28, సెప్టెంబర్ 2023, గురువారం

ఏ సమస్య గొప్పది కాదు

 83) మన శరీరం లో ఉన్న శక్తి కన్నా ఏ సమస్య గొప్పది కాదు

[84)మనిషికి ఏదైనా సమస్య వస్తే నేను గెలవాలి సమస్య ఓడిపోవాలి ఆ విధంగా మనం సాధన చేయాలి సమస్యకె భయం పుట్టాలి

[85)మొదటి దేహశుద్ధి రెండోది భావ శుద్ధి మూడోది ఆత్మ శుద్ధి అవుతుంది అప్పుడు లక్ష్యానికి వెళ్తారు ఇది సత్యం

[86)దేవుని ఫలితాలు అడిగేది భోగి దేవునే అడిగేది యోగి

87)-ప్రపంచాన్ని పట్టుకుని వేలాడుతున్నవు కానీ, విశ్వనాధుని పట్టుకుని విశ్వంలో తిరుగు

బ్రహ్మాండం ఆకారం

 

బ్రహ్మాండం ఆకారం, శివలింగం ఆకారం రెండు ఒకేలా ఉండడం మీరు ఇక్కడ గమనించవచ్చు.


పూర్వం మునులు, తపస్విలు, ఋషులు మన శాస్త్రాలలో ఏ విషయాన్ని వేల సంవత్సరాలకు పూర్వమే తెలియ చెప్పారు


బ్రహ్మాండమే శివలింగం.

సమస్త బ్రహ్మాండమే శివస్వరూపం.

శివ లింగానికి ప్రదక్షిణ చేయడం సమస్త లోకాలను ప్రదక్షించడంతో సమానం.

శివ లింగాన్ని అభిషేకం చేయడం సమస్త బ్రహ్మాండాన్ని సేవించడంతో సమానం అని.


విఘ్నేశ్వరుడూ కూడా శివ పార్వతులను ముమ్మారు ప్రదక్షిణ చేయడం వల్లనే గణాధిపతి/విఘ్నాధిపతి అయ్యాడు.


‘లిం’ అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నదానిని,

‘గం’ అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంటుంది.

అందుకే అది లింగమైంది.

ఈ సృష్టి సమస్తం శివమయం.


- oఓo నమః శివాయ -


- సర్వం శివమయం జగత్

కోపంగా ఉన్న వ్యక్తికి

 శ్లోకం:☝️

*వాచావాచ్యం ప్రకుపితో*

  *న విజానాతి కర్హిచిత్ ।*

*నాకార్యమస్తి క్రుద్ధస్య*

  *నావాచ్యం విద్యతే క్వచిత్ ॥*


భావం: కోపంగా ఉన్న వ్యక్తికి తాను ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు అనే విచక్షణ ఉండదు. అలాగే కోపంతో ఉన్న వ్యక్తికి చేయకూడనిది మరియు చెప్పకూడనిది లేదు. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి.

పంచాంగం 28.09.2023 Thursday,

 ఈ రోజు పంచాంగం 28.09.2023  Thursday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: చతుర్థశి తిధి బృహస్పతి వాసర: పూర్వాభాద్ర నక్షత్రం గండ యోగ: గరజి తదుపరి వణిజ తదుపరి భద్ర కరణం ఇది ఈరోజు పంచాంగం.

చతుర్థశి సాయంత్రం 06:50 వరకు.

పూర్వాభాద్ర రాత్రి 01:48 వరకు.

సూర్యోదయం : 06:09

సూర్యాస్తమయం : 06:04

వర్జ్యం : పగలు 10:09 నుండి 11:35 వరకు.

దుర్ముహూర్తం : పగలు 10:07 నుండి 10:55 వరకు తిరిగి మధ్యాహ్నం 02:53 నుండి 03:41 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం : ఉదయం 06:00 నుండి 07:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

సాధన

 卐///  _*సాధన*_  ///卐



సాధన వల్ల మూలాధారం నుండి పుట్టిన కుండలినీ శక్తి సుఘమ్న ద్వారా ఎగబాకి, చక్రాలనే గ్రంథులను దాటి సహస్రారాన్ని చేరుతుంది. సహస్రారమంటే లౌకికంగా మెదడు. దీని వెలుగు గాలి రూపంలో వేగు చుక్కలాగ జ్ఞానాన్ని సూచిస్తున్నదని సారాంశం. ఇదే యోగుల అనుభవం. కుండలిని అంటే మూలాధారంలో ఉండే బిందు రూపమైన చైతన్య శక్తి.


    ఇది ప్రాణాధారమైన తేజోరూపం. బిందువు అంటే విభజనకు అందని సూక్ష్మాతి సూక్ష్మమైన గుర్తు (చుక్క, పాయింట్). జ్ఞాన యోగంలో పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి అనుసరించదగ్గ విధానం ఈ పద్యంలో వివరించబడింది.

    ఆత్మసాక్షాత్కారాన్ని సాధించే మార్గమన్నమాట. జ్ఞానమంటే యధార్థాన్ని తెలుసుకోవటానికి జాగృతమైన చైతన్యం. ఇది స్వయం ప్రకాశకం.

అనంత పద్మనాభ వ్రతం*

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*నేడు అనంత పద్మనాభ వ్రతం*


అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశినాడు జరుపుకొనే వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం. ఇది హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనదని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడటానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తోంది.


ఎంతో పూర్వ కాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనిలో కనిపిస్తుండటం విశేషం. పాండవులు వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అనంతపద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్లచతుర్దశినాడు చేయమని చెప్పాడట. అనంతుడన్నా, అనంతపద్మనాభస్వామి అన్నా సాక్షాత్తూ కాలమే అన్నాడు. యుగ, సంవత్సర, మాస తదితర కాలం అంతా తన స్వరూపమన్నాడు. అనంతపద్మనాభుడంటే కాల స్వరూపుడైన వైకుంఠవాసుడి అవతారమే శ్రీకృష్ణుడు. పాల కడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల-కౌండిన్య దంపతుల సకల సంపదలు, సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి


ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకొని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజించటం కనిపిస్తుంది. వ్రత సంబంధమైన పూజను గమనిస్తే అనంతపద్మనాభ అవతారం కళ్ల ముందు మెదలాడుతుంది. వ్రతాచరణ కోసం పిండితో ఏడు పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేసి పూజించటం కనిపిస్తుంది. దర్భలతో చేసిన పామును మూతపెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు. ఈ మొత్తంలోనూ శేషశయనుడి రూప భావన కనిపిస్తుంది. వ్రతంలో ఉంచటం కోసం సిద్ధం చేసుకొన్న కలశంలో పవిత్ర జలాలను ఉంచుతారు. ఆ నీటిలో కొద్దిగా పాలు, ఒక పోకచెక్క, ఓ వెండి నాణెం వేస్తుంటారు. కలశంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తుంటారు. అనంతపద్మనాభస్వామి పూజలో పద్నాలుగు సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. పద్నాలుగు లోకాలను ఏలే ఆ స్వామి పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి పద్నాలుగులో సగమైన ఏడు సంఖ్యలో పడగలను పెట్టడం, పద్నాలుగుకు రెండింతలైన ఇరవై ఎనిమిది సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి పద్నాలుగేళ్ల కొకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంది. ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి 14 ముడులుంటాయి. మరి కొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు, పిండి వంటలు, పూజ కోసం పత్రిని వాడుతుంటారు. ఇదంతా ఏడేడు పద్నాలుగు లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపుడిని తలచుకోవటం కోసమే.


ఈ వ్రతంలో కలశాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడి సాయంతో చేసుకోవటం మేలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసముంటుంటారు.


వ్రతానికి సంబంధించి కథను పరిశీలిస్తే అంతా సత్యం, ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్యధర్మాలను అనుసరించేవారు దైవకృపకు పాత్రులవుతారని, వాటిని విస్మరించినవారు జన్మజన్మలకూ కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక కనిపిస్తుంది. తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని, ఇంటికి వెళ్లి తన లేగదూడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకొని పులి దగ్గరకు వెళ్లి సత్యవ్రతాచరణను చాటిన కథను ఈ వ్రత సందర్భంగా చెప్పుకొంటుంటారు. ఆనాడు ఆ ఆవు తన ప్రాణాల కన్నా సత్యమే మిన్న అని భావించింది. తన లేగదూడకు కడుపునిండా పాలుపట్టి ధర్మాన్ని బోధించింది. అలాంటి దర్శ జీవన విధానాన్ని ఈ వ్రత సందర్భంగా తలచుకుంటారు.

దినఫలం నేటి (28-09-2023)ఫలితాలు

 🌸     _*దినఫలం*_     🌸


నేటి (28-09-2023)ఫలితాలు


మేషం

సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి  ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

వృషభం

రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 

---------------------------------------

మిధునం

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో  అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగుల ప్రయత్నాలకు నిరాశ తప్పదు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మధ్యమ ఫలితాలు అందుతాయి.  

---------------------------------------

కర్కాటకం

చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగుల  ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. 

---------------------------------------

సింహం

నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో   చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలలో  నష్టాలు  భర్తీ అవుతాయి. గృహమున సంతాన శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఉద్యోగాలలో  సమస్యల నుండి బయట పడతారు.

---------------------------------------

కన్య

రావలసిన ధనం చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వస్తు వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తులనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. 

---------------------------------------

తుల

ఋణదాతల  ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. 

---------------------------------------

వృశ్చికం

నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో  విఫలమౌతారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన  పనులు నిదానంగా  సాగుతాయి. ఆస్తి  వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి.

---------------------------------------

ధనస్సు

సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన సహకారం లభిస్తుంది. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు  అందుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా  సమస్యల నుండి బయట పడతారు .

---------------------------------------

మకరం

వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. నూతన ఋణప్రయత్నాలు కలసిరావు.

---------------------------------------

కుంభం

ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి వ్యాపారమున వ్యవహార  అనుకూలత కలుగుతుంది. కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగస్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. ఉద్యోగమున  అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. 

---------------------------------------

మీనం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుండి వివాద విషయమై కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన శుభకార్యలు విషయమై ప్రస్తావన వస్తుంది.  

---------------------------------------

గణేశ పంచరత్నమ్*

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

                _*భక్తిసుధ*_

         *గణేశ పంచరత్నమ్*

              (ఫలశ్రుతితో...)


𝕝𝕝శ్లోకం𝕝𝕝-1

*ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం*

*కళాధరావతంసకం విలాసిలోక రక్షకం*

*అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం*

*నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం*

𝕝𝕝తా𝕝𝕝 

మోదకములు చేతిలో ఆనందంగా ఉంచుకుని, ఎల్లప్పుడూ మోక్షాన్ని ప్రసాదించే, శిరస్సున చంద్రుని ధరించిన, లోకాన్ని కాపాడే, నాయకులకే నాయకుడైన, అసురులను, అన్ని ఆశుభాలను నశింప జేసే ఆ విఘ్నేశునికి నా నమస్కారములు.


𝕝𝕝శ్లోకం𝕝𝕝-2

*నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం*

*నమస్సురారి నిర్జనం నతాధికాపదుద్ధరం*

*సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం*

*మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం*

𝕝𝕝తా𝕝𝕝

భక్తుల శత్రువులకు భయం కలిగించే వానికి, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్న వానికి, దేవతలు, అసురులచే నుతింపబడేవాడికి , భక్తుల విఘ్నాలను తొలగించే వానికి, దేవతలకే దేవునికి, సర్వ సంపదలకు అధిపతి అయిన వానికి, గజరాజుకు, దేవతల గణాలకు అధిపతి అయిన వానికి ఎల్లప్పుడూ నా నమస్కారములు.


𝕝𝕝శ్లోకం𝕝𝕝-3

*సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం*

*దరేదరోదరం వరం వరే భవక్త్ర మక్షరం*

*కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం*

*మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం*

𝕝𝕝తా𝕝𝕝

సమస్త లోకాలకు శుభం కలిగించే వానికి, లోకాన్ని గజాసురుని బారినుండి కాపాడిన వానికి, పెద్ద ఉదరముతో, గజముఖముతో జనులను ఆశీర్వదించే వానికి, కరుణను కురిపించే వానికి, తప్పులను క్షమించి, శుభము, యశస్సు కలిగించే వానికి, తనకు నమస్కరించే వానికి సర్వ శుభాలు కలుగ జేసే విఘ్నరాజునికి నా నమస్కారములు.


𝕝𝕝శ్లోకం𝕝𝕝-4

*అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం*

*పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం*

*ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం*

*కపోల దాన వారణం భజే పురాణ వారణం*

𝕝𝕝తా𝕝𝕝

కోరికలను తీర్చి, బాధలను నశింప  జేసే వానికి, అనాదిగా పూజింపబడిన వానికి, ప్రళయ కారకుడైన శివుని పెద్ద కుమారునికి, అసురుల గర్వాన్ని అణచే వానికి, ప్రళయ కాలంలో భీషణంగా ఉండే వానికి, సర్పము ఆభరణంగా ఉన్నవానికి, మద గజము వలె ఉత్సాహముగా ఉన్నవానికి, పురాతనమైన వానికి నా నమస్సులు.


𝕝𝕝శ్లోకం𝕝𝕝-5

*నితాంతికాంత దంతకాంతి మంతకాంతకాత్మజం*

*అచింత్య రూప మంతహీనమంతరాయకృంతనం*

*హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం*

*తమేకదంతమేవతం విచింతయామి సంతతం*

𝕝𝕝తా𝕝𝕝

ఎంతో శోభతో ఉన్న దంతము కలవాడు, మృత్యుంజయ కారకుడైన శివుని కుమారుడు, వర్ణనకు, ఊహకు అందని ఆకారము కలవాడు, అంతము లేని వానికి, విఘ్నాలు, ఆపదలు తొలగించే వానిడు, వసంత ఋతువులాగా యోగుల మనస్సులో నిలిచే వాడు అయిన ఏకదంతుని ఎల్లప్పుడూ నా స్మరించెదను.


𝕝𝕝శ్లోకం𝕝𝕝  *ఫలశ్రుతి*

*మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం*

*ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరన్ గణేశ్వరమ్*

*అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం*

*సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్॥*

𝕝𝕝తా𝕝𝕝

మహాగణేశ పంచరత్నమను ఈ స్తోత్రమును ప్రతి దినము ప్రాతః కాలమున శ్రీ వినాయకుని మనస్సుయందు ధ్యానించుచు ప్రకటముగా ఎవరెవరు పఠిస్తారో, అట్టి వారికి వెంటనే ఆరోగ్యము,దోషములేని జీవనమును, మంచి విద్యను, జ్ఞానమును, చక్కని సంతానము కలవారై, దీర్ఘాయుష్కులై అష్టైశ్వర్యములను అనుభవించి సమస్త మంగళములనూ పొందెదరు.

               --------------------

శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం


    గురూజీ సహదేవ రాజు సెల్ :9948381552

   ఈ భూప్రపంచం మీద సమస్య లేని వాళ్ళు ఎవరు ఉండరు

   )1విద్య

   2)ఉద్యోగం

   3)వ్యాపారం

   4)భార్య భర్తల మధ్య గొడవలు

   5)పుత్రసంతానం

   6)ప్రేమ సమస్యలు

   7)ఎన్ని సంబంధాలు వచ్చిన పెళ్లి ముడి పడకపోవడ

   8)ధనము కలసి రాకపోవడం

   10)కుటుంబ సమస్యలు

   11)ఆర్థిక సమస్యలు

   13)స్త్రీ వశీకరణం

   14పురుష వశీకరణం

   15)శని దోషం నాగదోషం నరదిష్ఠి

   16)ఇంట్లో మనశాంతి లేకపోవడం మీ కుటుంబంలో దెయ్యాల సమస్యలు ఉంటే చెడు కర్మలు ఉన్నా గురూజీ చక్కటి పరిష్కరం చెప్పగలరు

   ఎదో సరదాగా ఆడుకుందామని :::చేపి చేయొద్దు సమస్య ఉంటే ఫోన్ చేయండి

   సర్వేజన సుఖినోభవంతు

   నమ్మకంతో ఫోన్ చేయండి

   సర్వ సమస్యలకు పరిష్కరం చేయబడును పూజారి లక్ష్మణ్ రాజు

   సెల్ : 9150206445

Disclaimer. This bloger is not responsible for the above add. 


విలేజ్ స్మార్ట్ మార్ట్

 🛒మన *విలేజ్ స్మార్ట్ మార్ట్* ప్రతీ రోజూ హోల్ సేల్ ధరలకే చేనేత వస్త్రాలు  వినియోగదారులకి మార్కెట్ ధర కంటే అతి తక్కువ ధరలకే అందరికీ అందిస్తుంది🛍️📲ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా విలేజ్ స్మార్ట్ మార్ట్ లో సభ్యునిగా కింది ఇవ్వబడిన లింక్స్ ద్వారా గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి🛍️


🛒పట్టు మరియు ఇతర వస్త్రాలు👇🏽

https://chat.whatsapp.com/EPvNKjHjYptGPwIp9YDcTL


🛒చేనేత కాటన్ వస్త్రాలు👇🏽

https://chat.whatsapp.com/E4nrPFLVephKzDPS95Wpyo


🛒 కుర్తి సెట్స్ & మోడ్రన్ డ్రెస్సులు👇🏽

https://chat.whatsapp.com/K9t91tPBaQj4l4D2eOjUNY


🛒 కిడ్స్ వేర్👇🏽

https://chat.whatsapp.com/C12BWIpJjwkKCwKEn2IV6n


🛒హ్యాండ్ బ్యాగ్స్👇🏽

https://chat.whatsapp.com/HJZctQid8X43CFGWGNB99y


🛒మెన్స్ వేర్ 👇🏽

https://chat.whatsapp.com/KCz64h8wUYb9AEmGTU62q0


🛒🛍️👇🏽

విలేజ్ స్మార్ట్ మార్ట్

7396400123


Disclaimer.  This bloger is not responsible for the above add. 

కొండల నుందువో

 ఉ॥

కొండల నుందువో! లలితకోమలడెందము లందు నుందువో!

బండల నుందువో! మృదులభావరసోన్నతులందు నుందువో! 

చండపరాక్రమోద్ధతికి శాత్రవదర్పనిహంతృబుద్ధికిన్ 

మండితరూపమైన నిను మాన్యత గొల్తును తల్లి! శాంభవీ! 

*~శ్రీశర్మద*

మహాగణేశ పంచరత్నమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


_ *మహాగణేశ పంచరత్నమ్ - ఫలశ్రుతి* _


🙏🌼🌞🌼🌞🌼🌞🌼🌞🙏


*_మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం_*


*_ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరన్ గణేశ్వరమ్_*


*_అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం_*


*_సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్!!!!!!_*


భావము : *మహాగణేశ పంచరత్నమను ఈ స్తోత్రమును ప్రతి దినము ప్రాతః కాలమున శ్రీ వినాయకుని మనస్సుయందు ధ్యానించుచు ప్రకటముగా ఎవరెవరు పఠిస్తారో, అట్టి వారికి వెంటనే ఆరోగ్యము,దోషము లేని జీవనమును, మంచి విద్యను, జ్ఞానమును, చక్కని సంతానము కలవారై, దీర్ఘాయుష్షు లై అష్టైశ్వర్యములను అనుభవించి సమస్త మంగళములను పొందెదరు*.....


🧘‍♂️🙏🪷 ✍️🙏

గురువారం, సెప్టెంబరు 28, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


గురువారం, సెప్టెంబరు 28, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - శుక్ల పక్షం

తిథి:చతుర్దశి సా6.26 వరకు  

వారం:గురువారం (బృహస్పతివాసరే)

నక్షత్రం:పూర్వాభాద్ర రా2.48 వరకు

యోగం:గండం రా1.43 వరకు

కరణం:గరజి ఉ7.37 వరకు తదుపరి వణిజ రా6.26 వరకు ఆ తదుపరి విష్ఠి తె5.17వరకు

వర్జ్యం:ఉ10.23 - 11.53

దుర్ముహూర్తము:ఉ9.52 - 10.40&

మ2.39 - 3.27

అమృతకాలం:రా7.20 - 8.50

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్యరాశి: కన్య

 చంద్ర రాశి : కుంభం 

సూర్యోదయం:5.53

సూర్యాస్తమయం: 5.55


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

దత్తుడు

 *దత్తుడు చూపిన దారి..*


"కొన్ని రోజులపాటు కేసు పొడిగించవచ్చు కానీ..మనం ఈ కేసు గెలవలేము..అన్ని రకాల ఆధారాలూ వాళ్ళవైపు బలంగా ఉన్నాయి..మరి ఎలాగ..?" అన్నారు లాయర్ గారు.."నేను కోరుకునేది కూడా ఆరేడు నెలల సమయం మాత్రమే..నేను వాళ్లకు బాకీ ఉన్నమాట నిజం..ఇప్పటికిప్పుడు అంత మొత్తాన్ని కట్టుకోలేను..నావద్ద ప్రస్తుతం ఉన్న డబ్బు వాళ్లకు ఇచ్చి..కొంత సమయం అడుగుదామని అనుకుంటున్నాను..కానీ వాళ్ళు అందుకు సుముఖంగా లేరు..కోర్టులోనే తేల్చుకుంటాము అని ఖచ్చితంగా చెప్పారు..అందువల్ల మీ సహాయం అడుగుతున్నాను.." అన్నాను.."అది కాదండీ..ప్రస్తుతం ఉన్న జడ్జీ గారు ఇలాటి కేసులకు ఎక్కువ సమయం ఇవ్వటం లేదు..త్వరగా ముగించి శిక్ష ఖరారు చేస్తున్నారు..మీరు జాగ్రత్త పడటం మంచిది..నా వరకూ ఓ రెండుమూడు నెలలు పొడిగించగలను..ఆలోపల మీరు మీ ప్రత్యర్థులతో రాజీ పడటం మంచిది..మీ అన్నయ్య గారు వృత్తిపరంగా నాకు మంచి స్నేహితులు..ఆ చనువుతో చెపుతున్నాను.." అన్నారు.."సరేనండీ..మీ ప్రయత్నం మీరు చేయండి..నేను మా ఊరు వెళ్లి.. ఆ దత్తాత్రేయుడి పాదాలు పట్టుకుంటాను..అంతకు మించి నాకు వేరే దిక్కు కూడా లేదు.." అని చెప్పాను..ఆరోజు కోర్టుకు హాజరయ్యాను..మరో పదిహేను రోజులకు వాయిదా వేసి పంపించారు..నేను మా ఊరు వచ్చేసాను..


మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర నిర్వహణా బాధ్యతలు తీసుకున్న తొలినాళ్లలో జరిగిన సంఘటన..అప్పట్లో నేను పూర్తిగా ఆర్ధిక సమస్యల్లో చిక్కుకొని వున్నాను..ఋణదాతల వత్తిడులు ఎక్కువగా ఉన్నాయి..వాటికి తోడు కోర్టు కేసులూ ఉన్నాయి..స్వామివారి మందిరం నిర్వహిస్తూ..ఈ బాధలను అనుభవిస్తూ..రోజులు గడుపుతున్నాను..ఆర్ధికంగా సమస్యల్లో వున్నప్పుడు..దగ్గరగా ఉన్నవాళ్లు కూడా దూరం జరిగిపోతారు..అది సహజం కూడా..విజయవాడ లో ఈ కేసు నడుస్తోంది..నా మీద కేసు పెట్టిన కంపెనీ వాళ్ళతో నేరుగా మాట్లాడదామని నేను శతవిధాల ప్రయత్నం చేసాను..కానీ కుదరలేదు..వాళ్ళు ఆ అవకాశమూ ఇవ్వలేదు..నేను వాళ్లకు బాకీ పడ్డ మొత్తం లో సగం చెల్లించడానికి సిద్ధంగా వున్నాను..మిగిలిన సగానికి కొంత సమయం తీసుకొని చెల్లించాలని నా ఆలోచన..వాళ్ళు కేవలం కోర్టు ద్వారానే విషయం తేల్చుకోవాలని అనుకున్నారు..


లాయర్ గారి వద్దనుంచి తిరిగి ఇంటికి వచ్చిన మరునాడు..మొగిలిచెర్ల కు మా దంపతులము వచ్చాము..విజయవాడలో లాయర్ గారితో జరిగిన సంభాషణ మొత్తం ఆవిడతో చెప్పాను.."స్వామివారి పాదాల వద్ద మన సమస్య విన్నవించుకుందాము..పరిష్కారం చూపుతారు అనే నమ్మకం నాకు ఉంది.." అని ఆవిడ చెప్పింది.."చూద్దాం.." అన్నాను..స్వామివారి మందిరానికి చేరిన వెంటనే కాళ్ళూ చేతులూ శుభ్రం చేసుకొని..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..మనసులోని ఆవేదనను చెప్పుకున్నాము..ఆ ప్రక్కరోజు శనివారం..స్వామివారి పల్లకీసేవ లో మా దంపతులము కూడా అర్చన చేయించుకున్నాము..ఆదివారం ఉదయం భక్తుల రాకపోకలతో ఉన్న హడావుడి లో నా సమస్య గురించి తాత్కాలికంగా మర్చిపోయాను..మధ్యాహ్నం అర్చకస్వామి స్వామివారికి నైవేద్యం పెట్టి..హారతి ఇచ్చే సమయం లో మళ్లీ మా దంపతులము స్వామివారిని మనసులోనే వేడుకున్నాము..

ఆరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయం లో మందిరం ముందు ఒక కారు వచ్చి ఆగింది..అందులోంచి నలుగురు వ్యక్తులు లోపలికి వచ్చారు..మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేసి..సమాధి ని దర్శించుకొని, తమ గోత్రనామాలతో అర్చన చేయించుకొని ఇవతలికి వచ్చారు.."మేము విజయవాడ నుంచి వచ్చామండీ..ఇద్దరం లాయర్ల గా ఉన్నాము..మరో ఇద్దరు ఆడిటర్లు..భైరవకోన చూద్దామని వచ్చాము..అక్కడ ఈ క్షేత్రం గురించి చెపితే..ఇలా వచ్చాము.." అన్నారు..


నాకెందుకో నా సమస్య వీళ్ళతో చెప్పాలని అనిపించింది..ఆ ఇద్దరు లాయర్లనూ కూర్చోబెట్టి విజయవాడ కోర్టు కేసు విషయం చెప్పాను..అంతా విన్నారు.."మీరు సగం డబ్బు చెల్లించడానికి సిద్ధంగా వున్నారు..మిగిలిన సగం చెల్లించడానికి మీకు మరో ఐదారు నెలల సమయం కావాలి..ఈ వార్త మీరు మీమీద కేసు వేసిన వాళ్ళతో చెప్పాలని అనుకున్నా..కుదరటం లేదు..అంతే కదా ప్రసాద్ గారూ..?" అన్నారు.."అవునండీ.." అన్నాను.."మీరేమీ కంగారు పడకండి..ఆ కంపెనీ తరఫున ఉన్న లాయర్ల లో నేనూ ఒకడిని..నేను వాళ్లకు చెపుతాను..మీరు నేరుగా వాళ్ళతో మాట్లాడే ఏర్పాటు చేస్తాను.." అని ఆ ఇద్దరిలో ఒకరు అన్నారు..నా నెంబర్ తీసుకున్నారు..కేసు నెంబరూ తీసుకున్నారు..వెళ్ళొస్తామని చెప్పి వెళ్లిపోయారు..ఆ ప్రక్కరోజు సోమవారం ఉదయం పదిగంటల వేళ.."ప్రసాద్ గారూ..నిన్న మీతో మాట్లాడిన లాయర్ గారిని మాట్లాడుతున్నాను..మీరు చెప్పిన విషయం కంపెనీ వాళ్ళతో చెప్పాను..మిమ్మల్ని ఎల్లుండి బుధవారం రమ్మన్నారు..తప్పకుండా విజయవాడ రండి..మీతోబాటు మీ లాయర్ గారిని రమ్మనండి..నేనూ ఉంటాను..మాట్లాడుకుందాము.." అన్నారు..


"స్వామివారు మనకు దారి చూపిస్తారు అని ముందే చెప్పాను కదా..మీరు ఎల్లుండి విజయవాడ వెళ్ళండి.." అని మా ఆవిడ అన్నది..మళ్లీ ఇద్దరమూ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని వచ్చాము..బుధవారం విజయవాడ వెళ్ళాను..నాతో మాట్లాడిన లాయర్ గారు వున్నారు..కంపెనీ ప్రతినిధుల తో నేరుగా మాట్లాడటం జరిగింది..ప్రస్తుతం నేను చెల్లించగలిగిన మొత్తాన్ని చెప్పాను..మరే అభ్యంతరమూ లేకుండా ఒప్పుకున్నారు..ఒక గంటలోపలే అంగీకారం కుదిరింది..తరువాతి వాయిదా నాటికి కేసు ఉపసంహరించుకోవాలని అనుకోవడం..అందుకు తగ్గ కాగితాలు సిద్ధం చేయడం కూడా జరిగిపోయింది..వాళ్ళను ఒప్పించిన ఆ లాయర్ గారికి కృతజ్ఞతలు చెప్పాను..


ఆరోజు మధ్యాహ్నం మా లాయర్ గారు నాతో మాట్లాడుతూ.."ప్రసాద్ గారూ మీరు అదృష్టవంతులు..ఈ కేసు లో ఆ కంపెనీ వాళ్ళు రాజీ పడకుండా వుండి ఉంటే..మీరు డబ్బూ కట్టాలి..పైగా  శిక్ష కూడా పడేది..దైవమే మిమ్మల్ని కాపాడాడు.." అన్నారు..


ఆ దైవం వేరెవరో కాదు..మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన అవధూత దత్తాత్రేయుడే అని వేరే చెప్పుకోవాలా?..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

మంచి మాటలు

 &&& నాలుగు మంచి మాటలు &&&                      ***** సుఖాలను పొందినందుకు మనం కృతజ్ఞులుగా ఉండడం అవసరం అనుకొంటే - - - - - దుఃఖాలు పొందనందుకు కూడా మనం కృతజ్ఞతతో ఉండవచ్చుగదా! ఆలోచించండి!                       ***** మనం పొందిన కష్టాలను ఇసుకలో రాసుకోవాలి. మరి సుఖాలనో రాతిపై చెక్కించుకోవాలి. కృతజ్ఞత చూపగలిగినవారికి అవి రెట్టింపుగ లభిస్తాయి.             ***** చెడులో మంచిని చూడటం, విషాదంలో కూడా సంతోషాన్ని చూడడం,కష్టాలలో కూడా లాభాన్ని గణించడం కొందరికే సాధ్యం. ఆ కొందరిలో మనం ఒకరిగా ఎందుకు ఉండకూడదు.        ***** చేసిన ఉపకారాన్ని మరవడం - - - అజ్ఞత.           ఉపకారికి ఉపకారం చెయ్యడం - - - విజ్ఞత.             ఉపకారికి అపకారం తలపెట్టడం - - - కృతఘ్నత.                             అపకారికి ఉపకారం చెయ్యడం - - - ధన్యత.           ***** ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తుంది.                   ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.                                  ***** పట్టుదలతో సంపాదించుకోవలసింది- - - కీర్తి.                                      సంరక్షించుకోవల్సిందా? గౌరవం.                                  ***** కొండ పాదపీఠం వద్ద కంటే కొండ శిఖరాగ్రాన జాగ్రత్త మిక్కిలి అవసరం. కింద పడితే చిన్నపాటి దెబ్బలతో లేచి నిలబడవచ్చు. కొండ పై భాగాన్నుండి పడితే శాల్తీ గల్లంతు కావచ్చు.                  ***** ఒకరికి సలహా ఇచ్చేటప్పుడు విచక్షణ అవసరం--- ఒకరినుండి సలహా స్వీకరించేటప్పుడు వినమ్రత అవసరం.                - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -                               Sharpen your mind!     1* I am alive without breath and cold as death. I am never thirsty but always drinking. What am I?       2* In the face of adversity , I rise above, inspiring generations with courage and love. I transcend borders, cultures, and creed , embracing diversity, fulfilling a greater need. What am I?             3* I am bright as gold, but without a touch ,I turn cold. What am I?     4* I have a heart that doesn't beat. I have no home but I never sleep. I can take a man's house and build another's. What am I?     (For answers you have to wait 24 hrs only.).                                  * * * * * * * * * * * * * * * * * * * * * * *                        తెలుగు పొడుపుకథలు ( విడుపులు)                          1* ఒక రాజుకు పన్నెండు చొక్కాలు. నెల తిరగగానే చొక్కాను మారుస్తారు. ఏమిటది? ( కాలెండర్)              2* హద్దు లేని పద్దు. ఎన్నడూ ఆడొద్దు.? (అబద్ధం)                              3* హద్దులోనే ఉండాలి. " రామాయణం లో ఒక వాడుక పదం. ( లక్ష్మణరేఖ)                         4* ఊళ్ళో పెళ్ళి. ఇతడికే హడావుడి? ( వీధి కుక్క)          5* హారం కాని హారమిది? (ఆహారం)                                తేది 28--9--2023, గురువారం, శుభోదయం.