23, అక్టోబర్ 2023, సోమవారం

M


 

Wonderful skit on Bathakamma eve


 

రుగ్వేదంలోని మన్యు సూక్తం

 



మహ అద్భుతం.ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం ఉండాలని చెబుతారు. ఇది డిలీట్ చెయ్యకండి.వీలయినంత ఎక్కువసార్లు ప్రతినిత్యం వినడానికి ప్రయత్నం చెయ్యండి.      ఇది రుగ్వేదంలోని మన్యు సూక్తం. దీనిని రోజుకొకసారి వింటే చాలు మీ ఆరోగ్యంలో ఉన్న ఎటువంటి లోపాలనైన నయం చేయగలదని రుగ్వేదంలో రాయబడింది. సో మీరు వినండి మరియు మీ మిత్రులకు కూడ పంపండి .

Driver less taxi


 Driverless taxi service started first time in world. 
And in Chennai started yesterday. Enjoy the ride 😀👍

పూజాకార్యక్రమాల సంకల్పము. పూర్వ పద్ధతి పంచాంగం.

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ. 23.10..2023

సోమ వారం (ఇందు వాసరే) 

*************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ  సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

___________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

ఆశ్వయుజ మాసే శుక్ల పక్షే

నవమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

ఇందు వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు 

శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  ఆశ్వయుజ మాసే  శుక్ల పక్షే నవమ్యౌపరి దశమ్యాం.

ఇందు వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.58

సూ.అ.5.32

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 


శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

ఆశ్వయుజ మాసం 

శుక్ల పక్షం నవమి మ.3.08  వరకు.  

సోమ వారం. 

నక్షత్రం శ్రవణం మ.3.45 వరకు.

అమృతం ఉ.6.00  ల 7.30  వరకు. 

పునరమృతం తె.4.25 ల 5.55 వరకు.

దుర్ముహూర్తం ప.12.08 ల 12.54  వరకు.

దుర్ముహూర్తం మ.2.27 లో 3.13 వరకు.

వర్జ్యం రా.7.28 ల‌ 8.58 వరకు .

యోగం శూలం సా.6.23  వరకు. 

కరణం కౌలవ మీ.3.08  వరకు.

కరణం బవ సా. 5.24 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.. 

రాహు కాలం ఉ7.30 ల 9.00 వరకు. 

గుళిక కాలం మ.1.30 ల 3.00  వరకు. 

యమగండ కాలం ఈ.10.30 12.00 వరకు. .

.***********

పుణ్యతిధి ఆశ్వయుజ శుధ్ధ నవమి మరియు దశమి.

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

Sachivalayanagar,

Vanasthalipuram,

Rangareddy Dist, 500 070,

80195 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

పంచాంగం 23.10.2023 Monday,

 ఈ రోజు పంచాంగం 23.10.2023  Monday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస శుక్ల పక్ష: నవమి తిధి ఇందు వాసర: శ్రవణా నక్షత్రం శూల యోగ: బాలవ తదుపరి కౌలవ తదుపరి తైతుల కరణం ఇది ఈరోజు పంచాంగం.


నవమి సాయంత్రం 05:42 వరకు.

శ్రవణం సాయంత్రం 05:11 వరకు .

సూర్యోదయం : 06:15

సూర్యాస్తమయం : 05:45

వర్జ్యం : రాత్రి 08:53 నుండి 10:22 వరకు.

దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:23 నుండి 01:09 వరకు తిరిగి మధ్యాహ్నం 02:41 నుండి 03:27 వరకు.


రాహుకాలం : ఉదయం 07:30  నుండి 09:00 వరకు 


యమగండం : పగలు 10:30 నుండి 12:00 వరకు.  



శుభోదయ:, నమస్కార:

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం  - నవమి -  శ్రవణం - ఇందు వాసరే* (23.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/PBzCH9cd7HM?si=Z-XWHrJO-NDFxSZE



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

స్తోత్ర పఠనం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...                                  


*స్తోత్ర పఠనం..విధి విధానాలు..*


*(ఐదవ రోజు)*


శ్రీ స్వామివారు ఆదేశించిన మీదట, ప్రభావతి గారు ఆదిత్యహృదయం స్తోత్రాన్ని రోజూ తాను పఠించే విధంగా గబ గబా చెప్పేసారు..ఈసారి ఎటువంటి తడబాటూ లేదు..ఒక్క అక్షరమూ తప్పు పోలేదు..మొత్తం ముప్పై ఒక్క శ్లోకాలూ గడ గడా చెప్పేసారు..రెండు మూడు నిమిషాల్లోనే పూర్తి స్తోత్రం చెప్పడం అయిపోయింది..


ఆదిత్య హృదయం స్తోత్రం విన్న స్వామివారు..ప్రభావతి గారి వైపు చూసి..ఒకింత అసహనంగా.."ఏమిటమ్మా ఆ వేగం?..అమ్మా!..నువ్వు చదివిన స్తోత్రం నీకు అర్ధమైందా?..ఆ ఆదిత్యుడు కూడా ఈ వేగం అందుకోలేడమ్మా..ఇలా రోజూ పారాయణం చేస్తే ప్రయోజనము వుందా తల్లీ!..తపశ్శక్తి సంపన్నులైన మహర్షుల నోటి నుంచి దేవభాష అయిన సంస్కృతంలో బీజాక్షర సహితంగా రూపుదిద్దుకున్న స్తోత్రాన్ని..నువ్వు ఒక్క క్షణంలో వల్లె వేసావే.. ఆ మంత్రాల్లోని సుస్వరమూ..సంధులూ.. సమాసాలూ..ఒక నియమానుసారంగా వుండి.. ఉచ్ఛారణలో ఆ మంత్ర శక్తి ప్రాణం పోసుకుంటుంది..ఆ మంత్రోచ్ఛారణే మనం పూజించే దైవాన్ని నామరూపాలతో మన హృదయానికి సాక్షాత్కరింపచేసే ఉత్తమ మార్గం అవుతుంది..ఎంతో మహిమాన్వితమైన ఆదిత్యహృదయ స్తోత్రం అగస్త్య మహాముని విరచితం..వాల్మీకి మహర్షి వ్రాసిన ఆదికావ్యం రామాయణం లో చెప్పబడింది..అటువంటి స్తోత్రాన్ని నువ్వు ఎంత తక్కువ సమయంలో అప్పచెప్పుతానా అన్నట్లు చెప్పేసావే..ఇది కాదు పద్ధతి!.." 


"ఒక స్తోత్రాన్ని చేసేటప్పుడు..అందులోని ప్రతి అక్షరము..సంధి..సమాసము..దానిలోని అర్ధమూ..స్పష్టమైన ఉచ్ఛారణతో.. మన మనసుకు తెలుసుకుంటూ చేస్తే..ఆ మంత్రాధి దేవతకు నిజమైన పూజ చేసినట్లు..అంతేకానీ..ఇప్పుడు నువ్వు చదివినట్లుగా..ఇదిగో, ఇన్ని నిమిషాల లోపు ఈ స్తోత్రం చదవడం అయిపోవాలి అని లెక్క పెట్టుకొని చేసేది పూజ కాదమ్మా..అసలు నీ మనసంతా ఎంత సమయంలో పూర్తి చేసామనే విషయం మీద కేంద్రీకృతమైనప్పుడు ఇక భగవంతుడి గురించిన చింత ఎక్కడుంది?..కొద్దిసేపు పూజ చేసినా..ఏకాగ్రచిత్తంతో భగవంతుడిని సాక్షాత్కరించుకునే విధంగా చేయాలి..చిత్తశుద్ధి ముఖ్యం..ఇక మీదట నువ్వు ఏ స్తోత్రాన్ని చేసినా..మెల్లిగా ఆ స్తోత్ర అర్ధాన్ని ఆకళింపు చేసుకుంటూ..ఆ దేవీ దేవుళ్ళ రూపాలను మనసులో ప్రతిష్టించుకొని చేయి..ఫలితం ఉంటుంది.."


"అహంకారం తొలిగిపోనంతవరకూ..మనసు వాసనారహితం కానంతవరకూ..బ్రహ్మజ్ఞానం గోచరం కాదు..అందుకు సద్గురు కృప ఉండాలి తల్లీ!..ఆత్మ సర్వ జీవులలోనూ వ్యాపితమై ఉంటుందని అందరూ చెపుతారు..కానీ ఆ ఆత్మతత్వాన్ని ఎవరూ ఇతమిద్ధంగా వర్ణించలేరు..ఆత్మ సాక్షాత్కారమూ సులభంగా పొందలేరు..గురువు అనుగ్రహమొక్కటే జ్ఞానాన్ని పొందే మార్గాన్ని చూపిస్తుంది..సద్గురువుల, సాధు సత్పురుషుల సాంగత్యం తోనే బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలరు..నిత్య నైమిత్తిక కర్మలు యధావిధిగా ఆచరించాలి..శుద్ధమైన మనసుతో, సంస్కారయుతంగా కర్మలను చేయాలి.."


ఇలా చెపుతున్న స్వామివారి వాక్ప్రవాహం అంతటితో ఆగలేదు..శ్రీధరరావు దంపతుల కు ఉపనిషత్తుల గురించి..వాటి లోని ముఖ్యమైన శ్లోకాలు..వాటి అర్ధాలు..వాటి ఉచ్చారణ..భగవద్గీతా శ్లోకాలు..భక్తి, జ్ఞాన యోగాలు..గంగా ప్రవాహంలా ఆయన నోటినుంచి జాలువారుతున్నాయి..   ఉదయం 10 గంటలకు స్వామివారి వద్ద కూర్చున్న ఆ దంపతులిద్దరికీ..సమయమెంత గడిచిందో గుర్తుకురాలేదు..సాయంత్రం 4 గంటల దాకా ఒకే ఆసనంలో కూర్చుని శ్రీ స్వామివారు చేసిన బోధ వాళ్ళిద్దరి హృదయాలలో నాటుకొని పోయింది..


మాలకొండ వచ్చి, పార్వతీదేవి మఠం వద్ద మొదటి సారి ఆ యోగిని దర్శించుకోవడం..ఆయన ఉపదేశము విన్న ప్రభావతి గారికి మనసులో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలై పోయాయి..తాము దర్శించుకున్నది సాధారణ మానవుణ్ణి కాదనీ..సాక్షాత్ జ్ఞాన స్వరూపమే ఈ యోగిపుంగవుడి రూపంలో ఇక్కడ నడయాడుతోందనీ అర్ధమైంది..ఇంతకాలం ఈయన గురించి తన భర్తగారు చెప్పిన ప్రతి మాటా అక్షర సత్యమని బోధపడింది..


"శ్రీధరరావు గారూ..పొద్దుకూకుతోంది.. మీరు మళ్లీ మీ గ్రామం చేరాలి..బైలుదేరండి!..నాకూ జపానికి వేళయింది.." అంటూ శ్రీ స్వామివారు హెచ్చరించాకగానీ...వాళ్ళు ఇహ లోకంలోకి రాలేదు..

దంపతులిద్దరూ వెళ్ళొస్తామని శ్రీ స్వామివారికి చెప్పి, పార్వతీదేవి మఠం వెలుపలికి వచ్చేసారు..శ్రీ స్వామివారు తలూపి..పార్వతీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకొని, వీళ్లిద్దరి దగ్గరకూ వచ్చి..ఆశీర్వదించినట్లుగా చేయెత్తి ఊపి..లోపలికి వెళ్లిపోయారు..


మాలకొండ నుంచి తిరిగి ఆ దంపతులిద్దరూ మొగలిచెర్ల కు తమ రెండెడ్ల బండిలో పయనమయ్యారు..దాదాపు ఆరు ఏడు గంటలపాటు శ్రీ స్వామివారి వద్ద గడిపి, తాము పొందిన అనుభూతి ని ఇద్దరూ మాట్లాడుకోసాగారు..


"స్వామి వారి పూర్వాశ్రమం గురించి మీరేమన్నా కనుక్కున్నారా?..వారిది ఏ ఊరు?..తల్లిదండ్రులెవరు?..మాలకొండకు ఎప్పుడు వచ్చారు?.." అని ప్రభావతి గారు భర్తను అడిగారు..శ్రీధరరావు గారు.."కొంత వివరం సేకరించాను ప్రభావతీ..ఇంటికెళ్లి మాట్లాడుకుందాం.."అన్నారు..


శ్రీ స్వామివారి పుట్టుపూర్వోత్తరాలు...రేపటినుంచీ తెలుసుకుందాము...


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

చండీహోమం ఎవరికి

 చండీహోమం ఎవరికి సంబంధించినది..............!!


ఇది బ్రాహ్మణులకి..మాత్రమే..కాదు..

అన్ని వర్ణాల వారికి..సంబంధించినది.

దీని గురించి వేదాలలో ఎటువంటి సమాచారం సరియైనది లేదు..


చండీ ఆరాధన కలకత్తా దగ్గరలోని గిరిజన జాతులవారు ప్రారంభించారని పెద్దలు చెప్పియున్నారు,

వారి వద్ధనుండే చండీహోమం ఆరాధన,,హోమం బయల్పడినాయి.

కాలక్రమేణా బ్రాహ్మణులు,,పండితులు కూడా చండీహోమం చేయనారంభించారు. 


లక్ష్మీ,,సరస్వతీ,,పార్వతీదేవి,,ఈ ముగ్గరు శక్తుల కలయికతో ఏర్పడినదే మహాచండీ..

ఈమె హోమం చేయడంవల్ల సమస్త బాధలు నివారణమవుతాయి.

వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.

శత్రువులు నశిస్తారు.

పరప్రయోగాలతో బాధపడేవారు..

తరచుగా కుటుంబంలో మరణాలు సంభవిస్తున్నవారు..

అకారణంగా కోర్టు  కేసులలో ఇరుక్కుంటున్నవారు.

ఇంకేమైనా ఇతరత్రా సమస్యలతో బాధపడతున్నవారు చండీహోమాన్ని చేయించుకోవడం వల్ల చండీమాత అనుగ్రహంతో త్వరితగతిని వాటినుండి బయటపడతారు,, 


చండీమాత ఉగ్రరూపమే కాళికామాత,,

ఈమె శాంతరూపంలో.. 

మంగళచండి,

సంకటచండీ,,

రణచండీ,,

ఓరైచండీ గా 

పూజలందుకుంటారు..  

చండీహోమం ఈరోజున చాలా ఖర్చుతో కూడుకుని ఉన్నది,, 


ప్రముఖ దేవాలయాలలో చేయించుకునే చండీహోమం వల్ల కేవలం 5% మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. ఎవరైనా చేయించుకునే ఆర్థికస్తోమత ఉన్నవారు ఎవరికివారుగా..

ఆర్థికస్తోమత తక్కువగా ఉన్నవారు నాలుగు కుటుంబాలవారు కలిసికట్టుగా గాని చండీహోమం చేయించుకోవచ్చు,, 


చండీ హోమము ఎందుకు చేయాలి..!

అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే.! 

చండీ మాత ఓ ప్రచండ శక్తి. 

భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. 

సృష్టి జరగడానికి, 

అది వృద్ధి చెందడానికి, 

తిరిగి లయం కావడానికి 

అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. 


ఆమె ఆదిశక్తి, 

పరాశక్తి, 

జ్ఞానశక్తి, 

ఇచ్చాశక్తి, 

క్రియాశక్తి, 

కుండలినీ శక్తి! 

అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం.


లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. 

లోక కల్యాణం కోసం, 

విశేష కార్యసిద్ధి కోసం 

సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు 

మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం 

అనాదిగా వస్తోంది. 

ఆదితత్త్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య.


అది లలితా పారాయణం, 

చండీ పారాయణం 

అని రెండు రకాలు. 


బ్రహ్మాండ పురాణం, 

దేవీ భాగవతం 

లలితాదేవి మహిమలను చెబితే, 

మార్కండేయ పురాణం 

చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. 


చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతోపాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి.


చండీ హోమం లో ఉన్న మంత్రాలు & అధ్యాయాలు....


చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే, ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు, 

అర్థశ్లోక, 

త్రిపాద శ్లోక 

మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. 


బ్రాహ్మీ, 

నందజా, 

రక్తదంతికా, 

శాకంబరీ, 

దుర్గా, 

భీమా, 

భ్రామరీ 

అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్తసతులు అని పేరు. వారి మహత్య్మ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి 

దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చింది. 

ఇది శాక్తేయ హోమం కనక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది.


దుర్గ లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా, 

13 అధ్యాయాలుగా ఉంటుంది. 

తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 

రెండో భాగంలో మూడు అధ్యాయాలు, 

మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, 

మహిషాసుర సంహారం, 

శుంభనిశుంభుల వధతోపాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. 


సప్తశతిని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు. 

పూజ, 

పారాయణ, 

హోమం. 

ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. 

పారాయణలో దశాంశం హోమం, 

దశాంశం తర్పణం ఇస్తారు. 


చండీ హోమానికి సంబంధించి..

నవ చండీ యాగం, 

శత చండీ యాగం, 

సహస్ర చండీ యాగం, 

అయుత (పది వేలు) చండీ యాగం, 

నియుత (లక్ష) చండీ యాగం, 

ప్రయుత (పది లక్షలు) చండీ యాగం ఉంటాయి.


చండీ పారాయణ వలన సమాజానికి జరిగే మేలు:.....


ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. 

దుఃఖం అనేది రాదు. 

ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. 

లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది.


కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. 

ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, 

గ్రహాల అనుకూలతకు, 

భయభీతులు పోవడానికి, 

శత్రు సంహారానికి, 

శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు.


వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట.


ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడని, 


ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని, 


మను చండి (చతుర్దశ చండి)తో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది. 


ఇక, శత చండి చేస్తే కష్టాలు, 

వైద్యానికి లొంగని అనారోగ్యం, 

ధన నష్టం తదితరాలు తొలగుతాయి. 


సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది. 

కోరికలు నెరవేరతాయి. 


లక్ష చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. 

దీనినే నియుత చండి అంటారు. 

ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు..!

ఓం నమః శివాయ..!!


లోకా సమస్తా సుఖినోభవంతు..!!

శుభమిడు దసరా జనులకు

 కం..

శుభమిడు దసరా జనులకు

శుభ మభ్యుదయంబుల నిడు శుభమౌదసరా

శుభమౌ తెలగాణకుభువి

విభవంబది రాముడిచ్చు విజ్ఞత బెంచున్....

డా.. శేషం వేణుగోపాల శర్మ

సోమవారం, అక్టోబరు 23, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


సోమవారం, అక్టోబరు 23, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం

తిథి:నవమి మ3.08 వరకు  

వారం:సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం:శ్రవణం మ3.44 వరకు

యోగం:శూలం సా6.21 వరకు

కరణం:కౌలువ మ3.08 వరకు తదుపరి తైతుల రా1.58 వరకు

వర్జ్యం:రా7.27 - 8.57

దుర్ముహూర్తము:మ12.08 - 12.54 & మ2.26 - 3.13

అమృతకాలం:ఉ7.28వరకు & మరల తె4.24 - 5.54

రాహుకాలం:ఉ7.30 - 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00

సూర్యరాశి : తుల

చంద్రరాశి : మకరం 

సూర్యోదయం:5.58

సూర్యాస్తమయం: 5.32


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

పనులను కష్టం బనుచును


*కం*

పనులను కష్టం బనుచును

పనిచేయుట మానుకన్న పనిలో నెపుడున్

అనువగు సౌలభ్యమెరిగి

పనిమంతులుగా నెగడుట బాధ్యత సుజనా.

*భావం*:-- ఓ సుజనా! పనులు కష్టం గా ఉన్నాయంటూ మానివేయడం కన్నా ఆ పనిలో సౌలభ్యాన్ని తెలుసుకుని పనులు చేస్తూ పనిమంతులుగా వర్ధిల్లడం మన బాధ్యత.

*సందేశం*:-- ప్రతీ పనిలో నూ ఖచ్చితంగా ఒక సులభమార్గం ఉంటుంది, అది తెలుసుకోవడానికి ప్రయత్నించి పనిమంతులుగా వర్ధిల్లవలెను.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

దశవిధ రిపు సంహారము

దశహర పర్వంబునందు దర్శించదగున్.

దశగుణకర విజయదశమి

దిశదెల్పును కనకదుర్గ దీవెన సుజనా.

*అందరికీ విజయదశమి శుభాకాంక్షలు*


*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

దసరా శుభాకాంక్షలు

 ఈ విజయదశమి నుంచి మళ్లీ విజయదశమి వరకు అన్నీ విజయాలే కలగాలని కోరుకుంటూ..

మీకు మీ కుటుంబ సభ్యులకు 

దసరా శుభాకాంక్షలు 🎊🎉

మీ..

Bhargava Sarma

సోమవారము, అక్టోబర్, 23, 2023

 సోమవారము, అక్టోబర్, 23, 2023

-----------------------------------------

మాసం: ఆశ్వీయుజ మాసం

ఆయనం: దక్షిణాయణం

పక్షము: శుక్ల పక్షము

ఋతువు: శరత్ ఋతువు

అమృతకాలము: 07:29 నుండి 08:59 వరకు, 05:50, అక్టోబర్ 24 నుండి 07:19, అక్టోబర్ 24 వరకు

సూర్యోదయము: 06:11

సూర్యాస్తమయము: 17:50

రాహు కాలం: 07:39 నుండి 09:06 వరకు

యమగండము: 10:33 నుండి 12:00 వరకు

దుర్ముహుర్తములు: 12:24 నుండి 13:10 వరకు, 14:43 నుండి 15:30 వరకు

అభిజిత్: 11:37 నుండి 12:24 వరకు

కరణం: బాలవ 06:54 వరకు, కౌలవ 17:44 వరకు

చంద్రోదయం: 13:56

చంద్రాస్తమయం: 01:30, అక్టోబర్ 24

చంద్ర రాశి: మకరము 04:23, అక్టోబర్ 24

తిథులు: నవమి 17:44 వరకు

నక్షత్రము: శ్రవణం 17:14 వరకు

గుళిక కాలం: 13:28 నుండి 14:55 వరకు

శక: 1945 శోభకృత్

వర్జ్యం: 20:56 నుండి 22:25 వరకు

యోగా: శూల 18:53 వరకు


 

Checkout Telugu Calendar Panchangam App: 

 IOS :  https://itunes.apple.com/app/telugu-calendar/id1448360812

మహిషాసుర మర్దిని!

 మహిషాసుర మర్దిని!


ఉ: తారకపర్వతా గ్రపరితః పరిపుష్పితసత్కదంబకాం/

తారసభాంతరస్థలసుధాకర రత్నమృ గేంద్రపీఠిపైఁ/

జేరి జగంబు లేలు శశి శేఖర గేహినివైన నిన్నుఁ జె/

న్నార భజింతునమ్మమహిషాసురమర్ధని ! పుణ్యవర్ధనీ!


దిట్టకవి రామచంద్రకవి " మహిషాసురమర్ధని శతకము" నుండి🙏🙏🙏🌷🌷🌷🌷🌷