18, అక్టోబర్ 2020, ఆదివారం

 🌷ఆత్మ గోష🌷


శాశ్వతంగా నిద్రపోయిన తర్వాత ఎంత గొప్పగా బతికినా శవం అనే అంటారు, సమయం మించకుండా తీసేయండి అని పెద్దలు అంటున్నారు, భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు వచ్చి కర్మ చేసి వెళ్లిపోయారు.. అప్పుడు మొదలు అవుతుంది ఆత్మ గోష నా భార్య నా పిల్లలు నా ఇల్లు అని గుండెలు బాదుకుంటూ ఆ ఇంటికే వెళ్తాడు అతను ఎవరికీ కనిపించడు వినిపించడు ఇది నా ఇల్లు నా వస్తువులు నా ఆస్తి అని నిన్నటి వరకు కాపాడుకున్న ఏది నాతో తీసుకుని వెళ్లలేకపోయానే.. వీటి కోసమా జీవితం అంతా కష్టపడ్డాను.. అని ఏడుపు మొదలు అవుతుంది.. 


గుండె పగిలేలా ఏడుస్తున్న భార్యను చూసి ఉన్నన్ని రోజులు ఎదో సాకుతో సాదించాను కాస్త ఓపికగా ప్రేమగా ఉంటే బాగుండేది ఇప్పుడు ఓడార్చే శక్తి కూడా లేదు..అని అప్పుడు అనిపిస్తుంది   కుటుంబ సభ్యులను చూసుకుని చేసిన పోరాబాట్లు గుర్తు చేసుకొని ఒక్కసారి భగవంతుడు బతికిస్తే అందరికి క్షమాపణ చెప్పుకుని మళ్ళీ నిదగ్గరకు వస్తాను తండ్రి అని ఆత్మ గోషిస్తుంది, చిన్న చిన్న తప్పులను క్షమించి అందరితో సంతోషం గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. 


ఎక్కడైతే వదిలేసారో అదే స్మశానానికి తిరిగి వెళ్లి అక్కడ ఒంటరిగా రోదిస్తూ భగవంతుడా అని పిలవ గానే ఓ స్వరం వినిపిస్తుంది నేను నీకు తోడుగా ఇక్కడే ఉన్నాను బయపడకు అని ,ఎవ్వరూ రాని చోటికి ఏ దిక్కు లేని చోట కూడా నీ కోసం శివుడు ఉన్నాడు  అప్పుడు కనిపిస్తాడు దేవుడు.  


అప్పటివరకు ఆత్మ గోషతో రోదిస్తున్న ఆత్మ ఏమైయ్యా బతికి ఉండగా ఎన్నిసార్లు పిలిచి ఉంటాను..ఎంత మొక్కి ఉంటాను ఏనాడైన ఇలా వెంటనే పలికావా ఇప్పుడు మటుకు ప్రత్యక్షం ఐయ్యావు అని అడుగుతాది ఆత్మ , శివయ్య అంటాడు నేను నువ్వు పిలిచిన ప్రతి సారి పలుకుతూనే ఉన్నాను కానీ నువ్వు వినలేక పోయావు నువ్వు ఒకసారి పిలిస్తే నేను 108 సార్లు పలుకుతాను అది నీకు వినపడాలి అని కానీ నువ్వు బతికి ఉన్నంత కాలం నేను నాది అనే మాయలోనే ఉన్నావు.. ఇప్పుడు నీదంటూ ఏమీ లేదు అన్న సత్యాన్ని గ్రహించావు కనుకే నా మాట వినగలిగావు.. స్మశానంలో కూడా నీకు తోడుగా ఉన్న నేను ఎప్పుడూ నీ పక్కనే ఉన్నాను నీ ప్రతి కష్టంలోనూ తొడుగానే ఉన్నాను దాటిస్తూనే ఉన్నాను కానీ అదంతా నువ్వే చేస్తున్నావు అనుకున్నావు కనుక నన్ను గుర్తించలేక పోయావు.. నువ్వు వచ్చే టప్పుడు నువ్వు పోయే టప్పుడు నీ తో వస్తున్నది నీ కర్మ మటుకే ఇంక ఏదీ నీతో రాదు అని శివయ్య చెప్పాక.. ఏది శాశ్వతం కాదు అని గ్రహించిన ఆత్మ శాంతించి వెళ్ళిపోతుంది. రుణ బంధం ఉన్నంత వరకే ఈ జీవితం.. దేహం తట్టుకునే వరకే ప్రాణం తట్టుకోలేని స్థితిలో దేహం ఉంటే పోతుంది ప్రాణం ఇంకో కొత్త దేహాన్ని వెతుకుంటుంది ప్రాణమే అలా ఉన్నప్పుడు ఇంక ఋణ బంధాలు ఎలా ఉంటుంది ఆలోచించండి.


🌷హర హర మహాదేవ🌷

 *.                                                  శ్రీశరన్నవరాత్రశుభాకాంక్షలతో నాచే రచింపబడినటువంటి**. *శ్రీశారదాంబాsష్టకమ్*** ******రోజుకి ఒక శ్లోకము*******

(1)శృంగేరీపురవాసినీం సురవరైస్సంపూజితాం సర్వదా,

శ్రీమచ్ఛంకరభారతీగురువరైస్సంసేవితాం వై సదా |

తుంగానీరసమర్చితాం సురనుతాం సద్విద్యదాం పావనీం, వన్దే శారదమాతరం శ్రుతినుతాం సర్వార్థసంపూరణీమ్ ||

భావం - శృంగేరీపురవాసిని అయినటువంటి, దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడేటటువంటి,శ్రీశంకరభారతీగురువర్యులచే ఎల్లప్పుడూ సేవింపబడేటటువంటి, పవిత్రతుంగానదీజలములచే అర్చింపబడేటటువంటి, దేవతలచే స్తుతింపబడేటటువంటి, సద్విద్యను ప్రసాదించేటటువంటి, పావని అయినటువంటి, వేదములచే స్తోత్రము చేయబడేటటువంటి, సర్వార్థములను పూరించేటటువంటి, శారదా మాతను నమస్కరించుచున్నాను.

 *నీ జీవిత సహచరి ఎవరు?*

అమ్మనా?

నాన్ననా?

భార్యనా?

భర్తనా?

కొడుకా?

కూతురా?

స్నేహితులా?

బందువులా?

లేదు.ఎవరూ కాదు.!

నీ నిజమైన సహచరి ఎవరో తెలుసా?

*నీ శరీరమే!* 

ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!

నువ్వు అవునన్నా?కాదన్నా?ఇది కఠిక నిజం.!!!

నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.

నీవేదైతే నీ శరీరం కొరకు భాద్యతగా ఏ పనైతే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.

నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరిరాన్ని బాగా చూసుకుంటావో.,నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా బాగా చూసుకుంటుంది.

నీవేమి తినాలి?

నీవేమి చేయాలి?

ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?

నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?

అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.

గుర్తించుకో.!

నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా.!!

నీ శరీరమే నీ ఆస్థి.,సంపద.

వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.

నీ శరీరం నీ భాద్యత.!

ఎందుకంటే?

నీవే నిజమైన సహచరివి.!

కనుక జాగ్రత్తగా ఉండు.

నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో.

డబ్బు వస్తుంది.వెళ్తుంది.

బందువులు.,స్నేహితులు శాశ్వతం కాదు.

గుర్తుంచుకో.!

నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.

ఒక్క నీవు తప్ప.!

ఊపిరితిత్తులకు- ప్రాణాయామం.

మనసుకు-ద్యానము.

శరీరానికి-యోగా.

గుండెకు-నడక.


ప్రేగులకు-మంచి ఆహారం.

ఆత్మకు-మంచి ఆలోచనలు.

ప్రపంచానికి-మంచి పనులు.

కుటుంబ సభ్యులందరికీ శుభ శుభోదయపు శుభాకాంక్షలు💐🙏

 " శ్రీ వెంకటేశ్వర సోత్రం".  (బ్రహ్మాండ పురాణాంతర్గతము).     సేకరణ   &  సమర్పణమ:- "మజుందార్ ",87925-86125, "బెంగుళూర్.".        నేడు "ఆధ్యాత్మిక దృష్టి కోణంలో " తాత్పర్య సహితము గా మీ కొరకు ప్రత్యేకముగా! అధిక మాసంలో"       . శ్లోకం:1) వేంకటేశో  వాసుదేవః ప్రద్యుమ్నె మిత విక్రమః !      సంఘర్షణో నిరుద్ధ శ్చ శేషాద్రి పతి రే వచ!!   1)"వెంకటేశా":- పాపమును కాల్చి వేయును.  మాధవుడ ను యొక  యోగ్య బ్రాహ్మణుడు  ప్రారబ్ధ వశము చేత తల్లితండ్రులను, భార్యను, తుదకు కు బ్రాహ్మణ్యం విడిచి చండాలుడై ,. చండాల స్త్రీ లోలుడై, తాను చేసిన సకల పాపములను తిరుపతి కొండ స్పృశించు మాత్రముననే పోగొట్టుకొనెను.   అనగా తన స్పర్శ మాత్రము చేత మాధవుని పాపములు కాళీ భస్మమై  పోవుట చేత  ఈ పర్వతమునకు  "వెంకట అను  పేరు కలిగినది అని చెప్పబడెను.  ఇటువంటి పర్వతమునకు వాడు అనగా పతి అయిన కారణముచేత శ్రీనివాస దేవునకు "వెంకటేశుడు" పేరు.                        ‌  2)"వాసుదేవా":- జ్ఞాన స్వరూపిణి సకల లోకములను సృష్టించు వాడు, ఆ లోకములందు  క్రీడించు వాడు.   లోక సృష్టికర్తయగు  శ్రీనివాసులకు సృష్టి లేదని నచో, నతనికి శరీరము లేదని చెప్పినట్లు అయినది.   శరీరము లేనివాడు ఇతరులను ఎలా సృష్టించగలడు?  ఒకవేళ అతనికి సృష్టి ఉన్నచో, సృష్టికర్తయగు శ్రీనివాసునకు మేమందరము అతని ఆదీనులై నట్లు  అతడు తనను సృష్టించిన వానికి పరాధీనుడై ఉండవలెను.    మన దీనులైన మనలను నుండి సృష్టి ఏర్పడనట్లు, అతని నుండి యు సృష్టి ఏర్పడుట అసాధ్యమను  శంకను(అనుమానము ను) పరిహ రించుట కు గాను యని చెప్పబడెను.    పరమాత్మకు దేహము కలదు.  అది పాకృతము కాదు.   జ్ఞానానం దా ది గుణాత్మకమైన ది.   పా కృత దేహమునకు జన్మ ము లేదు.  కనుక శ్రీనివాసునకు సృష్టి, పరాధీనత లేకుండుట చేత, దేహము ఉండుట చేత  అతని వలన మన సృష్టి ఏర్పడుట లో ఏ బాధ కము(వి ప్రతిపత్తి) లేదు.         ప్రతి యొక్క వ్యక్తి యు ప్రయోజనము లేకుండా ఏ పని చేయడు.   శ్రీనివాసుడు ప్రపంచమును సృష్టించి నాడు అనగా అతనికి ఓ ప్రయోజనం ఉండి తీరుతుంది.  అట్ల కూర్చో అతడు మన వల్లనే ప్రయోజనము కొరకు పనులను చేయుటవలన, ఫలముల  నిచ్చు వాని  యాదీనుడ అని చెప్పవలసి వచ్చును.   అటువంటి శ్రీనివాసుని చేత సృష్టి ఏర్పడు టెట్లు? యను అనుమానము పరిహ చుటకు గాను "దేవ" అని చెప్పబడినది.   ఆనందోదెకము   చేత నర్తనాది లీలలు చేయుచుండిన తాగుబోతు వలనే పరమాత్ముడు తనతో నుండు పూర్ణానంద ము చే అన్ని పనులను చేయును.  కనుక అతడు చేయు సృష్టి వలన అతనికి ఎప్పుడు ఫలము లేదు.   అది అంతయు అతని లీల.  ఇట్లు paramaatmudu చేయు ప్రపంచ సృష్టి అతనికి పరాధీనత లేకుండుటచే లోకపు సృష్టి చేయుటకు ఏ బాధ లేదు.   ఈ అభిప్రాయమును వాసు, దేవ, యను  3 అవాంతర పదములు తెలుపుచున్నవి.  సౌక రాయణ స్మృతి లో.       ,2) శ్లోకం:- వానాతోస................"వాసుదేవ అను పదమునకు నాలుగు అర్ధములు కలవు.   2 వ అర్థము:-వాసు అనగా అన్ని లోకములందు నుండువాడు.  " దేవ" అనగా క్రీడించు వాడు.  సకల జీవులందు ను, సకల జడము లందును, లోన శీను వాసుడు సన్నిహితుడై ఉండి అందరిచే అన్ని కార్యములను చేయించుకున్నాడు.  కనుక మన ప్రయత్నము లేక ఇతరుల సహాయము చేసి సుఖము కలిగినను ఆ సుఖము అన్ని వేళల ఎందుండి  అన్ని కార్యములను చేయించు శ్రీనివాసుని చేతనే  వచ్చినదని తెలిసి  అతని  యందు భక్తిని  చేయవలెను.  దుఃఖము కలిగినచో నది మన పాప రాశిని పరిహరింప జేసి, మమ్ములను నుద్ద ధరించుటకు గాను  కరుణాపయోనిధీ యగు శ్రీనివాసుడి ంచిన్నదని తెలిసి అతని యందు భక్తిని చేయవలెను.   ఆ దుఃఖము ఇతరుల నుండి వచ్చినదని వానిని ద్వేషించకు కూడదు.   ఇక్కడ కూడా "దేవ" అను పదము యొక్క ప్రయోజనము వెనుక చెప్పినట్లు తెలియవలెను.            . 3 వ అర్థము:- "వాసు అనగా అన్ని వస్తువులకు కప్పు కోను (ఆచ్ఛాదన ము) వస్త్రము వంటివాడు.   "దేవ" అనగా క్రీడించు వాడు.  మన శరీరము పైనున్న కప్పు వస్త్రము మమ్ములను చలిగాలుల నుండి కాపాడు ఉన్నట్లుగా శ్రీనివాసుడు మనకు బయట నుండి మనలను కాపాడుతున్నాడు.   ఇక్కడ కూడా వెనుకటి వలనే అన్ని అంశముల తెలియవలెను.           4వ అర్థము:- "వ" అనగా బల పూర్ణుడు  అని అర్థము. "అను" అనగా సర్వ చేష్ట కుడని యర్థము. "దే" అనగా అన్నియును ఇచ్చువాడు అని అర్థము. "వ" అనగా అన్ని చోట్ల యందుండు వాడు అని అర్థము.  అందరి చేత, అన్ని విధముల పనులను శ్రీనివాసుడు చేయించును.  దానికి కావలసిన బలము అతనియందు పూర్ణముగా గలదు.   అన్ని చోట్ల యందుకు ఉండుటచే, అందరి చేత అన్ని కార్యములను చేయించుట అతనికి మాత్రమే సాధ్యము.   ఇతరులకు సాధ్యము కాదు.  ఇతరులచే సమస్త కార్యములను నిరపేక్ష కుడై చేయించి వాటికి తగిన ఫలములను ఇచ్చువాడు డగుచున్నాడు  అను అర్థము క్రమముగా అను,వ,వ,దేవ యను యీ నాల్గుపాదములచే "వాసుదేవా "అను పదము  తెలుపుచున్నది.    అటులనే వసుదేవుని కుమారుడై  అవతరించి నందులకు వాసుదేవుడు డను నామాంతరం  కలిగినది.     3) "ప్రద్యుమ్న":- మూల రూపి యగు నారాయణుడు సృష్టి యొక్క ప్రారంభము నందు  వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధుమను అను నాలుగు రూపములను స్వీకరించెను.  అప్పుడతని పత్ని లక్ష్మీదేవి యు, మాయ, కృతి, జయ ,శాంతి అను 4 రూపములను స్వీకరించెను.   మాయావతి అయినా వాసుదేవుడు సర్వులకు ముక్తిని, కృతి పతి యగు   ప్రద్యుమ్నుడు సృష్టిని జయ పతి యగు సంఘర్షణనుడు సంహారము ను, శాంతి పతి అగు అనిరుద్ధుడు పాలన మును చేయుచున్నాడు.  శ్రీనివాసుడు వాసు దేవుడని చెప్పబడి ఉండుట చేత అతని యందు  మోక్షదాయక త్వ శక్తి కలదని చెప్పినట్లు లగును.   ఇప్పుడు శ్రీనివాసుడే కృతిపతి అయినా ప్రద్యుమ్నుడు అని చెప్పొచ్చు, సృష్టికర్త తత్వము  అతని ఎందు కలదని యీ పదము తెలుపుచున్నది.  "ప్ర" అనగా సర్వోత్తమమైన, "దుమ్మ' అనగా బంగారము వలెనుండు అనంత కళ్యాణ గుణముల చేత  పూర్ణుడగుటచేత అతనికి "ప్రద్యుమ్ను" మను నామము కలదు.  4) అమిత" అతిశయించిన "విక్రమః'  పరాక్రమము గలవాడు.  ఇచ్చా మాత్రము చేత జీవ జడ ఆత్మ కమైన  సకల ప్రపంచమును లోగోని న యనంత  బ్రహ్మాండములను సృష్టించి పాలించి సంహరించు శ్రీ హరి పరాక్రమము నకు మేరగలదా?  కనుక శ్రీనివాసుడు అమిత విక్రముడు దగుచున్నాడు.            5) "సంకర్షణః :--  చక్కగా నాశనము చేయువాడు.  మనం ఎవ్వరే గాని యే వస్తువునైనా నాశనము చేసినచో అది కొన్ని ముక్కలుగా ఖండింప బడి కింద  పడవచ్చును.   పరమాణు వలె సూక్ష్మముగా నాశనము చేయు శక్తి మనకు లేదు.    సంకర్షణ రూపమైన  శ్రీ హరి యు బ్రహ్మాండమును ఇచ్చ మాత్రము చేత పొడి చేసి ప్రకృతి రూపమైన అతి  సూక్ష్మ అణువుల స్థితికి తీసుకొని రాగలడు. కనుక ఉత్తమ సంహారము చేయు శక్తి అతనికి మాత్రం వుండుట వలన లోక సంహారక  మూర్తి అయిన శ్రీ హరి మూర్తికి సంకర్షణుడు అను నామము కలదు.  ఇటువంటి సంకర్షణుడు శ్రీనివాసుడే అగుటవలన లోక సంహార కర కత్వ శక్తి యు  అతనికి కలదు.        6)"అనిరుద్ధః చే :- ఎవరి చేతను నిరోధింప బడని వాడు.  1) శ్రీ హరి కల్పించిన కార్యమును నిరోధించు శక్తి ప్రపంచము నందు ఎవరికీ వెనుక కాలమందు లేదు.   ఇప్పుడు లేదు.  ముందు కాలమందే పడుట లేదు.  కనుక యుద్ధమునందు శ్రీనివాసుని తలకు దెబ్బ తగిలే ను.  ఉన్న గు కథలు ద్వైత మోహనా ర్థ కముగా వ్రాయబడినవి గాని వాణి ఎందు తత్వ వంశము  లేవు.  ఇంద్రజిత్తు ని నాగపాశము చే బంధింపబడి నట్లు నటించిన శ్రీ రాముడు, ఖరాసుర  సంహర కాలమున   రావణుని మూల బలమును చెండాడు కాలమున అసంఖ్యాకములగు రూపములను స్వీకరించెను.  దీనివలన తన్ను ఆవ రోధించు శక్తి యెవరికి లేదు .  అవరోధం దించినట్లు నటించినచో అది నటన మాత్రమే అని స్పష్టం చేసి ఉన్నాడు.  2) సర్వ శ్రేష్ట కు దైన వాయు దేవుడు అతని భక్తుడు.  అతని చేత "రుద్ధ" వశము చేసుకున్నవాడు.  శ్రీ హరి , పైన చెప్పినట్లు ఎవరికీ గాని వసుడు కాడు.  వాలి భక్తుడై నప్పటికీ , హనుమంత దేవుని అనుగ్రహమునకు పాత్రుడు కాక ఉండి నందున, శ్రీరామ దేవుడు అతనిని ని గ్రహించెను.   సుగ్రీవుడు వాలి కంటే అల్ప భక్తుడు అయినప్పటికీ హనుమంతుని అనుగ్రహమునకు పాత్రుడు అగుటచే అతనిని శ్రీరాముడు అనుగ్రహించెను. ఇడ్లీ శ్రీనివాసునకు అనుగ్రహమునకు పాత్రుడైన  శ్రీ వ్యాస తీర్థుల వారు , గురు సార్వభౌములు మొదలగు వారికి వసూలు డై యుండుట వలన అతనికి " అనిరుద్ధ" అను పేరు కలిగినది.  లోక పాలకుడైన  అనిరుద్ధుడు అను పేరు కలిగినది.  లోక పాలకుడైన అనిరుద్ధుడు ఇతడే ఐ ఉండుటవలన లోక పాలక తత్వ శక్తి ఇతనికి కలదు.                 7) "శేషాద్రి పతిః ఏవచ: శేష దేవుని వలన చుట్టబడిన ఆనంద పర్వతమునకు ఎజమానుడా అయినవాడు, ఈ శేషాద్రి పటుత్వము శ్రీనివాసు ని  ఎల్లప్పుడూ కలదు.   వైకుంఠము నందు నారాయణుడు యోగనిద్ర యందున్న ప్పుడు శేషా దేవుని ద్వారము దగ్గర ఉండు నట్టు చేసెను.  అప్పుడు వాయుదేవుడు పరమాత్ముని చూడవచ్చును.   అప్పుడు శేషా దేవుడు అతనిని నిరోధించి ఆత్మస్తుతి గావించెను.   అప్పుడు శ్రీహరి అచటికి వచ్చి"శేషుడు" తన దేహము చేత ఈ ఆనంద పర్వతాన్ని గట్టిగా చుట్టి ఉండే వాసుదేవ్ పర్వతమును కదిలించిన చో అతడు శ్రేష్టుడు.  అట్లు కానిచో శేషుడు  శ్రేష్ఠుడు డగు ని  తీర్మానం చేసినట్లు తెలిపెనట,  దాని ప్రకారము శేషుడు తన దేహము చేత పర్వతమును గట్టిగా చుట్టి విషము గ్రక్కె ఉండగా వాయుదేవుడు తన కాలి స్పర్శ మాత్రము చేత నా పర్వతమును శేషు ని తో సహా 51000 యోజనాలు ఎగురుతూ పడునట్లు చేసెను.  శేషా దేవునకు మదము  తగ్గింది.   వాయు దేవుని స్తుతించెను.   ఇటు శేషా దేవుని గర్వ పరిహారము లకు కారణం నందున ను, ఎల్లప్పుడు శేషు దేవుని దేహము చేత చుట్టబడిన ఈ పర్వతమును నాటినుండి "శేషాద్రి" యాను పేరు వచ్చినది.   ఇటువంటి శేషాద్రికి యజమానుడు శ్రీనివాసుడు.  ఈ "శేషాద్రి" పుట్టుట కు ముందు, నాశనము తరువాత శేషాద్రి ఏ లేఖ యుండుటచేత శ్రీనివాసుడా సందర్భమున శేషాద్రి పతి కాడని చెప్పినట్లు కాదా?  యను అనుమానము "ఏవ" యను పదము ఉత్తర మించు చున్నది.  ఈ శేషాచలము పుట్టుటకు పూర్వము ,  నాశన పొందిన తరువాత కూడా అనంత బ్రహ్మాండములు వానిలో నితిన్ శేషాద్రి ఉండి యే యున్నవి.  వాటికి శ్రీనివాసుడే అధిపతి  అగుట వలన అతని యందు గల శేషాద్రి పతిత్వము  సర్వకాలము నందు ఉన్నది యని చెప్పబడెను.  (ఇంకా ఉంది)

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*కేశవ నామాల విశిష్టత_తెలుసుకుందాం*

☘☘☘☘☘☘☘☘

*మనము ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముంచుగా ఆచమనము చేస్తూ.*


*కేశవాయనమః*

*నారాయణాయనమః*

*మాధవాయనమః*


*అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని 3సార్లు తీర్థము తీసుకుని,తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము.ఈ 24 కేశవ నామాలు చెప్పడంలో విశిష్టత ఏమి? దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది.ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో చానిపైన పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది.ప్రీతితో కార్యము చేస్తాము.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*01. ఓం కేశవాయనమః(శంఖం _చక్రం_గద_పద్మం)*


*బ్రహ్మ రుద్రులకు ప్రవర్తకుడూ,నియామకుడూ అయినందువల్ల శ్రీహరి ‘కేశవుడు’అనబడుతున్నాడు.ఈ కేశవుడు గాయత్రిలోని ‘తత్’ అన్న మొదటి అక్షరానికీ,‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అన్న మహామంత్రం లోని ‘ఓం ’అన్న అక్షరానికీ,ఇరవై నాలుగు తత్వాలలో మొదటిదైన అవ్యక్త తత్వానికీ,మార్గశీర్షమాసానికీ,శుక్లపక్షంలో లలాటంమీద ధరించే ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలలో ఒకటైన నామానికీ,మేషరాశికీ,ఆహారపదార్థాలలో ఒకటైన అన్నానికీ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*02. ఓం నారాయణాయనమః (పద్మం_గద_చక్రం_శంఖం)*


*నాశరహితుడైనందువల్ల విష్ణువు ‘నరుడు’ ఆయన చేత,సృష్టించబడిన జలం ‘నార’అనబడుతోంది.ప్రళయకం మీద శయనించిన విష్ణువు ‘నారాయణుడు’ అయ్యాడు.*

*ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘న’అక్షరానికీ,గాయత్రిలోని‘స’అన్న అక్షరానికీ,మహత్తత్వానికీ,పౌష్యమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం మీద ధరించే నామానికీ,వృషభరాశికీ, పరమాన్నానికీ, ప్రాతఃకాలానికీ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*03. ఓం మాధవాయ నమః(చక్రం_శంఖం_పద్మం_గద)*


*‘మధు’నామక యదువంశ శాఖలో జన్మించడంవల్లా,రమాదేవికీ పతి అయినందువల్లా,సర్వోత్తముడు అయినందువల్లా,శ్రీహరి ‘మాధవుడు’ అయ్యాడు.*

*ఈ మాధవుడు వాసుదేవ మహామంత్రంలోని‘మో’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వి’అన్న అక్షరానికీ,అహంకారతత్వానికీ,మాఘమాసానికీ,శుక్లపక్షంలో హృదయంమీద ధరించే నామానికీ,మిథునరాశికీ,భక్ష్యాలకూ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*04. ఓం గోవిందాయ నమః(గద_పద్మం_శంఖం_చక్రం)*


*వేదాల మూలంగా పొందబడేవాడూ,భూమినీ,గోవులనూ రక్షించేవాడూ,మోక్షప్రదుడూ అయినందువల్ల శ్రీహరి ‘గోవిందుడు’ అనబడుతాడు.* 

*ఈ గోవిందుడు వాసుదేవ మంత్రంలోని‘భ’అన్న అక్షరానికీ’గాయత్రిలోని“తుః”అన్న అక్షరానికీ,మనస్తత్త్వానికీ,పాల్గుణ మాసానికీ,శుక్లపక్షంలో కంఠ మధ్యలో ధరించే నామానికీ,కర్కాటక రాశికీ,నేయికీ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*05. ఓం విష్ణవే నమః(పద్మం_శంఖం_చక్రం_గద)*


*జ్ఞానానందాది సమస్త గుణాలతో,దేశతఃకాలతః వ్యాప్తుడైనందువల్లా సర్వోత్తముడై ఉన్నందువల్లా శ్రీహరి “విష్ణువు” అనబడుతున్నాడు.*

*ఈ విష్ణువు వాసుదేవ మహా మంత్రంలోని‘గ’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వ’అనేఅక్షరానికీ కర్ణతత్త్వానికీ,చైత్రమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం యొక్క దక్షిణ పార్శ్వంలో ధరించే నామానికీ,సింహరాశికీ,పాలకూ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*06. ఓం మధుసూదనాయ నమః (శంఖం_పద్మం_గద_చక్రం)*


*“మధు”నామక దైత్యుడిని సంహరించినందువల్లా,సాత్త్విక లోకానికి సుఖాన్ని ప్రసాదించేవాడైనందువల్లా శ్రీహరి‘మధుసూదనుడు’ అనబడుతున్నాడు.*

*ఈ మధుసూదనుడు వాసుదేవ మహామంత్రంలోని‘వ’అన్న అక్షరానికీ,గాయత్రిలోని ‘రే’అన్న అక్షరానికీ,త్వక్ తత్త్వానికీ,వైశాఖమాసానికీ, శుక్లపక్షంలో కుడిస్తనంమీద ధరించే నామానికీ,కన్యారాశికీ,మధురభక్ష్య విశేషానికీ నియామకుడు.* 

*ఈ మధుసూదనుడు‘హస్తిని’నాడిలో ఉంటాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*07. ఓం త్రివిక్రమాయ నమః (గద_చక్రం_శంఖం_పద్మం)*


*మూడు వేదాలనూ,మూడు కాలాలనూ,సత్త్వాది మూడు గుణాలనూ,భూరాది మూడు లోకాలనూ,త్రివిధ జీవులనూ,చేతన అచేతన మిశ్రములన్న త్రివిధ ద్రవ్యాలనూ తన స్వరూపంతో వ్యాపించి నెలకొన్న కారణంగా శ్రీహరి ‘త్రివిక్రముడు’ అనబడుతాడు.*

*వాసుదేవ మహామంత్రంలోని “తే”అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘ణి’అన్న అక్షరానికీ,నేత్ర తత్త్వానికీ,జ్యేష్ఠమాసానికీ,శుక్లపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ,తులా రాశికీ,వెన్నకూ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*08. ఓం వామనాయ నమః(చక్రం_గద_పద్మం_శంఖం)*


*అపేక్షిత సుఖాలనూ,అభీష్టాలనూ కరుణించేవాడూ,మోక్ష విరోధులైన దైత్యులను అంధకారంలో నెట్టివేసేవాడూ అయినందువల్ల శ్రీహరి‘వామనుడు’ అనబడుతున్నాడు.*

*ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘వా’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘యం’ అన్న అక్షరానికీ జిహ్వాతత్త్వానికీ,ఆషాడమాసానికీ,శుక్ల పక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ,వృశ్చికరాశికీ, పెరుగుకూ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*09. ఓం శ్రీధరాయ నమః(చక్రం_గద_శంఖం_పద్మం)*


*శ్రీ శబ్దవాచ్య అయిన మహాలక్ష్మికి కూడా ధారణకర్తా,పోషణకర్తా అయినందువల్లా లక్ష్మిని సర్వదా తన వక్షస్థలంలో ధరించి ఉండడం చేతా శ్రీహరి‘శ్రీధరుడు’ అనబడుతున్నాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘సు’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘భ’అన్న అక్షరానికీ,ఘ్రాణతత్త్వానికీ,శ్రావణమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికీ,ధనూరాశికీ,ముద్దపప్పుకూ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*10. ఓం హృషీకేశాయ నమః(చక్రం_పద్మం_శంఖం_గద)*


*ఇంద్రియ నియామకుడూ,రమ,బ్రహ్మ,రుద్రాదులకు ఆనందాన్ని ఇచ్చేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘హృషీకేశుడు’ అనబడుతున్నాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈయన వాసుదేవ మహామంత్రంలోని ‘దే’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘ర్గో’అన్న అక్షరానికీ,వాక్‍తత్త్వానికీ,భాద్రపద మాసానికీ,శుక్లపక్షంలో ఎడమ భుజంమీద ధరించే నామానికీ,మకర రాశికీ,ఆకుకూరలతో తయారుచేసిన పదార్థాలకూ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*11. ఓం పద్మనాభాయ నమః(పద్మం_చక్రం_గద_శంఖం)*


*నాభిలో పద్మాన్ని కలిగినవాడూ,భక్తుల మనస్సులో ప్రకాశించేవాడూ,సూర్యకాంతి వంటి కాంతి కలిగినవాడూ అయినందువల్ల శ్రీహరి‘పద్మనాభుడు’ అనబడుతున్నాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈయన వాసుదేవ మహామంత్రం లోని‘వా’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘దే’అన్న అక్షరానికీ,పాణితత్త్వానికీ, ఆశ్వయుజమాసానికీ, శుక్లపక్షంలో కంఠం ఎడమభాగంలో ధరించే నామానికీ,కుంభరాశికీ,కూరగాయలతో తయారుచేసే పదార్థాలకు నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*12. ఓం దామోదరాయ నమః(శంఖం_గద_చక్రం_పద్మం)*


*యశోదచేత పొట్టకు బిగించబడిన తాడుగలవాడూ,ఇంద్రియనిగ్రహం కలిగిన ఋషులతో క్రీడించేవాడూ,దానశీలురకు ఆనందాన్ని ఇచ్చేవాడూ,దైత్యులకు దుఃఖం కలిగించేవాడూ,దయాయుక్తులైన జీవులతో క్రీడించేవాడూ అయినందువల్ల శ్రీహరి‘దామోదరుడు’ అనబడుతున్నాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘య’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వ’అన్న అక్షరానికీ,పాదతత్త్వానికీ,కార్తీకమాసానికీ,శుక్లపక్షంలో మెడపైన ధరించే నామానికీ,మీనరాశికీ,అన్ని రకాల పుల్లని పదార్థాలకీ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*13. ఓం సంకర్షణాయ నమః(శంఖం_పద్మం_చక్రం_గద)*


*భక్తుల చిత్తాన్ని ప్రాపంచిక విషయాలనుండి మరలించి వైరాగ్య భావాన్ని కరుణించేవాడైనందువల్ల శ్రీహరి‘సంకర్షణుడు’ అనబడుతున్నాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈయన గాయత్రిలోని‘స’అన్న అక్షరానికీ,పాయు తత్త్వానికీ,కృష్ణపక్షంలో నుదిటిపై ధరించే నామానికీ,ఆమ్ల మిశ్రమాలు కాని పదార్థాలకీ, మనోమయకోశానికీ,క్షత్రియవర్ణానికీ,స్త్రీశరీరానికీ,ఋతుసామాన్యానికీ,రుద్రునికీ,మధ్యాహ్నసవనానికీ,ఆవేశరూపాలకూ,రాజసద్రవ్యాలకూ,త్రేతాయుగానికీ,శరదృతువుకూ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*14. ఓం వాసుదేవాయ నమః(శంఖం_చక్రం_పద్మం_గద)*


*త్రిలోకాలకూఆవాసస్థానమైనవాడూ,సర్వాంతర్యామీ,సర్వశక్తుడూ,సర్వచేష్టకుడూ,సర్వాభీష్టప్రదుడూ,యోగ్యజీవులకు ముక్తిని అనుగ్రహించేవాడూ,వసుదేవసుతుడూ అయినందువల్ల శ్రీహరి ‘వాసుదేవుడు’అనబడుతున్నాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈయన గాయత్రిలోని‘ధీ’అన్న అక్షరానికీ,ఉపస్థతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరమధ్యంలో ధరించే నామానికీ,పంచదారకూ,బెల్లానికీ,బ్రాహ్మణవర్గానికీ,పురుషశరీరానికీ,సాయంసవనానికీ,అవతారరూపాలకూ,శుభద్రవ్యాలకూ,కృతయుగానికీ,హేమంత ఋతువుకూ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*15. ఓం ప్రద్యుమ్నాయ నమః(శంఖం_గద_పద్మం_చక్రం)*


*అసదృశమైన కాంతీ,యశస్సు కలిగి ఉన్నందువల్ల శ్రీహరి ‘ప్రద్యుమ్నుడు’అనబడుతున్నాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈయన గాయత్రిలోని‘మ’అన్న అక్షరానికీ,శబ్దతత్త్వానికీ,కృష్ణపక్షంలో హృదయభాగంలో ధరించే నామానికీ,వడపప్పు మొదలైన పదార్థాలకూ,వైశ్యవర్ణానికీ,స్త్రీ శరీరానికీ,అయనానికీ,ప్రాతఃసవనానికీ,లీలారూపాలకూ,పీతవర్ణ ద్రవ్యాలకూ,ద్వాపరయుగానికీ,వర్ష ఋతువుకూ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*16. ఓం అనిరుద్ధాయ నమః(గద_శంఖం_పద్మం_చక్రం)*


*ఎవ్వరిచేతా నిరోధించబడనివాడూ,సర్వశక్తుడూ,గుణపూర్ణుడూ,మనస్సుతో సంపూర్ణంగా తెలియబడనివాడూ,జ్ఞానుల మనసులలో ధ్యానంతో బంధించబడేవాడూ,వేదవిరుద్ధ ఆచార నిరతులను సంహరించేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అనిరుద్ధుడు’అనబడుతున్నాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈయన గాయత్రిలోని‘హి’అన్న అక్షరానికీ,స్పర్శతత్త్వానికీ,కృష్ణపక్షంలో కంఠ మధ్యభాగంలో ధరించే నామానికీ,చేదుపదార్థాలకూ,శూద్ర వర్ణానికీ,అన్నమయకోశానికీ,భోగ్యవస్తువులన్నింటికీ, అబ్దానికీ, నల్లని ద్రవ్యాలకూ, కలియుగానికీ, గ్రీష్మఋతువుకూ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*17. ఓం పురుషోత్తమాయ నమః(పద్మం_శంఖం_గద_చక్రం)*


*దేహనాశంగల సర్వజీవులూ క్షరపురుషులు.ఏ విధమైన నాశనమూలేని అప్రాకృత శరీరంగల శ్రీమహాలక్ష్మిదేవి అక్షరపురుష.ఈ ఉభయ చేతనులకంటే సర్వోత్తముడైనందువల్ల శ్రీహరి‘పురుషోత్తముడు’అనబడుతున్నాడు*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈయన గాయత్రిలోని ‘థి’అన్న అక్షరానికీ,రూపతత్త్వానికీ, కృష్ణపక్షంలో ఉదరం కుడిభాగంమీద ధరించే నామానికీ,ఇంగువ,యాలకులు,ఆవాలు,కర్పూరాలకూ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*18. ఓం అధోక్షజాయ నమః(గద_శంఖం_చక్రం_పద్మం)*


*ఇంద్రియ నిగ్రహం కలిగిన వసుదేవాదులవల్ల ప్రాదుర్భవించినవాడూ,నిత్యజ్ఞానస్వరూపుడూ,అక్షయకుమారుడిని సంహరించిన హనుమంతుడిచేత తెలియబడేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అధోక్షజుడు’ అనబడుతాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈయన గాయత్రిలోని‘యో’అన్న అక్షరానికీ,రసతత్త్వానికీ,కృష్ణపక్షంలో కుడిస్తనంమీద ధరించే నామానికీ,పాలకూ,పానకమూ,మజ్జిగకూ,పచ్చిపులుసుకూ,నేతితో,నూనెతో వేయించిన పదార్థాలకూ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*19. ఓం నారసింహాయ నమః(పద్మం_గద_శంఖం_చక్రం)*


*నరుడిలాగా,సింహంలాగా ఉభయాత్మకమైన శరీరం కలిగివున్నందువల్ల శ్రీహరి ‘నారసింహుడు’అనబడుతాడు*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈయన గాయత్రిలోని ‘యో’అన్న అక్షరానికీ,గంధతత్త్వానికీ, కృష్ణపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ,బూడిద గుమ్మడికాయ,నువ్వులు,మినుములతో తయారుచేసిన వడియాలు మొదలైన పదార్థాలకూ,ఈశాన్య దిక్కుకూ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*20. ఓం అచ్యుతాయ నమః(పద్మం_చక్రం_శంఖం_గద)*


*శుద్ధజ్ఞానానందాలే దేహంగా కలవాడూ,సకలగుణ పరిపూర్ణుడూ,సత్య సంకల్పుడూ అయినందువల్ల సర్వదా పూర్ణకాముడూ,దోషరహితుడూ అయినందువల్లా శ్రీహరి ‘అచ్యుతుడు’అనబడుతున్నాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈయన గాయత్రిలోని‘నః’అన్న అక్షరానికీ,ఆకాశతత్త్వానికీ,కృష్ణపక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ,ఉద్దిపప్పుతో తయారుచేసే వడ మొదలైన వాటికి నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*21. ఓం జనార్థనాయ నమః(చక్రం_శంఖం_గద_పద్మం)*


*సముద్రంలో ఉండి తరచుగా దేవతల్ని పీడించే మధు,కైటభ,హయగ్రీవాది దైత్యులను మర్దనం చేసినవాడూ, మోక్షప్రదుడూ, జన్మలేనివాడూ, సంసారదుఃఖాన్ని పరిహరించేవాడూ,సుజీవులచేత పొందబడేవాడూ అయినందువల్ల శ్రీహరి‘జనార్ధనుడ’య్యాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈ జనార్ధనుడు గాయత్రిలోని ‘ప్ర’అన్న అక్షరానికీ,వాయుతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికీ,ఉప్పుకూ,నైరుతి దిక్కుకూ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*22. ఓం ఉపేంద్రాయ నమః(గద_చక్రం_పద్మం_శంఖం)*


*ఇంద్రుడిని అనుజుడిగా పొంది ఉన్నందువల్ల శ్రీహరి ‘ఉపేంద్రుడు’ అనబడుతున్నాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈ ఉపేంద్రుడు గాయత్రిలోని‘చో’అన్న అక్షరానికీ,తేజోతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఎడమ స్తనం మీద ధరించే నామానికీ,అరటిపండు,కొబ్బరికాయ మొదలైన ఫలాలకీ,వాటి రసాలకీ,తూర్పు దిక్కుకూ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*23. ఓం హరయే నమః(చక్రం_పద్మం_గద_శంఖం)*


*భక్తుల పాపాలను పరిహరించేవాడు కావడంచేత నారాయణుడు‘హరి’అనబడుతున్నాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈ హరి గాయత్రిలోని ‘ద’ అన్న అక్షరానికీ,అపోతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఎడమ భుజంమీద ధరించే నామానికీ,తాంబూలానికీ నియామకుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*24. ఓం కృష్ణాయ నమః(గద పద్మం చక్రం శంఖం)*


*సృష్టి,స్థితి,సంహార నియమనాదుల వల్ల సకల జగత్తునూ తనలోనికి లాగికొనువాడూ,పూర్ణానంద స్వరూపుడూ, నీలవర్ణ దేహకాంతికలవాడూ అయినందువల్ల శ్రీహరి“కృష్ణుడు”అనబడుతున్నాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఓం నమో నారాయణాయ*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 " శ్రీ వెంకటేశ్వర స్తోత్రం".  సాక్షాత్తు  చతుర్ముఖ బ్రహ్మ   మరియు  ఆయన మానసపుత్రుడు "నారదుల" వారి యొక్క  ముఖము నుండి  ఆవిర్భవించిన నటువంటి మహామహిమాన్వితమైన  "స్తోత్ర రాజము. "  ఇది.   బ్రహ్మాండపురాణం వెంకటగిరి  మహత్యము  లో చెప్పబడినది.   అని తెలుసుకున్నాము.        సహజంగా మన దేశంలో కుటుంబాలలో ఇంటి ఇలవేల్పు,  దేవతలు సైతం తమ "కుల దైవం,".  "ఇష్టదైవము" గా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూజలు, ప్రార్థనలు, చేస్తారు.    మనము కూడా ఈ నాటికి  కలియుగ దైవం అయిన "శ్రీ వెంకటేశ్వర స్వామి" (శ్రీనివాసుని) పూజించుట పరిపాటి.   శ్రీనివాసుని దర్శించని హిందూ కుటుంబము భారతదేశములో బహుశా కల్లా! (అరుదు).  ఈ శ్రీ వేంకటేశ్వరుని స్తోత్రము  అయితే కంఠస్థము గా అందరికీ వచ్చే ఉండును.   కానీ అర్థము ఎవరికీ తెలియదు. (  పండితులకు తప్ప) . తెలుగులో పుస్తకాలు అర్థము తాత్పర్యము ఉన్నది లభించుట లేదు.    అలా కేశవనామాలు 24 ఉంటాయి కదా!    ప్రతి పూజలో, వ్రతం నోము లలో, సంధ్యావందన కాలమునందు, మరియు దేవాలయం  ల యందు కేశవ నామాలు, చదవటం మనకు తెలుసు, ప్రతి ఒక్కరూ చెపుతారు.  అర్థం అనే  విషయానికొస్తే "తెలియదు" స్పష్టంగా చెప్పగలరు.  దమ్ తెలిసి చదివినా! పలికిన! ఆ ఆనందము, ఆ భక్తి శ్రద్ధలతో, రొమాన్ చితులై, పులకించి పోతూ జరుపుకుంటారు.    మరి శ్రీ వేంకటేశ్వర స్తోత్రం లో కేశవనామాలు వస్తాయి,  ఒక్కొక్క నామానికి ఒక పుస్తకము వ్రాయుటకు టైము చాలదు.  తగు పరిజ్ఞానము కూడా కావలసి ఉండును.  కనీసము "Basic Knowledge"  ఉండుట చాలా అవసరము ఉన్నది.   ఎందుకంటే నేటి తరం పిల్లలు పరిశీలించే తత్వము, తెలుసుకునే జిజ్ఞాస, కుతూహలము, మెండు, ఈ కంప్యూటర్ యుగంలో మనకే జ్ఞానము లేకపోతే. పిల్లలకు ఏమి చెప్పగలం?  పెద్దలు ఏమి చేసినా? చూచి, తెలుసుకుని, అడిగి, అర్థము చేసుకొని ఆచరించుట పరిపాటి అయినది (పిల్లలను కొట్టి నేర్పే కాలము కాదు).     అందుకే "ఆధ్యాత్మిక దృష్టి "కోణం లో  తాత్పర్యము ను సేకరించి ఇచ్చుట తెలపడమైనది.  తప్పులు ఉన్న తెలుగు టైపు సరిగా రాని, సరి అయిన మొబైల్ విజ్ఞానము లేని నాది, ఓనమాలు సరిగా రాని నాది, గా భావించి క్షమించగలరు.   నీకు అర్థమైన పదాలు , అన్ని విషయాలు శ్రీ హరి కృపా, మరియు జగద్గురువులు శ్రీ 1008, సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారి ఆదేశానుసారము వారి ప్రేరణ పొంది రాసి నట్లు భావించవలెను.  నేను నిమిత్తమాత్రుడు ను, దయచేసి ఈ "శీ వెంకటేశ్వర స్తోత్రం "  PART 1 , 2,3,4,ల కింద విభజించి రాయబడినది.  "మజుందార్, 87925-86125, బెంగళూర్"

జీవితం


 

ఆవేదన


 

Puja


 

All India Radio's

 



All India Radio's signature tune has been heard by hundreds of millions of people since it was composed in 1936. Somewhat improbably, the melody, based on raga Shivaranjani, was composed by Czech man Walter Kauffmann. He was the director of music at AIR and was one of the many refugees who found haven in India from Nazis. Kauffmann had arrived in India in February 1934 and ended up staying for 14 years upto 1948.


 

ప్రకృతి లో


 

 విదురనీతి 23


తమోగుణము గురించి విదురుడు ఈవిధంగా చెప్తున్నాడు.


మంచి చెడులను తెలుసుకోలేని అజ్ఞానం, మూర్ఖత్వం, మోహం, చపలత్వం, బుధ్ధిహీనత, ఇతరులను పీడించే దుష్టస్వభావం, తప్పుడు భ్రమ, సోమరితనము వంటి తమోగుణాలతో జీవుని ఆత్మ బంధింపబడుతోంది. 

తమోగుణము కలవారు భూత ప్రేత గణాలను ఆరాధిస్తారు.


1. దానం: తిరస్కరించదగినదియై, దానమునకు తగని సందర్భమునందు, అర్హులు కానివారికి ఇవ్వబడే దానం "తామసదానం" అనబడుతుంది.

2. త్యాగం: ఇక్కడ త్యాగమంటే మానవుడు తాను చేయవలసిన సత్కార్యాలను విడిచిపెట్టుట, వేదాలు, మహాత్ములు తెలిపినటువంటి సత్కార్యాలను నిర్వర్తించకపోవడం వగైరా అవివేకాన్ని, అలసత్వాన్ని తెలియచేస్తుంది.

3. జ్ఞానం.: ఏ జ్ఞానమైతే ఒక్క దాని యందే సమస్తమూ ఉన్నట్లుగా భావించి, దాని యందే ఆసక్తి, మనసు కలది అగుతున్నదో అట్టి జ్ఞానం తామస జ్ఞానం.

4. కర్త: ఆత్మస్థైర్యం లేనివాడు, మూఢుడు, నమ్రతలేనివాడు కుత్సితుడు, ఇతరుల జీవితాలను చెరచుటలో ఆసక్తి కలవాడు, వ్యసనపరుడు మొదలైన వారలు తామసకర్తలు.

5.బుధ్ధి: అజ్ఞానముతో పూర్తిగా నిండి అధర్మమును ధర్మముగా, మానవుడు తెలుసుకోదగిన, ఆచరించదగినా వాటినన్నిటినీ అందుకు విరుధ్ధముగా తలచుచున్నదో ఆ బుధ్ధి తమోగుణ ప్రధానమైనదిగా చెప్పబడుతుంది. 

6. ధైర్యము: దుష్ట స్వభావం కలవాడు తన గుణాలను ఏ ధైర్యముతో విడువడో అట్టి ధైర్యము తామస ధైర్యము. 


జీవుని లొని ఆత్మ సత్వ, రజో, తామస అనే మూడు గుణాలచేత బంధింప బడుతోంది. ఎవరిలో ఏ గుణము అభివృధ్ధిలో ఉంటే అందుకు తగినట్లుగానే వారి కార్యకలాపాలు ఉంటాయి.

మోహం, కోపం, లోభం, అనే ఈమూడు నరకానికి మూడు దారుల్లాంటివి . మనిషి వ్యక్తిత్వాన్ని ఇవి సంకుచితపరుస్తాయి. మోహం బారిన పడిన మానవుడు దానిని తృప్తి పరిచే ప్రయత్నంలో లోభానికి, అందులో విఫలమైతే అసహనానికి, కోపానికీ గురవుతాడు. మానవుని ఆత్మ భౌతిక బంధాల నుండి విముక్తి చెందకుండా ఈ మూడు అడ్డుపడుతుంటాయి.


కనుక సజ్జనుడు ఈ మూడింటి విషయంలో సర్వదా అప్రమత్తుడై మెలగాలి. ఆధ్యాత్మికానందానుభూతిని పరిపూర్ణంగా పొందాలంటే కూడ ఈ మూడింటికి హృదయంలో చోటివ్వకూడదు. అపుడే మనిషి తన జీవితంలో నియమనిబంధనలు పాటించి, సత్కర్మలనే ఆచరిస్తాడు. తద్వారా మోక్షప్రాప్తి పొందుతాడు. నాలుగు 

ఆశ్రమాలలోని వైదిక ధర్మాలను వ్యక్తి తన జీవితంలో ఆచరించినపుడు ఆధ్యాత్మికంగా సంపూర్ణ అనుభూతిని అతడు పొందగలుగుతాడు.


(ఇంకా ఉంది)

 _🚩🚩🚩🚩🚩🚩

*Swami Vivekananda's wisdom for daily inspiration - Oct 18.*_


_*స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - అక్టోబరు 18.*_


*It is the strong mind that hews its way through a thousand difficulties.*


*ధృఢమైన మనస్సు వేల అవరోధాలున్న మార్గంలో సహితం దారి చేసుకొని ముందుకు వెళ్ళగలదు.*

🚩🚩🚩🚩🚩🚩

 *Good Morning*

   *Happy Sunday*

🙏🙏🌷🌷🙏🙏

ఫోన్