11, ఏప్రిల్ 2024, గురువారం

మూత్రాశయంలో రాయిని

 5 రోజుల్లొ మూత్రాశయంలో రాయిని నిర్మూలించే రహస్య సిద్ధ యోగం - 


    యవాక్షారం ని చూర్ణం చేసి 4 చిటికెల చూర్ణం ఉదయం మరియు సాయంత్రం నీటిలో కలిపి తీసుకున్న మూత్రంలో రాళ్లు అడ్డుపడే అశ్మరి వ్యాధి అంతరించును.


 గమనిక - 


       అశ్మరి వ్యాధి అనగా మూత్రాశయంలో రాళ్లు ఏర్పడే వ్యాధి . శరీరతత్వాన్ని బట్టి 5 నుంచి 8 రోజుల్లో హరించును . 


 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కర్పూరం

 కర్పూరం గురించి సంపూర్ణ వివరణ - 2 . 


    ఇంతకు ముందు పోస్టు నందు మీకు కర్పూరం మరియు దానిలోని రకాల గురించి వివరించాను . ఇప్పుడు మీకు పచ్చకర్పూరం గురించి వివరిస్తాను . 


 పచ్చకర్పూరం - 


     ఇది రుచికి చేదుగా , వెగటుగా ఉండును. ఇది శరీరము నందలి అత్యుష్ణమును , రక్తపిత్త రోగమును , క్రిమి రోగము , కఫ , దాహ , తాప , పిత్తవికారము , వాతపిత్త రోగము , వాతశ్లేష్మము , నేత్రవ్యాధులు , అన్నిరకాల మూత్రవ్యాధులు పోగొట్టి విరేచనము కలిగించి , బుద్ది కుశలత , మాటనేర్పు , శరీరబలము వచ్చును . నోటి దుర్గన్ధము తీసివేయును . ఈ పచ్చకర్పూరమును పిల్లలకు మరియు పెద్దలకు తగిన మోతాదులో మాత్రలు కట్టి వాడించుచున్న ఎన్నో పెద్దరోగాలను పోగుట్టును . దోషముతో ఉన్నప్పుడు , ఆకలిదప్పికలతో ఉన్నప్పుడు , కడుపుబ్బు , శృంగార సమయము నందు , గుర్రపుస్వారీ వంటి సమయముల యందు ఈ పచ్చకర్పూరం సేవించిన శ్రమను పోగొట్టి శరీరముకు ఉల్లసము కలిగించును .  


      తరవాతి పోస్టు నందు మరికొన్ని ముఖ్యమైన కర్పూరాల గురించి వివరిస్తాను. 


 

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

పక్షవాతం

 పక్షవాతం - వివరణ - ఔషధాలు . 


   పక్షవాతం అనగా శరీరం నందలి ఏదేని ఒక భాగం చచ్చుబడిపోవడం . సామాన్యముగా పక్షవాతంలో ఒక కాలు , ఒక చెయ్యి కాని లేదా రెండుకాళ్లు గాని చచ్చుబడును . ఈ వ్యాధి రక్తపోటు అధికం అయినప్పుడు మెదడులోని నాడులు చచ్చుబడిపోయి మాటకూడా పడిపోవును . ఇది ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే వచ్చేది కాని ప్రస్తుతం ఇది మానసిక ఒత్తిడుల వలన నలభై సంవత్సరాల వారికి కూడా వచ్చుచున్నది. ఒకసారి పక్షవాతం వచ్చినచో సరైన చికిత్స తీసుకున్నచో మూడు నుంచి ఆరు నెలల సమయంలో రోగి కోలుకొగలడు . 


  పక్షవాతం రావడానికి గల కారణాలు - 


 * రక్తపోటు .

 * మానసిక ఒత్తిడి . 

 * నాడి దౌర్బల్యము . 

 * అతి సంభోగము . 

 * అనిద్ర . 

 * అతి వ్యాయామము . బరువులు ఎత్తుట . 

 * అతిగా మాట్లాడుట . 

 * మద్యపానం , ధూమపానం . 


  పక్షవాతం లక్షణాలు - 


 * తల తిరగటం . 

 * కాలు , చెయ్యి తిమ్మిర్లు . 

 * రక్తపోటు . 

 * మెడ నరములు లాగడం . 

 * నిద్రపట్టకపోవడం . 

 * నడవలేకపోవడం . 


  ఔషధయోగాలు - 


 * జాజికాయ నీటితో అరగదీసి చచ్చుబడిన అవయవానికి పట్టువేయవలెను . 


 * కసవింద చెట్టు రసము నందు వెన్న కలిపి చచ్చుబడిన అవయవానికి మర్దన చేయవలెను . 


 * వెల్లుల్లి , పసుపు కలిపి నూరి మర్దించవలెను . 


 * నువ్వులనూనెతో మిరియాల చూర్ణం కలిపి చచ్చుబడిన అవయవానికి మర్దన చేయుచున్న పక్షవాతం తగ్గును. 


  

 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

ఓంకారం ప్రణవ స్వరూపం

 *ఓంకారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి..??* 🕉️


 *ఓంకారం ప్రణవ స్వరూపం* 


🌷🌷" ఓం " అనేది ప్రణవ స్వరూపం, శబ్దమయం.🌷🌷


🌿1. అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న విశ్వంలో ఆకాశ తత్వంతో నినదించిన తొలి వాక్కు, బ్రహ్మవాక్కు - ఓంకారం! అది అకార, ఉకార, మకారాలనే బిందు సంయుక్తంగా ఏర్పడిన మొట్టమొదటి శబ్దం.


🌿2. అకారం సృష్టికి, ఉకారం పోషకత్వానికి, మకారం లయకారకత్వానికి చిహ్నాలు.


🌿3. ఓంకారం - బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వం.


🌿4. అది కేవలం ఓం మంత్రం కాదు; అన్ని మంత్రాలకూ అదే - బలం, జీవం, శక్తిరూపం.


🌿5. ‘ఓంకారం లేని మంత్రం ప్రాకారం లేని గుడి వంటిది’ అని పెద్దల మాట. 


🌿6. మంత్రాలకు పరిపుష్టినిచ్చేది, రక్షణ కల్పించేది ఓంకారం. ఓం అనేది ఒక మతానికి సంబంధించినది కాదు. 


🌿7. అది ప్రార్థనా మందిరం లోని ఘంటానాదం.


🌿8. ప్రతి మనిషి గుండె చప్పుడూ అదే.


🌿9. నిత్యమూ యోగులు, మహర్షులు జపించేది, మోక్షదాయకమైనది ఓంకారం అని వేదం ప్రకటించింది.


🌿10. ప్రతి నిత్యం 21 మార్లు ఓంకారం జపించడం వల్ల, మనిషి శరీరంలోని 21 తత్వాలు - అంటే, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కోశాలు, పంచ ప్రాణాలు, మనసు ఉత్తేజితమవుతాయని యోగ శాస్త్రం చెబుతోంది. మనిషి జన్మ ‘సోహం’తో ప్రారంభమవుతుంది. సో అని వూపిరి పీల్చడం, హం అని వదలడంతో జన్మ ప్రారంభమవుతుంది.


🌿సో నుంచి హం వరకు - అంటే గాలి పీల్చి జీవితాన్ని ప్రారంభించి ‘హం’ అంటూ వదిలి నిర్గుణత్వానికి మళ్లేవరకు, ‘కోహం’లోనే జీవిత అన్వేషణ సాగాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. కోహం అంటే, నేనెవరు అని ప్రశ్నించుకోవడం. తానెవరో, ఎందుకు జన్మించాడో, ఏ మార్గంలో వెళ్లడానికి ప్రయత్నించాలో మనిషి తెలుసుకోవడం; చివరకు ఎక్కడికి చేరుకోవాలో బోధించేవే.


🌿11. వేదాలు, ఉపనిషత్తులు, ఇతర పురాణాలు. వీటిన్నింటికీ ఓంకార సాధనే మూలాధారం.విమానం దూరంగా ఉన్నప్పుడు శబ్దం తక్కువగా ఉంటుంది. దగ్గరకు వచ్చేకొద్దీ, ఆ శబ్దం పెద్దదిగా మారుతుంది. విమానం తిరిగి దూరంగా వెళ్లిపోయినప్పుడు, శబ్దం చిన్నగా మొదలై, సాగి, ఆ తరవాత ఆగిపోతుంది. అలాగే ఓంకార శబ్దాన్ని మొదట చిన్న శ్రుతిలో మొదలుపెట్టి, తారస్థాయికి చేర్చి, చివరకు హం అనే శబ్దంతో ముగించాలి. నాభి నుంచి శబ్దాన్ని ప్రారంభించి, గొంతులో కొనసాగించి, పెదవులతో ముగించాలని యోగశాస్త్రంలోని ‘ఓంకారోపాసన’ తెలియజేస్తుంది.


🌿ఓంకార శబ్దసాధనకు, సంగీత సాధనకు దగ్గరి సంబంధం ఉంది. మంద్ర స్థాయి, తారస్థాయి- రెండూ సంగీత శ్రుతిలో మేళవించి ఉన్నట్లే, ఓంకార నాదమూ ఉంటుంది. అది లయబద్ధంగా సాగినప్పుడు - వ్యాధుల నుంచి ఉపశమనంతో పాటు శరీరానికి జవసత్వాలు లభిస్తాయని చెబుతారు. మానవుడు సత్వ, రజో, తమోగుణాలతో ఉంటాడు. 


🌿12. అతిశయం, అహంకారం అతణ్ని వశం చేసుకున్నప్పుడు - పూర్తిగా సత్వగుణంలోకి మనసును నడిపించి సత్య ధర్మ శాంతి ప్రేమలను అందజేసే ఔషధమే ఓంకారం! 


🌿13. సత్యాన్వేషణలో మనిషికి సహకరించేది, ఆధ్యాత్మిక చింతన వైపు అతణ్ని మళ్లించేది, ఆవేశాన్ని అణచి అహింసా మార్గం వైపు నడిపించేది ఓంకారోపాసన - అని మహాత్మాగాంధీ అనేవారు.సీతను రావణుడు అపహరించడంతో, శ్రీరామచంద్రుడు దుఃఖితుడయ్యాడు. ఆమె జాడ కనుగొనే యత్నంలో, సుగ్రీవుడితో మైత్రి సాగించాడు. అనంతరం సీతాన్వేషణకు ఆంజనేయుణ్ని దక్షిణ దిక్కు వైపు పంపించాడు. 


🌿శత యోజనాల సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమయ్యాడు హనుమ. మహేంద్ర పర్వతం మీద నుంచి ఎగరడానికి ఆయన సన్నద్ధమైన తీరు ఓంకార తత్వాన్ని తెలియజేస్తుంది. ఆకాశమార్గాన వెళ్లాలని నిశ్చయించుకొన్న మారుతి, వూపిరి దీర్ఘంగా పీల్చి వదులుతూ కొంతసేపు ప్రాణాయామ స్థితిలో ఉన్నాడు. ఒక్కసారిగా శక్తినంతా కూడదీసుకొన్న ఆయన, ప్రణవ నాదం(ఓం శబ్దం)తో కుప్పించి ఆకాశవీధిలోకి ఎగిరాడని సుందరకాండ వెల్లడిస్తుంది.


🌿14. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల పునరుద్ధరణకు; మంత్ర జపాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు, ఆత్మశక్తితో జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు అనువైన సాధనే - ఓంకారం. యోగులు సంకల్పాలను నెరవేర్చుకొనే క్రియ. 


🌿15. ఓంకార సాధన అందరికీ ఆరోగ్యకరం, ఆనందదాయకం.

రఘు రాముడు

 🙏🏽💅🏼💅🏼💅🏼💅🏼🙏🏽"

    "Jai Shri Ram 

Kancherla Venkata Ramana 

   

         🌹🌹🌹

👍" రఘు రాముడు"

    🙏" ఏ గారడీలు, ఏ మహిమలు, లేకుండా సంపూర్ణముగా మానవుడుగా ఈ లోకమునకు దిగివచ్చిన అవతారము" శ్రీ రామావతారం." అందుకే అన్ని అవతారాల కంటే "రామావతారం" మనవాళి కంతకు అత్యంత సన్నిహితం. అత్యంత ప్రియం, కేవలం ఆదర్శాలు, ఆశయాలు వర్ణించటంతోనే, సరిపెట్టకుండా వాటిని "ఆచరణ , అనుష్టానరూపాలలో రాముడేలా చేశాడు? ఎలా అన్ని జాతులను సమానంగా ఆదరణతో చూశాడు. అన్న విషయం చెప్తుంది! "రామాయణం" అధికారంలో ఉన్న అపక్ర, విక్రమ, పరాక్రమ సంపన్నుడై! "జ్ఞాన రుద్దుడైన". తోటి మానవులతో ఎలా మెలగాలి ? ఎదురుపడితే ఎలా ముందే వారిని పలకరించాలి? పెద్దల ఎడల ఎలా వినయంగా ఉండాలి? అన్న విషయాలను రాముని ద్వారా "రామాయణం" మనకు చెప్తుంది. ఆ విషయాలే మనము పిల్లలకు నేర్పాలి. "ప్రజలందరూ కలిసి మీరు మాకు నాయకుడుగా ఉండాలి ? అని ప్రార్థిస్తే! "రాముడు" నాయకుడయ్యాడు. గాని! మిమ్మల్ని నేను పరిపాలిస్తాను. మీ ఓట్లు నాకు ధర్మం చేయండి! బాబు అని "ముష్టి" అడుక్కునేవాడుగా నాయకుడు కాలేదు. రామాయణం ఒక భర్తకు ఒక భార్య అనే ఏకపత్నీవ్రతాన్ని గూర్చి, ఒక భార్యకు ఒక భర్త అనే ప్రాతివత్యా ధర్మాన్ని గూర్చి , దాని అవసరాన్ని గూర్చి చెప్తుంది. రామాయణం ఈ విషయం అంత సదుపాయంగా ఉండక, నచ్చనటువంటి వాళ్ళు ఇదెక్కడి ధర్మం ! మా ఇంట వంట లేదు, అనే వాళ్ళు ఉండవచ్చు! రామాయణం చదువుతున్నంతసేపు అది ఎంత కల్ప వృక్షం లాంటిదైనా అటువంటి వారి పరిపాలిటి కదే విషవృక్షంగానే కనబడుతుంది. ఎంత విశాలంగా బల్లకి- బల్లకి, "గోడకు -బల్లకూ" దూరంగా బెంచి పై ఇద్దరి కంటే ఎక్కువ మంది లేకుండా వెలుతురు ఉండి , సమస్త సదుపాయాలతో ఉన్న కాపీ కొట్టుకునే మనస్తత్వం గల విద్యార్థి పాలిటి కది ఎంత విషం లా ఉంటుంది. "రామాయణం" లో చెప్పిన విషయాలు నచ్చని వారి పాలిటికి రామాయణం కూడా అంతా విషతుల్యమే! "తిరునాళ్ల వాతావరణ క్రమబద్ధమైన రాకపోకలు గల ప్రదేశము దొంగలకెంత అసౌకర్యము. కదా ! "కల్ప వృక్షం " లాంటి రామాయణం కూడా సమాజంలో స్వేచ్ఛగా,

విశృంఖలంగా సౌర్యవిహారం, చేద్దామనుకునే వారికి అంత సౌకర్యాన్ని, వారికి నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. "రామాయణం అన్నం పెట్టింది . రామాయణం లిఖించటం వలన, వినటం వలన, పఠించటం వలన కలిగే , ఫలం ఇదన్నమాట.

"వాల్మీకి రామాయణం" లో రాముడు ఏ విధంగా ప్రవర్తించినది, చేసినది, అలాగే మీరు చెయ్యటం ప్రవర్తించటం, ఇష్టమైతే ఆ ఇష్టమైన వాళ్లే చదువుకోండి! కష్టమైతే ఊరుకోండి! అన్నదే సమాధానము "మఖ లో పుట్టి "పుబ్బ" లో పాడిపోయే నులిపురుగులాంటి పుస్తకాలు, కొల్లలు. వివిధ సాహిత్య ప్రక్రియలలో వస్తున్నాయి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రాసినా రామాయణం ఇప్పటికీ ఆరాధించబడి "అమృతంలా" ఆస్వాదించబడుతోంది. ఇక ముందు కూడా దాని స్థానము చెక్కుచెదరని, 

కొండలు ,నదులు, సముద్రాలు ఉన్నంతవరకు ఈ రామాయణ ఇతిహాసాలు జీవిస్తాయి. ఇటువంటి సందేహం లేదు. " నేడు "అయోధ్య " లో బాల రాముడు, ఆలయమునకు వచ్చిన ఊహించని స్పందనే దానికి తార్కాణం. కోర్టు ఉత్తర్వులు, దగ్గర నుండి

వాదనలు, విన్న వెంటనే జడ్జిమెంట్ ఇచ్చిన తీరు.

అసమాన్యము.

"🚩 Jai Shri Ram 

Kancherla Venkata Ramana 

🙏💐💐💐💐🙏🏽

ఉగాది

 ఉగాది.


తెలుగు నేలకు కొత్త సొగసులు

జనియించిన కాల కొలమానము

నూతన వస్త్ర అలంకరణము

క్రోధి నామ సంవత్సర కాల గమనం.


షడ్రుచుల సమ్మేళనం

ఉగాది పచ్చడి సేవనం

శరీరానికి మరో ఔషధం

ఆరోగ్యానికి హితం.


పులుపు రోగనిరోదకం

మధురం ఆహ్లదకరం

వగరు కాయం ఉత్తేజం

కారం ఉష్ణోగ్రత నియంత్రణ

లవణం శరీర స్వాంతన

చేదు క్రిమి నాశనం.


వసంతకాల వేడిమి

క్రమబద్దీకరించేలా

శరీర ధర్మాల నడవడికల

క్రమపద్దతిలో నడిపించే

దివ్యామృతం..ఈ ఔషధం.


యుగ ఆదిగా పిలిచే యుగాది

తెలుగు నేలలో ఉగాది


వసంత ఋతువుతో

ఆరంబమై నేలతల్లికి

వేడిమి కలిగిస్తూ

వర్ష ఋతువులో పుడమి

నందు చినుకులా పయణిస్తూ

శిశిర ఋతువు చివర వరకు

ప్రకృతిని శీతలంగా ఉంచే

కాలగమనమే సంవత్సరము.


ప్రతి యేట

నూతన సోయగాలతో వస్తుంది

కొత్త నామంతో పిలువ బడుతుంది.


నేలతల్లి అవ్వాలి

పాడి,పంటల లోగిలి,

ఈ ఉగాది జీవుల

ఆకలిదప్పులు తీర్చే

యుగాదిగా నిలవాలి.


సర్వే జన సుఖినోభవంతు.


మీ 

అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

ఋతువు కాలాలు*

 *ఋతువు కాలాలు*.... హిందూ చాంద్రమాన మాసాలు... ఆంగ్ల నెలలు లక్షణాలు.... *ఋతువులో వచ్చే పండుగలు*..

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *1 వసంతఋతువు Spring*:-

 చైత్రం, వైశాఖం ~ ఏప్రిల్13 నుండి జూన్ 10 సుమారు 20-30 డిగ్రీల ఉష్ణోగ్రత; వివాహాల కాలం ఉగాది, శ్రీరామ నవమి, వైశాఖి, హనుమజ్జయంతి


 *2 గ్రీష్మఋతువు Summer* :-

జ్యేష్టం, ఆషాఢం ~ జూన్ 11 నుండి ఆగస్టు 8 బాగా వేడిగా ఉండి 40 డిగ్రీల ఉష్ణోగ్రత, వటపూర్ణిమ, రధసప్తమి, గురుపూర్ణిమ.


 *3 వర్షఋతువు Monsoon* :-

శ్రావణం, భాద్రపదం ~ ఆగస్టు 9 నుండి అక్టోబరు 6 చాలా వేడిగా ఉండి అత్యధిక తేమ కలిగి భారీ వర్షాలు కురుస్తాయి. రక్షా బంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి..


 *4 శరదృతువు Autumn*:- ఆశ్వయుజం, కార్తీకం ~ అక్టోబరు 7 నుండి డిశంబర్ 4 తక్కువ ఉష్ణోగ్రత నవరాత్రి, విజయదశమి, దీపావళి,శరత్ పూర్ణిమ , బిహు, కార్తీక పౌర్ణమి...


 *5 హేమంతఋతువు Winter*- మార్గశిరం, పుష్యం ~ డిసంబరు 5 నుండి ఫిబ్రవరి 1 చాలా తక్కువ ఉష్ణోగ్రతలు (20-25 డిగ్రీలు) పంటలు కోతల కాలం పంచ గణపతి భోగి, సంక్రాంతి, కనుమ.


 *6 శిశిరఋతువు Winter & Fall* :- మాఘం, ఫాల్గుణం ~ ఫిబ్రవరి 2 నుండి ఏప్రిల్ 1 బాగా చల్లని ఉష్ణోగ్రతలు, 10 డిగ్రీల కంటే తక్కువ,ఆకురాల్చు కాలం వసంత పంచమి, రథసప్తమి/మకర సంక్రాంతి, శివరాత్రి, హోళీ


🌹🌹💐💐🌹🌹

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*11-04-2024 / గురువారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. ఇంటాబయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారమున లాభాలు అందుకుంటారు.

---------------------------------------

వృషభం


వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

---------------------------------------

మిధునం


వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సోదరులతో శుభకార్యాలు గూర్చి చర్చిస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

---------------------------------------

కర్కాటకం


అనారోగ్య సమస్యల నుండి బయట పడతారు. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

సింహం


సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు కొంత వరకు తొలగుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్త్ర వస్తు లాభాలు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు.

---------------------------------------

కన్య


నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభిస్తాయి.

---------------------------------------

తుల


భాగస్వామ్య వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిదికాదు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------

వృశ్చికం


జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

---------------------------------------

ధనస్సు


వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఇంటాబయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

---------------------------------------

మకరం


ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

---------------------------------------

కుంభం


నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. భూ సంభందిత క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు అధిగమిస్తారు. 

---------------------------------------

మీనం


స్ధిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి. వాహన యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో సమయపాలనతో పనులు పూర్తి చేస్తారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

10, ఏప్రిల్ 2024, బుధవారం

అధర్మఫలం

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝  

*యది నాత్మని పుత్రేషు నచేత్పౌత్రేషు,నప్తృషు౹*

*నత్వేవ తు కృతోஉధర్మః కర్తుర్భవతి నిష్ఫలః॥*



*మానవుడు తాను చేసిన అధర్మఫలం తాను అనుభవించకపోతే, దానిని అతని కుమారుడు గానీ, అతని మనుమడు గానీ, మునిమనుమడు గానీ తప్పక అనుభవించ వలసినదే*.... అధర్మఫలకర్తృత్వం ఎప్పటికీ సమసిపోయేదికాదు ..... చేసిన నేరాలకు శిక్ష ఎప్పటికైనా తప్పదు....

శుద్ధజలము

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 

*నాస్తి మేఘసమం తోయం*

*నాస్తి చాత్మసమం బలమ్‌౹*

*నాస్తి చక్షుఃసమం తేజో*

 *నాస్తి ధాన్యసమం ప్రియమ్‌॥*


తా𝕝𝕝 మేఘ జలముతో సమానమైన శుద్ధజలము లేదు....ఆత్మ బలముతో సమానమైన బలము శరీరములో కాని పృథివిలో కాని రెండవది లేదు....కన్నుతో సమానమైన తేజస్సు గల యింద్రియము శరీరములో మఱొకటి లేదు.... ధాన్యముతో (అన్నముతో) సమానమైన వస్తువు మఱొకటి లేదు.

విచార సంగ్రహం- 15 .

 విచార సంగ్రహం- 15 .

( భగవాన్ రమణమహర్షులు )


ఈ చిన్నగ్రంధము ఎంతో విలువైనది. ఎందువలన అంటే, 1901 -02 లో భగవాన్ రమణమహర్షి మౌనవ్రతంలో వుంటున్నప్పుడు, వారి పాదాలను ఆశ్రయించుకుని వున్న బ్రాహ్మణ పరమ భక్తాగ్రేసరుడు అయిన ‘ గంభీరం శేషయ్య ‘ గారికి ఆకాలంలో, వారు అడిగిన సందేహాలకు రమణులు వ్రాతపూర్వకంగా అనుగ్రహించిన వేదాంతసారం, యిందులో పొందుపరచ పడినది. 


ఇందులో ముముక్షువులైన సర్వాధికారులకు అధికఫలం ఇచ్చే ఉపదేశములు వుండడడం వలన ఇది ' విచార సంగ్రహము ' అనే పేరుతో పిలువబడినది.


జ్ణానాష్టాంగము 


ఇక్కడ మనం యమనియమాలను గురించి క్లుప్తంగా చెప్పకుందా౦  


ముందుగా ‘ యమము ‘ అంటే, ' దేహము మొదలైన అనాత్మ విషయాలు అనిత్యము అయినవి. '  అని తెలుసుకుని, ఇంద్రియ వృత్తుల వ్యాపకాలను అణచివేయుట.   విషయ రహితమైన, దృశ్య రహితమైన ప్రపంచంలో మనస్సును నిలపడానికి నిరంతరమూ కృషి చెయ్యడం.   


‘ నియమము ‘ , ఆత్మ సంబంధమైన అనగా పరమాత్మ విషయముల మీద అపరిమిత ఆసక్తి పెంచుకోవాలి.  విజాతీయ విషయములందు, తిరస్కారము చూపించాలి.  


ఇక ‘ ఆసనము ‘ అనగా, ధ్యానానికి కూర్చునే ముందు, ఫలానా విధమైన ఆసనం వుండాలనే నిబంధన ఏదీలేదు.   దేనిమీద కూర్చుంటే, ఎడతెగని బ్రహ్మచింతన సుఖముగా వీలు అవుతుందో,  దేహముఎక్కడ సహకరిస్తుందో, అదే సరిఅయిన ఆసనము.  అయితే అలాంటి సుఖమైన ఆసనము నిద్రలోకి దారితీసేటట్లు వుండకూడదు.  


ప్రాణాయామము :   రేచకమంటే వాయువును ముక్కు రంధ్రములద్వారా బయటకు వదలడం అని చెప్పుకున్నాముకదా ! ఆ బయటకు వదలడమనే ప్రక్రియను దేహాది అనిత్య ప్రపంచము యొక్క నామ రూపాలను బయటకు వదలడంగా అన్వయించుకోవాలి.  పూరకమంటే,  వాయువును గ్రహించడం అని తెలుసు కదా !   నామరూపములను వదిలిన తరువాత కలిగే సత్ చిత్ ఆనందములనే మూడు అంశాలను గ్రహించినట్లు భావించాలి.   కుంభకం అనగా వాయువును  బంధించి వుంచుకున్నట్లు,  ఆ గ్రహి౦చిన సచ్చిదానంద స్వరూపాన్ని నిలుపుకోవడమే.    


‘ ప్రత్యాహారం ‘ అనగా, రేచకంలో వదిలిన నామ రూపములను మనస్సు మరల గ్రహించుకోకుండా కాపాడుకోవడం.   మరి ‘ ధారణ ‘ అంటే, కుంభకం లో పూరించుకున్న సచ్చిదానంద స్వరూపమే తన ఆత్మస్వరూపం అని తెలుసుకున్న తరువాత, దానిని మనసు దాటి వెలుపలకు పోనీయకుండా, హృదయ కమలంలో నిలుపుకొనడం.  


‘ ధ్యానం  ‘ అంటే, పంచకోశయుత దేహము నేనుకాదని బాగుగా గుర్తెరిగి  ' నేను ఆత్మ స్వరూపమును  ' అని నిశ్చయించుకుని,  అహం స్వరూపంలో ఎడతెగకుండా వుండుట.  చివరగా, ‘ సమాధి స్థితి ‘ అంటే, అహం స్ఫురణ కూడా  కొట్టుకునిపోయి వున్న పరబ్రహ్మ సాక్షాత్కార స్థితి.  అనగా తురీయాతీత స్థితి అని చెప్పుకున్నాము కదా !  అది  అన్నమాట. 


ప్రాణాయామము గురించి మరికొంత రేపు తెలుసుకుందాం.  


స్వస్తి.

రమణుల అనుగ్రహంతో....🙏🏻🙏🏻🙏🏻🙏🏻

*సప్త వ్యసనాలు

 *సప్త వ్యసనాలు అంటే ఏమిటి?*


ఏ మనిషయినా దుర్వ్యసనాలకి లోనయితే జీవితంలో బాగుపడలేడు. 

ఈ వ్యసనాలకి లోనయి నాశనమయ్యేవాళ్ళు ఈ కాలంలోనే కాదు, పూర్వమూ వున్నారు. ముఖ్యంగా దుర్వ్యసనాలు ఏడు అంటారు. అవేమిటంటే

*1.పరస్త్రీ వ్యామోహం – ఏ కాలంలోనైనా మనిషిని అధఃపాతాళానికి తొక్కేసే వ్యసనం ఇది. ఈ వ్యసనంతో సర్వనాశనం తెచ్చుకున్నవాళ్ళల్లో పూర్వ కాలంలో రావణాసురుడు ముఖ్య ఉదాహరణ. సీతాదేవిని అపహరించి, ఎన్నో కష్టాలను కొని తెచ్చుకోవటమేగాక తన కుటుంబాన్నీ, వంశాన్నీ, అయినవారినీ, చివరికి రాజ్యాన్నికూడా కోల్పోయాడు.

*2.జూదం .. ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు. (ఆంతటి గొప్పవాడే ఆ రోజుల్లో అన్ని అవస్తలు తాను పడటమే కాకుండా, తన తమ్ములూ, భార్యా కూడా అవస్తలు పడటానికి కారకుడయ్యాడే, మరి ఈ రోజుల్లో ఈ పేకాట వగైరా వ్యసనాలబారినపడి ఎన్ని కుటుంబాలు ఎన్ని అవస్తలు పడుతున్నాయో)

*3.మద్యపానం – పురాతన కాలంలో దీనికి ఉదాహరణ శుక్రాచార్యుడు. ఈయన రాక్షసులకు గురువు. ఆయనకి మృత సంజీవినీ విద్య తెలుసు. ఆ విద్యతో చనిపోయిన రాక్షసులను వెంటనే బ్రతికించేవాడు. అలాంటివాడు మద్యపాన మత్తులో ఏమి చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో కచుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు. (పురాతన కధలు అందరికీ వివరంగా తెలియక పోయినా కచుడి చితాభస్మం తాగటం వివరాలు నేనూ ఇప్పుడు తెలుసుకోవాలి) నేటి సమాజంలో మద్యపాన మహిమ అందరికీ తెలిసినదే.

*4. వేట -- పూర్వం దశరధ మహారాజు వేటకోసం వెళ్ళి, నీటి శబ్దాన్నిబట్టి బాణం వేసి శ్రవణకుమారుడిని చంపుతాడు. ఆయనకి తెలియక చేసిన పాపమయినా శ్రవణుడి వృధ్ధ తల్లిదండ్రుల శాపానికి గురయి తన కుమారుడు శ్రీ రామచంద్రుడికి దూరమయి రాముణ్ణే కలవరిస్తూ మరణిస్తాడు. (ఇదివరకంటే కృర మృగాల (kroora - inscript లో ఎలా టైప్ చెయ్యాలో రాలేదు నాకు) బారినుండి ప్రజలను కాపాడటానికి రాజులు వేటాడేవారు. ఈ రోజుల్లో మాత్రం ఇది , స్ధితి పరులకు వ్యసనమే. దానితో పట్టుబడ్డవారెన్ని కేసులెదుర్కుంటున్నారో పేపర్లల్లో చూస్తున్నాంగా).ఆదిత్యయోగీ..

*5. కఠినంగా, పరుషంగా మాట్లాడటం -- దుర్యోధనుడు దీనికి మంచి ఉదాహరణ. పాండవులను దుర్భాషలాడి ఏ స్దితి తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. (పూర్వకాలంలో కఠినంగా మాట్లాడేవాళ్ళని వేళ్ళమీద లెక్కబెట్టేవాళ్ళు...ఇప్పుడు అలా మాట్లాడనివాళ్ళని....)

*6.కఠినంగా దండించటం -- దీనికికూడా దుర్యోధనుడే ఉదాహరణ. ఒకసారి దుర్యోధనుడు తన తాతగారిని, మేనమామలని కూడా బందిఖానాలో పెడతాడు. వారికి ఆహారం కూడా అతి తక్కువ ఇచ్చి నానా ఇబ్బందులూ పెడతాడు. వాళ్ళందరికీ ఇచ్చిన అతి కొద్ది మెతుకులను శకుని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకుని దుర్యోధనుడి చెంత చేరతాడు. కౌరవులమీద పగ తీర్చుకోవటానికి వారితో వున్నట్లు నటించి వారు నాశనమయ్యేటట్లు చేస్తాడు.

ఈ రోజుల్లోకూడా ఏ కారణంవల్లనైతేనేమి తల్లిదండ్రులు పిల్లల్ని దండించటం, టీచర్లు పిల్లల్ని కఠినంగా దండించటం ఎక్కువైంది. (ఎవరిమీదైనా ఏమైనా కక్షవుంటే దాన్ని తీర్చుకోవటానికి అనేక మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఇది ఎవరికీ మంచిది కాదు).

*7.ఆఖరిది డబ్బు. కొందరికి డబ్బు వృధాగా ఖర్చుచెయ్యటం అలవాటు. బాగా డబ్బున్నా, క్రమ శిక్షణా, సరైన ఆలోచన లేకపోవటంవల్ల అవసరముందా లేదా అని కూడా ఆలోచించకుండా డబ్బు దుర్వినియోగం చేస్తారు. మహాలక్ష్మిని ప్రయోజనకరమైనవాటికి కాకుండా దుర్వ్యసనాలకు వినియోగిస్తే దుర్గతే లభిస్తుంది అపజయమే తప్ప జయం వుండదు. అందుకే ధనాన్ని సద్వినియోగం చెయ్యాలి.

మంచీ చెడూ తెలుసుకుని మనుగడ సాగించటమే మనిషి జన్మకి సార్ధకత...

.


మనని మరొకరు మన్నించడం, క్షమించడం కాదు. 'ఎవరికి వారు ఆత్మ పరిశీలనతో తన తప్పును గ్రహించి, పశ్చాత్తాపంతో తనకు తానే మానసికంగా శిక్ష విధించుకుని, నూతన జీవితాన్ని ఆశ్రయించాలి. మనసే మన 'కర్మ'లకు మొదటి సాక్షి!'..

.

*భగవంతునికి - భక్తులు - అనే అర్హత ఎప్పుడు పొందగలము?*


భగవంతుని గుర్తించి మనము స్వీకరిస్తే ఆయన ఉంటాడు, కనబడుతాడు... 

ఆయనను తిరస్కరిస్తే ఆయన ఉండడు, కాక కనబడడు కూడా.... 

హిరణ్యకశిపుడు హరి ఎక్కడా లేడన్నాడు, కనుక ఎక్కడా కనబడలేదు, అతనికి...

అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు విశ్వసించాడు... 

కాబట్టి స్తంభము నుండి వెలిసి, ప్రహ్లాదుని విశ్వాసం సత్యమని నిరూపించాడు...

అంతే కానీ, హిరణ్య కశిపుని సవాలు ఎదుర్కోవడం కోసమని స్తంభములో  ప్రవేశించడం కాదు...


అన్నిటా, అంతటా నిండి ఉన్నట్లే, ఆ స్తంభములో కూడా ఆయన ఎప్పుడూ ఉన్నాడు... 

ఆ క్షణంలో తన ఉనికి ప్రదర్శించాడు, అంతే!...


సాధు సత్పురుషులు, మహర్షులు, ఆర్తితో ప్రార్ధించినపుడు, భగవంతుడు అవతరిస్తాడు...


*ఆయన కర్తవ్యాలు మూడు...!!!*


వేద రక్షణ, 

ధర్మ రక్షణ, 

భక్త రక్షణ...


నిశ్చలమైన విశ్వాసము, నిర్భయం, నిరహంకారం, సద్గుణం, ఇవి లేకుండా, ఆడంబరంగా పూజ చేస్తే, వ్యర్థమే... కాలము, శక్తీ, అన్నీ వృధా అవుతాయి...


ఇలాంటి సందర్భంలో మనము పవిత్ర గ్రంధాల నుండీ, పురాణముల నుండి, ఉపనిషత్తులనుండి, ప్రసంగాల నుండీ మనము పొందుతున్న లాభమేమిటి?...


వీటి మూలంగా మనమైనా బాగు  పడ్డామా? లేక చదివితేనే పుణ్యము వస్తుంది, అనుకొంటే మనకన్నా ముందు టేబురికార్డులకు, మన సెల్లులకు ముందుగా పుణ్యం వస్తుంది, అవి నిత్యం పటిస్తున్నాయి కాబట్టి...


భగవంతుని దర్శన భాగ్యం పొందిన మనము ఎంతవరకు పురోగమించాము? 

దర్శనమాత్రమునే పుణ్యము వస్తుంది, మోక్షానికి అర్హత వస్తుంది అనుకుంటే, మనకన్నా ముందు, నిత్యం ఆయన కోవెలలో ఉన్న చీమలకు, దోమలకు, కీటకాలకు వస్తుంది...

ఎందుకనగా అవి నిత్యం ఆయనను అంటిపెట్టుకుని ఉంటున్నాయి కాబట్టి...ఆదిత్యయోగీ..


ఆయన దగ్గర నుంచి పారమార్థిక జీవిత రహస్యం , తెలుసుకున్న దానికి  నిదర్శనంగా మన జీవన సరళిలో ఏదైనా మంచి మార్పు కన పడాలి...

మనలోనుండి మధుర భాషణం, విజయ, పరాజయాలకు పొంగని, కృంగని ఆత్మ నిగ్రహం మనము ప్రదర్శించాలి...

ఇవన్నీ మన భక్తికి సంకేతాలు, లేశమైన అహంభావము లేకుండా, భగవంతుని శరణాగతి పొందాలి...  

అప్పుడే మనము భక్తులు అని పించుకోగల అర్హత పొంద గలుగుతాము...

.

 ప్రత్యయస్య పరచిత్త జ్ఞానమ్


ఇదే విధంగా సంయమం ద్వారా పరుల చిత్తమును అతీత జ్ఞానముతో పరిశీలించిన యోగికి పరుల చిత్త జ్ఞానము కూడా లభిస్తుంది. ప్రతి మనిషి ప్రవర్తన అతడి చిత్తముపై ఆధారపడి వుంటుంది.


ఒక మనిషి లాగా మరొకమనిషి ప్రవర్తించకపోవడానికి అతడి మనస్సులో పుట్టే


ఆలోచనలే కారణం. ఆ ఆలోచనలనుబట్టే అతడి తీరు. ప్రవర్తన చర్యలు జరుగుతుంటాయి. ఇవి ఒక మనిషిని పోలి మరొక మనిషికి ఎప్పుడూ వుండవు. ఇందుచేతనే అనేక కోట్ల


మందిలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారుగా గుర్తించ బడతారు.


ఈ చిత్త ప్రవృత్తులు ఆ వ్యక్తి ముఖ భావాలు, చూపులు, హావభావాల ద్వారా బహిర్గత మవుతుంటాయి. మనం ఒక మనిషిని చూస్తూనే అతడుచాలాకోపంగా వున్నాడని గ్రహించగలుగుతాము. అలాగే మరొకడి ముఖాన్ని బట్టి అతడు సంతోషంగా వున్నాడనో, దుఖ్కంతో వున్నాడనో గ్రహించగలుగుతాము.


మనకి ఇలాంటి గ్రహింపుకి కారణం ఆయా వ్యక్తుల హావభావాలు. ఈ హావభావాలనేవి


చిత్తములోని ఆలోచనలకి ప్రతిబింబాలుగా ప్రదర్శించబడుతాయి.ఆదిత్యయోగీ..


కనుక ఈ హావభావాలని బట్టి అతడి చిత్తములో ఎలాంటి భావాలు నెలకొని వున్నాయో సులభంగా గ్రహించగలము.అయితే మరికొందరుంటారు. వారి చిత్తములో ఎలాంటి సంఘర్షణలు జరుగుతున్నా హావభావాల ద్వారా బయటపడకుండా జాగ్రత్తపడతారు. నిండు కుండ తొణకదంటారే, అట్లా! అయినప్పటికే అలాంటి వారిని పలకరించినప్పుడు 'నాకేం. నేను బాగానే వున్నా' నంటూనే అప్రయత్నంగా సూక్ష్మంగా తమ హావభావాల ద్వారా చిత్త వృత్తిని ప్రదర్శిస్తారు. అప్పుడు మనం 'అతడలా అంటున్నాడు గానీ, మనస్సులో ఏదో వుంది' అనుకుంటాము. దీనినే చిత్తవృత్తి అంటారు.


సమాధి స్థితి పొందిన యోగికి సాధనకి పూర్వము నుండి తన చిత్త వృత్తుల తీరు స్వానుభవమే. అతడు యోగాభ్యాస సాధన ద్వారా చిత్త వృత్తులను వరుసగా జయిస్తూ సమాధి స్థితి పొందుతాడు.


అంటే అనేక భావాలకి ఆలవాలమైన తన చిత్తమును తన వశం చేసుకుంటాడు. అట్టి అనుభవజ్ఞానం తనకి వుండటం చేత, ఎట్టి కోరికలూ, వృత్తులూ లేక శూన్యంగా వున్న తన చిత్తమును పరచిత్తముతో సంయమం చేస్తాడు.


అంటే ఇతరులచిత్త స్థితిగతులను శూన్యంగావున్న తన చిత్తముద్వారావశం చేసుకున్నప్పుడు ఇతరులచిత్తము ఎలావుంది? అప్పుడే విషయం ఆలోచిస్తోంది? అది ప్రశాంతంగా వుందా? అలజడత్వస్థితిలో ఉందా? మట్టిముద్దలావుందా? అనేకసంఘర్షణలతో సతమతమవుతోందా?' అనేవిషయాలు తనకి లభించిన అతీంద్రియ జ్ఞానం ద్వారా తెల్సుకోగలుగుతాడు...


అయితే, ఈ పరచిత్త జ్ఞానము పరుల చిత్తము యొక్క స్థితి గతులను మాత్రమే గ్రహించగలదు.


అంటే ఆ వ్యక్తి చిత్తము సంతోషంగా వుందా? దుఃఖ్క పూరితమై వుందా? ఏదైనా సంఘర్షణలతో బాధింపబడుతోందా? లేక ఆలోచనారహితంగా జడత్వంలా వుందా? ఇలా ఆ వ్యక్తిచిత్తముఏస్వరూపాన్నిధరించివున్నదోమాత్రమేటయోగిచిత్తము గ్రహించగలుగుతుంది.


అంతేగానీ ఆ వ్యక్తి సంతోషము లేదా దుఃఖ్కమునకు కారణం ఏమిటో, ఆ చిత్తము ఏ విషయం గురించి ఆలోచించడం వల్ల అలాంటి చిత్త స్వరూపం కలిగిందో ఆ విషయం లేదా ఆ వస్తువు ఏమైవుంటుందో, దాన్ని గ్రహించే జ్ఞానం కలగదు. ఆ చింతన ఆ వ్యక్తికి మాత్రమే స్వంతం.


కేవలం ఆ వ్యక్తి చిత్తములో కలిగిన భావ స్వరూపాన్ని మాత్రమే యోగి చిత్త జ్ఞానము గ్రహించగలుగుతుంది.అనగా యోగి చిత్తమునకు వశమైనది ఆ వ్యక్తి చిత్తమే గానీ, ఆ చిత్త క్షోభకి కారణమైన విషయవస్తువు కాదు. కనుక ఆ వ్యక్తి చిత్తము యొక్క స్థితి గతి ఏవిధంగా వున్నదోనని మాత్రమే యోగి చిత్తము గ్రహించగలుగుతుంది..*

.

తెలుగు సంపద. అష్టావధానం

 


శ్రీభారత్ వీక్షకులకు శ్రీక్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు 🌹 అవధాన విద్య మన తెలుగు సంపద. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, బృహత్ సహస్రావధానం వంటి ఎంతో వైవిధ్యంతో, విభిన్న రూపాలలో అలరారే ఈ విద్యను సాక్షాత్తు సరస్వతీ రూపంగా చెబుతారు. నాలుగైదు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అవధాన విద్య ను, దానిలో ఆరితేరిన ఎందరో అవధానుల గురించి శ్రీభారత్ వీక్షకులకు సీరియల్ గా పరిచయం చేస్తున్నారు ప్రముఖ సాహితీవేత్త ఆచార్య వేణు గారు. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

షడ్రుచుల కొత్త ఉగాది

 


శ్రీభారత్ వీక్షకులకు శ్రీక్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు 🌹కోయిల రాగాలు, కొత్త పలుకులు నవ వసంతం, చైత్ర సంగీతం... ఇవన్నీ కలిస్తే షడ్రుచుల కొత్త ఉగాది. చక్కటి ఉగాది పాటలతో కొత్త వసంతాన్ని ఆహ్వానించారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి వాణీ ప్రభాకరి గారు. ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలో, ఎలాంటి ఆనందాన్ని అనుభవించాలో చక్కగా వివరించారు. కొత్త ఉగాది, కొత్త కోయిల, కొత్త పలుకులు.. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

దివ్య రామాయణ

 *ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇంటింటా ప్రతిరోజూ దివ్య రామాయణ  పారాయణం*


        🌸🌸🌸🌸

           *1 వ  రోజు*


గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు… గురుదేవో మహేశ్వరః

గురు సాక్షాత్ పర బ్రహ్మ… తస్మై శ్రీ గురవే నమః


శ్రీ విద్యాం శివవామ భాగ నిలయాం… హ్రీంకార మంత్రోజ్జ్వలాం

శ్రీ చక్రాంకిత బిందుమధ్య వసతిం… శ్రీమత్సభా నాయకీమ్

శ్రీ మత్‌షణ్ముఖ 

విఘ్నరాజ జననీం

శ్రీ మజ్జగన్మోహినీం… మీనాక్షీం ప్రణతోస్మి సంతత మహం…

కారుణ్య వారాంనిధిమ్‌…

               ***

శ్రీరాఘ‌వం ద‌శ‌ర‌థాత్మ‌జ మ‌ప్ర‌మేయం 

సీతాప‌తిం ర‌ఘుకులాన్వ‌య ర‌త్న‌దీపం

ఆజానుభాహుం అర‌వింద ద‌ళాయ‌తాక్షం

రామం నిశాచ‌ర వినాశ‌క‌రం న‌మామి.

                ****


 శ్రీ‌మ‌ద్ రామాయ‌ణం ఆదికావ్యం.

 వాల్మీకి మ‌హ‌ర్షి, బ్ర‌హ్మ అనుగ్ర‌హంతో 

మాన‌వాళిని త‌రింప‌చేయ‌డానికి ఈ మ‌హాకావ్యాన్ని మ‌న‌కు అందించారు.


వాల్మీకి మ‌హ‌ర్షి ఒక‌రోజు త‌మ‌సా న‌దికి స్నానాకి వెళ్ళాడు. 

అక్క‌డ ఎదురుగా ఉన్న ఒక చెట్టు కొమ్మ‌మీద క్రీడిస్తూ ఆనంద‌సాగ‌రంలో ఉన్న ఒక ప‌క్షుల జంట‌లోని మ‌గ‌ప‌క్షిపై కిరాతుడు ఒక‌డు బాణం వేశాడు. అది విల‌విలకొట్టుకుంటూ నేల‌రాలింది. ఆ బాణం దెబ్బ‌తో ఆ మ‌గ‌ప‌క్షి ప్రాణాలు విడిచింది. ఆ మ‌గ‌ప‌క్షి చుట్టూ తిరుగుతూ  ఆడ‌ప‌క్షి విల‌పిస్తుండ‌డం చూసిన వాల్మీకి మ‌హ‌ర్షి మ‌న‌సు ద్ర‌వించింది. ఆయ‌న హృద‌య లోని  శోకం,  శ్లోకంగా మారింది.


 మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|

యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్| |


ఓ కిరాతుడా! క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపావు. అందువలన నీవు ఎక్కువకాలము జీవించియుండవు. (శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు) అని ఆ కిరాతుడిని శ‌పించాడు . అదే క్ష‌ణంలో బ్ర‌హ్మ ప్ర‌త్య‌క్ష‌మై నీ నోట స‌ర‌స్వ‌తి ప‌లికింది. క‌విత్వం జాలువారింది. నువ్వు రామాయ‌ణ మ‌హాకావ్యాన్ని ర‌చించి మాన‌వాళిని త‌రింప‌చేయి . అది భూలోకంలో శాశ్వ‌తంగా ఉంటుంది.,అని  సూచించి అక్క‌డినుంచి వెళ్లిపోయాడు.


     *బాల‌కాండ*


అయోధ్యాన‌గ‌రంలో శ్రీ రామ ల‌క్ష్మ‌ణ భ‌ర‌త శ‌తృఘ్నులు ధ‌నుర్ విద్య‌లో ప్రావీణ్యం సంపాదిస్తున్నారు.మ‌హ‌ర్షుల యాగాల‌కు ఆటంకం క‌లిగిస్తున్న రాక్ష‌సుల‌ను అంతం చేయ‌డానికి ద‌శ‌ర‌థ‌మ‌హారాజు సాయం కోరి విశ్వామిత్రుడు అయోధ్యా న‌గ‌రానికి విచ్చేశాడు. రాజ‌మందిర ద్వారం వ‌ద్ద నిల‌బ‌డి త‌న రాక‌ను ద‌శ‌ర‌థ మ‌హారాజుకు తెలియ‌జేయ‌మ‌న్నాడు. విష‌యం తెలిసిన వెంట‌నే ద‌శ‌ర‌థుడు స‌క‌ల మ‌ర్యాద‌ల‌తో విశ్వామిత్ర మ‌హ‌ర్షికి సాద‌ర స్వాగ‌తం ప‌లికాడు. ఏం కావాల‌న్నా ఇస్తాన‌న్నాడు. విశ్వామిత్రుడు తాను వ‌చ్చిన ప‌నిని వివ‌రించాడు. మారీచ సుబాహువుల‌నే రాక్ష‌సులు య‌జ్ఞ‌యాగాల‌కు ఆటంకం క‌లిగిస్తున్నారు. వారిని శ‌పించ‌వ‌చ్చు కానీ, యజ్ఞ క్ర‌తువులో నిమ‌గ్న‌మైన‌పుడు కోపం ద‌రిచేర‌కూడ‌దు. అందువ‌ల్ల వారిని శ‌పించ‌డం లేదు.  ఇలాంటి ప‌రిస్థితుల‌లో యాగ‌రక్ష‌ణ జ‌ర‌గాలంటే శ్రీ‌రాముడిని త‌న వెంట పంపాల‌ని విశ్వామిత్రుడు ద‌శ‌ర‌థ మ‌హారాజు ను కోరాడు. ఈ మాట వింటూనే ద‌శ‌ర‌థుడికి దిక్కుతోచ‌లేదు. లేక లేక క‌లిగిన సంతానాన్ని ఇలా రాక్ష‌స సంహారానికి పంప‌డ‌మా అని బాధ‌ప‌డ్డాడు. రాముడి  బ‌దులు తాను వ‌స్తాన‌న్నాడు. ఏం కోరినా ఇస్తాన‌ని ఇప్పుడు మాట త‌ప్పుతావా ఇది రాజ‌ధ‌ర్మ‌మా అని విశ్వామిత్రుడు ద‌శ‌ర‌ధుడిని ప్ర‌శ్నించాడు . వ‌శిష్ఠుల వారి సూచ‌న మేర‌కు విశ్వామిత్రుడి వెంట రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను పంప‌డానికి నిర్ణ‌యించాడు. 

అలా విశ్వామిత్రుడి వెంట రామ‌ల‌క్ష్మ‌ణులు ముందుకు సాగుతున్నారు.  అలా త‌న‌ను అనుస‌రిస్తున్న రామ‌ల‌క్ష్మ‌ణుల‌కు   స‌రయూ న‌దీతీరంలో - ఆక‌లి, ద‌ప్పిక‌లు లేకుండా బ‌ల , అతి బ‌ల అనే విద్య‌ల‌ను విశ్వామిత్రుడు వారికి అనుగ్ర‌హించాడు. దీనివ‌ల్ల వారికి ఎన్న‌టికీ ఆక‌లి , ద‌ప్పిక‌లు ఉండ‌వు.

 ఆ రాత్రి వారు అక్క‌డే విశ్ర‌మించారు. 

మ‌రునాడు ఉద‌యం తెల తెల వారుతుండ‌గా


కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ॥ 1 


కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! 

పురుషోత్తమా! తూర్పు తెల్లవారుతోంది, దైవ సంబంధాలైన కార్య‌క్ర‌మాలు  చేయవలసి ఉంది. క‌నుక లెమ్ము అంటూ ఆ శ్రీ‌రామ చంద్ర‌మూర్తిని, విశ్వామిత్ర మ‌హ‌ర్షి మేల్కొలిపాడు. 

మ‌హ‌ర్షి మేల్కొలుపుతో లేచి, సంధ్యావంద‌నాది కార్య‌క్ర‌మాలు ముగించుకుని వారు అక్క‌డి నుంచి బ‌య‌లుదేరారు. అలా న‌డుచుకుంటూ వారు మ‌హార‌ణ్యంలో ఒక జ‌న‌ప‌దం చేరారు. అక్క‌డ తాట‌క అనే రాక్ష‌సి ఉంటున్న‌ది. దాని గురించి రాముడికి తెలిపాడు మ‌హ‌ర్షి. అగ‌స్త్యుని ఆశ్ర‌మ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తూ , జ‌నాన్ని తింటూ ఇది బ‌తుకుతున్న‌ద‌ని రాముడికి వివ‌రించాడు. దీనికి వెయ్యి ఏనుగుల బ‌లం ఉంటుంద‌ని చెప్పాడు. తాట‌క స్త్రీ క‌దా చంప‌డం ఎలా అని సంకోచించ‌కుండా , దుష్ట శ‌క్తిని సంహ‌రించ‌మ‌ని సూచించాడు విశ్వామిత్రుడు.

రాముడు ధ‌నుష్ఠంకారం చేశాడు. ఆశ‌బ్దానికి తాట‌కి ఉగ్రురూపిణి అయి శ‌బ్దం వ‌చ్చిన దిక్కుగా వ‌చ్చింది. రాముడు దాని చేతులు ఖండించాడు. సాయంత్రం అయితే దాని బ‌లం ఇంకా పెరుగుతుంది క‌నుక వెంట‌నే దానిని సంహ‌రించ‌మ‌న్నాడు. రాముడు తాట‌కిని సంహ‌రించాడు. వెంట‌నే విశ్వామిత్రుడు రాముడికి దివ్యాస్త్రాలు అనుగ్ర‌హించాడు.  దండ‌చ‌క్ర‌, ధ‌ర్మ‌చ‌క్ర‌, కాల‌చ‌క్ర‌, విష్ణు చ‌క్ర‌,బ్ర‌హ్మాస్త్ర‌, కాల‌పాశ‌,ధ‌ర్మ‌పాశ‌, వ‌రుణ‌పాశ‌, ఆగ్నేయాస్త్రం, వాయ‌వ్యాస్త్రం ఇలా స‌మ‌స్త్ర అస్త్రాల‌నూ అనుగ్ర‌హించాడు.

 తాట‌కి వ‌ధ‌తో లోకం లో పుష్ప వ‌ర్షం కురిసింది. అక్క‌డి నుంచి విశ్వామిత్ర మ‌హ‌ర్షి యాగం చేస్తున్న సిద్ధాశ్ర‌మానికి వారు చేరుకున్నారు.

అక్క‌డ విశ్వామిత్ర మ‌హ‌ర్షి యాగం మొద‌లు పెట్టారు. అంతే రాక్ష‌సులు మారీచ సుబాహువుల అనుచ‌ర‌గ‌ణం అక్క‌డ‌కు చేరుకుంది. రాముడు బాణాల వ‌ర్షం కురిపించి వారిని హ‌త‌మార్చాడు. తాట‌క కొడుకు మారీచుడిపై బాణం సంధించాడు. వాడు వంద‌యోజ‌నాల దూరంలో స‌ముద్రంలో పోయి ప‌డ్డాడు.

ఇక రాక్షసులు ఎవ‌రూ అటువైపు క‌న్నెత్తి చూడ‌లేదు. యాగం నిర్విఘ్నంగా సాగిపోయింది. 

ఆ త‌ర్వాత వారు అక్క‌డ నుంచి మిథిలా న‌గ‌రానికి బ‌య‌లుదేరారు. మార్గ‌మ‌ధ్యంలో వారు గౌత‌మ మ‌హ‌ర్షి ఆశ్ర‌మం చేరుకున్నారు. అక్క‌డ అహ‌ల్య శాప గాథ‌ను విశ్వామిత్రుడు రాముడికి తెలిపాడు. నీ పాద స్ప‌ర్శ‌తో ఆమెకు  పూర్వ రూపం వ‌స్తుంద‌న్నాడు.  రాముడి దృష్టి ప‌డ‌గానే అహ‌ల్య పూర్వ రూపంతో లేచి నిల‌బ‌డింది. రామ‌ల‌క్ష్మ‌ణులు ఆ సాధ్వీమ‌త‌ల్లికి న‌మ‌స్క‌రించి ముందుకు సాగారు. మిథిలా న‌గ‌రంలో సీతా స్వ‌యంవ‌రం వార్త తెలుసుకుని విశ్వామిత్ర మ‌హ‌ర్షి రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను మిథిల‌కు తీసుకువెళ్లాడు. శివ‌ధ‌న‌స్సును విరిచి సీతమ్మ‌త‌ల్లిని స్వ‌యంవ‌రంలో రామ‌చంద్ర‌మూర్తి ద‌క్కించుకున్నాడు. ద‌శ‌ర‌థుడికి క‌బురుపంపి సీతారామ క‌ల్యాణానికి ఏర్పాట్లు చేశారు.  ల‌క్ష్మ‌ణ భ‌ర‌త‌శ‌త్రుఘ్నుల‌కూ వివాహాలు జ‌రిపించారు. 

ద‌శ‌ర‌థుడు కొడుకులు, కోడ‌ళ్ల‌తో అయోధ్య‌కు బ‌య‌లుదేరాడు. మార్గ మ‌ధ్యంలో ప‌ర‌శురాముడు ఎదురై, శివ‌ధ‌నుస్సు విరిచినందుకు రాముడిపై ఆగ్ర‌హించాడు.  నూత‌న వ‌ధూవ‌రుల‌పై ఆగ్ర‌హం త‌గ‌ద‌ని ద‌శ‌ర‌ధుడు ప‌ర‌శురాముడిని వేడుకున్నాడు. కుద‌ర‌ద‌న్నాడు. త‌న ద‌గ్గ‌ర  ధ‌నుస్సు తీసుకుని బాణం ఎక్కుపెట్ట‌మ‌ని రాముడికి సవాలు విసిరాడు. రాముడు బాణం సంధించి వ‌దిలాడు. వ‌దిలిన బాణం ల‌క్ష్యాన్ని ఛేధించ‌క త‌ప్ప‌దు. నీ న‌డ‌క‌ను నిరోధించ‌నా  లేక నీవు త‌ప‌స్సుతో ఆర్జించిన పుణ్య‌లోకాల‌ను  వ‌దిలించ‌నా అన్నాడు రాముడు. పుణ్య‌లోకాల‌ను వ‌దిలిస్తే మ‌ళ్లీ త‌ప‌స్సు చేసి సాధించుకుంటాన‌ని పుణ్య‌లోకాల‌ను వ‌దులుకున్నాడు ప‌రశురాముడు.

రాముడి శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను కీర్తించి ప‌ర‌శురాముడు అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు.


ఇక అక్క‌డ నుంచి ర‌థాలు అయోధ్య దిశ‌గా క‌దిలాయి........


            *****

ఆపదా మపర్తారం దాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్.


        ****

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

       *****

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే 

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

 శ్రీరామ రామ 

రఘునందన రామ రామ!

 శ్రీరామ రామ 

భరతాగ్రజ రామ రామ! 

శ్రీరామ రామ 

రణకర్కశ రామ రామ!

 శ్రీరామ రామ శరణం

 భవ రామ రామ!

 శ్రీరామ చంద్ర చరణౌ

 మనసా స్మరామి!

 శ్రీరామ చంద్ర చరణౌ

 వచసా గృహ్ణామి! 

శ్రీరామ చంద్ర చరణౌ

 శిరసా నమామి! 

శ్రీరామ చంద్ర చరణౌ 

శరణం ప్రపద్యే!.

                         ****

                    

     ( బాల‌కాండ స‌మాప్తం)