25, మార్చి 2024, సోమవారం

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*25-03-2024 / సోమవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు.

---------------------------------------

వృషభం


చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి.

---------------------------------------

మిధునం


కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.

---------------------------------------

కర్కాటకం


వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------

సింహం


బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోమున అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.

---------------------------------------

కన్య


నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఉద్యోగ యత్నాలు విజయం వరిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు.

---------------------------------------

తుల


కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది. బంధుమిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికం ఫలితం తక్కువగా ఉంటుంది.

---------------------------------------

వృశ్చికం


అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

ధనస్సు


ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారం నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------

మకరం


విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు.

---------------------------------------

కుంభం


సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.

---------------------------------------

మీనం


కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి వృధా ఖర్చులు చేస్తారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

శ్రీ కూడల సంగమ

 🕉 మన గుడి : నెం 758


⚜ కర్నాటక  : ఆల్మట్టి డ్యాం


⚜ శ్రీ కూడల సంగమ



💠 భారతదేశంలోని కూడలసంగమ  లింగాయత్‌లకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రం . 

ఇది కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్ జిల్లాలోని ఆల్మట్టి డ్యామ్ నుండి 15 కిమీ దూరంలో ఉంది . 

కృష్ణా మరియు మలప్రభ నదులు ఇక్కడ కలుస్తాయి మరియు తూర్పున శ్రీశైలం వైపు ప్రవహిస్తాయి . 

ఐక్య మంటపం లేదా స్వయంభూగా విశ్వసించబడే లింగంతో పాటు లింగాయత్ స్థాపకుడు బసవన్న యొక్క పవిత్ర సమాధి ఇక్కడ ఉంది .


💠 ఈ ప్రాంతం లింగాయత్ మతం పుట్టిన పవిత్ర ప్రదేశం. దీనినే కప్పడి సంగమ అని కూడ పిలుస్తారు.


💠 ఈ కూడల సంగమ 800 సంవత్సరాల క్రితం బసవన బగీవాది అనే పేరుతో విలసిల్లిన పవిత్ర పుణ్యక్షేత్రం. బసవేశ్వరుడు పుట్టిన పుణ్యభూమి. బసవేశ్వరునికి విద్యగరిపిన ఈశాన గురువు నివసించిన ప్రాంతం కూడా ఇదే. 


⚜ విశ్వగురు బసవన్న చరిత్ర ⚜


💠 విశ్వగురు  బసవన్న ప్రసిద్ధ తత్వవేత్త మరియు సంఘ సంస్కర్త, ఇతను ఉత్తర కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని బసవన బాగేవాడి అనే చిన్న గ్రామంలో జన్మించాడు , దీనిని ఇంగలేశ్వర బాగేవాడి అని కూడా పిలుస్తారు. 

పట్టణానికి అధిపతి అయిన మాదిరాజా ఇల్లు ఇక్కడే ఉంది. 


💠 బసవేశ్వరుడు  ఆనందనామ సంవత్సరం వైశాఖ మాసం మూడవ రోజున మదిరాజా మరియు మాదాంబికలకు జన్మించాడు (సంవత్సరం  1134తో సమానంగా ఉంటుంది).


💠 ఆ ఊరిలో నందీశ్వర దేవాలయం ఉంది. భార్యాభర్తలు నందీశ్వరుని భక్తులు. మదంబాంబకి నాగమ అనే కుమార్తె ఉంది మరియు కొడుకు పుట్టాలని ఆశించింది. 

ఆమె రోజూ శివుని పూజించి తన కోరిక తీర్చమని ప్రార్థించింది.

ఒకరోజు పూజ తర్వాత ఆమె ధ్యానంలో కూర్చుంది. శివలింగానికి నైవేద్యంగా ఉంచిన మల్లెపూవు ఒడిలో పడింది. ఎంతో భక్తితో దాన్ని తీసుకుని కళ్లకు మెల్లగా అదుముకుని జుట్టులో వేసుకుంది. ఆమె రోజంతా సంతోషంగా ఉంది మరియు ఆ రాత్రి ఆమెకు ఒక కల వచ్చింది: కైలాసం నుండి, శివుడు ఈ లోకంలోకి తన నందిని పంపాడు. 

నంది మదర్సా మరియు మాడంబాంబా ఇంటికి వచ్చింది. అప్పుడు ఎక్కడ చూసినా వెలుతురు.


💠 మరుసటి రోజు మదాలంబాకే ఈ కలను మదరసాకు వెల్లడించింది. అతను దానిని గ్రామ ఆధ్యాత్మిక గురువుకి నివేదించాడు. 

ఇది శుభసూచకమని గురువు అతనికి చెప్పాడు. 

దంపతులకు యోగ్యమైన కుమారుడు ఉంటాడు; వారు మొత్తం కుటుంబాన్ని పెంచుతారు. అతను సమస్త విశ్వాన్ని ఉద్ధరిస్తాడు మరియు జ్ఞానోదయం చేస్తాడు. 

ఈ జోస్యం మాటలు విని ఆ దంపతులు ఆనందానికి లోనయ్యారు.


💠 కాలక్రమేణా మదాలంబాకే ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. మనోహరమైన పిల్లవాడి

ముఖం ప్రకాశిస్తుంది. అప్పుడు గురువు ఇలా అన్నాడు: “శివుని దయతో, నంది (వృషభ అని కూడా పిలుస్తారు) స్వయంగా మీకు కొడుకుగా జన్మించాడు, అతను గొప్ప వ్యక్తిగా మారి ప్రపంచంలో మతాన్ని ప్రోత్సహిస్తాడు, అతను మొత్తం సంక్షేమాన్ని సాధిస్తాడు. 

అతనికి 'బసవ' అని పేరు పెట్టండి. "


💠 సరైన ప్రవర్తనను బోధించిన బసవ విప్లవకారుడు అయ్యాడు. 

పనిలో నిమగ్నమవ్వడం స్వర్గమని, సాదాసీదా జీవితం, స్త్రీ పురుషుల మధ్య సమానత్వం అనే ఆదర్శాలను బోధించారు. 

బసవన్న గొప్ప సాధువు; అతని అనుచరులు ఆయనను గురువుగా భావిస్తారు . 

అతని కాలంలోని నిజమైన దార్శనికుడు మరియు లింగాయత్ శాఖను ప్రారంభించిన విప్లవకారుడు. ఈ ప్రాథమిక హక్కు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడమే బసవన్న అంతిమ లక్ష్యం . 


💠 బసవన్న, సంక్షేమాన్ని అంతిమ లక్ష్యంగా ఉంచుకుని, కన్నడలో మతపరమైన సాహిత్యాన్ని ప్రబోధించడం మరియు వ్రాయడం ద్వారా మతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలను వేగవంతం చేశారు . అతని గడ్డుగే (సమాధి) కూడలసంగమలో ఉంది.


💠 ఎంతో రమణీయంగా నిర్మించిన ఇక్కడి బసవేశ్వరాలయంలో బసవేశ్వరుడు, నీలమ్మ ఉంటాయి. గర్భాలయంలో ఉన్న ద్వారబంధాలపై మంచి నగిషీలతో, అనేక జంతువుల శిల్పాలు మలిచి చాలా అద్భుతంగా ఉంటుంది. 

ఈ ఆలయంలోని శివలింగానికి సంగమేశ్వరుడని, సంగమనాథ్ అని కూడా నామాంతరాలు ఉన్నాయి.


💠 ఇక ఈ చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాల్లో ఇప్పుడు మనం చెప్పుకొన్న సంగమనాథ దేవాలయం . చాలా ముఖ్యమైనది. ఐక్యలింగ బసవేశ్వర మందిరం, బసవ ధర్మపీఠం, అతి చిన్న అరణ్యప్రదేశంగా భాసిల్లే పూజావనం మొదలైనవి. 

ఇవికాక ఇక్కడ నిర్మించిన ఆడిటోరియం 6000 మంది కూర్చోవడానికి వీలుగా నాలుగు ద్వారాలతో ఉంటుంది. 

ఇందులో ఒక్కో ద్వారానికి గంగాంబికా, నీలాంబిక, చెన్నబసవన్న, అక్కనాగమ్మ అనే పేర్లు పెట్టారు. ఈ ఆడిటోరియం ఎంతో ప్రశాంతంగా ఉండి అనేక కార్యక్రమాలకి వేదికగా అలరారుతోంది.


💠 కూడలసంగమ 850 సంవత్సరాల పురాతనమైన సంగమేశ్వర ఆలయానికి ప్రసిద్ధి చెందింది, దీనిని శివునికి అంకితం చేసిన కూడల సంగమేశ్వర అని పిలుస్తారు. 

12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం కృష్ణా నది ఒడ్డున ఉంది మరియు ఇది అనేక సార్లు పునరుద్ధరించబడింది. 

ఈ ఆలయం ద్రావిడ శైలిలో ప్రవేశద్వారం వద్ద పెద్ద ఆలయ గోపురంతో నిర్మించబడింది, దాని తర్వాత ప్రధాన ఆలయం వాకిలి, నవరంగ మరియు గర్భగుడితో ఉంటుంది. 


💠 బెంగళూరు నుండి 450 మరియు జిల్లా రాజధాని బాగలకోట్ నుండి 51 కి.మీ.



 © Santosh Kumar

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం  -‌   పూర్ణిమ - ఉత్తరాఫల్గుణి -‌‌ ఇందు వాసరే* (25.03.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

సోమవారం, మార్చి 25, 2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*

*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


సోమవారం, మార్చి 25, 2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం

తిథి:పౌర్ణమి ఉ11.34 వరకు

వారం:సోమవారం(ఇందువాసరే) 

నక్షత్రం:ఉత్తర ఉ9.59 వరకు

యోగం:వృద్ధి రా8.52 వరకు

కరణం:బవ ఉ11.54 తదుపరి బాలువ రా12.32 వ

వర్జ్యం:రా7.15 - 9.01

దుర్ముహూర్తము:మ12.29 - 1.17 మరల మ2.54 - 3.42

అమృతకాలం:తె5.50నుండి

రాహుకాలం:ఉ7.30 - 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00

సూర్యరాశి: కుంభం

చంద్రరాశి: కన్య 

సూర్యోదయం:6.07

సూర్యాస్తమయం:6.07

*శ్రీరంగనాచ్చియర్ (మహాలక్ష్మి) తిరునక్షత్రం*


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

సుఖం కలుగుతుంది*

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో॥ *ఇచ్ఛతి శతీ సహస్రం |* 

*సహస్రీ లక్ష మీహతే* |

      *లక్షాధిప స్తథా రాజ్యం |* 

*రాజ్యస్థః స్వర్గ మీహతే* ||


{ తృప్తి ఉండాలి }


*భావం : ఒక వంద ధనం కలవాడు వేయి ధనాన్ని కోరతాడు. వేయిగలవాడు లక్షను కోరతాడు. లక్షగలవాడు లక్షాధికారి. లక్షాధికారి రాజ్యాన్ని కోరతాడు. రాజ్యాధిపతి స్వర్గం కావాలని కోరతాడు. ఇలా ఆశకు అంతులేదు. కనుక తృప్తిని ఇవ్వని ఆశను విడిచి తనకు లభించినదానితో తృప్తిచెందు వానికి సదా సుఖం కలుగుతుంది*.

 

🙏🪷 ✍️🙏

24, మార్చి 2024, ఆదివారం

గత స్మృతులు

 *🪷గత స్మృతులు..!!*

       """"""""""""""""""""

*🚆రైల్వే స్టేషన్ లో వెయింగ్ మిషన్ ఎక్కడానికి 10 పైసల బిళ్ల కోసం మారాం చేసిన జెనరేషన్ మాది, ఇంటి ముందు కొచ్చే పాలఐసు 10 పైసలూ, ఫ్రూట్ ఐసు 5 పైసలూనూ, యస్సెల్సీ పాసవగానే టైప్ ఇన్ స్టిట్యూట్ కి పేపర్లు గుండ్రంగా చుట్టుకుని వెళ్లిన తరం వాళ్లం, అద్దెకి బుక్స్ ఇచ్చే షాప్ దగ్గర్లో వుందా, ఆస్పత్రి వుందా అని అద్దె ఇళ్లు చూసుకున్న బంగారు రోజులవి, సినిమా హాలు క్యూలో పాటల పుస్తకాలు కొనుక్కుని బట్టీలు పట్టే కాలం అది, గెజిటెడ్ ఆఫీసర్లు అయినా సైకిళ్లు తొక్కేవాళ్లు ఆ రోజుల్లో, డ్రాయింగ్ రూమ్లలో జిమ్ములలో తొక్కే అవసరం పడేది కాదు, చేబదుళ్లకి కాదేదీ అనర్హం, పిన్నిగారింట్లోంచి గ్లాస్ తో కాఫీ పొడైనా, బాబాయ్ గారి రేలీ సైకిల్ అయినా, పక్కింటి అన్నయ్య జామెంట్రీ బాక్సూ , స్కూల్లో డ్రామాకి ఎదురింటి అక్కయ్య జడగంటలూ, అప్పు పుట్టని పచారీ షాపులూ బట్టల కొట్టులూ వుండేవే కావు, రేషన్ షాపుల్లో పంచదార కోసం, కిరసనాయిల్ కోసం నిలబడి, డ్యూయెట్లూ, పాలసీసా కోసం బూతుల దగ్గర నిలబడినప్పుడు లవ్ లెటర్స్ ఎక్స్చేంజ్ లు జరిగేవి, మధ్య తరగతి మందహాసం కాదు, పగలబడి నవ్వేది, ఇంటి ముందుకు కోతులాడించేవాడు, పాము లాడించేవాడు, గంగిరెద్దు లాడించేవాడు, ఎలుగుబంటిని తెచ్చేవాడు, చిలక జోస్యం చెప్పేవాడు, వానల్లు పడాలి వాన దేవుడా అని కప్పలకి పెళ్లిళ్లు చేసే వాళ్లు, కాలాన్ని బట్టి వచ్చి వినోదం అందించే వాళ్లు, మేకప్పులు అంటే మాకు తెలీని రోజుల్లో మొహాలకి గులాబీ రంగులేసుకునొచ్చి, ఇళ్ల ముందు సినిమా పాటలకి డాన్స్ లాడే వారు, గారడీల వాళ్లు బాలన్సింగ్ ఎలాగో పైన తాడు మీద చిన్న పిల్లలని నడిపిస్తూ చూపించే వాళ్లు, మూలికలూ, పసర్లూ అమ్మేవాళ్లు, తాము నయం చెయ్యలేని రోగం లేదనేవాళ్లు, స్టేషన్ దగ్గర చెవి గులిమిలు తీస్తామనే పెట్టెలతో తిరిగే వాళ్లూ, ఇళ్లముందు కొచ్చి సవరాలు కడతాం అనే వాళ్లూ, వాళ్ల కోసం టిన్నుల్లో జుట్టు వూడితే దాచుకున్న వాళ్లూ వుండేవారు, మధ్యాహ్నాలు భోజనాలయి వంటింటి గుమ్మం మీద తల పెట్టి కునుకు తీస్తుంటే, "దువ్వెన్నలు, బొట్లు, కాటుక పెట్లు, ఇయర్ పిన్లు, లబ్బర్ గాజులు, రిబ్బన్లహో", అంటూ పెట్టె నెత్తిన పెట్టుకొచ్చే వాళ్ల దగ్గర దొరకని ఫ్యాన్సీ వస్తువుండేది కాదు, వాళ్లు వెళ్లగానే "పాత బట్టలకి స్టీల్ సామాన్లిస్తాం", అన్న వాళ్లు వచ్చి ఎన్నేసినా, చూపించినా గంగాళం కాకుండా, ఆఖర్న ఉగ్గు గిన్నె ఇచ్చి పోయేవాళ్లు, గోతాముడు పాత బట్టలొదిలిపోయేవి, కత్తికి సాన పెడ్తాం, నవార్లు నేస్తాం, పరుపులేకుతాం, గిన్నెలకి సొట్టలు తీస్తాం, బంగారు వెండి వస్తువులకి పాలిష్ పెడతాం, అరువు మీద చీరలిస్తాం అంటూ ఇంటి ఇల్లాళ్లని ఊపిరి తీసుకోనిచ్చే వాళ్లు కారు, ఇంక ముగ్గు అమ్మే వాళ్లూ, ఉప్పు అమ్మేవాళ్లూ, కూరలూ పండ్లూ అమ్మే వాళ్లూ సరేసరి, మాదా కబళం వాళ్లు "అన్నం వుంటే పెట్టమ్మా నీ కొడుకులు, బిడ్డలు, మనవలు సల్లంగుండ" అంటూ టైముల వారీగా వచ్చే వాళ్లు, సాయంత్రం 8 గంటలకు బిచ్చగాడొచ్చి వెళితే మా నానమ్మ మాత్రలేసుకునేది..!!*


*రేడియోలో బినాకా గీత్ మాలా ఊహల రెక్కలు విప్పేది, భూలే భిస్రే గీత్, అమర లోకాల్లో విహరింప చేసేది, రహస్య ప్రేమలు, అచ్చట్లు, ముచ్చట్లు..."ఏమిటో" అనుకోవడాలు ప్రొద్దుట సంస్కృత వార్తలు 'ఇతి బలదేవానంద సాగరహా 'తో ప్రారంభం అయితే ఈ మాసం పాటలూ కార్మికుల కార్యక్రమాలూ సంక్షిప్త శబ్ద చిత్ర ప్రసారాలూ..వివిధ భారతి మీరుకోరిన పాటలూ..పండితులచే నిర్మించబడ్డ నాటకాలూ..వావ్ రేడియో స్వర్ణ యుగం అది..!అప్పట్లో పేపరు చదువుతూ కాఫీ తాగని మనుషులు అరుదు.. ఇంగ్లీష్ పేపర్ చదువుతే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయినట్లే ,దూర్దర్శన్ లో ఇంగ్లీష్ వార్తల వల్ల ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం.. తాతయ్యలకీ దూరపు చుట్టాలకీ ఉత్తరాలు రాస్తూ లెటర్ రైటింగులు నేర్చుకున్నాం... "ఉభయకుశలోపరి" ఎక్కడ పెట్టాలో, గంగాభాగీరధీ సమానురాలైన ఎప్పుడు వాడాలో తెలుసు..!!*

*ఎన్నని చెప్పగలం ఆ పాత మధురమైన జ్ఞాపకాలు...!!*


*ఇప్పటికి ఎప్పటికి మా గుండెల్లో నిలిచిపోయి మా గుండెలు అగిపోయేవరకు మాతో వెన్నంటి మమ్మల్ని నడిపిస్తున్న ఏమో, మాటలు రావట్లేదు, అమ్మ చేతి మురుకులు లేవు, అలసట లేని పరుగులు లేవు, ఎత్తరుగులు మొత్తం పోయే, రచ్చబండలూ మచ్చుకు లేవు, వీధిలో పిల్లల అల్లరి లేదు, తాతలు ఇచ్చే చిల్లర లేదు, ఏడు పెంకులు ఏమైపోయే, ఎద్దు రంకెలు యాడకి పోయె, ఎక్కడా వెదురు తడికెలు లేవు, ఏ తడికకీ భోగి పిడకలు లేవు, కూరలమ్మే సంతలు లేవు, పెరుగులమ్మే ముంతలు లేవు, బువ్వా లాటల విందే లేదు, గవ్వలాటలు ముందే లేదు, కుప్పిగంతులు లేనే లేవు, కళ్ళ గంతలు కాన రావు, డ్రింకుమూతల గోలే లేదు, బచ్చాలాడే ఇచ్చా లేదు, కోతి కొమ్మచ్చి ఏమైపోయే, అవ్వా అప్పచ్చి ముందే పాయె, గూటీ బిళ్ళా గూటికి పోయే, తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె, గచ్చ కాయలు మచ్చుకు లేవు, చింత పిక్కలు లెక్కకూ లేవు,ధారగా కారే ముక్కులు లేవు, జోరుగా జారే లాగులు లేవు, కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు, కొండముచ్చుని కెలుకుడు లేదు, బట్టన మురికి అంటక పోయె, మనసుకి మురికి జంటగ చేరె, కాకి ఎంగిలి కరువై పోయే, భుజాన చేతులు బరువై పోయె, అన్ని రంగులూ ఏడకో పోయె, ఉన్న రంగులూ మాసికలాయె దానికితోడు "కరోనా" వచ్చె, బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె, బడిగంటల ఊసే లేదు, బడికి పోయే ధ్యాసే లేదు, మూతులన్నీ మాస్కుల పాలు, చేతులన్నీ సబ్బుల పాలు, ఆన్ లైన్ లో పాఠాలాయె, అర్థం కాని చదువులాయె, ప్రశ్నలకు జవాబు లుండవు, కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు, ప్రస్తుత బాల్యం వెలవెల పోయె, దానికి మూల్యం ప్రస్తుత మాయే, రేపటి సంగతి దేవుడి కెరుక, నేటి బాలలకు తప్పని చురక, బాలానందం లేని జీవితం, మానవాళికే మాయని మరక, మేమే అదృష్టవంతులం..!!*

     

*1960-70 లో పుట్టిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం, చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు, ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం, ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము, లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము, పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న "సామాజిక - ఆర్థిక" పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి, దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు, ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది, అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది..!!*


*పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది, రాత్రికి కూడా అంతే..!!* 

*పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది, బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము, దాదాపు అందరం దుంపల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే, మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే..! ఆ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేది, బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు, ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే, మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు..!!*


 *మూడు అణాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం, SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు, ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి, మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల, గోళీలాట, ఏడు పెంకులాట, బుచ్చలాట, రాత్రికి హరికథలు బుర్ర కథలు, నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం ఈ నాటికీ దాదాపు అందరం 55 -65 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే, జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళమే, పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే..!!*

*అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే, ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే.. ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు..?*

*ఆహా..! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ..!!*

*అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టుగానే వుంది..!!✍️*

ప్రాజ్ఞులు తమ పురుష ప్రయత్నంతో

 శ్లోకం:☝️

*మూఢైః ప్రకల్పితం దైవం*

 *తత్పరాస్తే క్షయం గతాః |*

*ప్రాజ్ఞాస్తు పౌరుషార్థేన*

 *పదముత్తమమాస్థితాః ||*

 - యోగవాసిష్ఠం


భావం: మూర్ఖులు విధియని, తమ కర్మయని భావించుకుని, తమను తాము దిగజార్చుకుంటూ ఉంటారు. ప్రాజ్ఞులు తమ పురుష ప్రయత్నంతోను పట్టుదలతోను ఉన్నత స్థానాన్ని సాధిస్తారు.

Panchaag


 

సంతోషం

 ఎక్కడ నుండి వస్తుంది సంతోషం ? నిత్యరోదితులం అయిపోయాం కదా ! మనకు లేదని కాదు ఏడుపు ; ఎదుటోడికి ఉందని కదా మన ఏడుపు ఇప్పుడు . చాగంటి వారు చెపుతుంటారు . 

నా దగ్గర కోటి రూపాయలు లేవని ఏడుస్తుంటే ఆ కోటి ఇస్తే ఏడుపు పోతుంది . 

ఎదుటోడి దగ్గర ఉన్న కోటి రూపాయలు పోవాలని కదా ఇప్పుడు ఏడుపు . దీనికి అంతం ఎక్కడ ? 


ఓ యాభై అరవై ఏళ్ళ కింద ఉన్నదానితో హాయిగా బతికేవాళ్ళం . 

మిద్దె ఇళ్ళల్లో , మూడు గదుల ఇరుకిళ్ళల్లో , 

ఓ రెండు దాపుడు బట్టలు , 

ఓ మూడో నాలుగో రోజువారీ బట్టలతో రాజాల్లాగా బతికే వాళ్ళం . 

ఇప్పుడు బీరువాలు బీరువాలు పట్టకుండా బట్టలు ఉన్నా తృప్తి ఎక్కడ ? 


నా చిన్నప్పుడు మా స్కూలు నరసరావుపేట సీతారామస్వామి దేవాలయంలో ఉండేది . 

అక్కడ గోడ మీద వ్రాసి ఉండేది . దొరికిన దాని యందు తృప్తి కలవాడు భాగ్యవంతుడు . జనం కూడా హాయిగా , హాయిహాయిగా ఎప్పుడూ నవ్వుతూ , సంతోషంగా ఉండేవాళ్ళు . 


రోజులు మారాయి . Beg , borrow , steal రోజులు వచ్చాయి .

 Earn and enjoy రోజులు పోయాయి . ప్రపంచాన్నంతా మోసం చేస్తున్నాం . స్నేహితుల్ని మోసం చేస్తున్నాం . బంధువులను మోసం చేస్తున్నాం . చివరకు అన్నాతమ్ముళ్ళని , అక్కాచెల్లెళ్ళని , తల్లీతండ్రులను కూడా మోసం చేస్తున్నాం . సంతోషం రమ్మంటే ఎక్కడ నుండి వస్తుంది . 


ముందు మనం పరుగెత్తటం మానుకోవాలి . నడవటం నేర్చుకోవాలి . కూర్చోటం అలవాటు చేసుకోవాలి . కోరికలనే గుర్రాలకు కళ్ళెం వేయాలి . మనకేం కావాలో తేల్చుకోవాలి . భౌతిక , ఐహిక అనవసర వాంఛల్లోనుంచి విముక్తులం కావాలి . అప్పుడు ఎందుకు రాదు సంతోషం . తప్పక వస్తుంది . 


ఆబ ప్రపంచం నుండి సంతృప్తి భావనలోకి రావాలి . ఎదుటోడిని చూసి ఏడవటం మానుకోవాలి . లేనిదాని కోసం కష్టపడి సంపాదించు కోవటం మొదలు పెట్టాలి . 

తప్పుడు మార్గాలను శోధించటం ఆపాలి . అప్పుడు మన భారతం కూడా సంతోష భారతం అవుతుంది .

🌹👏🏽🌷

23, మార్చి 2024, శనివారం

మన్రో గంగాళాలు

 మన్రో గంగాళాలు" అంటే  ఏవో తెలుసా


కడుపు నొప్పికి మంత్రం *శ్రీవారి పులిహోరే.


తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు ఇలాంటి గంగాళంలో మాత్రమే ఎందుకు నివేదింప బడుతున్నాయి. 


ఈ గంగాళం వెనక ఉన్న కథ ఏమిటి..


 1800 ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు, నైవేద్య నివేదనకు, భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు. 


అపట్లో భక్తులకు హోటల్స్ లేవు కనుక.... తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి. అక్కడక్కడా రామానుజా కూటముల ద్వారా కూడ అన్న సంతర్పణ కూడా జరిగినా ఆలయంలో పంచి పెట్టె ప్రసాదాలే ఆ నాటి భక్తులకు ప్రధాన ఆహారం.


 1800 ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ లో పని చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీ లో గవర్నర్ గా పని చేసిన అధికారి పేరు.. " THOMOS MUNRO "


దక్షిణ భారతదేశం మరియూ ప్రముఖంగా రాయలసీమ, కంచి ప్రాంతంలో ఆయన ఎలుబడి కింద ఉండేది.


 ఈయన నిక్కచ్చిగా క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు... మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవ భావం లేనివాడు..


 ఉద్యోగ రీత్యా చాలా సార్లు తిరుమల వచ్చినా...ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోయేవాడు.


 అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు( అవే వారికి భోజనాలు ).. అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి, పులిహారా , దద్దోజనం మొదలైన వంటలు సమర్పించేవారు. (అప్పటికి లడ్డు ప్రధాన ప్రసాదం కాదు.)

ఆ ప్రసాదాలను భక్త్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద  కూర్చుని నేరుగా చేతులతో తన్మయత్వంలో తినడం చూసి థామస్ మన్రోకి ఒకరకమైన అసహ్యం వేసింది...

స్వతహాగా విదేశీయుడు కావున... అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి అది ఆరోగ్యకరమైన పద్దతి కాదు అని , శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఓకేదగ్గర నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వల్ల లేనిపోని అంటు వ్యాధులు, కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అని. 


మన ఆలయ సంప్రదాయం, ప్రసాదాలు పట్ల ఒకింత చులకన భావం కలిగిన థామస్ మన్రో వెంటనే తన అధికారం ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు  తినకుండా ఆదేశాలు ఇచ్చాడు.. 


 శ్రీవారి లీల ప్రభావంతో  ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు థామస్ మన్రో రద్దు చేశారో...అదే  తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకి వచ్చి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా ఆతని ఆరోగ్యం క్షీణించి , పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టినాడు. 


 అనుకోని పరిస్థితుల్లో అతనికి మంత్రాలయం రాఘవేంద్రస్వామి వారి మీద ఎనలేని భక్తి శ్రద్ధ గురి కుదిరింది. అతను ఆ ఆలయంకి ఎన్నో కైంకర్యాలకు దన సహాయం చేసినా ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గక నరక యాతన అనుభవించేవాడు. 


 అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తన కి, సనాతన ధర్మం పట్ల భక్తిని  గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల  శ్రీవారి పట్ల ,ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పుని తెలియజేసి, శ్రీవారి క్షేత్ర మహిమని వివరించారు. శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న థామస్ మన్రో..శ్రీవారి పులిహార నేరుగా తన చేతితో తిన్న వెంటనే కడుపునొప్పి మటుమాయం అయింది..


తప్పు తెలుసుకున్న థామస్ మన్రో... శ్రీవారికి కైంకర్యాల కోసం, నైవేద్యాలు సమర్పణ కోసం  చాలా గంగాళాలు సమర్పించాడు మరియూ తిరుపతి శ్రీవారి భక్తులకు మళ్ళీ మునుపటి లాగా ప్రసాదాలు పంచి పెట్టేలా వాటిని భక్తులు నేరుగా ఆలయం దగ్గరే  తినేలా తిరిగి ఉత్తర్వులు ఇచ్చాడు...... 


 ఎంత పశ్చాత్తాప పడినా, ఎన్ని గంగాళాలు దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు.

మనోవ్యధ తో   మంచం పట్టి నేరుగా నీ సేవలో  పాల్గొని అదృష్టం లేదా స్వామి అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ 1827 లో ప్రాణం వదిలాడు. 



 అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాళాలులోనే స్వీకరిస్తున్నాడు... ఈ గంగాళలను ఇప్పటికీ

*" మన్రో గంగాళాలు "*  అనే పేరుతో  దేవస్థాన పూజా కైంకర్యాల లో చలామణీలో ఉన్నాయి...

శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోకపోయినా ఆయన పేరు మీదే ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరకీర్తిని కలిగించి ఒక రకమైన చిరకీర్తి  ప్రసాదించాడు. 


 తెలుసుకోవాలన్న శ్రద్ధ, భక్తి ఉండాలే గాని తిరుమలలో పరమాత్మ గూర్చే కాదు ఆ పరమాత్మునికి నివేదించే ప్రసాదాల లోనే కాక ఆ ప్రసాదాల పాత్రల వెనక కూడా ఎంతో విలువైన ఆధ్యాత్మిక మహిమలు, శ్రీవారు లీలలు, చరిత్ర  కలదు. 


భక్తితో శ్రీనివాసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తిరుమలగిరిలో అడుగడుగున, ప్రతి గడప కి, ప్రతి చెట్టు కి ప్రతి ఒక్క చిన్న ప్రదేశం వెనక ఎంతో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక చరిత్ర దాగి ఉంది.

మూత్రపిండాలలో రాళ్లు

 మూత్రపిండాలలో రాళ్లు కరిగించడానికి  - 


        ఆకులు తీసిన ముల్లంగి కాడని దంచి రసం తీసి ఒక కప్పు మోతాదుగా ఒక చెంచా తేనే కలిపి రెండు పూటలా తాగుతూ ఉంటే మూత్రకోశంలోని రాళ్లు ముక్కలు ముక్కలు అయ్యి మూత్రం గుండా పడిపోతాయి. 


              అంతేగాక ఈ రసం తాగడం వలన మూత్రం బందం విడివడి మూత్రం ధారాళంగా జారి అవుతుంది.  క్రమక్రమంగా మదుమేహం , అతిమూత్రం కూడా తగ్గుతాయి . 


 గమనిక  - 


  ప్రతిరోజూ ఈ ఔషదం తో పాటు బార్లీ గింజల నీటిని కూడా తాగడం వలన ఇంకా తొందరంగా మీ సమస్య నుంచి బయటపడతారు.

 

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

శ్రీ కాళహస్తీశ్వరా

 శు భో ద యం🙏


శ్రీ కాళహస్తీశ్వరా!


"నీతో యుధ్ధముసేయనోపఁగవితా నిర్మాణశక్తిన్ నినున్/

బ్రీతుంసేయగలేను,నీకొఱకు తండ్రింజంపఁగాఁజాల,నా/

చేతన్ రోకటనిన్నుమొత్తవెఱతున్, జీకాకు నాభక్తి,యే/

రీతిన్ నాకిక నిన్నుజూడఁగలుగున్ ,శ్రీ కాళహస్తీశ్వరా!


కాళహస్తీశ్వర శతకము.

ధూర్జటి మహాకవి.


భావము:స్వామీ! కాళహస్తీశ్వరా! నీభక్తులందరూ అసాధ్యమైన కార్యములొనరించి నీమెప్పువడసినారు.తెలిసీతెలియనివాడనునాభక్తియెట్టిదో నాకేతెలియనిపామరుడనునీతో యుధ్ధమొనర్చుటనాతరమా?కవిత్వమును జెప్పినిన్నుమెప్పించు శక్తియు లేనివాడనే, నీకొరకు కన్నతండ్రినైనను జంపుసాహసములేదే,నాచేతిరోకటితో నిన్నుదంచలేనే?మరియెట్లుస్వామీ నీసన్నిధినిచేరుట.నాకాఉపాయమేదో ఉపదేశింపుమని కవియభవుని అడుగుచున్నాడు.


విశేషములు:

ఇందు నిందాస్తుతి యలంకారమున్నది.నిందించుచున్నట్లు పైకిగానవచ్చినను వ్యంగ్యముగా శివుని ,యతనిభక్తులను ప్రశంసించుటయే కవియొనరించినకార్యము.

1అర్జునుడు పాశుపతాస్త్రముకొరకై తపమొనర్చునపుడు మాయాకిరాతవేషధారియగుశివునితో యుధ్ధమొనరించును.ఆరీతిగా నీతో యుధ్ధము నేనుచేయలేనుస్వామీ!అనుచున్నాడు.(సమరమున అర్జునుడు శివునిపలురీతులనొప్పించెను)

2నత్కీరుడనే శివభక్తుడు శివునికవిత్వమునతప్పులుబట్టి తనకవితాశక్తితో శివుని మెప్పించినాడు.నాకు అటువలె కవితచెప్పుశక్తిలేదనుచున్నాడు.

3విచార,శర్మయనునాయనారు పశువులను మేపుటకుగొనిపోయి,భక్తిపారవశ్యమున మునుగ,పశులు పంటపొలమునబడినవి.ఇదేమిరాయని అడుగ వచ్చిన తండ్రిని తనఏకాగ్రతకుభంగముకల్గించెనని, కోపావేశమున గొడ్డలితోనరకును.అదిగో ఆనాయనారువలె తండ్రిని చంపలేననుచున్నాడు.


4చిరుతొండనంబియను శివభక్తుడు కపటజంగముకోర్కెదీర్చుటకై కొమరుని జంపి యతనిశిరోమాంసమునురోకటదంచి కూరవండి పెట్టినాడు.


ఈరీతిగా శివభక్తులు చేసినత్యాగములను నేనుచేయలేని యశక్తుడననుచు,"చీకాకునాభక్తి"-యనుచున్నాడు(.అనగా తనభక్తిస్వరూప స్వభావ ులేవో చెప్పుటకు వీలులేనిది)

అట్టిశక్తిహీనుడను నన్ను నీవే నీదరికి చేర్చుకొనవలె ననుచున్నాడు.

                     స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఆశీర్వాదం

 🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏


*అర్చకుని*

   *పురోహితుని*

      *బ్రహ్మణుడి*

🙌 *ఆశీర్వాదం విలువ*

         

🌷🙌🌷🙌🌷🙌🌷        


*ఒకరోజు ఒక కోర్టులో జడ్జి గారి ముందుకు ఒక కేసు వచ్చింది.*

     *ఫిర్యాదు దారుడు ఒకతను ఈ విధంగా ఫిర్యాదు చేశాడు.*

       

       ఒక పురోహితుడు  సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి Tax కూడా చెల్లించడం లేదు,

       కావున తమరు విచారణ జరిపి అక్రమ సంపాధరణ దారుడిగా గుర్తించి తగిన విధంగా శిక్షించగలరని పిర్యాదు.

 

*జడ్జి :-* పురోహితుణ్ణి పిలిచి ఈ విధంగా ప్రశ్నించారు. మీరు మీ వద్ద ఉన్న ధనం అక్రమంగా సంపాధించారా లేక సక్రమంగా సంపాధించారా   అని

*పురోహితుడు:-* ఈ విధంగా సమాధానం ఇచ్చాడు

నేను సంపాదించినదంతయు సక్రమమే  ఇసుమంతయు అక్రమం కాదు అని

*జడ్జి :-* అంత సంపాదన సక్రమంగా ఎలా సంపాదించావో వివరించు

*పురోహితుడు :-* అయ్యా!

ఒక రోజు ధనవంతులైన దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి చెరువు వద్దకు వచ్చారు నేను ఆ సమయంలో సంధ్యావంధనం చేస్తున్నాను. ఆ సమయంలో వారు చేసుకోబోయే అకృత్యాన్ని చూసి వారించాను ఆత్మ హత్య మహా పాపం అని వివరించి వారిని ఆ ప్రయత్నం నుండి విరామయింప చేసి సాంతన కలిగించాను. నా మాటపై విశ్వసంతో వెనుదిరిగి వెళ్లారు కొద్ది రోజుల తరువాత నాపై గౌరవంతో వద్దన్న వినకుండా కొంత ధనాన్ని ఇచ్చి ఆశీర్వదించండి అని వేడుకున్నారూ.

దానికి ప్రతిఫలంగా సంతానా సిద్ధిరస్తు అని ఆశీర్వాదం ఇచ్చాను. కొన్ని సంవత్సరాల తరువాత వారికీ కలిగిన సంతానాన్ని వెంటబెట్టుకొని ఆనందంతో నావద్దకు వచ్చి నా కుమారునికి మీ ఆశీస్సులు అందచేయండి అని ప్రాధేయపడ్డాడు. దానికి నేను ఆపిల్లవాడు బాగా చదివి ప్రయోజకుడు అవుతాడు నీకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తాడు అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ సమయంలో ఆనందంతో మరికొంత ధనం ఇచ్చి వెళ్ళాడు.మరికొన్ని సంవత్సరాల తరువాత ఈ మధ్యనే అదనవంతుడు తన కుమారుడు ప్రయోజకుడాయ్యాడనే విషయం తెలియజేయడానికి నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం అడిగాడు

నేను ఆదంపతులిద్దరిని ఆయురారోగ్య వృద్ధిరస్తు అని ఆశీర్వదించా.

అతను తన వద్ద ఉన్న ధనంలో కొంత ధనాన్ని ఇచ్చి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు.

అయ్యా! ఈ విధంగా నేను ధనవంతుణ్ణి అయ్యాను. నేను సంపాధించింది సక్రమమైనదో లేక అక్రమమైనదో  తమరే తీర్పు ఇవ్వండి అని సెలవిచ్చారు.


-పై విషయం అంత సావధానంగా విన్న జడ్జి తీర్పు ఇచ్చాడు. ఆరోజున ఆత్మ హత్య చేసుకోవాలనుకున్న ఆదంపతులను ఈ పురోహితుడు వారించకుండా ఉంటే వారికీ తర్వాత జీవనం ఉండేది కాదు. కొన్ని రోజులకు వారు తప్పు తెలుకొని పశ్చాత్తాపంతో కృతజ్ఞత పూర్వకంగా కొంత ధనం ఇవ్వడం పూర్తిగా ఆమోదయోగ్యమైనది ఆ ధనం సక్రమమైనదే

కొన్ని రోజులకు వారు సంతానవంతులై పుత్రుడు పుట్టాడనే ఆనందంలో మరికొంత ధనం ఇచ్చాడు అధియును సక్రమైనదేగా

మరికొన్ని రోజులకు కొడుకు ప్రయోజకుడాయ్యాడనే సంతోషం తో కొంత ధనం ఇచ్చాడు ఇది కూడా సక్రమమే

మరియు ధనవంతుని శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉంటుందని తెలుకొని ఆనందంగా జీవిస్తున్నాడు

ఈ విషయంలో ఎక్కడ పురోహితుని సంపాధన అక్రమమని తెలుపలేము అని తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంలోనే జడ్జి గారు ఇలా అడిగారు


*జడ్జి:-* 

అయ్యా ఇంత ధనాన్ని మికిచ్చి పుణ్యాత్ములైన ధనవంతులు ఎవరో తెలుకోవాలనే ఉత్చాహం ఉన్నాను ఎవరో తెలుపగలరా అని.


*పురోహితుడు :-* 

ఆ పుణ్య దంపతులు మీ తల్లిదండ్రులే! అని తెలియచేసాడు.


దుఃఖంతో తను కూర్చున్న స్థానం నుంచి దిగి వచ్చి పురోహితునికి షాష్టాంగ నమస్కారం చేసారు జడ్జి.


🙌 *బ్రాహ్మణుడి ఆశీర్వాదం ఎంతో శక్తివంతమైనది.* 🙌


🌷🙌🌷🙌🌷🙌🌷🙌🌷సే క ర ణ: వేదుల జనార్ధన రావు.

మిగుల్చు కోరాదు

 🪔 *ॐ卐 _సుభాషితమ్_ ॐ卐* 💎 


శ్లో𝕝𝕝 

ఋణశేషోగ్ని శేషశ్చ     

శత్రుశేషస్తథైవ చ 

పునః పునః ప్రవర్ధంతే 

తస్మాచ్ఛేషం న రక్షయేత్!!


తా𝕝𝕝 ఋణశేషం, అగ్నిశేషం, శత్రుశేషం మరల మరల ప్రవృద్ధమౌతాయి. అందువల్ల ఆమూడింటినీ మిగుల్చు కోరాదు అని ఈ శ్లోకానికి అర్థం.

పంచాంగం 23.03.2024

 ఈ రోజు పంచాంగం 23.03.2024 Saturday,

 

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతు ఫాల్గున మాస శుక్ల పక్ష: త్రయోదశి తిధి స్థిర వాసర: పూర్వఫల్గుని నక్షత్రం శూల యోగ: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


త్రయోదశి ఉదయం 07:17 వరకు.

పూర్వఫల్గుని ఈ రోజు పూర్తిగా ఉంది.

సూర్యోదయం : 06:22

సూర్యాస్తమయం : 06:24


వర్జ్యం : మధ్యాహ్నం 01:28 నుండి 03:17 వరకు .


దుర్ముహూర్తం : ఉదయం 06:22 నుండి 07:58 వరకు.


అమృతఘడియలు : రాత్రి 12:19 నుండి 02:08 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.



శుభోదయ:, నమస్కార: