20, అక్టోబర్ 2020, మంగళవారం

కథలు/నీతి కథలు

 *కథలు/నీతి కథలు సంబంధ 58 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

58  పుస్తకాలు ఒకేచోట    https://www.freegurukul.org/blog/kathalu-pdf


               (OR)


భారతంలో నీతి కథలు www.freegurukul.org/g/Kathalu-1


చందమామ కథలు www.freegurukul.org/g/Kathalu-2


నీతి కథలు www.freegurukul.org/g/Kathalu-3


నీతి కథామాల www.freegurukul.org/g/Kathalu-4


కుచేలోపాఖ్యానం www.freegurukul.org/g/Kathalu-5


బాలానంద బొమ్మల పంచతంత్రం-1,2 www.freegurukul.org/g/Kathalu-6


నూరు మంచి మాటలు www.freegurukul.org/g/Kathalu-7


భేతాళ కథలు www.freegurukul.org/g/Kathalu-8


అపూర్వ చింతామణి www.freegurukul.org/g/Kathalu-9


సుజ్ఞాన బోధిని-నీతి కథలు www.freegurukul.org/g/Kathalu-10


నీతి కథలు www.freegurukul.org/g/Kathalu-11


బొమ్మల భట్టి - విక్రమాదిత్యుల కథలు-1,2 www.freegurukul.org/g/Kathalu-12


కాశీమజిలీ కథలు-1 www.freegurukul.org/g/Kathalu-13


కాటమ రాజు కథలు-1 www.freegurukul.org/g/Kathalu-14


పంచతంత్రం-మిత్ర భేదం,మిత్ర ప్రాప్తికం www.freegurukul.org/g/Kathalu-15


భట్టి విక్రమార్కుని కథలు www.freegurukul.org/g/Kathalu-16


ప్రసన్న కథా విపంచి www.freegurukul.org/g/Kathalu-17


కథా గుచ్ఛము-1 www.freegurukul.org/g/Kathalu-18


మాటా మంతి అవీ ఇవీ www.freegurukul.org/g/Kathalu-19


నాలుగు కథలు www.freegurukul.org/g/Kathalu-20


కథా సరిత్సాగరము-1నుంచి5 www.freegurukul.org/g/Kathalu-21


భేతాళ కథలు www.freegurukul.org/g/Kathalu-22


విశాలాంధ్ర తెలుగు కథ 1910-2000 www.freegurukul.org/g/Kathalu-23


ఉత్తమ ఇల్లాలు www.freegurukul.org/g/Kathalu-24


పరమానందయ్య శిష్యులు www.freegurukul.org/g/Kathalu-25


పొడుపు కథలు www.freegurukul.org/g/Kathalu-26


నీతి చంద్రిక -పూర్వార్ధము www.freegurukul.org/g/Kathalu-27


కథాసూక్తులు - సుధామూర్తులు www.freegurukul.org/g/Kathalu-28


ఉదయభాను బాలసాహిత్యం-1 www.freegurukul.org/g/Kathalu-29


కాటమ రాజు కథలు-2 www.freegurukul.org/g/Kathalu-30


పదహారు రాత్రులు www.freegurukul.org/g/Kathalu-31


ఆరె జానపథ గాధలు www.freegurukul.org/g/Kathalu-32


గజపతులనాటి గాధలు www.freegurukul.org/g/Kathalu-33


ఆంధ్ర నలకథా సర్వస్వం www.freegurukul.org/g/Kathalu-34


గయోపాఖ్యానము www.freegurukul.org/g/Kathalu-35


కథలు-3 www.freegurukul.org/g/Kathalu-36


ఒకే కథ అనేక రకాలు www.freegurukul.org/g/Kathalu-37


ఉన్నది - ఊహించేది www.freegurukul.org/g/Kathalu-38


మదాలసా చరిత్రము www.freegurukul.org/g/Kathalu-39


పరమానంద గురువు కథలు www.freegurukul.org/g/Kathalu-40


పేదరాసి పెద్దమ్మ కథలు-2 www.freegurukul.org/g/Kathalu-41


చైనా జపాన్ ప్రసిద్ద కథలు www.freegurukul.org/g/Kathalu-42


బాలానంద కాశీరామేశ్వర మజిలీల కథలు www.freegurukul.org/g/Kathalu-43


రాయల నీతి కథలు www.freegurukul.org/g/Kathalu-44


పల్నాటి కథలు www.freegurukul.org/g/Kathalu-45


భోజ కాళిదాస కథలు-1 www.freegurukul.org/g/Kathalu-46


బొమ్మల భేతాళ కథలు www.freegurukul.org/g/Kathalu-47


టాల్ స్టాయి కథలు www.freegurukul.org/g/Kathalu-48


ఉడతమ్మ ఉపదేశం www.freegurukul.org/g/Kathalu-49


జేజమ్మ కథలు www.freegurukul.org/g/Kathalu-50


నలదమయంతుల కథ www.freegurukul.org/g/Kathalu-51


భేతాళ కథలు www.freegurukul.org/g/Kathalu-52


చదువు కథలు www.freegurukul.org/g/Kathalu-53


సదుపదేశ కథలు-1,2,3 www.freegurukul.org/g/Kathalu-54


శుకసప్తతి కథలు www.freegurukul.org/g/Kathalu-55


గిరిజా కళ్యాణము-కుమార సంబవము www.freegurukul.org/g/Kathalu-56


బొమ్మల ఆలీబాబా 40 దొంగలు www.freegurukul.org/g/Kathalu-57


వీర గాధలు www.freegurukul.org/g/Kathalu-58


కథలు గురించి తెలుసుకోవడానికి  కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link  www.freegurukul.org/join

పాట బాగుంది


 

దేవరహస్యం

 యమధర్మరాజు ఒక యమదూతను భూలోకానికి వెళ్ళి ఒక ప్రాణాన్ని తీసుకురమ్మని పంపుతాడు

భూలోకానికి వచ్చాడు ఆ దూత 

ఒక ఆవిడ అప్పుడే బిడ్డను ప్రసవించింది 

అంతకు ముందు వారం ఆమె భర్త చనిపోయాడు 

ఆ తల్లిని కూడా  చంపేస్తే ఆ బిడ్డ ఆలనా పాలన ఎలా అని ఆ యమదూత జాలిపడి ప్రాణాలు తీయకుండానే వెళ్ళిపోయాడు 


అదే విషయాన్నీ యమధర్మరాజుకు చెప్పగా 

దేవరహస్యం తెలియక నీకు ఇచ్చిన కార్యాన్ని నువ్వు చేయకుండా ఉల్లంఘించినందుకు నువ్వు నీ రూపు మారి భూలోకంలోకి వెళ్ళి దేవరహస్యం అర్థం అయ్యాకే ఇక్కడకు చేరుకుంటావని శాపం ఇచ్చాడు 


యమదూత పూర్తి నల్లని రూపంతో ఒక చోట మూలుగుతుండగా అక్కడకు ఓ దర్జీ వచ్చి చూసి జాలిపడి అతడిని ఇంటికి తీసుకు వెళ్తాడు 

తన ఇంటి ముందు ఆవరణలో అతను కుట్టుమిషన్ పెట్టుకుని బట్టలు కుడుతూ జీవనం సాగిస్తాడు 


యమదూతను తీసుకెళ్లి కూర్చోబెట్టి భార్యను పిలిచి భోజనం వడ్డించమంటాడు 

తాను తాగేందుకే గంజి లేదు అతిథికి విందుభోజనమా 

అన్నం లేదు ఏమీ లేదు వేళ్ళు అంటుంది 

యమదూత అక్కడనుండి వెళ్లిపోతుండగా మళ్ళీ ఆమె పిలిచి సరే లోపలి రా వచ్చి బోంచేయి అంటది 

అప్పుడు యమదూత ఒక నవ్వు నవ్వుతాడు 

అతడి శరీరం కొంత భాగం బంగారు వర్ణానికి మారుతుంది 


ఆ దర్జీ నువ్వు నా దగ్గరే ఉండి నాకు తోడుగా పని చేస్తూ ఇక్కడే ఉండొచ్చు అంటాడు అలా ఐదేళ్లు గడిచాక ఆ ఇంటిముందు ఓ స్థితిమంతురాలైన ఒక స్త్రీ ఇద్దరి పిల్లలతో దర్జీ దగ్గరకు వచ్చింది 

ఆ ఇద్దరి పిల్లలలో ఒకడు అవిటివాడు 

కొన్ని బట్టలు ఇస్తూ ఆ పిల్లాడికి ప్రత్యేకంగా 

 చాలా ఖరీధైన దుస్తులు కుట్టించమని చెప్పి వెళ్ళింది 

అప్పుడు నవ్వాడు మరోసారి యమదూత 

మళ్ళీ శరీరం బంగారు వర్ణంలోకి రంగు మారింది 


మరొక పదేళ్లు గడిచింది ఇప్పుడు యమదూత బట్టలు కుట్టడం నేర్చుకున్నాడు అప్పుడు ఓ ఐశ్వర్యవంతుడైన వ్యక్తి కారులో  వచ్చి చాలా విలువచేసే గుడ్డను ఇచ్చి తనకు ఇరవై ఏళ్లకు చినిగిపోని సూట్ ఒకటి కుట్టమని మూడురోజుల్లో వచ్చి తీసుకుంటానని చెప్పి వెళ్తాడు 


యమదూత రెండు రోజులు కుట్టకుండానే జాప్యం చేసి మూడో రోజు ఒక దిండు కవర్ మరియు ఒక దుప్పటిలా కుట్టేస్తాడు అది చూసిన ఆ దర్జీ అయ్యో ఎంత పని చేసావు ఇప్పుడు అతను వచ్చి అడిగితే నేను ఏమీ చెప్పాలి అని అంటుండగానే కారు డ్రైవర్ వచ్చి అయ్యా మా యజమాని చనిపోయారు ఆయనకు దిండు కవర్ దుప్పటి కుట్టివమని చెప్పి కుట్టినవి తీసుకుని వెళ్ళిపోతాడు 


అప్పుడు మరోసారి నవ్వుతాడు యమదూత పూర్తిగా బంగారు వర్ణంలోకి మారి పైకి వెళ్లిపోతుండగా అప్పుడు దర్జీ అయ్యా మీరెవరు 

మీరు నా దగ్గరకు వచ్చినప్పటి నుండి మూడు సార్లు మాత్రమే నవ్వారు మీరు నవ్వినప్రతిసారి మీ రంగు మారేది కారణం చెప్పండి అన్నాడు 


జరిగిన విషయం చెప్పి 

మొదటి సారి 

మీ భార్య అన్నం లేదు అని చెప్పింది 

అప్పుడు ఆమె దరిద్రదేవతలాగా కనిపించింది 

మళ్ళీ బోంచేయి అని పిలిచినప్పుడు 

నాకు ఆమె మహాలక్ష్మి రూపంలో కనిపించింది 

అప్పుడు తెలిసింది అభిప్రాయాలు మారుతాయి అని 


రెండవ సారి 

ఆ పిల్లాడు తల్లి ప్రాణాలను తీయమన్నపుడు అలోచించి వదిలేసాను కానీ అతనికి ఆమె కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి అతని అంగవైకల్యాన్ని కూడా లెక్కచేయకుండా తన బిడ్డకు సమానంగా చూసే వ్యక్తి దగ్గర చేసాడు 

అప్పుడు అర్థం అయింది దేవుడు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే ఆ చోటును తప్పకుండ భర్తీ చేస్తాడు అని 


ఇక మూడోసారి 

అతడు మూడు రోజుల్లో చనిపోతాడని నాకు తెలుసు అందుకే అలా కుట్టాను కానీ అతను ఇరవై ఏళ్లకు చినిగిపోనంతగా ఒక సూట్ కుట్టమని ఇచ్చాడు 

మనం శాశ్వతం కాదు 

ఏ క్షణాన ఎవరూ పోతామో తెలియదు ఎంత కాలం ఉంటామో తెలియదు  కానీ నమ్మకం 

ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు కానీ డబ్బును ఎక్కువగా పోగుచేసేస్తుంటారు 

అక్రమంగా సంపాదించి చెర్చేస్తుంటారు 

ఆశతో బతికేస్తుంటారు అని చెప్పి దేవరహస్యాలను తెలుసుకున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు.

💐💐💐

ధృవ నక్షత్రము

 ధృవ నక్షత్రము సప్తర్షి మండలము లో భాగము కాదు.Ursa minor తోక భాగము లో ధృవ నక్షత్రము ఉంటుంది.సాధారణంగా ధృవ నక్షత్రము ను పూర్వ కాలము లో దిక్కులను తెలుసుకోవడానికి అందరూ కూడా ఉపయోగిచేవారు.అందుచేత Ursa minor యొక్క‌ స్థితి అందరికి సుపరిచితము.


Ursa major మరియు Ursa minor రెండింటి తోక భాగాలు వ్యతిరేక దిశలో కనపడుతాయి.

టెలిస్కోప్ ద్వారా చూసేవారికి ఈ రెండు కూడా ప్రధానమైన అంశాలే.

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*127వ నామ మంత్రము*


*ఓం శ్రీకర్యై నమః*


సమస్త సంపదలను మరియు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను అనుగ్రహించు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శ్రీకరీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులు సిరిసంపదలు, ఆధ్యాత్మిక సంపదలు సంప్రాప్తమయి ఆనందముతో, ఆత్మానందానుభూతితో జీవింతురు.


జగన్మాత అష్టలక్ష్మీ స్వరూపిణి. భక్తులకు కేవలం పాడిపంటలు, సిరిసంపదలు మాత్రమేగాక ఒక గృహస్థుకు కావలసిన విద్య, ఆరోగ్యము, కష్టములనెదుర్కొనే ధైర్యము, వంశాభివృద్ధి (సంతానము), పాడిపంటలు, తలచిన ధర్మకార్యములందు విజయము, వస్తువాహనములను మరియు ధర్మార్థకామములను పురుషార్థములకు అనుగుణంగా, పూర్వజన్మ కర్మఫలము ననుసరించి   అనుగ్రహించు అష్టలక్ష్మీ స్వరూపిణి. 


*శ్రీ* అంటే సంపదమాత్రమేకాదు. సర్వ శుభకరం. సర్వ మంగళకరం. మనకు కావలసింది అదేకదా. సిరిసంపదలు, వస్తువాహనములు, పాడిపంటలకు లోటు లేకున్నప్పటికిని అందరూ సంతోషంగా ఉండాలి. దుఃఖకరమైనది ఏదియు సంభవింపకూడదు. ఏదైనా పని చేయునప్పుడు *శ్రీ* కారం చుట్టాము అంటాము. అంటే తలపెట్టిన కార్యము శుభకరము గాను, మంగళకరముగాను జరగాలనే భావనేకదా ఈ *శ్రీకారం* చుట్టాము అని అనడంలోని అంతరార్థము. శ్రీకారం చుట్టామంటేనే సర్వమంగళకారిణి అయిన జగన్మాతను తలచినట్లేగదా. అందుకు ఆ తల్లి తలచిన పనులు అవిఘ్నముగా, సర్వశుభకరముగా సిద్ధింప జేయును. అందుకే జగన్మాత *శ్రీకరీ* అని అనబడినది. నారాయణుడు అంటే శ్రీమన్నారాయణుడు. నారాయణి అంటే జగన్మాత. విష్ణుసహస్రంలో 

 

*శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః* (విష్ణుసహస్ర నామస్తోత్రము, 65వ శ్లోకము, రెండవ పాదము)


పై శ్లోకంలో *శ్రీకరః* (శ్రీకరుడు) అని శ్రీమన్నారాయణుని స్తుతించాము. 


ఇక్కడ నారాయణి కూడా *శ్రీకరి* అని స్తుతింపబడుతూ, మువురమ్మల (మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతి) అనడంచేత కూడా *శ్రీకరీ* అని నామ ప్రసిద్ధమైనది.


*అష్టలక్ష్ములు*


1) ఆదిలక్ష్మి, 2) ధాన్యలక్ష్మి, 3) ధైర్యలక్ష్మి, 4) గజలక్ష్మి, 5) సంతాన లక్ష్మి, 6) విజయలక్ష్మి, 7) విద్యాలక్ష్మి, 8) ధనలక్ష్మి.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శ్రీకర్యై నమః* అని అనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*704వ నామ మంత్రము*


*ఓం సరస్వత్యై నమః*


జ్ఞానాధిష్ఠాన దేవతా స్వరూపిణిగా, జ్ఞానముద్రాస్వరూపిణిగా, ప్రాణుల జిహ్వలయందు వాగ్రూపిణిగా, సరస్వతి యను నదీస్వరూపిణిగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సరస్వతీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సరస్వత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణచే చక్కని వాక్పటిమ, పలువురిలో మన్ననలందగల సంభాషణా చాతుర్యత, (విద్యార్థులయినచో) విద్యాబుద్ధులు, వేదాధ్యయనులకు వాక్శుద్ధి సంప్రాప్తించును ఆ జగన్మాత ఆరాధనలో.


సరస్వతి యనగా జ్ఞానిభిమానినీ దేవత. జ్ఞానముద్రస్వరూపురాలు గూడా. అనగా బ్రహ్మజ్ఞాన స్వరూపురాలు. అజ్ఞానముచే జ్ఞానమావరింపబడినది అనగా ప్రాణులు మోహమును పొందుచున్నారు. ఈ విషయం *సర్వమోహినీ* (703వ నామములో చెప్పబడినది. జ్ఞానమంటే అద్వైతము (జీవుడు, దేవుడు ఒకటే), అజ్ఞానము అద్వైతము అనగా జీవుడు వేరు, దేవుడు వేరు. అలా అన్నప్ఫుడు అజ్ఞాని మోహావేశభరితుడై భౌతికసుఖలోలత్వమునకు ఆశపడును.


 వ్యాఘ్రపాదుడు అను మహాత్ముని కుమారులు ఉపమన్యు మరియు దౌమ్యుడు.  ఈ దౌమ్యుడు కన్యకలకు నామకరణము చేయునపుడు రెండు సంవత్సరముల కన్యకకు సరస్వతి అని పేరు పెట్టెను. అందుచే రెండుసంవత్సరముల కన్యక భరద్వాజస్మృతిలో ప్రాణులందరి జిహ్వలందు వాక్కులకు స్థానమై ఎల్లప్పుడు ఉంటుంది గనుక,  సరస్వతి వాగ్రూపురాలు అయి ఉండుటచేతను,రెండు సంవత్సరముల కన్యకకు సరస్వతి అని పేరు పెట్టిరి.   అందుచేతనే రెండు సంవత్సరముల కన్యకను సరస్వతిగా నవరాత్రులలో ఆరాధించు సాంప్రదాయము గలదు.

అందరి జ్ఞానదృష్టులు ఈ రెండు వత్సరముల కన్యకపై యుండును గనుక ఆ రెండువత్సరముల బాలికకు సరస్వతి అని నామమును నిర్ణయించిరి. జగన్మాత *సరస్వతీ* యని ఈ కారణముచే చెప్పదగును. ఈ సరస్వతి సర్వులకు జ్ఞానదృష్టులను  స్రవింపజేయుటచే గూడ, జగన్మాత *సరస్వతీ* యను నామముచే ప్రసిద్ధురాలు. జగన్మాత జ్ఞానప్రవాహ. 


పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది.


సృష్టిచేయాలని బ్రహ్మ తపస్సు చేసినప్పుడు అతని శరీరం నుంచి పదిమంది కుమారులు, పదిమంది కుమార్తెలు ఉద్భవించారు. కుమార్తెలలో చివరిది శతరూప. ఆమెయే సరస్వతి.


సరస్వతీ నది హిందూ పురాణములలో చెప్పబడిన ఓ పురాతనమైన నది.  

 ఆ తరువాత మహాభారతములో ఈ నది ఎండిపోయినట్లు చెప్పబడింది.  కాని సరస్వతీ నది అంతర్వాహినియై ఉంటుందని, ప్రయాగవద్ద గంగా, యమునలలో అంతర్వాహినిగా కలిసి, త్రివేణీ సంగమము ఏర్పడినదని పురాణగాథ.    


మూలాధారం నుండి సహస్రారం దిశగా కుండలినీ శక్తి సుషుమ్నా మార్గంలో పయనిస్తుంది. సుషుమ్నాకు ఇరువైఫుల ఉండే ఇడ, పింగళ నాడులు రెండూ గంగ, యమునలు అయితే, సుషుమ్నా నాడి సరస్వతీ రూపము. ఆవిధంగా జగన్మాత సరస్వతీ స్వరూపురాలు. 


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సరస్వత్యై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

నవ దుర్గలు*

 **దశిక రాము**


 **దేవీ నవరాత్రులు  నవ దుర్గలు**

 - 4. 


**కూష్మాండ** 


 లలితా త్రిపుర సుందరి దేవి 



  ప్రార్ధనా శ్లోకము :


**సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।**

**దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే** ॥


🌷. అలంకారము : శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి - ఆకాశం రంగు


🌷. నివేదనం : అల్లం గారెలు 


🌷. మహిమ :

జ్ఞానరూపిణి,సరస్వతీ

శక్తిగా స్తుతించబడే కూష్మాండ రూపంతో అలరారే దేవీమాత అభయముద్రలను ధరించి భక్తులను కాపాడుతుంది. నమ్మిన భక్తులకు బహురూపాలుగా కనిపించి రక్షిస్తుంది. ఆయుష్యును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

సంసారమనే జగత్తు యొక్క అందాన్ని ఉదరాన ధరించే మాయారూపిణి .. ఈమె .


దుర్గామాత నాలుగవ స్వరూప నామము ‘కూష్మాండ’. దరహాసముతో అంటే అవలీలగా బ్రహ్మాండమును సృజించుతుంది కాబట్టి ఈ దేవి ‘కూష్మాండ’ అనే పేరుతో విఖ్యాతి చెందింది.


🌻. సాధన :

ఈ జగత్తు సృష్టి జరుగక ముందు అంతటా గాఢాంధకారమే అలముకొని ఉండేది. అప్పుడు ఈ దేవి తన దరహాసమాత్రంతో ఈ బ్రహ్మాండాలను సృజించింది. కాబట్టి ఈ స్వరూపమే ఈ సృష్టికి ఆదిశక్తి. ఈ సృష్టిరచనకు పూర్వము బ్రహ్మాండమునకు అస్తిత్వమే లేదు.


ఈమె సూర్యమండలాంతర్వర్తిని. సూర్యమండలంలో నివసింపగల శక్తిసామర్థ్యములు ఈమెకే గలవు. ఈమె శరీరకాంతిచ్ఛటలు సూర్యకిరణ ప్రభలలాగా దేదీవ్యమానముగా వెలుగొందుతూ ఉంటాయి. ఈమె తేజస్సు నిరుపమానము. దానికి అదే సాటి. ఇతర దేవతాస్వరూపాలేవీ ఈమె తేజః ప్రభావములతో తులతూగలేవు. ఈమె తేజోమండల ప్రభావమే దశదిశలూ వెలుగొందుతూ ఉంటుంది. బ్రహ్మాండములోని అన్ని వస్తువులలో, ప్రాణులలో ఉన్న తేజస్సు కూష్మాండ ఛాయయే.


ఈ స్వరూపము ఎనిమిది భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. అందువల్లనే ఈమె ‘అష్టభుజాదేవి’ అనే పేరుతో కూడా వాసిగాంచింది. ఈమె ఏడు చేతులలో వరుసగా కండలమూ, ధనుస్సూ, బాణమూ, కమలమూ, అమృతకలశమూ, చక్ర గదలు తేజరిల్లుతూ ఉంటాయి. ఎనిమిదవ చేతిలో సర్వ సిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాల ఉంటుంది. సింహవాహన. సంస్కృతంలో ‘కూష్మాండము’ అంటే గుమ్మడికాయ. కూష్మాండబలి ఈమెకు అత్యంత ప్రీతికరము. ఇందువల్ల కూడా ఈమెను ‘కూష్మాండ’ అని పిలుస్తారు.


నవరాత్రి ఉత్సవాలలో నాల్గవరోజు కూష్మాండాదేవీ స్వరూపమే దుర్గామాత భక్తుల పూజలను అందుకొంటుంది. ఈనాడు సాధకుని మనస్సు అనాహత చక్రంలో స్థిరమవుతుంది. కాబట్టి ఈ రోజు ఉపాసకుడు పవిత్రమైన, నిశ్చలమైన మనస్సుతో కూష్మాండాదేవి స్వరూపాన్నే ధ్యానిస్తూ పూజలు చేయాలి. భక్తులు ఈ స్వరూపాన్ని చక్కగా ఉపాసించడంవల్ల పరితృప్తయై ఈమె వారి రోగాలనూ, శోకాలనూ రూపుమాపుతుంది. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములూ, ఆరోగ్యభాగ్యములు వృద్ధి చెందుతాయి. సేవకుల కొద్దిపాటి భక్తికే ఈ దేవి ప్రసన్నురాలవుతుంది. మానవుడు నిర్మల హృదయంతో ఈమెను శరణుజొచ్చిన వెంటనే అతి సులభముగా పరమ పదము ప్రాప్తిస్తుంది.


శాస్త్రాలలో, పురాణాలలో పేర్కొనబడిన రీతిలో విధివిధానమును అనుసరించి మనము దుర్గాదేవిని ఉపాసిస్తూ అనవరతము భక్తి మార్గంలో అగ్రేసరులమై ఉండాలి. ఈ తల్లి భక్తిసేవా మార్గంలో కొద్దిపాటిగానైనా పురోగమించగలిగిన సాధకునికి ఆమె కృపానుభవము అవశ్యము కలిగి తీరుతుంది. దాని ఫలితంగా దుఃఖరూప సంసారమంతా భక్తునికి సుఖదాయకమూ, సుగమమూ అవుతుంది. మనిషి సహజంగా భవసాగరాన్ని తరించడనికి ఈ తల్లియొక్క ఉపాసన అతి సులభమైన, శ్రేయస్కరమైన మార్గం. మనిషి ఆదివ్యాధులనుండీ సర్వదా విముక్తుడవటానికీ, సుఖసమృద్ధిని పొందటానికీ, ఉన్నతిని పొందటానికీ కూష్మాండా దేవిని ఉపాసించటమనేది రాజమార్గం వంటిది. కాబట్టి లౌకిక, పారలౌకిక ఉన్నతిని కాంక్షించేవారు ఈ దేవీస్వరూపంయొక్క ఉపాసనలో సర్వదా తత్పరులై ఉండాలి.

🌹 🌹 🌹 

🙏🙏🙏

సహజ జ్ఞానం*

 *సహజ జ్ఞానం*


ఇతరులకు మంచి చెడుల గురించి ఎరుకన పరచాలంటే మనం ఆచరించి చూపాలి. అప్పుడు మాత్రమే ఎవరైనా మనం చెప్పేది శ్రద్ధగా వింటారు. రాసేది ఆసక్తిగా చదువుతారు. మంచి ప్రవర్తన కోసం అంతర దృష్టి ఎంతో అవసరం. ఈ సహజ జ్ఞానం కోసం నిరంతరం సాధన చేయాలని విజ్ఞులు చెబుతారు. దీనికోసం ఘనమైన కుటుంబ నేపథ్యం, అనేక పట్టాలు అవసరం లేదు.  కొన్ని సార్లు అటువంటి అర్హతలే మనిషిని అహంకారిని చేస్తాయి.

ఈ విశ్వంలో రెండు శక్తులు సమాంతరంగా పని చేస్తున్నాయి. వాటినే సచేతనత్వం, నిశ్చలత్వంగా గుర్తిస్తారు. ఈ రెండూ రైలు పట్టాల్లా ఎప్పుడూ కలవవు. సచేతనత్వం నిశ్చలత్వానికి భిన్నమైంది. పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఈ రెండు శక్తులూ పోటీపడుతూ మనిషిని కలవరానికి గురిచేసే ప్రయత్నం చేస్తాయి. ఈ రెంటి మధ్య ఒడుదొడుకులు లేకుండా మన సత్ప్రవర్తనను కాపాడుకోవాలి. అప్పుడే మనం గెలిచినట్లు... ఒకరికి మంచి చెప్పే అర్హత సాధించినట్లు!

సమాజంలో అసాంఘిక శక్తులు సమస్యలను సృష్టిస్తాయి. నైతిక విలువలు పాటించేవారు సైతం కొన్నిసార్లు అవినీతిపరుల వల్ల నైరాశ్యానికి గురి అవుతుంటారు. దీనితో మంచివారు సమాజంలో ఇమడలేక ఒంటరి పోరాటం చేస్తుంటారు. ధనం, భుజబలం కలిగినవాళ్లు దుష్టులై సమాజానికి ప్రశ్నార్థకంగా మారతారు. సహజం గానే మంచితనం తాత్కాలికంగా బలహీన పడుతుంది. మంచివారే దోషులనిపించుకుని కష్టాలపాలయ్యే పరిణామాలు ఏర్పడతాయి. శ్రీరాముడొక్కడై లంకలోని రాక్షసులను గెలిచేందుకు తగిన సమయం, బలం, బంటు కోసం వేచి చూడాల్సి వచ్చింది. ప్రహ్లాదుణ్ని రక్షించేందుకు శ్రీహరి సైతం నిరీక్షించాల్సి వచ్చింది. దుష్టులను దెబ్బకొట్టేందుకు శ్రేష్ఠులను సమీకరించుకోవాలి... లంకపై దాడికి వానరుల్ని కూడగట్టినట్లు!

ఆత్మజ్ఞానం కలిగినవాడు దేని గురించైనా చెప్పగలడు. శాస్త్రాలన్నీ అంతర్యామిలో అంతర్భాగాలే. ‘నాలోనే అన్నీ ఉన్నాయి’ అన్నాడు జగద్గురువు శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శన యోగంలో. మనిషి తానెవరో తెలుసుకోవాలి. అమెరికాలో స్వామి వివేకానంద ధార్మిక ప్రసంగం- ఇతర మతాల వారిని సైతం ప్రభావితం చేసింది. నవంబర్‌, 21, 1893 నాటి డైలీ కార్డినాల్‌ పత్రిక సంపాదకీయం వివేకానందుడి ప్రసంగాన్ని ప్రస్తుతించింది. ఆయన ప్రజ్ఞలో కౌశలంలో సహజ జ్ఞానం అద్భుతంగా వ్యక్తమైందని వ్యాఖ్యానించింది.

నీతి అనేది- గడ్డిపోచల కలయిక వల్ల ఏర్పడిన గట్టి మోకు లాంటిది. మదమెక్కిన ఏనుగును సైతం అది నియంత్రించగలదు. చెడుపై గెలుపు దక్కాలంటే నైతికత్వం, ధర్మం అవసరం. దైవ బలంతోపాటు అంతర దృష్టీ అవసరం. దీపం ఆరి పోయి తిమిరం అలముకొనకుండా చెయ్యి అడ్డు పెడితేనే ఆ వెలుగులో ఎంతైనా శోధించి సాధించవచ్చు. మనిషిలో నెలకొన్న నైరాశ్యం, వికల్పం తొలగినప్పుడు మానసం నిర్మలమవుతుంది. స్తుతులు, భజనలు మనల్ని మనం నిర్మలం చేసుకునేందుకే. అవేవీ దైవాన్ని బుజ్జగించి మంచి చేసుకునేందుకు కానే కాదు. మాలిన్యాలను మనసులోనుంచి తొలగిస్తూ, దుష్టత్వాన్ని చెరిపి నిర్మలమైన మనసుతో మనం ఏది చెప్పినా అది శ్రేష్ఠమవుతుంది. ఏది రాసినా అదే మధుర కావ్యమవుతుంది.

(ఈనాడు అంతర్యామి)

✍🏻అప్పరుసు రమాకాంతరావు

భగవద్గీత

 📖 *భగవద్గీత ఎందుకు చదవాలి?*


 *సంతోషంగా ఉన్నవా... భగవద్గీత చదువు.*

* బాధలో ఉన్నావా... భగవద్గీత చదువు.

* *ఏమి తోచని స్థితి లో ఉన్నావా... భగవద్గీత చదువు.*

* ఏదో గెలిచినావా... భగవద్గీత చదువు.

* *ఏదో ఓడిపోయినావా... భగవద్గీత చదువు.*

* నువ్వు మంచి చేసినావా... భగవద్గీత చదువు.

* *నువ్వు చెడు చేసినావా...భగవద్గీత చదువు.*

* నువ్వు ఏదో సాధించాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.

* *నువ్వు ఏది సాధించ లేక ఉన్నావా... భగవద్గీత చదువు.*

* నువ్వు చాలా ధనవంతుడవా... భగవద్గీత చదువు.

* *నువ్వు చాలా బీద వాడివా... భగవద్గీత విను.*

* నువ్వు సమాజాన్ని బ్రతికించాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.

* *నువ్వు ఆత్మహత్యా చేసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.*

* నువ్వు మోసం చేసినావా... భగవద్గీత చదువు.

* *నువ్వు మోసపోయినావా... భగవద్గీత చదువు.*

* నీకు అందరూ ఉన్నారా... భగవద్గీత చదువు.

* *నీవు ఒంటరివా.... భగవద్గీత చదువు.*

* నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా... భగవద్గీత చదువు.

* *నీవు వ్యాధిగ్రస్తుడవా... భగవద్గీత చదువు.*

* నీవు చాలా విద్యావంతుడవా... భగవద్గీత చదువు.

* *నీవు విధ్యాహీనుడవా... భగవద్గీత చదువు.*

* నీవు పురుషుడవా... భగవద్గీత చదువు.

* *నీవు మహిళవా... భగవద్గీత చదువు.*

* నీవు ముసలివాడివా.. భగవద్గీత చదువు.

* *నీవు యవ్వనస్తుడివా... భగవద్గీత చదువు.*

* దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలి అని ఉందా... భగవద్గీత చదువు.

* *దేవుడు లేడు అని అనుకుంటున్నావా.... భగవద్గీత చదువు.*

* ఆత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.

* *పరమాత్మ తత్త్వం ఎలాంటిదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.*

* మనిషి జీవితం ఎందుకు అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.

* *కర్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని ఉందా... భగవద్గీత చదువు.*

* ఈ సృష్టి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.

* *పుట్టకముందు మనము ఎవరము అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.*

* చనిపోయిన తర్వాత మనము ఏమి అవుతాము అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.

* *దేవుడంటే అసలు ఎవరు అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.*

* నీలో కామం, క్రోధం, లోభం, మొహం, మదం, మాత్సర్యము వంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయా... భగవద్గీత చదువు.

* *నీవు ప్రేమిస్తున్నావా... భగవద్గీత చదువు.*

* నీవు ద్వేషిస్తున్నావా... భగవద్గీత చదువు.

* *నీలో వైరాగ్యం ఉందా... భగవద్గీత చదువు.*

* జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.

* *బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.*

* ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.

* *మోక్షం అంటే ఏమిటి, స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అంటే... భగవద్గీత చదువు.*

* పంచ భూతాలు అంటే ఏమిటి, అవి ఎందుకు ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే.... భగవద్గీత చదువు.

* *ప్రకృతి, పురుషుడు, భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే... భగవద్గీత చదువు.*

* ఇక చివరగా... నీవు ఎవరు, ఎక్కడ నుండి వచ్చినావు, ఎక్కడికి పోతావు, నీవారు ఎవరు, నీ అసలు గమ్యం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే....

*భగవద్గీత చదువు.*


భగవధ్గీతలో ఏముంది?:

 *ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?*


గీత ఎప్పుడు పుట్టింది? భారతదేశ చరిత్రలో మహాభారత యుధ్ధం ఒక ప్రధానమైన సంఘటన భారత యుధ్ధం జరిగిన తర్వాత 36 సంవత్స రాలకు ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమైంది!!

యుధ్ధ సమయంలో శ్రీకృష్ణుని వయస్సు 90 సం!!రాలు!! శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన నాటి నుండి కలి ప్రవేశం జరిగింది!! అంటే కలియుగం ప్రారంభమైనది!! శ్రీకృష్ణ భగవానుడు దాదాపు126 సంవత్సరాలు

జీవించి యున్నాడు!!

భారత యుధ్ధ విజయం తర్వాత ధర్మ రాజు పట్టాభిషిక్తుడైనాడు కృష్ణ నిర్యాణ వార్త విన్న తరువాత పాండవులు ద్రౌపదీ సహితంగా "మహా ప్రస్థానము" గావిస్తూ హిమాలయాలకు వెళ్లారు!! అంటే యుధిష్టురుడు హస్తినాపుర సింహానముపై కూర్చుని ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా 36 వర్షాలు పాలించాడు!!

మహాభారత యుధ్ధము "కురుక్షేత్రము"లో 18రోజులుజరిగింది!!

కార్తీక అమావాస్య రోజు మహభారత యుద్ధం


ప్రారంభమైనది!!

అడుగు మాడితేనే

 #అన్నం అడుగు మాడితేనే మనసు చివుక్కుమంటుంది.

 గుప్పెడు అన్నం మిగిలిపోతే పారేయకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం.


 అదీ మన కున్న అన్నం సెంటిమెంట్. 


#ఆర్నెల్లు రాత్రీపగలూ కాలం తో పరిగెత్తి, వేలల్లో అప్పుచేసి,

 బంగారంలా మెరుస్తున్న పంట తుఫాను ముంగిట్లో,


#ఉయ్యాలకి చుట్టుకున్న పాముని చూసిన పసిపిల్లలా భయం భయంగా చూస్తూ ఉంటే, 


రైతు గుండె కారుకింద పడిన కుందేలు పిల్లలా, 


ముళ్లకంపలో ఇరుక్కున్న సీతాకోకచిలుకలా విలవిల్లాడుతోంది.


 #కొంతమంది రాత్రికి రాత్రే కుప్ప నూర్చేస్తే, కొంతమంది పన పచ్చి ఆరకుండానే నూర్చేస్తే, 

ఇవేమీ చెయ్యలేని రైతులు, 

వారి భార్యలు, 

పోయినేడు పండక్కి బట్టలకొట్టువాడిచ్చిన దేవుడి క్యాలెండర్ కి దణ్ణం పెట్టుకుంటున్నారు. 

 

#తుఫాన్లకి పేరు పెట్టడంలో ఉండే సాంకేతిక పరిజ్ఞానం రైతుకి సాయపడ్డంలో కనబడదు. 


#ఏలిన వారు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాం లు కానీ 

మేమున్నాం అన్న ఒక్క స్టేట్మెంట్ ఏ పేపర్ లోనూ కనబడదు. 

ఇదేదో రైతుల సొంత వ్యాపార సమస్య అనుకుంటే మన కంచంలో మనం నీళ్లు పోసుకున్నట్టే. 


#వర్షం వల్ల క్రికెట్ మ్యాచ్ రద్దయితే ఇన్సూరెన్సు కవర్ ఉంది. 

 కాజల్ కళ్ళకీ, ఏంకర్ గొంతుకీ, డాన్సర్ కాళ్ళకీ, ఇన్సూరెన్సు ఉంది.  


ఇలాంటి రైతులకి, వారి పంటకి కూడా ఉండే ఉండొచ్చు. 


కానీ, 


లక్ష కండిషన్లు కూడా ఉండి ఉండొచ్చు.


 చాలా మంది రైతులకి ఈ విషయం తెలియక పోవచ్చు.  


#గుళ్ళకి కోట్లు విరాళాలిచ్చే భక్తుల్లారా, దేవుడి తరఫున అవి అందుకునే దేవాదాయ శాఖల్లారా,  


కాస్త ఇటువైపు కూడా చూడండి.

 వీళ్ళ క్యాలెండర్ల లో కూడా దేవుడున్నాడు. 


#ఒకటి మాత్రం నిజం. ఆమాత్రం ఏడాదికి లక్ష రూపాయలు ఏ వాచ్ మేన్ ఉద్యోగం చేసినా వస్తుంది అని రైతు విసుగెత్తిపోయి 

అనుకున్న నాడు,


#జంతువుల్లా మనల్ని మనం చంపుకు తినాలి,

లేదా,

పాముల్లా మన గుడ్లు మనమే పెట్టుకుని తినడం నేర్చుకోవాలి. ....అన్నదాత ఏడుస్తుంటే.... మనకు ఎంత సంపద ఉన్నా జీవించడం కష్టం అవుతుంది.....అన్నదాత సుఖీభవ

.🙏 🙏 🙏

గీతా మకరందము

 16-11,12-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


చిన్తామపరివేుయాం చ ప్రళయాన్తాముపాశ్రితాః | 

కామోపభోగపరమా  

ఏతా వదితి నిశ్చితాః || 


ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః | 

ఈహన్తే కామభోగార్థం అన్యాయేనార్థసఞ్చయాన్|| 


తాత్పర్యము:- మఱియు (ఆసురీసంపదగల)వారు అపరిమితమైనదియు, మరణమువఱకు (లేక, ప్రళయకాలమువఱకు) విడువనిదియునగు విషయచింతన (కోరికలను)ను ఆశ్రయించినవారును, కామోపభోగమే పరమపురుషార్థముగ దలంచువారును, ఇంతకుమించినది వేఱొకటి లేదని, నిశ్చయించువారును, పెక్కు ఆశాపాశములచే బంధింపబడినవారును, కామక్రోధములనే ముఖ్యముగ నాశ్రయించినవారును అయి కామముల ననుభవించుట కొఱకుగాను అన్యాయమార్గములద్వారా ధనసమూహములను కోరుచున్నారు.


వ్యాఖ్య:- అట్టి ప్రాపంచిక మనుజులయొక్క చింతలకు, కోరికలకు, మనోరథములకు అంతము యుండదు. వారి యా చింతలను చావు (లేక మహాప్రళయము) నిలుపుదల చేయవలసినదే తప్ప వారు స్వయముగ నిలుపరు. భక్తులు, ముముక్షువులు దైవమునే పరమపురుషార్థముగను, గమ్యముగను, జీవితలక్ష్యముగను ఎట్లుతలంచుదురో, అట్లే ఈ అసురప్రవృత్తికలవారు కామోపభోగమునే పరమార్థముగ దలంచి అంతకు మించి ప్రపంచములో గొప్పదికాని, సుఖసాధనమార్గముకాని లేదని వచించుదురు. మఱియు లోకములో ఒక్క త్రాటిచే కట్టబడినవారే ఎంతయో బాధనొందుచుండగా వీరు వందలకొలది ఆశలను త్రాళ్ళచే బంధింపబడియుండుటచే (ఆశాపాశశతైర్భద్ధాః) ఇక వారి బాధ, అశాంతి వర్ణనాతీతముగనుండునని ఊహించుకొనవచ్చును. అట్టివారు కామక్రోధములను ఏ కాలమందును విడిచియుండక తత్పరాయణులై యుందురు. మఱియు తమ కామోపభోగముకొఱకు అన్యాయమార్గముల ద్వారా విత్తము నభిలషించుచుందురు.


 "అర్థసంచయాన్" - అని చెప్పినందువలన వారు ఏకొద్ది ధనముతోనో తృప్తిపడువారు కారనియు, ధనసమూహమునే కోరుచుందురనియు, అదియు సత్కార్యములకొఱకుగాక కేవలము విషయభోగములకొఱకేయనియు తెలిసికొనవలసియున్నది. దీనినిబట్టి వీరు రెండు ఫెూరప్రమాదముల నాచరించుచున్నట్లు విదితమగుచున్నది - 

(1)కామాశ్రయము 

(2)అన్యాయార్జనము. కావున సాధకులు, ముముక్షువులు ఇట్టి అల్పచరితుల సాంగత్యము చేయక కడు జాగరూకులైయుండవలెను.


ప్రశ్న:- ఆసురీసంపదగల వారింకను ఎట్లుందురో తెలుపుడు?

ఉత్తరము:- (1) అంతులేని ఆశ, చింతలు గలిగియుందురు (2) కామోపభోగమే గొప్పదిగ తలంచుదురు (3) దానినిమించి మఱియొకటి లేదని భావించుదురు (4) పెక్కు ఆశాపాశములచే బంధింపబడియుందురు (5) కామక్రోధతత్పరులై యుందురు (6) విషయభోగములను మిక్కుటముగ అనుభవించుచు వానికొఱకై అధికధనమును వాంఛించి, అన్యాయమార్గములద్వారా మోసపుపద్ధతులద్వారా దానిని సంపాదింపదలంచుదురు.

గీర్వాణవాణి

 గీర్వాణవాణి 

  భావానువాదం    

గౌ!!శ్రీ కొంపెల్లరామకృష్ణమూర్తి గారు🙏🙏

*65.స్వభావం న జహాత్యేవ సాధురాపద్గతోఽపి సన్*

*కర్పూరః పావకాస్పృష్టః సౌరభం లభతేతరామ్.*

సజ్జనుడు ఆపద సంభవించినా తన స్వభావాన్ని మార్చుకోడు. కర్పూరం అగ్నితో కాలినా తన సువాసనను మరల్చుకోదు కదా.

తెలుసుకుందాం

 *✅ తెలుసుకుందాం ✅*



*🔴మానవ శరీరానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు*


1) పుట్టినప్పుడు మోకాలు చిప్పలు ఉండవు. 2 నుంచి 6 సంవత్సరాల వయసు మధ్యలో మోకాలు చిప్పలు ఏర్పడతాయి.


2) ఒక మానవ శరీరంలో ఉన్న జీవుల (క్రిములు, బాక్టీరియా లాంటివి) సంఖ్య ఈ ప్రపంచ జనాభా కంటే ఎక్కువ.


3) ఒక గంట సేపు హెడ్‌ఫోన్స్ పెట్టుకోవడం వలన చెవిలో బాక్టీరియా 700 రెట్లు పెరుగుతుంది.


4) మోచేతిని నాలుకతో అందుకోవడం అసాధ్యం.


5) పురుషుల కళ్లు స్త్రీల కంటే బాగా పని చేస్తాయి. స్త్రీలు పురుషుల కంటే బాగా వినగలరు.


6) మనిషి కళ్లు పుట్టినప్పటి నుంచి ఒకే సైజులో ఉంటాయి. ముక్కు, చెవులు మాత్రం చచ్చే వరకు పెరుగుతూనే ఉంటాయి.


7) మనిషి తుమ్ము వేగం 100 మైళ్ల కన్నా ఎక్కువ.


8) చేతి వేళ్ల లాగానే ప్రతి ఒక్కరి నాలుక పైన ఉన్న ప్రింట్ కూడా వేరుగా ఉంటాయి.


9) తుమ్మును ఆపుకోడానికి ప్రయత్నిస్తే తల లేదా మెడలోని రక్తనాళాలు ఒత్తిడికి గురై చిట్లి పోయే ప్రమాదం ఉంది. తుమ్మేటప్పుడు తప్పకుండా కళ్లు మూసుకునే ఉంటాం, బలవంతంగా తెరవాలని ప్రయత్నించకూడదు.


10) ఇది చదివిన ప్రతి ఒక్కరు మోచేతిని నాలుకతో అందుకోవడానికి ప్రయత్నించారు.


11) కొన్ని సార్లు మానవ మెదడు నిద్రపోయినప్పుడే ఎక్కువ ఆక్టివ్ గా ఉంటుంది


12) మనిషిలోని రక్త నాళాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పేర్చితే భూమిని 4 సార్లు చుట్టవచ్చు.


13) మనిషి ఏడాదికి సరాసరి 4 కిలోల చర్మ కణాలను కోల్పోతాడు   


14) తిండి లేకుండా ఒక మనిషి కొన్ని వారాలు బ్రతక గలడేమో కానీ నిద్ర లేకుండా 11 రోజుల కంటే బ్రతక లేడు.


15) పుట్టినప్పుడు మనిషి శరీరంలో 300 ఎముకలుంటాయి. పెరుగుతున్న కొద్దీ కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయి 206 ఎముకలు మిగులుతాయి.

విధి లిఖితం

 విధి లిఖితం విష్ణువు నైనా విడిచిపెట్టదు* 📍


 శ్రీకృష్ణుడి అంత్యక్రియలు:

రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి. 

కోవిడ్ వచ్చింది కదా, లాక్డౌన్ ఉంది కదా అని ఇతర మరణాలు ఆగకుండా ఉండవు కదా. 


ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా ఈ లాక్డౌన్ సమయంలో ప్రాణం విడిస్తే కుటుంబ సభ్యులు పడుతున్న బాధ "ఈ సమయంలో ఇలా ఏమిటి? అంతిమయాత్ర పట్టుమని పదిమంది కూడా లేకుండా ఏమిటి?" అని. చాలామంది ఇదే విషయానికి మరింతగా కృంగిపోతూ ఉండవచ్చు ప్రస్తుతం. సహజం. 

అంతేకాదు..కొందరికి ఉన్న కొడుకులు, కూతుళ్లు అందరూ విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు. లాక్డౌన్లో ఏం జరిగా ఎవ్వరూ రాలేని పరిస్థితి. 

వారందరి కోసం "మహాభారతం" మౌసలపర్వంలోని శ్రీకృష్ణుని అంత్యక్రియల విషయం క్లుప్తంగా ఒక్కసారి చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది.

 

ఎక్కడో ద్వారక. 

దానికి చాలా దూరంలో తపోవనం. 

ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు. 

అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు. 

ఆ కార్యక్రమం ముగిసాక అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త నెమ్మదిగా చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం దాకా ప్రయాణమై వచ్చాడు. వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు. 

మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు...కానీ ప్రాణం లేకుండా..! అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలిపోయాడు. రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు. 

అర్జునిడితో పాటూ ఉన్న రథసారధి, ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రమే అర్జునుడిని ఓదార్చారు. 

అప్పటికే శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి.  అప్పుడు ఆ మృతదేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక (ఎందుకంటే ద్వారక సరిగ్గా అప్పుడే సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉంది), అక్కడే అర్జునుడొక్కడే అరగంటలో అంత్యక్రియలు పూర్తిచేసాడు ఏ అర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా.


అష్టభార్యలు, ఎనభై మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. 

శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కొడుకులున్నా వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు.


అంతటి ఇతిహాసపురుషులకే అటువంటి అంతిమఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలు, ఊరటలు, మార్గనిర్దేశకాలు అవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ. 

మనమంతా కూడా కాలంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఆ కాలం ఎప్పుడు ఎవరికి ఎలా నిర్ణయిస్తుందో ఎవరూ చెప్పలేరు. 


ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మరణాలు పొందినవారి కుటుంబ సభ్యులకి ఈ శ్రీకృష్ణుడి అంత్యక్రియల ఘట్టం కొంతైనా భారాన్ని దింపుకునే శక్తిని ప్రసాదించుగాక. 🙏

ధార్మికగీత - 55*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 55* 

                                   *****

         *శ్లో:- ఉత్సాహస్సాహసం ధైర్యం ౹*

                *బుద్ధి శ్శక్తి: పరాక్రమః ౹*

                *షడేతే యత్ర వర్తంతే ౹*

                *తత్ర దేవో౽పి తిష్ఠతి ౹౹*

                                    *****

*భా:- లోకంలో ప్రతిఒక్కరు పని చక్కబడితే తన గొప్పతనంగా భావిస్తారు. అదే పనికి అడుగడుగునా ఆటంకా లెదురౌతుంటే దేవునిదయ లేదని నిందిస్తారు.1.పనినెరవేరవేరాలంటే ఉత్సాహం, సంకల్పబలంతో కూడిన "ప్రయత్నం" కావాలి. 2. ఎన్ని అవరోధా లెదురైనా, ఎదురొడ్డి దూసుకుపోగల "తెగువ" ఉండాలి. 3. గిట్టనివారు పలికే, నిస్సత్తువ, నీరసపు మాటలను లెక్కచేయని "ధైర్యం" అలవరచుకోవాలి. 4. కార్యసాధన దిశగా నిరంతర సునిశిత పరిశీలనా నైపుణ్యం గల "బుద్ధికుశలత" కలిగిఉండాలి. 5. పని పూర్తి కావడానికి అంగ, ఆర్థిక రూపేణ "శక్తి సంపన్నత" పుష్కలంగా ఉండాలి. 6. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక "బల సమృద్ధి" కలిగి ఉండాలి. ఈ ఆరు లక్షణాలు ఎక్కడ ఉంటాయో, అక్కడ దైవబలము కూడ తోడూనీడగా ఉంటుంది. ఆ కార్యము నూటికి నూరుశాతం జయము, విజయము, దిగ్విజయముగా సాధించబడుతుంది. "శ్రమ ఏవ జయతే" అనే ఆర్యోక్తి మన మెరిగినదే. కార్యసాధనకు ముందు ఈ ఆరు వనరులు ఉన్నాయా! లేవా! పరిశీలించుకోవాలని సారాంశము*.

                                *****

                         *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲