30, ఆగస్టు 2023, బుధవారం

భూచక్రగడ్డ విశేషాలు -

 భూచక్రగడ్డ విశేషాలు  -


       సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన ఈ భూమి మీద ఎన్నో వింతలు , విశేషాలు ఉన్నాయి. అవి నిగూఢముగా ఉన్నాయి. వాటిలో వృక్షజాతిలో ఎన్నో విచిత్రాలు కలవు. నేను  ఛత్తీస్ గడ్ అడవులలో వెదురుబొంగులు కొట్టిన తరువాత భూమి యందు ఉండు బొంగు ముక్క నుంచి తెల్లటి వెలుగు రావటం గమనించాను. అలా కొన్ని ప్రదేశాలలో మాత్రమే కనిపించింది. సూర్యోదయం అయ్యేప్పుడు పూర్తిగా సూర్యునివైపు తిరిగే చెట్లు ఉన్నాయి అని అక్కడి కొండజాతివారు చెప్పారు . వారి వైద్యవిధానం కూడా బహుచిత్రంగా ఉన్నది. చెయ్యి విరిగినవారికి కేవలం మూడురోజుల్లో చెయ్యి ఎముక అతుక్కునే విధంగా చెయ్యగలరు. వారు ఉపయోగించే మొక్కని మాత్రం నాకు చూపించలేదు.  నా కాలుకి దెబ్బతగిలి రక్తం పోతున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్న వెదురుబొంగు పైన పచ్చరంగులో ఉన్నది చాకుతో గీకి మెత్తటి చూర్ణం చేసి దానికి సున్నం కలిపి నా గాయం పైన చల్లి అద్దడం జరిగింది.వెంటనే రక్తస్రావం ఆగిపోయింది. ఆ తరువాత ప్రతినిత్యం దానిపైన వేయుటకు మరికొంత చూర్ణం ఇచ్చారు . ప్రతినిత్యం ఉదయం , సాయంత్రం దానిపైన చల్లడం వలన అది ఒక చెక్కు మాదిరి గట్టిగా అయ్యి గాయం నయం అయ్యాక ఊడి వచ్చింది. అక్కడివారు చెప్పినదాని ప్రకారం గాయం అయినపుడు ఎటువంటి ఇంజెక్షన్స్ తీసుకోరు. కేవలం దీనితోనే వారు ఎటువంటి గాయాన్ని అయినా మాన్పుకుంటారు. ఇదంతా మీకు చెప్పడానికి ప్రధాన కారణం ఎమిటంటే ప్రకృతిలోని వృక్షజాతుల్లో అంత గొప్ప ఔషధవిలువలు ఉన్నాయి. 


          ఇలాంటి వృక్షవిచిత్రాలలో ఒకటైన భూచక్రగడ్డ గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు రహదారుల పక్కన భూచక్రగడ్డ పేరు చెప్పి అడివి లో దొరికే కొన్ని గడ్డలను అమ్ముతున్నారు. అసలైన భూచక్రగడ్డ అనేది పాత ఎద్దులబండి చక్రం అంత వెడల్పుగా ఉంటుంది. ఇది అత్యంత దట్టమైన కీకారణ్యాలలో మాత్రమే లభించును. కొన్ని చోట్ల ఈతచెట్ల కింద అత్యంత అరుదుగా ఉంటుంది. ఇది ఏ వృక్షం కింద అయితే ఉంటుందో ఆ వృక్షం పైన బంగారు రంగులో ఒక తీగ అల్లుకుని ఉంటుంది. భూమిలో ఉన్న గడ్డకు చెట్టు పైన ఉన్న తీగకు మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. ఆ రెండు గొప్ప అయస్కాంత శక్తితో సంబంధం ఏర్పరచుకొని ఉంటాయి. 


             భూమిలో గడ్డ ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించుటకు ఆ ప్రదేశం మొత్తం రెల్లుగడ్డి పరిచి నిప్పు అంటించండి. కేవలం గడ్డ ఉన్న ప్రదేశంలో రెల్లుగడ్డి ఏ మాత్రం చెక్కుచెదరదు. మిగిలిన గడ్డి కాలిపోవును. కాలని ప్రదేశం ఉన్న భాగం అంతా ఆ గడ్డ ఉన్నది అని నిర్ధారించుకొని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచి ఇష్టదైవాన్ని ప్రార్ధించి చాలా జాగ్రత్తగా తవ్వడం ప్రారంభించాలి . ఇది అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని. తవ్వే సమయంలో ఏ మాత్రం భూమి అదిరినను ఆ గడ్డ ఆ ప్రదేశం నుంచి జరిగిపోవును. కావున అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని.


           ఈ గడ్డ లభించడం అంటే అమృతం లభించడంతో సమానం . ఈ గడ్డ మందం 4 అంగుళాల నుండి 20 అంగుళాల వరకు ఉంటుంది. ఇది తీపిగాను మరియు వగరు , చిరుచేదు మిశ్రమముగా ఉండును. దీని మోతాదు 30 గ్రాముల ముక్క తిని స్వదేశీ ఆవుపాలు తాగవలెను. దీనిని జాగ్రత్తగా నిలువచేసికొని మండలం (40 ) రోజులపాటు వాడిన శరీరము నందలి సర్వరోగములు నివారణ అగును. దేహము అత్యంత కాంతివంతం అయ్యి బంగారు రంగులో మారును . నరములు శక్తిమంతం అయ్యి మెదడుకు అమితమైన బలం కలిగి ఏకసంథాగ్రాహి అవుతాడు. ముసలితనాన్ని పోగొట్టగల శక్తి దీనికి ఉన్నది. దీనిని ఆయుర్వేదంలో " కాయసిద్ది " అని పిలుస్తారు . దీర్గాయుష్షును ప్రసాదించును.


        పైన చెప్పినవన్నీ అసలయిన భూచక్రగడ్డని సాధించి వాడినప్పుడు మాత్రమే కలుగుతాయి.


   

   మరింత సంపూర్ణ మరియు వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  

తుం గ భ ద్రా న ది

 శు భో ద యం!👏👏

              చొప్పకట్ల.


తుం గ భ ద్రా  న ది

...........................


గంగా సంగమ మిచ్చగించునె, మదిన్  కావేరి  దేవేరిగా 

అంగీకారమొనర్చునే, యమునతో ఆనందమున్ పొందునే, 

రంగత్తుంగ తరంగ హస్తములతో రత్నాక రేంద్రుండు నీ 

అంగంబంటి సుఖించునేని, గుణభధ్రా తుంగభద్రా నదీ!


తెనాలి రామకృష్ణ కవి

పాండురంగ మాహాత్మ్యము

ప్రథమాశ్వాసం

139 వ పద్యం


తెనాలి రామకృష్ణ కవి తుంగభద్రానదిని స్తుతిస్తున్నాడు. 


ఓ తుంగభద్రా నదీ!

నీవు గుణభద్రవు, నీవు సముద్రునితో కలవడం లేదు. ఒకవేళ, తన ఉత్తుంగ తరంగ హస్తాలతో రత్నాకరేంద్రుడైన సముద్రుడు నీ స్పర్శా సౌఖ్యాన్ని గనక పొంద గలిగి వుంటే, అతడు తానిప్పుడు అనుభవిస్తున్న గంగాసంగమాన్ని ఇష్టపడతాడా? కావేరిని దేవేరిగా అంగీకరిస్తాడా? యమునతో ఆనందాన్ని పొందుతాడా? 

అవేవీ ఆ నదులతో పొందబోడని పద్యభావం.


ఈ పద్యంలో సముద్రంలో ప్రత్యక్షంగా కలిసే నదులు రెండు - గంగ, కావేరి. అట్లా కలవని ఉపనదులు రెండు - యమున, తుంగభద్ర. తక్కిన నదీ సముదాయాన్ని కవి పేర్కొనడం లేదు. యమున శాఖానది. త్రివేణి వద్ద గంగతో సంగమిస్తుంది. కాకపోతే, సముద్రుడు యమునతో కూడా ఆనందాన్ని పొందుతున్నాడని వక్కాణిస్తున్నాడు. అంటే, యమునానది, గంగతో బాటు రహస్యంగా ప్రవహించి, సముద్రునితో రహస్య దాంపత్యం నెరపుతున్నదని కవి భావం. అందుకే యమునతో "ఆనందమున్ పొందునే" అంటున్నాడు.

 

విశ్వనాథ వారు ఈ పద్యం గురించి రాస్తూ ఇట్లా అంటారు: "యమున ప్రయాగ వద్ద గంగతో కలిసి ఆమె వెనక దాగికొని వెళ్ళుచున్నది. గంగకు కూడా తెలియకుండా వెళ్ళు చున్నదేమో! సముద్రునకు యమున తోడి సంగమం చాల రహస్య సంగమం. అందుచేత అతడధికమైన సుఖాన్ని పొందుచున్నాడు. అందుకనియే గంగా కావేరుల విషయంలో ఉపయోగించి ఆనంద శబ్దమును వాడినాడు. గంగా కావేరితో సంసారం చేయుచున్నాడు. యమునతో ఆనందమును పొందుచున్నాడని అర్థము" .


ఇది విశ్వనాథవారి వ్యాఖ్య. మరి తుంగభద్ర విషయం? ఆ నది సముద్రునితో రహస్య కాపురం చెయ్యడం లేదని, ఒక్కసారి గనక తుంగభద్రా సౌఖ్యం సముద్రునికి కలిగితే, యమునను పరిత్యజించి, తుంగభద్ర తోనే ఆనందాతిరేకాన్ని పొందుతాడనీ కవి తాత్పర్యం.


ఇదంతా రామకృష్ణ కవి పద్యరచనలో చూపించే గడుసుదనం.


శబ్ద సౌందర్యంలో ఈయన ఎవరికీ తీసిపోడు. ఈ పద్యంలో తుంగభద్ర పొంగులను చూపడానికి శార్దూల వృత్తాన్ని ఎన్నుకున్నాడు. ఇతర నదులను వర్ణిస్తున్నా ఆయన ధ్యాస తుంగభద్ర పైనే. అందుకే అందుకు అనుగుణమైన పాదప్రాసను ఎన్నుకున్నాడు. గంగాసంగమము, అంగీకార మొనర్చడము, రంగత్తుంగ తరంగ హస్తాల సముద్రుడు, అంగంబంటి సుఖించడము - తుంగభద్రానదిని స్ఫురింపజేసే శబ్దాలు ఇవన్నీ. 

All the sounds that rhyme with the spelling of Tungabhadra.


ఇవి గాక, కావేరి దేవేరి కావడము, తుంగభద్ర గుణభద్ర కావడమూ, ఈ ప్రాసా సౌందర్యాలన్నీ ఒలకబోసి, మీదికి లంఘించే శార్దూల పద్యంలో సముద్రుడు, కనీసం భావనా ప్రపంచంలో నైనా తుంగభద్రను తన ఉత్తుంగ తరంగ హస్తాలతో గాఢ పరిష్వంగంలో చేర్చుకొక పోతాడా అనే భ్రమను సృష్టిస్తాడు.


 ( మోహన్ గారి సుదీర్ఘవ్యాసంలో ఇది కొంతభాగం మాత్రమే!)


అక్టోబర్ 1971 - నివర్తి మోహన్ కుమార్


 


👏🌸🌷🌷💐💐🌷🌷🌷👏🌷🌷💐

A


 

భూజనసురభాష

 *1866*

*కం*

భూజనసురభాష కరణి

తేజములొందెడి గతులను తీరిన తెలుగున్

ఓజులు సైతము విడిచిన

నోజమ్ములు తగ్గబోవు నుర్విన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! భూజనులకు దేవభాషవలె వెలుగొందేవిధంగా సంస్కరించబడిన తెలుగు ను ఉపాధ్యాయులు (ఓజులు) కూడా విడిచిపెట్టి ననూ దాని ప్రకాశములు(ఓజములు) ఈ భువిలో తరగవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శ్రీ రాజీవ్ లోచన్ Temple

 🕉 మన గుడి 


⚜ ఛత్తీస్‌గఢ్ : రాజిమ్ (రాయపూర్)






⚜ శ్రీ రాజీవ్ లోచన్ Temple


💠 రజిమ్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని ప్రయాగ్ అని పిలుస్తారు.  నదులు, అందమైన దృశ్యాలు మరియు దేవాలయాలు ఈ మూడింటిని ఒకే చోట చూడాలనుకుంటే, ఖచ్చితంగా రజిమ్‌కు రండి. వర్షాకాలంలో దీని అందం మరింత పెరుగుతుంది.  


💠 ఇది గరియాబంద్ యొక్క ఈశాన్యంలో మహానది యొక్క కుడి ఒడ్డున ఉంది, ఇక్కడ పరి మరియు సొంధూర్ అనే దాని ఉపనదులు కలుస్తాయి. 

మహానది, పారి నది మరియు సొంధూర్ నది సంగమించడం వల్ల దీనిని ఛత్తీస్‌గఢ్ త్రివేణి సంగమం అంటారు.  ప్రతి సంవత్సరం మాఘ పూర్ణిమ నుండి మహాశివరాత్రి వరకు ఇక్కడ భారీ జాతర జరుగుతుంది.  


💠 సంగం మధ్యలో కులేశ్వర్ మహాదేవ్ యొక్క భారీ ఆలయం ఉంది. 

శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రదేశంలో మహాదేవ్‌ను పూజించాడని నమ్ముతారు.  

ఈ ప్రదేశం యొక్క పురాతన పేరు కూడా కమల క్షేత్రం.


💠 రాజిమ్‌లో అనేక ప్రధాన ఆలయాలు మరియు ఆకర్షణీయ కేంద్రాలు ఉన్నప్పటికీ.  అయితే ఈ రోజు మనం ఇక్కడ ఉన్న ప్రసిద్ధ రాజీవ్ లోచన్ దేవాలయం గురించి మాట్లాడుకుందాం.  


💠 రాజీవ్‌లోచన దేవాలయం చతుర్భుజంగా నిర్మించబడింది.  ఇది శంఖం, చక్రం, గద మరియు పద్మాలతో నల్లరాతితో చేసిన నాలుగు చేతుల శ్రీ మహావిష్ణువు విగ్రహం. 


💠 ప్రజల విశ్వాసాల ప్రకారం, రాజీవ్ లోచన్ ఆలయాన్ని విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు.

రాజీవ్ లోచన్ దేవాలయం ప్రాచీన భారతీయ సంస్కృతి మరియు హస్తకళల యొక్క ఏకైక సంగమం.  ఈ ఆలయంలో విష్ణువు విశ్రమిస్తాడని ప్రజల నమ్మకం.


🔅 ఆలయ చరిత్ర 🔅


💠 ఈ ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది.  

ఈ ఆలయం లోపల 1197  యొక్క శాసనం ఉంది . ఈ ప్రదేశం యొక్క పురాతన పేరు కమల క్షేత్రం.  విశ్వం ప్రారంభంలో విష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమలం ఇక్కడ ఉందని మరియు బ్రహ్మా ఇక్కడ నుండి విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు, అందుకే దీనికి కమలక్షేత్రం అని పేరు వచ్చింది.  ప్యారీ నది, సొంధూర్ నది మరియు మహానది సంగమం అయిన రజిమ్ ఛత్తీస్‌గఢ్ యొక్క ప్రయాగగా పరిగణించబడుతుంది.  

ఈ స్థలంలో అస్తికల నిమజ్జనం మరియు పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు మరియు పిండతర్పణం నిర్వహిస్తారు.


💠  రాజీవ్‌లోచన్ దేవాలయంలో ఉత్తరం మరియు దక్షిణంలో ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మహామండపం మధ్యలో గరుడుడు ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు. గర్భగుడిలో, రాజీవ్లోచన్ అంటే సింహాసనంపై విష్ణుమూర్తి ఉన్నాడు. ఈ విగ్రహం నల్లరాతితో చేసిన చతుర్భుజి విష్ణుమూర్తి. శంఖ, చక్ర, గద, పాదములను చేతిలో ఉన్నవాడు, లోచన నామముతో పూజింపబడువాడు. ఆలయానికి రెండు వైపులా పరిక్రమ మార్గం ఉంది.

మహామండపం పన్నెండు రాతి స్తంభాలతో నిర్మించబడింది.


💠 ఉత్తరం వైపున ఉన్న ద్వారంలోంచి బయటకు వస్తే సాక్షి గోపాల్‌  ఆలయం కనిపిస్తుంది. తరువాత, చుట్టూ నరసింహ అవతారం, బద్రీ అవతారం, వామనావతారం, వరాహ అవతారం ఉప ఆలయాలు ఉన్నాయి.


💠 రెండవ ప్రకారంలో రాజరాజేశ్వర్, సతీ మాత ఆలయం ఉన్నాయి.

దీని తరువాత నదుల వైపు వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. ఇక్కడి ద్వారం పశ్చిమ దిశలో ఉన్న ప్రధాన మరియు పురాతన ద్వారం. దానిపై రజిమ్ పురాతన పేరు కమలక్షేత్ర పద్మావతి పూరి అని వ్రాయబడింది.


💠 నది ఒడ్డున భూతేశ్వర్ మరియు పంచేశ్వర్ నాథ్ మహాదేవ్ ఆలయాలు ఉన్నాయి మరియు త్రివేణి మధ్యలో కులేశ్వర్ నాథ్ మహాదేవ్ యొక్క శివలింగం ఉంది.


💠 రాజీవ్‌లోచన్ దేవాలయం ఇక్కడి దేవాలయాలన్నింటిలో కెల్లా పురాతనమైనది.


💠 రాజీవ్‌లోచన ఆలయంలో ఒక మూలలో, గజరాజు తన తొండంతో తామరపువ్వును పట్టుకొని ఉన్నట్టు విగ్రహాలు ఉంటాయి.

గజేంద్ర మోక్షాన్ని గుర్తుకు చేస్తూ గజరాజు పుష్పాలతో చతుర్భుజడైన శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తున్న విగ్రహం దేశంలో ఇంకా ఎక్కడ ఉండదు. ఇది ఇక్కడి విశేషం.


💠 దీని గురించి ప్రముఖ కథనం ఇలా ఉంది : మొసలి చేత హింసించబడిన గజరాజు తన తొండంతో తామర పువ్వును పట్టుకుని రాజీవ్ లోచన్‌కు అందించాడు. ఈ తామర పువ్వు ద్వారా, గజరాజు తన బాధనంతా విష్ణువు ముందు విన్నవించాడు. ఆ సమయంలో విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నాడు. మహాలక్ష్మి అతని పాదాలను నొక్కుతోంది. గజరాజు బాధను చూసిన దేవుడు వెంటనే లేచి చెప్పులు లేకుండా పరుగెత్తుకుంటూ ప్రస్తుతం రాజీవ లోచన ఆలయం ఉన్న ప్రాంతానికి చేరుకుని గజరాజును రక్షించాడు. గజేంద్రమోక్ష ఘట్టం ఈ ప్రదేశంలోనే జరిగింది అని ఈ ప్రాంత వాసుల నమ్మకం.


💠 త్రివేణి సంగమం మధ్యలో ఉన్న "కులేశ్వర్ మహాదేవ్" ఆలయం, దాని మహామండపం దగ్గర ఒక శాసనం ఉంది, దాని ప్రకారం ఈ ఆలయం 8-9వ శతాబ్దంలో నిర్మించబడింది . ఆనాటి సాంకేతిక పరిజ్ఞానానికి ఈ దేవాలయం సజీవ సాక్ష్యం. 


💠 రైలులో : రాయ్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి 50 కి.మీ.

నీలిరంగు చందమామ

 🎻🌹🙏నేడు నీలిరంగు చందమామ  ఆవిష్కృతం..!!



🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿హైదరాబాద్ :ఆగస్టు 30

ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. 


🌸బుధుడు, యురేనస్‌, గురుగ్రహం, నైప్యూటర్‌, శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా చూడే అవకాశం కలిగింది.ఈ క్రమంలోనే బుధవారం మరో అరుదైన దృశ్యం నీలిరంగు చందమామ ఆవిష్కృతం కాబోతున్నది.


🌿ఈ నెలలో రెండు పున్నములు ఉండగా.. ఒకటి ఆగస్టు ఒకటో తేదీన ఏర్పడింది. దీన్ని సూపర్‌మూన్‌గా పిలువగా.. 


🌸నేడు నీలిరంగు చందమామ బుధవారం ఏర్పడబోతున్నది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్‌ మూన్స్‌ ఏర్పడుతుంటాయి..


🌿కానీ, బుధవారం ఏర్పడబోయే బ్లూమూన్‌ మాత్రం అరుదైనది. పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా వచ్చిన సూపర్‌ మూన్‌ ఆవిష్కృతమవుతుంది. 


🌸సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్‌ మూన్‌ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు.


🌿 సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు..స్వస్తి.. సేకరణ...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

నవగ్రహా పురాణం🪐* . *14వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *14వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*సూర్యగ్రహ జననం - 5*


ఆనాడు కశ్యప ప్రజాపతి ఆశ్రమం దేవ సభను తలపింపజేస్తోంది. శ్రీలక్ష్మీ మహావిష్ణువులూ , సరస్వతీ సమేతంగా సృష్టికర్త బ్రహ్మా, సతీసమేతంగా శివుడూ , ఆదితేయులైన ఇంద్రాది దేవతలూ , కశ్యపుని తల్లి కళా , తండ్రి మరిచీ , ప్రసూతి దక్ష ప్రజాపతులూ , నారద మహర్షీ , ఇతర బ్రహ్మ మానస పుత్రులైన అత్రీ , అంగిరసుడూ , కర్దముడూ , పులహుడూ , పులస్త్యుడూ , భృగువూ , వసిష్ఠుడూ , క్రతువూ , వాళ్ళ పత్నులూ.... కాశ్యపేయుడి నామకరణ మహోత్సవానికి విచ్చేశారు.


కశ్యపుడు శ్రీమహావిష్ణువుకు నమస్కరిస్తూ యిలా అన్నాడు. *"పరమ పురుషా ! మా చిన్న కొడుకు తమ వరప్రసాదమే ! సార్థక నామధేయం అనుగ్రహించి , ఆశీర్వదించండి !"*


*"కశ్యపా ! ఈ పుత్రుణ్ని నీకు ప్రసాదించింది. కేవలం మీ దంపతుల కోసమే కాదు. సమస్త విశ్వం కోసమూ ! నవగ్రహ దేవతలలో ఆద్యుడూ , అధికుడూ అయిన సూర్యుడు మీ దంపతుల పుత్రుడుగా ఆవిర్భవించాడు. భవిష్యత్తులో ఈ చిన్నారి బాలుడు గ్రహరాజు అవుతాడు ! జ్యోతిర్మండలంలో , నక్షత్రాల కలయికతో రూపొందిన ద్వాదశ రాశులలో నెలకొకరాశిలో నెలకొంటూ సంచరిస్తూ వుంటాడు..."*


*"ద్వాదశ రాశులా !"* కశ్యపుడు ఆశ్చర్యంగా అడిగాడు..


*"ఔను కశ్యపా !"* బ్రహ్మ వివరిస్తూ అన్నాడు. *"మా జనకులు శ్రీమహావిష్ణు దేవుల సంకల్పం ప్రకారం అంతరిక్షంలో నక్షత్రాలు బృందాలుగా చేరాయి. మేషం , వృషభం , మిథునం , కర్కాటకం , సింహం , కన్య , తుల , వృశ్చికం , ధనస్సు , మకరం , కుంభం , మీనం - ఆకారాలలో స్థిరపడి వున్నాయి !"*


*"ద్వాదశ రాశులలో ద్వాదశ మాసాలలో ద్వాదశ నామ ధేయాలతో అదితి కశ్యపుల అనుంగు సుతుడైన ఈ సూర్యుడు సంచరిస్తాడు..."* అంటూ శ్రీమహావిష్ణువు బ్రహ్మనూ , శివుణ్నీ సాభిప్రాయంగా చూశాడు. *"పరమేష్ఠీ పరమేశ్వరులూ , నేనూ చిరంజీవికి ద్వాదశ నామ నిర్దేశం చేస్తాం !"*


*"చాలా సంతోషం. ప్రారంభించండి !"* పరమ శివుడు అన్నాడు..


అదితి లేచి , శ్రీమహావిష్ణువు దగ్గరగా వచ్చింది. తన చేతుల్లోని పురిటి బిడ్డను ఆయనకు అందించింది. విష్ణువు బాలుణ్ని చిరునవ్వుతో చూస్తూ శ్రీలక్ష్మికి అందించాడు. బాలుణ్ని చూస్తున్న లక్ష్మి దేవి ముఖం కమలంలా వికసిస్తోంది !


*"లక్ష్మీ ! బాలసూర్యుణ్ని ఆ వేదిక మీద పడుకో బెట్టు !"* అన్నాడు విష్ణువు.


లక్ష్మి బాలుణ్ని నుదురు మీద ముద్దు పెట్టి అరుగు మీద పడుకో బెట్టింది. శ్రీమహావిష్ణువు బాలుణ్నే చూస్తూ నామ నిర్దేశం ప్రారంభించాడు. *"ధాత ! ఆర్యముడు..."*


అందర్నీ ఆశ్చర్యంలో ముంచివేస్తూ బాలసూర్యుడి పక్కనే అదే పోలికతో మరొక బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.


*"మిత్రుడు !"* ఆశ్చర్యంతో ఏర్పడిన నిశ్శబ్దాన్ని విష్ణువు గంభీర కంఠస్వరం ఛేదించింది మూడవ బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.


*"శక్రుడు !"* విష్ణువు నాలుగవ నామధేయాన్ని ప్రకటించాడు. నాలుగవ బాలసూర్యుడు సాక్షాత్కరించాడు.


విష్ణువు బ్రహ్మదేవుడి వైపు చూశాడు. బ్రహ్మ ఆయన దృష్టిలోని ఆజ్ఞను అర్ధం చేసుకుంటూ , బాలసూర్యుడికి తన వంతుగా నాలుగు నామధేయాలు ప్రకటించాడు.


*"వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు !"* బాలసూర్య రూపాలు మరో నాలుగు ప్రత్యక్షమయ్యాయి.


పరమశివుడు బాలసూర్యుడికి మరొక నాలుగు పేర్లు ప్రసాదించాడు. *"పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !"* బాలసూర్యుని రూపాలు ఇప్పుడు పండ్రెండు కనిపిస్తున్నాయి.


పండ్రెండు రూపాలూ ఒకదాని పక్కన ఒకటి - వలయాకారంలో కనిపిస్తున్నాయి. సున్నితంగా కదలాడుతున్న చిన్నారి కాళ్ళూ , చేతులూ ! చిరునవ్వుల కాంతుల్ని వెదజల్లుతున్న గుండ్రటి ముఖాలు ! తామరరేకుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు ! ద్వాదశ బాలాదిత్యులతో ఏర్పడిన వలయం సజీవంగా ఉన్న రంగవల్లిగా అందరి దృష్టినీ లాగి పట్టింది.


నారదుడు తన మృదుమధుర కంఠస్వరంతో వరసగా ఆ ద్వాదశ బాలాదిత్యుల నామధేయాలను ఆనందంగా వల్లె వేశాడు. *"ధాత! ఆర్యముడు ! మిత్రుడు ! శక్రుడు ! వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు ! పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !"*


త్రిమూర్తులూ , దేవతలూ , మానస పుత్రులూ , వాళ్ళ పత్నులూ , నారదుడూ , కశ్యపుడు , ఆయన పత్నులూ అక్షింతలు వేస్తూ ఆశీర్వదించారు.


*"త్రిమూర్తులు నా మనుమడికి సార్థక నామధేయాలు ప్రసాదించారు ! వెలుగు వేలుపు పితామహుడు కావడం నా అదృష్టం !"* మరీచి చేతులు జోడిస్తూ అన్నాడు.


*"సకల ప్రాణుల్నీ సమదృష్టితో చూసే లోకబాంధవుడైన పుత్రుడు కావాలన్న మహదాశయంతో తపించింది అదితి ! ఉన్నతమైన ఆ కోరికతో - ఆమె గ్రహరాజును పుత్రుడిగా పొందే అదృష్టాన్నీ , అర్హతనూ సంపాందించుకుంది ! ఈ బాలాదిత్యుడు పెరిగి పెద్దవాడై గ్రహసార్వభౌముడిగా అందరి అర్చనలూ అందుకుంటాడు !"* విష్ణువు అన్నాడు.


*“తథాస్తు !"* అన్నారు శివుడూ , బ్రహ్మా.


అదితి ఆనందబాష్పాలతో తన అందాల పాపడి వైపు చూస్తోంది. పన్నెండు ముద్దుల మూటలను చూస్తుంటే ఆమె మాతృత్వం పొంగి పొర్లసాగింది. పన్నెండుగుర్నీ ఒకేసారి ఎత్తుకుని , వక్షానికి హత్తుకుని , బొజ్జల నిండుగా పాలు పట్టాలన్న కోరిక ఆమె సర్వస్వాన్నీ ఆవరించి కుదిపి వేస్తోంది.


అదితి ఆవేశంగా కదిలి చేతులు ఎడంగా చాపి , తన ద్వాదశ పుత్రుల్ని వొడిసి పట్టుకోబోయింది. విచిత్రంగా అన్ని రూపాలూ ఒక్కసారిగా కలిసి , ఒక్కటిగా మారిపోయాయి. తన చేతుల్లోకి వచ్చిన బాలసూర్యుణ్ని ఆశ్చర్యానందంతో చూస్తోంది. అదితి. కశ్యపుడు ఆమె పక్కకు జరిగాడు. అందరూ నవ్వుతున్నారు. బాలసూర్యుడు. అందర్నీ కలయజూస్తూ నవ్వుల వెలుగుల్ని వెదజల్లుతున్నాడు.


 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

నవగ్రహా పురాణం🪐* . *14వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *14వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*సూర్యగ్రహ జననం - 5*


ఆనాడు కశ్యప ప్రజాపతి ఆశ్రమం దేవ సభను తలపింపజేస్తోంది. శ్రీలక్ష్మీ మహావిష్ణువులూ , సరస్వతీ సమేతంగా సృష్టికర్త బ్రహ్మా, సతీసమేతంగా శివుడూ , ఆదితేయులైన ఇంద్రాది దేవతలూ , కశ్యపుని తల్లి కళా , తండ్రి మరిచీ , ప్రసూతి దక్ష ప్రజాపతులూ , నారద మహర్షీ , ఇతర బ్రహ్మ మానస పుత్రులైన అత్రీ , అంగిరసుడూ , కర్దముడూ , పులహుడూ , పులస్త్యుడూ , భృగువూ , వసిష్ఠుడూ , క్రతువూ , వాళ్ళ పత్నులూ.... కాశ్యపేయుడి నామకరణ మహోత్సవానికి విచ్చేశారు.


కశ్యపుడు శ్రీమహావిష్ణువుకు నమస్కరిస్తూ యిలా అన్నాడు. *"పరమ పురుషా ! మా చిన్న కొడుకు తమ వరప్రసాదమే ! సార్థక నామధేయం అనుగ్రహించి , ఆశీర్వదించండి !"*


*"కశ్యపా ! ఈ పుత్రుణ్ని నీకు ప్రసాదించింది. కేవలం మీ దంపతుల కోసమే కాదు. సమస్త విశ్వం కోసమూ ! నవగ్రహ దేవతలలో ఆద్యుడూ , అధికుడూ అయిన సూర్యుడు మీ దంపతుల పుత్రుడుగా ఆవిర్భవించాడు. భవిష్యత్తులో ఈ చిన్నారి బాలుడు గ్రహరాజు అవుతాడు ! జ్యోతిర్మండలంలో , నక్షత్రాల కలయికతో రూపొందిన ద్వాదశ రాశులలో నెలకొకరాశిలో నెలకొంటూ సంచరిస్తూ వుంటాడు..."*


*"ద్వాదశ రాశులా !"* కశ్యపుడు ఆశ్చర్యంగా అడిగాడు..


*"ఔను కశ్యపా !"* బ్రహ్మ వివరిస్తూ అన్నాడు. *"మా జనకులు శ్రీమహావిష్ణు దేవుల సంకల్పం ప్రకారం అంతరిక్షంలో నక్షత్రాలు బృందాలుగా చేరాయి. మేషం , వృషభం , మిథునం , కర్కాటకం , సింహం , కన్య , తుల , వృశ్చికం , ధనస్సు , మకరం , కుంభం , మీనం - ఆకారాలలో స్థిరపడి వున్నాయి !"*


*"ద్వాదశ రాశులలో ద్వాదశ మాసాలలో ద్వాదశ నామ ధేయాలతో అదితి కశ్యపుల అనుంగు సుతుడైన ఈ సూర్యుడు సంచరిస్తాడు..."* అంటూ శ్రీమహావిష్ణువు బ్రహ్మనూ , శివుణ్నీ సాభిప్రాయంగా చూశాడు. *"పరమేష్ఠీ పరమేశ్వరులూ , నేనూ చిరంజీవికి ద్వాదశ నామ నిర్దేశం చేస్తాం !"*


*"చాలా సంతోషం. ప్రారంభించండి !"* పరమ శివుడు అన్నాడు..


అదితి లేచి , శ్రీమహావిష్ణువు దగ్గరగా వచ్చింది. తన చేతుల్లోని పురిటి బిడ్డను ఆయనకు అందించింది. విష్ణువు బాలుణ్ని చిరునవ్వుతో చూస్తూ శ్రీలక్ష్మికి అందించాడు. బాలుణ్ని చూస్తున్న లక్ష్మి దేవి ముఖం కమలంలా వికసిస్తోంది !


*"లక్ష్మీ ! బాలసూర్యుణ్ని ఆ వేదిక మీద పడుకో బెట్టు !"* అన్నాడు విష్ణువు.


లక్ష్మి బాలుణ్ని నుదురు మీద ముద్దు పెట్టి అరుగు మీద పడుకో బెట్టింది. శ్రీమహావిష్ణువు బాలుణ్నే చూస్తూ నామ నిర్దేశం ప్రారంభించాడు. *"ధాత ! ఆర్యముడు..."*


అందర్నీ ఆశ్చర్యంలో ముంచివేస్తూ బాలసూర్యుడి పక్కనే అదే పోలికతో మరొక బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.


*"మిత్రుడు !"* ఆశ్చర్యంతో ఏర్పడిన నిశ్శబ్దాన్ని విష్ణువు గంభీర కంఠస్వరం ఛేదించింది మూడవ బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.


*"శక్రుడు !"* విష్ణువు నాలుగవ నామధేయాన్ని ప్రకటించాడు. నాలుగవ బాలసూర్యుడు సాక్షాత్కరించాడు.


విష్ణువు బ్రహ్మదేవుడి వైపు చూశాడు. బ్రహ్మ ఆయన దృష్టిలోని ఆజ్ఞను అర్ధం చేసుకుంటూ , బాలసూర్యుడికి తన వంతుగా నాలుగు నామధేయాలు ప్రకటించాడు.


*"వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు !"* బాలసూర్య రూపాలు మరో నాలుగు ప్రత్యక్షమయ్యాయి.


పరమశివుడు బాలసూర్యుడికి మరొక నాలుగు పేర్లు ప్రసాదించాడు. *"పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !"* బాలసూర్యుని రూపాలు ఇప్పుడు పండ్రెండు కనిపిస్తున్నాయి.


పండ్రెండు రూపాలూ ఒకదాని పక్కన ఒకటి - వలయాకారంలో కనిపిస్తున్నాయి. సున్నితంగా కదలాడుతున్న చిన్నారి కాళ్ళూ , చేతులూ ! చిరునవ్వుల కాంతుల్ని వెదజల్లుతున్న గుండ్రటి ముఖాలు ! తామరరేకుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు ! ద్వాదశ బాలాదిత్యులతో ఏర్పడిన వలయం సజీవంగా ఉన్న రంగవల్లిగా అందరి దృష్టినీ లాగి పట్టింది.


నారదుడు తన మృదుమధుర కంఠస్వరంతో వరసగా ఆ ద్వాదశ బాలాదిత్యుల నామధేయాలను ఆనందంగా వల్లె వేశాడు. *"ధాత! ఆర్యముడు ! మిత్రుడు ! శక్రుడు ! వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు ! పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !"*


త్రిమూర్తులూ , దేవతలూ , మానస పుత్రులూ , వాళ్ళ పత్నులూ , నారదుడూ , కశ్యపుడు , ఆయన పత్నులూ అక్షింతలు వేస్తూ ఆశీర్వదించారు.


*"త్రిమూర్తులు నా మనుమడికి సార్థక నామధేయాలు ప్రసాదించారు ! వెలుగు వేలుపు పితామహుడు కావడం నా అదృష్టం !"* మరీచి చేతులు జోడిస్తూ అన్నాడు.


*"సకల ప్రాణుల్నీ సమదృష్టితో చూసే లోకబాంధవుడైన పుత్రుడు కావాలన్న మహదాశయంతో తపించింది అదితి ! ఉన్నతమైన ఆ కోరికతో - ఆమె గ్రహరాజును పుత్రుడిగా పొందే అదృష్టాన్నీ , అర్హతనూ సంపాందించుకుంది ! ఈ బాలాదిత్యుడు పెరిగి పెద్దవాడై గ్రహసార్వభౌముడిగా అందరి అర్చనలూ అందుకుంటాడు !"* విష్ణువు అన్నాడు.


*“తథాస్తు !"* అన్నారు శివుడూ , బ్రహ్మా.


అదితి ఆనందబాష్పాలతో తన అందాల పాపడి వైపు చూస్తోంది. పన్నెండు ముద్దుల మూటలను చూస్తుంటే ఆమె మాతృత్వం పొంగి పొర్లసాగింది. పన్నెండుగుర్నీ ఒకేసారి ఎత్తుకుని , వక్షానికి హత్తుకుని , బొజ్జల నిండుగా పాలు పట్టాలన్న కోరిక ఆమె సర్వస్వాన్నీ ఆవరించి కుదిపి వేస్తోంది.


అదితి ఆవేశంగా కదిలి చేతులు ఎడంగా చాపి , తన ద్వాదశ పుత్రుల్ని వొడిసి పట్టుకోబోయింది. విచిత్రంగా అన్ని రూపాలూ ఒక్కసారిగా కలిసి , ఒక్కటిగా మారిపోయాయి. తన చేతుల్లోకి వచ్చిన బాలసూర్యుణ్ని ఆశ్చర్యానందంతో చూస్తోంది. అదితి. కశ్యపుడు ఆమె పక్కకు జరిగాడు. అందరూ నవ్వుతున్నారు. బాలసూర్యుడు. అందర్నీ కలయజూస్తూ నవ్వుల వెలుగుల్ని వెదజల్లుతున్నాడు.


 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-33🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-33🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*ధ్రువబేరం:*


తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. ఈ మూర్తి స్వయంభూమూర్తి (అనగా స్వయంగా వెలసినది, ఎవరూ చెక్కి ప్రతిష్ఠించలేదు) అని భక్తుల విశ్వాసం. 


మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. 


మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు.


 నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.



 18 అంగుళాలున్న పద్మాకారం వేదికపై స్వామివారు నిలుచుని ఉంటారు. గురువారం సాయంకాలం, మరియు శుక్రవారం నాడు తప్ప ఇతర దినాలలో ఈ వేదిక, స్వామివారి పాదాలు తులసి దళాలతో కప్పబడి ఉంటాయి


ధృవబేరం చక్కని ముఖకవళికలతో వెలసి ఉంటుంది. ముక్కు మరీ ఎత్తూ కాదు, చప్పిడీ కాదు. కన్నులు స్పష్టంగా అమరి ఉంటాయి. నుదుటిపై రేఖారూపంగా ఏర్పడిన నామం ఉంది.


 నిత్యం పచ్చకర్పూరంతో పెట్టిన నామం కన్నులను కొంతభాగం కప్పివేస్తుంది. నామం రూపం, సైజూ వంటి వివరాలు వైఖానస ఆగమంలో చెప్పినవిధంగా కచ్చితంగా పాటిస్తారు. 


స్వామివారి శిరస్సుపై (నుదుటిపైభాగం వరకు) కిరీటం ఉంది. ఆయన జటాజూటము భుజాలపై పడుతూ ఉంటుంది. 


కచ్చితమైన కొలతలు తీసికొనబడనప్పటికీ స్వామివారి ఛాతీ వెడల్పు సుమారు 36-40 అంగుళాల మధ్య సైజులోనూ

, నడుము భాగం వెడల్పు 24-27 అంగుళాలు సైజులోనూ ఉంటుంది. 


స్వామివారి నడుము పైభాగం ఆచ్ఛాదనారహితంగా ఉంటుంది. ఆయన వక్షస్థలం కుడిభాగాన శ్రీలక్ష్మీదేవి రూపం ఉంది. స్వామివారు చతుర్భుజములను కలిగియున్నారు. పై కెత్తిన కుడిచేతిలోనున్న సుదర్శన చక్రము, ఎడమచేతిలోనున్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావు. 


అదనంగా స్వామివారి చేతులలో ఉంచిన అలంకారాయుధాలు. దిగువనున్న రెండుచేతులలోను కుడిచేయి వరదహస్తము (అరచేయి భక్తులకు కనిపిస్తూ, వరములను ప్రసాదిస్తున్నట్లుగా ఉంటుంది).


 ఎడమచేయి కట్యావలంబిత ముద్రలో (నడుమువద్ద మడచినచేయి. అరచేయి స్వామివారివైపు ఉంటుంది) ఉంది. నడుము క్రిందభాగంలో స్వామివారు ధోవతి ధరించి ఉంటారు. రెండు మోకాళ్ళూ కొంచెంగా వంగినట్లు కనిపిస్తాయి (స్వామివారు భక్తుల రక్షణకు నడచి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా). 


స్వామివారు ఆయుధాలను ధరించిన త్రిభంగ రూపంలో ఉండనప్పటికీ స్వామివారి భుజాలపై ధనుర్బాణాల ముద్రలున్నాయి



వేంకటేశ్వరునిగా వ్యవహరించే ఈ ధృవభేరం ఏ దేవతామూర్తిది, మొదటి నుంచి ఏ రూపంగా అక్కడ అర్చన కొనసాగింది అన్న విషయంపై తీవ్ర వాదోపవాదాలు సాగాయి.


నాగేంద్రభూషణ గోవిందా, మంజీర మండిత గోవిందా, తులసిమాలప్రియ గోవిందా, ఉత్పమాలాంకృత గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||33||


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 27*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 27*

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩


.               *ఆధ్యాత్మిక అనుభూతి*


1.ఆత్మ, భగవంతుడు లాంటి సత్యాలను ధ్రువీకరించడానికిగల ఒకే మార్గం ప్రత్యక్ష అనుభవమే. శాస్త్రాలు సంకేత ఫలకాలలా ఈ సత్యాలను సూచించ గలుగుతాయేగాని వాటిని నిరూపించలేవు. వర్షం ఎప్పుడు పడుతుందో పంచాంగం తెలుపుతుంది. అలాగని పంచాంగాన్ని పిండితే ఒక చుక్కనీరు కూడా రాదు.


2. ఆధ్యాత్మిక అనుభవాలకు హద్దులు లేవు. కనుక పొందిన అనుభవాలతో తృప్తిచెంది ఆగిపోకుండా ముందుకు సాగాలి.


 3. కుండలినీ శక్తి జాగృతమయినప్పుడే ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి.


4. ద్వైతం కాని స్థితియైన అద్వైతానుభవమే అత్యంత ఉన్నతమైన అనుభవం.


5. కాని అద్వైతం చరమ అనుభూతి కాదు. అద్వైత అనుభవం పొందిన కొందరు మళ్లీ సామాన్య స్థితికి వస్తారు. వారు సర్వత్రా భగవంతుణ్ణి చూస్తారు, ఆ భగవదానందంలోనే జీవిస్తారు. ఈ స్థితి 'విజ్ఞానం' అనబడుతుంది. ఈ స్థితిని పొందిన వ్యక్తిని 'విజ్ఞాని' అని పేర్కొంటారు. ఆ వ్యక్తి భగవంతుడు (నిత్యం), జగత్తు (లీల) రెంటినీ సత్యంగా దర్శిస్తాడు.


6. ఎన్నడూ బద్ధుడుకాని, సదా ముక్తి స్థితిలోనే నెలకొనివున్న వారుకొందరున్నారు.

నిత్యముక్తులయిన వీరు భగవంతుడు అవతరించే తరుణంలో ఆయనతో బాటే జన్మించి, ఆయన అవతార కార్యానికి తోడ్పడతారు. వీరిని ఈశ్వర కోటులుగా పేర్కొంటారు.


శ్రీరామకృష్ణులు వీటిని బోధించడంమే కాక సత్యాలను ధ్రువీకరించడానికి కొందరి జీవితాలను రూపొందించి నిష్క్రమించారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 11*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 11*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి*

*ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః |*

*చతుశ్చత్వారింశత్ వసుదళ కలాశ్రత్రివలయ*

*త్రిరేఖబి సార్ధం తవ శరణకోణాః పరిణతాః ||*



ఈ శ్లోకంలో అమ్మవారు శ్రీచక్ర స్థిత అయిన వైనం వివరిస్తున్నారు. దీనిలో అనేకమైన శ్రీచక్ర రహస్యాలను నిక్షిప్తం చేశారు శంకరులు. అందంతా ఒక విజ్ఞాన శాస్త్రం, ఒక సాంకేతిక పరిజ్ఞానం. గురూపదేశం,గురు శిక్షణ లేకుండా శ్రీచక్ర ,బిందు కోణచక్ర వివరణ అర్థం చేసుకోవడం కష్టం.గురూపదేశం లేకుండా శ్రీచక్రార్చన చేయరాదు.


చతుర్భిః శ్రీకంఠైః = నాలుగు శివ  చక్రాలతోనూ


శివయువతభిః పంచభిః = ఐదు శక్తి చక్రములతోనూ  కలిసి ఏర్పడింది శ్రీచక్రము.


ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలపృకృతిభిః = ఇవ్వన్నీ కలిసి పరమేశ్వరుని నవాంశములతో కూడిన మూలప్రకృతిని తెలియచేస్తున్నాయి.


చతుశ్చత్వారింశత్ వసుదళ కలాశ్ర త్రివలయ =  44 త్రికోణాలతోను,అష్ట గణాధి దేవతలు దళములతోను, షోడశ కళల దళములతోను, మూడు వలయములతోను


త్రిరేఖభిః సార్ధం తవ శరణకోణతాః = మూడు రేఖలతోను,నీ ఆశ్రయమైన శ్రీచక్రము విరాజిల్లుతున్నది తల్లీ! శ్రీచక్రమును ఎలా భావన చేయాలో భావనోపనిషత్ చెప్తుందట.అమ్మవారి నామాల్లో *భవానీ భావనాగమ్యా* దీనికి సూచన.


            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

యజ్ఞోపవీత ధారణ

 *"ఓ బ్రాహ్మణా" నీ కోసం నీకు నువ్వే కేవలం 10 ని.ల సమయం కూడా కేటాయించుకోలేవా...??*


*ది.31/8/23 గురువారం నాడు ఉదయం పూట జంధ్యాల పౌర్ణమి/శ్రావణ పౌర్ణమి సందర్భంగా కనీసం నీ వంటి మీద వున్న నీ పవిత్ర జంధ్యాన్ని కూడా నేడు మార్చుకోలేవా...?? దయచేసి మార్చుకో...!!🙏*


*""నూతన యజ్ఞోపవీత ధారణ విధానము ప్రార్థన:""*


శుక్లాంబరధరం విష్ణుం

శశివర్ణం చతుర్భుజం |

ప్రసన్న వదనం ధ్యాయేత్ 

సర్వ విఘ్నోపశాంతయే ||


గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః 

గురు దేవో మహేశ్వరః |

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: 

శ్రీ గురవే నమః ||


అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో పివ |


యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: ||


పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!


(అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను)


ఆచమన విధానం:

ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,

1.   ఓం కేశవాయ స్వాహా,


2.   ఓం నారాయణాయ స్వాహా,


3.   ఓం మాధవాయ స్వాహా,


అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.


4.   ఓం గోవిందాయనమః,


5.   ఓం విష్ణవే నమః,


6.   ఓం మధుసూదనాయనమః,


7.   ఓం త్రివిక్రమాయనమః,


8.   ఓం వామనాయనమః,


9.   ఓం శ్రీధరాయనమః,


10.  ఓం హృషీకేశాయనమః,


11.  ఓం పద్మనాభాయనమః,


12.  ఓం దామోదరాయనమః,


13.  ఓం సంకర్షణాయనమః,


14.  ఓం వాసుదేవాయనమః,


15.  ఓం ప్రద్యుమ్నాయనమః,


16.  ఓం అనిరుద్ధాయనమః,


17.  ఓం పురుషోత్తమాయనమః,


18.  ఓం అధోక్షజాయనమః,


19.  ఓం నారసింహాయనమః,


20.  ఓం అత్యుతాయనమః,


21.  ఓం జనార్దనాయనమః,


22.  ఓం ఉపేంద్రాయనమః,


23.  ఓం హరయేనమః,


24.  ఓం శ్రీకృష్ణాయనమః.

అని నమస్కరించవలెను. అటు పిమ్మట:


*భూతోచ్చాటన:*


(చేతిలో ఉద్ధరిణి తో నీరు పోసుకుని యీ క్రింది మంత్రమును చదివిన పిమ్మట భూమిపై నీళ్ళు జల్లవలెను.)


ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః | దేవీ గాయత్రీచ్చందః ప్రాణాయామే వినియోగః


(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)


గృహస్తులు ఐదు వ్రేళ్లతో నాసికాగ్రమును పట్టుకొని మంత్రము చెప్పవలెను. బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక ఉంగరం వ్రేళ్లతో ఎడమ ముక్కును పట్టుకొని ఈ క్రింది మంత్రమును చెప్ప వలెను.


ఓం భూః, ఓం భువః, ఓగ్ మ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ | ఓం ఆపో జ్యోతి రసో2మృతం, బ్రహ్మ భూర్భువస్సువరోమ్||


*తదుపరి సంకల్పం:*


మమ ఉపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా కావేరీయోర్మధ్యే, స్వగృహే (లేదా శోభన గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే


(బ్రహ్మచారులు “ధర్మపత్నీ సమేతస్య” అని చెప్పనక్కర లేదు)


యజ్ఞోపవీతములు ఐదింటిని ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలముల వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి, యజ్ఞోపవీత ధారణా మంత్రము స్మరించి ఈ క్రింది విధముగా ధరించవలెను.


*1 మొదటి యజ్ఞోపవీతం ధారణ:*


యజ్ఞోప వీతే త్తస్య మంత్రస్య పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా,


దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః ||


*“ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం*


*ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్*


*ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం*


*యజ్ఞోపవీతం బలమస్తు తేజః”*


అని చెప్పి అని మొదటి ముడి ఉన్న జంధ్యాన్ని ధరించవలెను.


(మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.)


*2 ద్వితీయోపవీత ధారణం:*


తిరిగి ఆచమనం చేసి “మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.


*3 తృతీయ యజ్ఞోపవీత ధారణం:*


తిరిగి ఆచమనం చేసి “ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.


*4,5 చతుర్ధ, పంచమ యజ్నోపవీతములు ధరించుట:*


తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ “ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను. మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.


తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి, “దశ గాయత్రి” (పదిమారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు” అని నీటిని వదలవలెను. (బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును)


*గాయత్రీ మంత్రము:*


“ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం


భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ ”


తరువాత ఈ క్రింది విజర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.


*జీర్ణోపవీత విసర్జనం:*


తిరిగి మరలా ఆచమనం చేసి


శ్లో: ఉపవీతం భిన్నతంతుం కశ్మల దూషితం


విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే ||


శ్లో: పవిత్రదంతా మతి జీర్ణవంతం


వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం


ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం


జీర్నోపవీతం విసృజంతు తేజః ||


శ్లో: ఏతా వద్దిన పర్యంతం


బ్రహ్మత్వం ధారితం మయా


జీర్ణత్వాత్తే పరిత్యాగో


గచ్ఛ సూత్ర యథా సుఖం ||


విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను.


తిరిగి ఆచమనం చేసి కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపింఛి యధాశక్తి “గాయత్రీ దేవతార్పణమస్తు” అని నీరు విడువ వలెను. ఆ తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను.


తీసివేసిన పాత జందెమును ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను.


నూతన యజ్ఞోపవీత ధారణ సమయములు:


శ్రావణ పౌర్ణమి నాడు, జాతాశౌచ శుద్ధి యందు, మృతాశౌచ శుద్ధియందు, గ్రహణానంతరము, ప్రతి నాలుగు మాసముల అనంతరము నూతన యజ్ఞోపవీతమును ధరించి, పూర్వ యజ్ఞోపవీతమును త్యజించవలెను. ఎవరు తొక్కని ప్రదేశంలోనో, చెట్ల మొదలులోనో, పారే నదిలోనో,బావిలోనో విసర్జించవలెను.


ఓం శ్రీ గాయత్రి దేవై నమః

        🔥శివేశ్రీ🔥


*బ్రాహ్మణ చైతన్య వేదిక*

సుభాషితమ్

 🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*ఇదే మే హి పాండిత్యం*

*ఇయమేవ విదగ్ధతా.*

*అయమేవ పరోధర్మః*

*యత్ ఆయావ్యధికోవ్యయ*


*- _తాత్పర్యము_-* 


*సంపాదనకు మించి ఎప్పుడూ ఖర్చు పెట్టకూడదు. అలా ఖర్చుపెట్టకుండా ఉండడమే పాండిత్యం, అదే గొప్ప నేర్పరితనం, అదే ముఖ్య కర్తవ్యం.*


 *కనుక ఎప్పుడూ ఆదాయానికి మించి వ్యయం చేయకూడదు*.....!!!!


🧘‍♂️🙏🪷 ✍️🙏

విలువుండని(విలువెరుగని) వారలతో


*కం*

విలువుండని(విలువెరుగని) వారలతో

విలువగు సమయంబునెల్ల వెచ్చించినచో

అలతులు బల్లిదులగుదురు

విలువగు నీ విలువలెల్ల వెడలును సుజనా.

*భావం*:-- ఓ సుజనా! విలువ లేని వారి తో విలువైన సమయమంతా గడపడం వలన ఆ అల్పులు బలవంతులై విలువైన నీ విలువ లన్నీ తగ్గిపోవును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

వంశజనులపెంచగనే

వంశోధ్ధారకులుగారు పరిగణమొనరన్(ప్రముఖులు మెచ్చన్)

వంశ(పు)ప్రతిష్ఠ బెంచగ

వంశోధ్ధారకుడనబడు పదపడి (బలముగ)సుజనా

*భావం*:-- ఓ సుజనా! వంశం లో జనులను పెంచినంతమాత్రాన వంశోధ్ధారకుడనబడరు. పరిగణించేస్థాయిలో వంశం యొక్క ప్రతిష్ఠ పెంచినప్పుడే వంశోధ్ధారకుడనబడును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మొదటి* *భాషగా సంస్కృతం✍️📚*

 *📚✍️పాఠశాల విద్యలో మొదటి*

 *భాషగా సంస్కృతం✍️📚*


*♦️ఆరో తరగతి నుంచి ఎంపికకు అవకాశం*


*♦️ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన*


*🌻ఈనాడు, అమరావతి*: పాఠశాల విద్యలో మొదటి భాషగా సంస్కృతం సబ్జెక్టును తీసుకురాబోతున్నారు. పాఠశాల విద్యా శాఖ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వ నికి పంపింది. త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. మొదటి భాషగా దీన్ని ఎంచుకున్న విద్యార్థులు రెండో భాషగా హిందీకి బదులు తెలుగు సబ్జెక్టు చదవాల్సి ఉంటుంది. మూడో భాషగా ఆంగ్లం ఉంటుంది. తెలుగు సబ్జెక్టును మొదటి భాషగా తీసు కున్న వారు రెండో భాషగా హిందీ చదవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఆరో తరగతిలో మొదటి భాషను ఎంపిక చేసుకునే

అవకాశం కల్పిస్తారు. సంస్కృతం పుస్తకాలు ఆరో తరగతి నుంచి ఉన్నాయి. పదో తరగతి పరీక్షల సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం కాంపొజిట్ తెలుగును తొలగించింది. ఇందులో తెలుగు 70 మార్కులు, సంస్కృతం 30 మార్కులకు ఉండేది. తెలుగునే వంద మార్కులకు చేసినందున సంస్కృతం సబ్జెక్టుకు అవకాశం కల్పించాలనే డిమాండ్ వచ్చింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కృతం ఉపాధ్యాయులు పని చేస్తు న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కన్నడ, తమిళం, ఒడియా, హిందీ, ఉర్దూ మొదటి భాషగా చదువుతున్న విద్యార్థులు 10వేల వరకు ఉన్నారు. ఇప్పుడు సంస్కృతం తీసుకువస్తే ఈ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. సంస్కృతంలో ఎక్కువ మార్కులు సాధించే వీలుంది. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ మంది ఈ సబ్జెక్టును ఎంచుకునే అవకాశం ఉంది.


🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇