ఉన్నప్పుడు అత్యధిక ధనం సంపాదిస్తారు అనుకుంటాము కానీ ధన పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరొక గ్రహం కుజుడు ఈ కుజుడు మిధున మరియు కన్యలో ప్రమాదకరమైన స్థితి అని చెప్పాలి. ఏ లగ్న జాతకులకు అయినప్పటికీ లగ్నాత్తు ఈ ప్రమాదకరమైన స్థానాలలో ఆయాగ్రహాలు ఉన్నప్పుడు మరియు కాలపురుష చక్రంలోని స్థానాల ప్రకారం ఆ గ్రహాలు ఉన్నప్పుడు రెండు విధాలుగా జాతకుడిని బాధిస్తుంది. ఆయాగ్రహ దశ కాలంలో జాతకుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాడు. బుధ గ్రహము మకరంలో రిస్క్ ప్లేస్ అని చెప్పవచ్చు కాలపురుష చక్రం ప్రకారం మేషలగ్న జాతకులకు దశమ స్థానంలో బుధుడు శుభ యోగాలను ఇస్తాడు అనుకుంటాము మేష లగ్న జాతకులకు దశమంలో బుధుడు స్థితి పొందినప్పుడు ఆ దశాకాలంలో ఉద్యోగాల లేదా వ్యాపార పరంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితులను చవిచూస్తాడు. గురు భగవానుడు వృషభంలోనూ కుంభం లోనూ ఏదైనా స్థానంలో స్థితి పొందినప్పుడు ఆ దశాకాలంలో ఆస్థానాలు పూర్తిగా దెబ్బతింటాయి. శుక్ర భగవానుడు తులాలగ్నంలో స్థితి పొందినప్పుడు మేష లగ్న జాతకులకైతే వైవాహిక జీవితం దెబ్బతింటుంది. మరియు వారి లగ్నానికి శుక్రుడు ఎన్నో స్థానంలో స్థితి పొందుతున్నాడు ఆ స్థానం కూడా బలహీనమైపోతుంది. శని భగవానుడు వృశ్చికంలోనూ మీనంలోనూ పూర్తి వ్యతిరేక ఫలితాలను ఇస్తారు. వృశ్చికంలో ఉన్నప్పుడు మేష లగ్న జాతకులకు అయితే అత్యంత ప్రమాదాలు కు గురి అవుతారు ప్రాణాపాయ స్థితి కూడా సంభవించవచ్చు. శని భగవానుడు మీనంలో స్థితి పొందినప్పుడు కాలపురుష చక్రం ప్రకారం మరియు లగ్నం ప్రకారం కూడా రెండు స్థానాలు దెబ్బతింటాయి. కుంభ లగ్న జాతకులకు మీనంలోశని భగవానుడు ఉన్నప్పుడు లగ్నాధిపతి ధన స్థానంలో ఉన్నట్టుగా భావించి అత్యధిక ధనాన్ని సంపాదిస్తారు అని భావించరాదు. శని భగవానుని దశాకాలంలో ధనపరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొన్ని గ్రహాలకు రెండు స్థానాల ఆధిపత్యం ఉంటుంది. ఇటువంటి గ్రహాలు పై చెప్పిన స్థానాలలో ఉన్నప్పుడు ఆ స్థానంతో పాటు మిగిలిన రెండు స్థానాలు కూడా బలహీనం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా జాతక పరిశీలన చేసే సమయంలో రవి భగవానుడు ఉచ్చ స్థానంలో ఉన్నారని ,చంద్రుడు కర్కాటకంలో స్వక్షేత్రంలో ఉన్నారని, శుక్రుడు తులలో స్వక్షేత్రంలో ఉన్నారని ఫలితాలు చెప్పే విషయం పై అంశాలను కూడా తీసుకొని జాగ్రత్తగా తెలియజేయవలసి ఉంటుంది.


జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్న, member in international astrology federation. ..శ్రీనివాస సిద్ధాంతి*

*9494550355*


PlZ Forward the message

సద్గుణములు సంపాదించుకోవాలి

 🚩🔯🌸🌄⚛🌅🌸🔯🚩

🌸🌼ಬೆಳಗಿನ 🌅 ಸೂಳ್ನುಡಿ🌼🌸 


*ವಿನಯಂ ತು ಸುತಾನ್ ಸಂತಃ*

*ಸ್ವಸಂಪಾದ್ಯಾಃ ಪುನರ್ಗುಣಾಃ |*

*ಸರ್ವಂ ಕೃಷಾಣಾಂ ಕುರ್ವಂತು*

*ಬೀಜಂ ಸೂತೇಽಂಕುರಂ ಸ್ವತಃ ||*

(ಹರಿಹರ ಸುಭಾಷಿತ)


ಸತ್ಪುರುಷರು ತಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಶಿಕ್ಷಣವನ್ನೀಯುವುದು ಕರ್ತವ್ಯ. ಸದ್ಗುಣಗಳನ್ನು ಮಕ್ಕಳು ತಾವೇ ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಕೃಷಿಕರು ಉಳಿದೆಲ್ಲ ಕೆಲಸಗಳನ್ನೂ ಮಾಡುತ್ತಾರೆ. ಮೊಳಕೆ ಒಡೆಯುವುದು ಬೀಜದಿಂದಲೇ ಆಗಬೇಕಾದ್ದು.


*🌷🌺🙏 ಶುಭದಿನವಾಗಲಿ! 🙏🌺🌷*

తమ పిల్లల కి విద్యా వినయములు నేర్పటం తల్లి తండ్రుల కర్తవ్యం. కానీ సద్గుణములు పిల్లలే సంపాదించుకోవాలి. రైతు పొలాన్ని అన్ని రకములగా సిద్ధం చేయగలడు. కానీ మొలకలు రావటం అనేది బీజమే యొక్క పని

నవగ్రహా పురాణం🪐* . *25వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *25వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*చంద్రగ్రహ జననం - 7*


ఆశ్రమంలోకి వచ్చిన అనసూయను త్రిమూర్తులు ఆనందంగా చూశారు. అత్రి మొహంలో సంతోషం నాట్యం చేస్తోంది.


*"అనసూయా ! ఆడిన మాట నెరవేర్చి , మాకు ఆనందం కలిగించావు. మా మాటను మేమూ పాటిస్తాం. కోరిన వరాలు కొంగులో వేయాలన్నావుగా. కోరుకో !"* చిరునవ్వుతో అన్నారు.


*"అలాగే స్వామీ ! నాకు మూడు వరాలు కావాలి. మొదటి వరంగా - శీలవతి భర్త పునర్జీవితుడు కావాలి. ఆ ఉగ్రశ్రవుడు కుష్టురోగ విముక్తుడై యవ్వనవంతుడిగా , శీలవతికి అనుకూల పతిగా మారాలి. వెంటనే ఈ రెండు వరాలూ...” "ప్రసాదించాం ! మూడో వరం కోరుకో , సాధ్వీ !"* విష్ణువు అన్నాడు.


*"మాత అనసూయ పతివ్రతే కాదు. పరిణత మనస్కురాలు !"* ఇంద్రుడు మెచ్చుకున్నాడు.


అనసూయ కొంచెం ముందుకి జరిగింది. తన చీర కొంగును రెండు చేతుల్లోకి విడదీసి పట్టుకొంది. ఆమె విశాల నేత్రాలు తడిగా మెరుస్తున్నాయి. బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులను ఆమె తదేకంగా చూస్తోంది.


*"వరం కోరుకో అనసూయా !"* బ్రహ్మ ఆమెను హెచ్చరించాడు. 


*"మీరు ముగ్గురూ నా కుమారులుగా , నా గర్భవాసాన విడిది చేసి , జన్మించాలి..." విష్ణువు అర్ధం కానట్టు చిరునవ్వు నవ్వాడు. "ఎవరు ముగ్గురూ , అనసూయా ! పేరు పేరునా వివరంగా చెప్పు !".*


*"మీరే స్వామీ... బ్రహ్మ విష్ణు మహేశ్వరులు !"*


త్రిమూర్తులు ఒకర్నొకరు క్షణకాలం చూసుకొన్నారు.


*“తథాస్తు !"* త్రిమూర్తులు ఒకేసారి , ఒకే కంఠంతో అన్నారు.


*"ధన్యురాలిని స్వామీ !"* అనసూయ చేతులు జోడిస్తూ అంది. నిలువెల్లా ఆవరించిన ఏదో ఉద్రేకంతో వణికిపోతున్న అత్రి మహర్షి అనసూయ సమీపానికి జరిగి , మంత్రముగ్ధుడిలా ఉండిపోయాడు.


*"అనసూయా ! నీ ప్రార్ధన ప్రకారం - ప్రథమ పుత్రుడుగా బ్రహ్మ , ద్వితీయుడుగా నేను , తృతీయుడుగా పరమేశ్వరుడూ నీ గర్భాన నీ పుత్రులుగా జన్మించి , నీ లోగిలిలో ఆడుకుంటాం !"* విష్ణువు నవ్వుతూ అన్నాడు. 


అనసూయ మౌనంగా చూస్తోంది. ఆమె విశాల నేత్రాలు ఆనందబాష్పాల్ని వర్షిస్తున్నాయి.


*"అత్రీ ! మీ దంపతులు అదృష్టవంతులు. అంతరిక్షంలో సూక్ష్మరూపంలో ఉన్న చంద్రుడు , సశరీరంగా మీ పుత్రుడుగా జన్మిస్తాడు. ఆ చంద్రుడు మరెవరో కాదు. సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడే !*


తదనంతరం నేను దత్త నామ ధేయంతో జన్మిస్తాను. అత్రి పుత్రుడైన కారణంగా 'దత్తాత్రేయుడు'గా ప్రసిద్ధుడవుతాను...


ఆ తరువాత మీ తృతీయ పుత్రుడుగా పరమశివుడు 'దుర్వాసుడు'గా అవతరిస్తాడు !" 


*"మా జన్మలు ధన్యమైనాయి !"* అత్రి కంఠం వణికింది.


బ్రహ్మ తన మానస పుత్రుడైన అత్రిని చిరునవ్వుతో ప్రత్యేకించి చూశాడు. 


*"కుమారా , అత్రీ ! శుభఘడియలలో నీ తేజస్సును యజ్ఞకుండలిలో హవిస్సులాగా అనసూయ గర్భంలో నిక్షేపించు !"*


*"ఆజ్ఞ !"* అత్రి నమస్కరిస్తూ అన్నాడు. అనసూయ నమస్కరించింది. 


*"ఇష్టకామ్యార్ధసిద్ధిరస్తు !"* అన్నాడు దీవిస్తూ.


*"తథాస్తు !"* అన్నారు శివుడూ , విష్ణువూ , ఇంద్రుడూ , నారదుడూ. నమస్కరించిన అత్రి అనసూయలు రెప్పలెత్తి చూశారు. త్రిమూర్తులూ , ఇంద్రుడూ , నారదుడు లేరు!


అత్రి అనసూయ మొహంలోకి పారవశ్యంతో చూశాడు.


*"అనసూయా , నీ జన్మ ధన్యం ! నీ చరిత్ర శాశ్వతం ! త్రిమూర్తుల్ని ఆడిస్తాను అన్నప్పుడు నీ మాట నాకు అర్థం కాలేదు ! అలా ఎందుకన్నావో ఇప్పుడు అర్థమైంది ! నువ్వే కాదు , నీ పెనిమిటి అత్రి కూడా త్రిమూర్తుల్ని వొడిలో ఆడిస్తాడు సుమా !"* అనసూయ ఆనందాశ్రువుల్ని తుడుచుకుంటూ నవ్వింది.


*"అమ్మా !"* ఆశ్రమం వెలుపలి నుంచి వినిపించింది పిలుపు. అనసూయా , అత్రీ గుమ్మం వైపు చూశారు. శీలవతీ , ఆమెతో పాటు అందగాడైన యువకుడు వస్తున్నారు.


*"అమ్మా... అమ్మా... నా భర్తకు పునర్జన్మ సిద్ధించింది. నా భర్త వ్యాధీ , వృద్ధాప్యమూ మాయమైపోయాయి. అంతా మీ ఆశీర్వచన మహిమే అమ్మా !”* భర్త చెయ్యి పట్టుకున్న శీలవతి ఆనందంగా అంది అనసూయతో.


*"అది నా మహిమ కాదు , శీలవతీ ! త్రిమూర్తుల దయ , నీ అదృష్టం !"* అనసూయ అంది.


*"మాతా ! మీ దయతో , నా సతీమణి మహిమతో నాకు పునర్జన్మ దక్కింది. మమ్మల్ని దీవించండి !"* అందంతో , యవ్వనంతో కళకళలాడుతున్న ఉగ్రశ్రవుడు కృతజ్ఞతా పూర్వకంగా అంటూ , అత్రి , అనసూయల ముందు మోకరిల్లాడు. శీలవతి కూడా ఆ ఇద్దరికీ పాదాభివందనం చేసింది.


*“నాయనా ! శీలవతి నీకోసం ఇన్నాళ్ళూ అష్టకష్టాలు అనుభవించింది. ఇక మీదట ఆమెను ఇష్టసుఖాలలో వోలలాడించే బాధ్యత నీదే !"* అనసూయ ఉగ్రశ్రవుడితో అంది. 


*“అవున్నాయనా !” అత్రి ఉగ్రశ్రవుడితో అన్నాడు. సతి పతిని ఆరాధనతో సేవిస్తుంది. పతి సతిని అనురాగంతో దీవించాలి !"*


*"మా దంపతులిద్దరికీ , మీ దంపతులిద్దరే ఆదర్శం !"* అన్నాడు ఉగ్రశ్రవుడు. శీలవతి చిరునవ్వుతో చూసింది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 46🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 46🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*తిరుమల భూవరాహ స్వామి ఆలయం*


తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీవరాహ స్వామి ఆలయం ఉంది. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.


వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందు న వరాహస్వామికి తొలిదర్షనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ రాగిరేకుని నేటికీ  హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని దర్షించక పోతే యాత్రా ఫలం దక్కదు అని చెపుతారు.


*తిరుమల వరదరాజ స్వామి ఆలయం:*


వెండి వాకిలి దాటగానే ఎడమవైపునవున్న చిన్న అరలాంటి గుడే వరదరాజ స్వామి వారి గుడి. ముష్కురుల(మహ్మదీయుల)దాడి సమయంలో కంచి వరదరాజ స్వామి వారి ఉత్సవవిగ్రహం కొన్నిరోజులు ఇక్కడ దాచి పరిస్థితులు చక్కబడ్డాకా తిరిగి కంచి తీసుకొని వెళ్ళిపోయారు. తరువాత ఆ స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈయన వేంకటేశ్వరుని ఆరుగురు అన్నగార్లలో ఒకరని జనపదులలో ఒక నానుడి.


*తిరుమల యోగనరసింహ స్వామి ఆలయం:*


ఈయన గుడి ప్రధానాలయాని కి ఈశాన్య దిక్కున వుంటుంది. పురాతనమైనది ఈ విగ్రహం రామానుజుల కాలం లో దొరికితే రామానుజులవారు ' గ్రామంలో సర్వదేవతలూ ప్రధాన దైవానికి అభిముఖం గా వుండాలన్న' ఆగమోక్తి ననుసరించి, నరసింహుని ఉగ్రరూపం తగ్గించడానికనీ తిరుమల ఆలయం లో రెండవ ప్రాకారం లో స్వామికి ఈశాన్య దిక్కున పశ్చిమాభిముఖంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.


 *గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా;* 

 *గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా,*


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 38*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 38*


*శ్రీరామకృష్ణ నరేంద్రుల సంబంధం*


శ్రీరామకృష్ణుల ఆక్రందన ప్రకృతి అంతటా మౌనంగా ప్రతిధ్వనించింది.  కాల ఆవశ్యకతను ఎరిగిన  కాళికాదేవి ఒకరి తరువాత ఒకరిగా శిష్యులను పంపసాగింది. కాని ఎవరైనా 'ఆ ' ఒక్కరి'కి సాటి అవుతారా? తానే స్వయంగా వెళ్లి మౌన తపం నుండి తోడ్కొని వచ్చిన ఋషి కాగలరా? ఆతడు ఇంకా రాలేదే అని శ్రీరామకృష్ణులు పరితపించారు. ఆ ఋషియైన నరేంద్రుడు ఏతెంచాడు. ఇక తమ సందేశ బీజాలను అతడి మీద చిలకరించాలి. ఆ ప్రయత్నంలో ఆయన  నిమగ్నమయ్యారు.


నరేంద్రుణ్ణి చూడగానే, "ఇతడు నా కుమారుడు, మిత్రుడు, నా ఆదేశాన్ని శిరసావహించడానికి జన్మించినవాడు, ఎన్నటికీ విడివడని ప్రేమపాశంతో నాతో పాటు అల్లుకుపోయినవాడు" అని శ్రీరామకృష్ణులు గుర్తించారు. శతాబ్దాలుగా సనాతన ధర్మానికి పట్టిన మలినాన్ని తొలగించి, దానిని కాలానుగుణ్యమైన ఒక జీవన విధానంగా మార్చి, సత్యయుగాన్ని స్థాపించే మహత్కార్యం జగజ్జనని తమకు అప్పగించింది; ఆ కార్యంలో తోడ్పడడానికే నరేంద్రుడు జన్మించాడని ఆయనకు దివ్యదర్శనాల ద్వారా తెలియవచ్చింది. ఆ నిజాన్ని ఆయన తన పరిశోధనల మూలంగా ధ్రువీకరించుకొన్నారు. తదనంతరం ఎనలేని ఆప్యాయతతోనూ, విశ్వాసంతోనూ నరేంద్రుడితో శాశ్వత బంధం ఏర్పరచుకున్నారు.


ఆ తరువాత నరేంద్రునికి అనేక రీతుల్లో శిక్షణనిచ్చి, ఆ ఉన్నత లక్ష్యసాధనకి ఉపయోగపడే పరికరంగా అతణ్ణి రూపొందించారు. శిక్షణ పూర్తయి, సంసిద్ధంగా ఉన్న నరేంద్రునికి సత్యయుగ స్థాపన మహత్కార్యంలో ఎలా పాలుపంచుకోవాలో ఉపదేశించారు. పిదప ఆ కార్యాన్నీ, బాధ్యతనూ అతడికి అప్పగించారు.


శ్రీరామకృష్ణ - నరేంద్రుల ప్రథమ సమావేశానంతరం శ్రీరామకృష్ణులు దాదాపు ఐదేండ్లు జీవించారు. ప్రారంభంలో నరేంద్రుడు ప్రతి వారమూ ఒకటి  రెండుసార్లు దక్షిణేశ్వరానికి తప్పక వెళ్లేవాడు. కొన్ని సమయాల్లో రాత్రుళ్లు కూడా అతడు అక్కడే బసచేయడం కద్దు. వరుసగా కొన్ని రోజులు అతడు దక్షిణేశ్వరానికి పోకపోతే శ్రీరామకృష్ణులు తీవ్ర ఆందోళనకు గురయ్యేవారు. వచ్చేపోయేవారందరినీ నరేంద్రుణ్ణి గురించి వాకబు చేసేవారు, అతణ్ణి దక్షిణేశ్వరానికి రమ్మని చెప్పమనేవారు; విలపిస్తూ జగజ్జననిని ప్రార్థించేవారు. రాత్రిళ్లు నిద్ర మానుకొని అతణ్ణి గురించి ఆలోచించేవారు. "శ్రీరామకృష్ణులకు నా పట్ల గల ప్రేమే నన్ను ఆయనతో పెనవేసింది" అని కాలాంతరంలో నరేంద్రుడు చెప్పడం కద్దు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 21*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 21*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


 *తటిల్లేఖా తన్వీం తపనశశి వైశ్వానరమయీం*

           *నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్ |*

           *మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా*

           *మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాద లహరీమ్ ||*


ఈ శ్లోకం కుండలినీ ధ్యానం గురించి చెప్తున్నది. మూలాధారం నుండి సహస్రారం వరకు చైతన్య లత/ తేజోలత ప్రయాణిస్తున్న అనుభూతిని గురించి చెప్తున్నారు.


తటిల్లేఖా తన్వీం = తనువులో ఒక మెరుపు తీగ వలె


తపన శశి వైశ్వానరమయీం = సూర్య చంద్రాగ్నులమయమైన ఒక తేజస్సును 


మహాపద్మాటవ్యాం = అమ్మవారి స్థానమైన మహాపద్మాటవి  అనగా ఇక్కడ సహస్రార కమలంలో


నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్ = ఆరు కమలాలు (షట్చక్రములు) దాటిన తరువాత వచ్చే మహా కమలం (సహస్రార పద్మం) లో నీ కళను (చంద్రకళ, షోడశి కళ)


మృదితమలమాయేన మనసా = స్వచ్ఛమైన, నిర్మలమైన మనసు కల


మహాంతః పశ్యంతో = మహాత్ములైన యోగులు దర్శిస్తున్నారు 


పరమాహ్లాద లహరీమ్ = బ్రహ్మానంద లహరిని అనుభవిస్తున్నారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సందేహం తొలగిపోయింది

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*కైలాసము వైకుంఠము మనకు ఎంత దూరంలో ఉన్నాయి! "కైలాసం చేతికందే దూరంలోనూ, వైకుంఠము పిలుపుకందే దూరములోనూ ఉన్నాయి” అని మీకు తెలుసా*


మనిషిని సన్మార్గం వైపు నడిపించేది, క్రమ శిక్షణ, జీవితాన్ని ప్రసాదించేది దేవుడు. ఆ దేవుడు మీద ఉన్న భక్తి మనిషిలో ఎంతో గొప్ప పరిణితి తీసుకొస్తుంది. అయితే ఈ కాలంలో ఎంతో మంది నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు గుడిలో ఉన్నాడని అనుకుంటారు. మరికొంద రు ఆ శివ, విష్ణువులను వారి వారి లోకాలు, నివాస ప్రాంతాలైన కైలాసం, వైకుంఠంలో వారున్నారని చెబుతుంటారు. మన భక్తి, మన పిలుపు అంత దూరం చేరాలి కదా అని అంటుంటారు చాలామంది. 


కానీ ఆ భగవంతుడికి భక్తుడికి మధ్య దూరం ఎంత?? ఆ భగవంతుడు నివసించే లోకాల కు, భక్తుడి పిలుపుకు మధ్య ఆంతర్యం ఎంత?? ఈ విషయాన్ని వివరించే ఓ ఉదాహరణ..



ఒక గురువు తన చుట్టూ కూర్చున్న శిష్యులను చూస్తూ “ఇక్కడ నుండి కైలాసం ఎంత దూరం? వైకుంఠం ఎంత దూరం?” అని ప్రశ్నించాడు.


శిష్యులందరూ వెంటనే తమ బుద్ధికుశలతను ఉపయోగించి శాస్త్రప్రమాణములను సంగ్రహించి లెక్కలువేయడం మొదలుపెట్టా రు.


అప్పుడు ఆ గురువు తన శిష్యుల అతి ఉత్సాహాన్ని చూసి చిరునవ్వుతో.. 


“కైలాసం చేతికందే దూరంలోనూ, వైకుంఠము పిలుపుకందే దూరములోనూ ఉన్నాయి” అని చెప్పాడు. 


శిష్యులు తమ గురువు మాటలు విని నివ్వెరపోయారు. "అదెలా గురుదేవా!! విషయం వివరంగా చెప్పండి" అని అడిగారు.  


“యమధర్మరాజు మార్కండేయుని ప్రాణాలను హరించడానికి వచ్చినప్పుడు అతడు శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు కైలాసం నుండి శివుడు వచ్చి యమధర్మ రాజును శిక్షించి, మార్కండేయుణ్ణి రక్షించాడు. అంటే కైలాసం చేతికి అందినంత దూరంలో ఉన్నట్లే కదా! అదేవిధంగా తటాకములో మొసలి నోటికి పట్టుబడిన గజేంద్రుడు ఎలుగెత్తి 'నారాయణా' అని పిలిచాడు. వైకుంఠంలో ఉన్న ఆ శ్రీహరి వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి గజేంద్రుణ్ణి రక్షించాడు. ఆర్తితో పిలిచిన భక్తుని పిలుపు వైకుంఠానికి వినబడిందంటే, మరి వైకుంఠం పిలుపు వినిపించే అంత దూరంలో ఉన్నట్లే కదా!” అని వివరించాడు గురువు.


గురువు మాటలు విన్న శిష్యులకు సందేహం తొలగిపోయింది. భగవంతుడిని ఆర్థిగా, భక్తితో, విశ్వాసంతో పిలిస్తే తప్పకుండా పలుకుతాడని ఎక్కడెక్కడికో శ్రమకోర్చి వెళ్ళవలసిన పని లేదని వారు అర్థం చేసుకున్నారు.


సేకరణ:- వాట్సాప్ పోస్ట్

House for sale for rd 43 lakh

House for sale 

Video call bell

Video call bell 

Sofa mechanism

Sofa technology 

అమావాస్య నోము

 అనగనగా ఒక బ్రాహ్మణునకు ఏడుగురు కొడుకులు, ఏడుగురు కోడళ్ళు కలరు.ఆ ఏడుగురు కోడళ్ళు పోలాల అమావాస్య నోము నోచుకుందామని ప్రయత్నం చేసుకున్నారు.అంతలో ఆఖరి కోడలికి అమావాస్య రోజున ఒకపిల్ల చచ్చిపోయెను.ఆ కారణంగా ఆ సంవత్సరం అందరూ నోము నోచుకోవడం మానేసారు.అది మొదలు ప్రతి సంవత్సరం వీళ్లంతా నోము నోచుకుందామని ప్రయత్నం చేసుకోవడం, అమావాస్య వచ్చేసరికి ఆఖరి కోడలికి పుట్టిన పిల్ల చచ్చిపోవడం జరుగుతుండటం వల్ల ఆ ఏడుగురు కోడళ్ళకి ఆ నోము పట్టడానికి వీలు లేకపోయింది.ఇలా ఏడేళ్ళు గడచిన తరువాత, "ఏటేటా ఈ ఆఖరుదానికి పిల్లలు పుట్ట, చావ " అని తిట్టుకుంటూ మిగతా కోడళ్ళు ఆ నోము నోచుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేసుకున్నారు.అమావాస్య వచ్చేసరికి ఆఖరి కోడలికి పుట్టిన పిల్ల మళ్ళీ చచ్చిపోవడంతో అంతా తనని తిట్టిపోస్తారని, చనిపోయిన ఆ పిల్లని ఇంటిలో పెట్టి తాళం వేసుకుని చివరికోడలు అందరి తోడికోడళ్ళ ఇంటికి వెళ్ళి అందరికీ తలా ఒక పనిలో సాయం చేసింది.తరువాత ఒకరి ఇంటిలో తలంటి నీళ్ళు పోసుకుని, మరొకరి ఇంట్లోనుండి పిండి, పప్పు మొదలైనవి తెచ్చుకుని ఇంటికొచ్చి చచ్చిన ఆ పిల్లని ఇంట్లో పెట్టుకునే తాను కూడా ఆ నోము నోచుకుంది.ఆ రాత్రిదాకా ఉండి చీకటిలో చచ్చిన పిల్లని భుజం మీద వేసుకుని పోలేరమ్మ గుడి వద్దకి వెళ్ళి ఆ పిల్లని అక్కడ పడుకోబెట్టి ఏడ్వసాగింది.ఇంతలో గ్రామ సంచారానికి వెళ్లిన అమ్మవారు గుడి వద్దకు వచ్చి, ఏడుస్తున్న ఆ స్త్రీని చూసి ఎందుకేడుస్తున్నావని ప్రశ్నించింది.అందుకు ఆ స్త్రీ, "ఏడేళ్ళనుండీ ఏడుగురు పిలల్లని ఈ అమ్మవారికి అప్పగిస్తున్నాను.ఈ ఏడు కూడా ఈ పిల్ల చచ్చిపోయింది.తోడికోడళ్ళు తిడతారని ఈ చనిపోయిన పిల్లని ప్రొద్దుటినుండీ దాచి ఇప్పుడు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టి ఏడుస్తున్నాను" అని సమాధానమిచ్చింది.


అప్పుడు అమ్మవారు కరుణించి, "నీ పిల్లలకి మరేమీ భయం లేదు.నేను తీసుకుని వచ్చి ఇస్తాను!" అని చెప్పి అక్షింతలు ఆ స్త్రీ చేతిలో పోసి, "నువ్వు నీ పిల్లలని పాతిపెట్టినచోటుకి వెళ్ళి వాళ్ళని పిలువు!" అని చెప్పెను.


ఆ స్త్రీ ఆ అక్షింతలని చేతిలో వేసుకుని, "అందెలాడ రారా!మువ్వలాడ రారా!" అని వరుసగా ఏడుగురిని పిలవగానే అందరూ వరసగా లేచి వచ్చిరి.సంతోషముతో ఆ పిల్లలందరినీ తీసుకొని ఆ స్త్రీ ఇంటికి వెళ్ళింది.


తెల్లవారిన తర్వాత అందరూ ఈ పిల్లలని చూసి వీరెక్కడినుండి వచ్చారని ఆమెని అడిగారు.పోలేరమ్మ దయవలన ఆ పిల్లలు బ్రతికికి వచ్చారని ఆ స్త్రీ వారితో చెప్పింది.అప్పటినుండి ప్రతి సంవత్సరం అందరూ ఈ అమావాస్యకు తప్పకుండా నోము నోచుకుని ఈ కథ చెప్పి అక్షింతలు వేసుకోసాగారు.అందుకు అమ్మవారు సంతోషించి సంతానము లేనివారికి సంతానమిచ్చి,సంతానము కలవారికి కడుపు చలవ ఇచ్చి రక్షించుచుండెను.


దీనికి ఉద్యాపనము లేదు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

మన సంస్కృతిని

 *ఎవరో కాదు, మన సంస్కృతిని మనమే చిన్న బుచ్చుకుంటున్నా మెమో,......ఆలోచించండి.*

         **********


🙏ప్రతి ఒక్క భక్తుడు చదవాల్సిన సంధేశం! 


వినాయక చవితి సందర్భంగా మీకు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ?


1) ఈద్ రోజున మసీదు ముందు ముస్లింలు మద్యం మత్తులో అసభ్యకరమైన పాటలతో నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా?


2) ఏసుక్రీస్తు ముందు శాంతాబాయి పాటకు క్రైస్తవులు నృత్యం చేయడం మీరెప్పుడైనా చూశారా?


3) జైన మతస్థులు తమ దేవుడి ముందు ఆలా బాబూరావు పాట పాడుతూ నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా?


4) ఈ సమాజాలన్నీ ఎంతో చిత్తశుద్ధితో తమ సొంత ప్రయోజనాలను గౌరవిస్తాయి.  ఎందుకంటే వారు తమ సంస్కృతి కోసం తమ మతాన్ని కాపాడుకోవాలి.


5) అలాంటప్పుడు మన హిందూ మతానికి చెందిన దేవుడి ముందు మత్తులో అసభ్యకరమైన పాటలకు DJ పెట్టి ఈ అసభ్య నృత్యం ఎందుకు?


6) ఈ కళంకం మన హిందూ సమాజంపై ఎందుకు విధించబడింది లేదా మనమే ఆలా చేస్తున్నామా ??.


7) డీజేలపై అసభ్యకరమైన పాటలు పెట్టి మనకు ఇష్టమైన, మన సనాతన సంస్కృతిని అవమానిస్తున్నాం.


మన  పండుగలు చాలా ఉత్సాహంగా మరియు పెద్ద ఎత్తున జరుపుకోవాలి, కానీ సాంప్రదాయ సంగీత వాయిద్యాలు, డ్రమ్స్, మజీరో, షానాయి, సాంప్రదాయ దుస్తులు మరియు తలపాగా యొక్క వైభవం ప్రతి హిందువుల పండుగలో కనిపించాలి.


9) అప్పుడే మన సనాతన సంస్కృతి నిలబడుతుంది.  చూడండి, మీ గురించి ఆలోచించండి మరియు ఇతరుల గురించి కూడా ఆలోచించడం ప్రారంభించండి.


10) వాళ్ళు కూడా సినిమాలు చూస్తారు కదా?  కానీ వారు తమ మతపరమైన కార్యక్రమంలో అలాంటి దుబారా చేయరు.


11) ఇప్పుడు గణేశోత్సవం, దశహర, నవరాత్రుల సమయంలో గుర్తుంచుకోండి మరియు ఎవరైనా ఇలా చేస్తే, అతనికి వివరించండి.


12) బదులుగా,  హిందూ భక్తి పాటలు మరియు భజన కార్యక్రమాలు, మహిళలతో సామూహిక కుంకుమ అర్చన కార్యక్రమాలు, సంగీతం ఆధారంగా శ్లోకాలు పెట్టండి.


13) అదేవిధంగా హిందువులలో ఐక్యమత్యం పెరిగే అంశాలపై మహాభారత భగవద్గీత రామాయణం వంటి కార్యక్రమాలు నిర్వహించి హిందూ సమాజంలో సనాతన ధర్మంపై అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించండి.


14) మండపాల దగ్గర సభ్య సమాజం తలదించుకునే విధంగా అశ్లీల కార్యక్రమాలు పాటలు నిర్వహించకుండా సనాతన ధర్మాన్ని కాపాడండి.


15) ముఖ్యంగా హిందువులకు, మరియు హిందూ ధర్మ రక్షకులకు, సంఘసంస్కర్తలకు, మరియు హిందూ సంఘాల పెద్దలు, 

హిందూ నాయకులు, మరియు కార్యక్రమం నిర్వాహకులకు,

ప్రతి ఒక్కరు కూడా పైన చెప్పబడిన అంశాలను  పాటిస్తారని 

మా యొక్క విన్నపం.


చదవడం అయిపోయిందిగదా ..తప్పకుండ షేర్ చెయ్యండి 


ధన్యవాదాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽