6, నవంబర్ 2023, సోమవారం

కృతజ్ఞత

 *కృతజ్ఞత*



“కృతజ్ఞత” అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచిపోకుండా ఉండటం. 


మనం, 

ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, 

ఏదో ఒక సహాయం మనకు అవసరమైనపుడో, 

మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు. 


మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే ఉదారులు కొందరుంటారు. 


వీరికెప్పుడూ, 

మనం కృతజ్ఞులమై ఉండాలి. 


కృతజ్ఞత అనేది నాగరిక సంస్కారం.


వాల్మీకి, రాముణ్ణి వర్ణిస్తూ “ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ” అన్నాడు. 


సీతమ్మను అపహరించు కొనిపోతున్న రావణునితో పోరాడి ఆ సమాచారాన్ని రామునికి చెప్పి ప్రాణాలు కోల్పోయిన జటాయువుకు రాముడు కృతజ్ఞతతో అంతిమసంస్కారం చేశాడు.


రావణ సంహారంలో తనకు తోడ్పడిన వానరుల కోసం,


ఈ వానరులు, ఎక్కడ ఉంటే అక్కడ త్రికాలాలలోనూ మధురఫలాలను ఇచ్చే వృక్షాలు ఉండేటట్లు, 

అక్కడి నదులలో నిరంతరం స్వాదుజలం ప్రవహిస్తూ ఉండేటట్లు వరం ఇవ్వవలసిందిగా, 

రాముడు ఇంద్రుణ్ణి కోరాడు.


ఇదీ ఆయన కృతజ్ఞతా లక్షణం.


మహాభారతం లో,


దగ్ధమైన లాక్షాగృహం లోంచి ప్రాణాలతో బయటపడి,


ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో, 

తన కుమారులతో తల దాచుకుంటున్న కుంతి, 


తమకు ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణునకు ఒక కష్టదశ సంభవించగా, 

అతనికి ప్రత్యుపకారం చేయటం తన ధర్మమని భావించిన సందర్భంలో కుంతీదేవి తన ఒక కుమారుడను రాక్షసుడుకు ఆహారముగా పంపడం ద్వారా కృతజ్ఞత తెలియజేసింది.


ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం, 


దానికి సమమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం, 


వారు చేసిన ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం అంటుంది ధర్మం.


“ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం”

అనే చందంగా కాకుండా, 


మన ఉనికికి, ఉన్నతికి కారకులైన వారిపట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. 


ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి , 

విధివశాత్తూ ఒక కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే,


అతని యందు సకాలంలో, 

అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే, 

అది కృతఘ్నత ఔతుంది. 


ఈ విషయాన్ని మహాభారతం అనుశాసనికపర్వంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఒక కథారూపంలో ధర్మరాజుకు చెప్పాడు.


ఒక బోయవాడు వేటకు వెళ్ళి "ఘనతర విషదగ్ధ శరం" తో ఒక మృగాన్ని కొట్టబోయాడు. 

అది గురి తప్పి ఒక చెట్టును తాకింది. 

పువ్వులతో, కాయలతో పచ్చగా ఉన్న ఆ వృక్షం, విష శరాఘాతం వల్ల నిలువునా శుష్కమైపోయింది. 


ఆ చెట్టే ఆశ్రయంగా, 

దాని తొర్రలో నివాసముంటున్న ఒక మహాశుకం, 

దానిని వదలలేక దాని మీదనే ఉండిపోయింది. 


దీనిని గమనించిన ఇంద్రుడు మానుషరూపంలో దాని దగ్గరకు వెళ్ళి,


ఓ కీరమా! ఈ వృక్షం బెండువారి పోయింది. 


ఫలసంపద గల అనేక ఇతర వృక్షాలు ఈ అరణ్యంలో ఉండగా, 

ఇంకా దీనినే అంటిపెట్టుకున్నావెందుకు..?

అని అడిగాడు.


అపుడా శుకం, 

ఈ చెట్టు తాను మధురఫలాలతో నిండిఉన్న సమయంలో నాకు ఆశ్రయం ఇచ్చింది.


ఈవేళ ఇది ఎండిపోయిందని, నేను దీనిని వదలి వెళ్ళిపోవటం కృతఘ్నత కాదా! అనిమిషనాథా! అంది. 


తాను మానుషరూపంలో వచ్చినా 

"పురాకృత సంజనిత విశేషము" చేతనే, 

ఈ మహాశుకం తనను ఇంద్రునిగా పోల్చుకోగలిగిందని ఆశ్చర్యపోయి,


నీ మాటలకు మెచ్చాను, నీకేం కావాలో కోరుకో, 

అన్నాడు ఇంద్రుడు. 


అపుడా మహాశుకం,

ఈ వృక్షానికి మేలు చెయ్యి, చాలు. అంది. 


ఇంద్రుడు సంతోషించి, 

అమృతసేచనంతో ఆ వృక్షానికి పూర్వం కంటే ఎక్కువ శోభను, ఫలసంపదను కలుగజేశాడు.


ఈ కథ వల్ల, 

ఉత్తములైన ఆశ్రితులు, 

ఆశ్రయదాత క్షేమాన్ని కోరుకోవాలని,

కృతజ్ఞత ఉత్తమలక్షణమని తెలుస్తోంది. 


సజ్జనులు, 

ఇతరులు తమకు చేసిన ఉపకారాన్ని మరచిపోరు.


🙏 సర్వే జనా సుఖినోభవంతు🙏

అనన్తపారం

 అనన్తపారం నవనీతకుమ్భం,

పరాత్మతత్త్వార్థసుబోధమార్గమ్।స్పృహానుసారం తు హి దీయమానం,

రసాలయం భాగవతం మహాన్తమ్।।(కంచినాథమ్)

భావం-అంతులేనటువంటిది శ్రీమద్భాగవతనవనీతకుంభము.పరబ్రహ్మతత్త్వార్థాన్ని సులభముగా బోధించు మార్గము .ఎవరికి ఎంతకావాలంటే అంతనవనీతజ్ఞానామృతము ఇచ్చేటటువంటిది శ్రీమద్భాగవతము.నవనీతామృతజ్ఞానరసాలయం శ్రీమద్భాగవతము.

        అటువంటి మహత్తరమైన ఎంతతోడినా తరగని జ్ఞానామృతసాగరాన్ని మాబోటివారలకు పంచిపెట్టినందులకు ఇస్కాన్ కృష్ణభక్తపరంపరకు,దాతలకు హృదయపూర్వకకృతజ్ఞతాభివందనములు.

Panchaag


 

శ్రీ సిద్ది వినాయక గణేష్ మందిర్


 🕉 మన గుడి : నెం 231



⚜ గోవా : కండోలిమ్


⚜ శ్రీ సిద్ది వినాయక గణేష్ మందిర్


💠 గోవా యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక రత్నాలను అన్వేషించే విషయానికి వస్తే, శ్రీ సిద్ధివినాయక్ గణేష్ దేవాలయం ఉత్తర గోవాలో తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశంగా నిలుస్తుంది. 

మీరు ఓదార్పు కోరుకునే ప్రయాణీకుడైనా లేదా ఉల్లాసమైన ఉత్సవాల్లో మునిగితేలాలని చూస్తున్న సాంస్కృతిక ఔత్సాహికులైనా, 

ఈ ఆలయం మరెవ్వరికీ లేని అనుభూతిని ఇస్తుంది.


💠 ఉత్తర గోవా నడిబొడ్డున నెలకొని ఉన్న శ్రీ సిద్ధివినాయక్ గణేష్ దేవాలయం పంజిమ్ సిటీ సెంటర్ నుండి కేవలం 12 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ఆలయం సందర్శకులను ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకునివెళ్తుంది.


💠శ్రీ సిద్ధివినాయక్ గణేష్ ఆలయంలో ఉత్సాహభరితమైన పండుగలను అనుభవించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, గణేష్ చతుర్థి సమయంలో సందర్శించడానికి ఉత్తమ సమయం . 

ఇది సాధారణంగా హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో వస్తుంది . 


💠 ఆలయం ప్రశాంతతను వెదజల్లుతుండగా, పండుగ సీజన్లలో రంగురంగుల వేడుకల కేంద్రంగా  మారుతుంది. 


💠 శ్రీ సిద్ధివినాయక గణేష్ దేవాలయంలో ఉత్సవాల సాక్ష్యం మరెక్కడా లేని సాంస్కృతిక అనుభూతి. 

ప్రజల ఉత్సాహం మరియు భక్తి మీ సందర్శనకు ఒక ప్రత్యేక ఆకర్షణను జోడిస్తాయి. సంప్రదాయాలలో మునిగిపోండి, ఉల్లాసమైన ఊరేగింపులను చూసుకోండి మరియు ఈ సమయాల్లో ప్రసరించే సామూహిక ఆనందాన్ని అనుభవించండి.


💠 రంగుల ఊరేగింపులు: 

గణేష్ చతుర్థి సందర్భంగా, ఆలయం మరియు దాని పరిసరాలు వీధుల గుండా గణేశ విగ్రహాన్ని తీసుకువెళ్ళే రంగురంగుల ఊరేగింపులతో ముస్తాబు చేస్తారు.

సాంప్రదాయ సంగీతం, నృత్య ప్రదర్శనలు మరియు ఉత్సాహభరితమైన కవాతులను చూసేందుకు భక్తులు మరియు చూపరులు గుమిగూడుతారు.


💠 ఆచారాలు మరియు నైవేద్యాలు: 

పండుగ అంతటా, ఆలయం ప్రత్యేక ప్రార్థనలు, ఆర్తి (దీపాలతో పూజించడం), మరియు భజనలు (భక్తి పాటలు) సహా వివిధ ఆచారాలు మరియు వేడుకలను నిర్వహిస్తుంది. 

భక్తులు గణేశుడికి తమ భక్తికి చిహ్నంగా మోదకం (తీపి ప్రసాదం), పువ్వులు మరియు కొబ్బరికాయలు వంటి నైవేద్యాలను తీసుకువస్తారు.


💠 మీరు గోవాకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ ప్రయాణంలో శ్రీ సిద్ధివినాయక్ గణేష్ ఆలయాన్ని తప్పకుండా చేర్చుకోండి. 


💠 పంజిమ్‌కి సామీప్యత కారణంగా దీనిని సులభంగా చేరుకోవచ్చు మరియు 12 కిలోమీటర్ల ప్రయాణం ఈ ప్రాంతం యొక్క సుందరమైన అందాలను చూసేందుకు ఒక అవకాశంగా ఉంటుంది.

విదురనీతి

  విదురనీతి

శ్లో)కిం వై సహైవం చరథో న పురాచరథః సహ 

విరోచనైతత్ పృచ్ఛామి కింతే సఖ్యం సుధన్వనా॥


అ)మీరు ఇదివరకెప్పుడు కలిసి తిరుగలేదు. ఇప్పుడిలా కలిసి తిరుగుతున్నారు. విరోచనా! నీకు సుధన్వునితో స్నేహం కలిసినదాయేమి?

 ఉద్ధవగీత

శ్లో)యః స్వదత్తాం పరైద్దత్తాం హరేత సురవిప్రయోః 

 వృత్తిం స జాయతే విడ్భుగ్వర్షాణామయుతాయుతమ్ ॥ 


అ)స్వదత్తము లేదా పరదత్తము నగు దేవతావృత్తిని, బ్రాహ్మణ వృత్తిని హరించువాడు కోట్లకొలది సంవత్సరముల వఱకు మలమును భక్షించు క్రిమియై జన్మించును.

దేవుడు అంతటావున్నాడు

 

 *దేవుడు అంతటావున్నాడు*

                   ➖➖➖✍️


*”భగవంతుడు అన్నిటా వున్నానని చెప్పినప్పుడు హిందువులు విగ్రహారాధన ఎందుకు చేస్తారు?”*


*ఒకసారి వివేకానందుడు ఇప్పుడున్న రాజస్తాన్ లో వున్న అల్వార్ సంస్థానాధీశుని దగ్గరకు వెళ్ళాడు.*


*విగ్రహారాధానని వెక్కిరించడానికి ఆ రాజు వివేకానందునితో…  ‘నాకు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేదు, రాయినీ, రాప్పనీ, కర్రనీ, లోహాన్నీ ఎవరయినా ఎలా ఆరాధిస్తారు? ప్రజలు అపోహలో వున్నారు, కేవలం సమయం వృధా చేసికుంటున్నారు’ అన్నాడు.*


*స్వామీజీ నవ్వుతూ స్పందించారు.*


*రాజు సహాయకుడిని అక్కడ గోడకి వ్రేలాడుతూ వున్న రాజు చిత్ర పటాన్ని క్రిందకు దించమన్నారు.*


*అయోమయం లో పడిన ఆ సహాయకుడు స్వామీజీ చెప్పినట్లే చేసారు.*


*అప్పుడు స్వామీజీ ఆ పటం పై వుమ్మివేయమని రాజు సహాయకుడిని ఆదేశించారు.*


*నిర్ఘాంత పోయిన సహాయకుడు రాజు వైపూ, స్వామీజీ వైపూ చూస్తూ ఉండిపోయాడు.*


*స్వామీజీ మళ్ళీ, మళ్ళీ ఆదేశించారు. ప్రతీ సారీ మరింత తీవ్రంగా ఆదేశించ సాగారు.*


*రాజు ఆగ్రహోద్రకుడవుతున్నాడు, సహాయకుడు వణికి పోతున్నాడు.*


*చివరికి సహాయకుడు ‘నేను ఈ పటం పై ఎలా ఉమ్మగలను? పటం లో వున్న చిత్రం లో    మా రాజు వున్నారు అంటూ అరిచాడు.*


*అప్పుడు స్వామీజీ ‘రాజు నీ ఎదురుగా వ్యక్తిగతంగా కూర్చుని వున్నారు. ఆ పటం లో వున్నది ఒక కాగితం మాత్రమే అది మాట్లాడలేదు, వినలేదు, కదలలేదు. కానీ నువ్వు ఆ పటం పై ఉమ్మి వేయనంటు న్నావు, ఎందుకంటే నువ్వు ఆ పటం లో నీ రాజు ని చూసుకుంటున్నావు కాబట్టి ఉమ్మి వేయనంటు న్నావు. ఆ పటం మీద ఉమ్మితే నీ రాజు మీద ఉమ్మినట్లని నువ్వు అనుకుంటున్నావు’ అన్నారు.*


*స్వామీజీ ని చూసిన రాజు సామీజీ ముందర సాష్టాంగ పడ్డాడు, స్వామీ చెప్పదలుచుకున్నది తనకి పూర్తిగా అర్ధమయిందని ఆ రాజు చెప్పాడు.*


*ఇదే విగ్రహారాధన యొక్క సారము.*


*భగవంతుడు అన్నిచోట్లా వున్నాడు. కానీ మనం ఆయనని పూజించాలను కుంటాము, కోరికలను కోరాలను కుంటాము, నివేదన చేద్దామను కుంటాము, కధలు చెప్పాలని అను కుంటాము, స్నానం చేయించాలని అనుకుంటాము, ఆడుకోవాలను కుంటాము.*


*మనం మన జీవితాలతో ఏమి చేస్తామో అన్నీ భగవంతునితో చేయించాలని అనుకుంటాము.*


*విగ్రహం రూపంలో వున్న భగవంతుని ఆకారాన్ని మనం మన సహచరుడు గానూ, మార్గ దర్శకునిగానూ, స్నేహితుని గానూ, రక్షకునిగానూ, ప్రసాదించే వానిగానూ, సాటి మనిషి గానూ భావించుకుంటూ ఉంటాము.*


*విగ్రహము మనం చూడగలిగే యదార్ధ  ప్రతినిధి.*


*నేను ఆ విగ్రహపు కన్నులలోనికి చూస్తున్నప్పుడు, నాకది రాయిలాగానో, లోహం లాగానో కనిపించదు. మరొక జత కన్నులు  ప్రేమతో నన్ను  నవ్వుతూ  చూస్తున్నట్లు అనిపిస్తుంది.*


*అద్భుతమైన సందేశం, దయచేసి చదవండి మరియూ పంచండి.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


: విగ్రహారాధన వ్యతిరేకించే వారికి ఈ msg ఒక కనువిప్పు కలగాలి

గుండెదడ , నీరసము

 గుండెదడ , నీరసము హరించుటకు సులభ ఔషధ యోగము  - 


       క్యారెట్ మెత్తగా దంచి రసము తీసి , 50 రసము నందు 20 గ్రాముల పటికబెల్లం చూర్ణము కలిపి పూటకు ఒక మోతాదు చొప్పున ఉదయము మరియు సాయంత్రం రెండు పూటలా తాగుచున్న గుండె దడ , నీరసం , నిస్సత్తువ హరించును . 


       పైన చెప్పిన సులభ యోగము వలే మరెన్నో అద్భుత సులభయోగాలు నేను రచించిన గ్రంథాల యందు సంపూర్ణముగా ఇచ్చాను. 


 

   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

        9885030034 


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


            9885030034

పండుగల గొప్పతనం

 _*మన పండుగల గొప్పతనం తెలుసుకోండి..........!!*_

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


 *ఉగాది:-*  కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.


 *శ్రీరామ నవమి:-* భార్య - భర్తల  అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.


 *అక్షయ తృతీయ:-* విలువైన వాటిని  కూడబెట్టుకోమని.


 *వ్యాస (గురు) పౌర్ణమి :-*  జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.


 *నాగుల చవితి;-* ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.


 *వరలక్ష్మి వ్రతం :-*  నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.


 *రాఖీ పౌర్ణమి:-* తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.


 *వినాయక చవితి ( నవరాత్రులు ) :-*  ఊరంతా ఒక్కటిగా కలవడానికి.


 *పితృ అమావాస్య:-* చనిపోయిన వారిని  ఎప్పటికి మరువకు అని చెపుతూ.


 *దసరా ( ఆయుధ పూజ)  :-* ఎప్పుడు నీకు అండగా  నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.


 *దీపావళి :-*  పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.


 *కార్తీక పౌర్ణమి :-*  చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.


 *సంక్రాంతి :-*   మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం,  అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.


 *మహాశివరాత్రి :-*  కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.


 *హోలీ :-*   వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు,  పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.


ఇవే కాక, ప్రతీ నెల వచ్ఛే

*👉రెండు ఏకాదశిలు*,

*👉సంకష్ట హర చతుర్థి*,

*👉మాస శివరాత్రి,*

*👉ప్రాదోశ వ్రతం,*

ఇలా చిన్న పెద్ద అన్ని పండుగలు, వ్రతాలు, మొదలగునవి..... 


 *👉ప్రతి హిందువు, ప్రతి పండక్కి, కష్టమైనా, తీరిక చేసుకొని, హిందూ సంప్రదాయాన్ని, భావితరాలకు, మీ పిల్లలకు గుర్తుండే విధంగా, వాళ్లతో కలిసి మెలిసి పండగ చేసుకోవాలని, మన పెద్దల ఆచారాన్ని, నమ్మకంతో పాటిస్తాం, తప్పకుండా జరుపుకుంటాం.*

 

*ఇదే మన ధర్మం గొప్పతనం*. *హిందువులమని గర్విద్దాము .* *హిందువులుగా జీవిద్దాము* .

🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐

సిరిసంపదలతో తులతూగేటప్పుడు

 *1978*

*కం*

సిరులను తులతూగునపుడు

సరిగానగుపడ దు జగము( రు హితులు) జనులకు నెపుడున్.

సిరిదరివీడగ జనులను

మరిగానక రాదు జగము(రారెవరును) మహిలో సుజనా.

*భావం*:-- ఓ సుజనా! సిరిసంపదలతో తులతూగేటప్పుడు జనులకు ప్రపంచం(శ్రేయోభిలాషులు) సరిగా కనబడదు(రు). అదే సిరిసంపదలు పోయినప్పుడు ఈ భూలోకంలో ఆ జనులను చూడటానికి ప్రపంచం రాదు ( ఎవ్వరూ రారు).

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



మహానుభావులారా! మీరు దేవతలు. సూర్యభగవానుడి పుత్రులు. సర్వజ్ఞులు. సురసమ్మతులు.

నావంటి సౌశీల్యవతిని మీరు ఇలా భావించడం తగదు. స్వయంగా ఇష్టపడి పెద్దల సమ్మతితో ఒక

యోగీశ్వరుణ్ణి పరిణయమాడాను. నేను అపమార్గం తొక్కలేను. సర్వలోకద్రష్ట సర్వకర్మసాక్షి అయిన

దివాకరుడికి పుత్రులై జన్మించిన మీరు ఇలా మాట్లాడకూడదు. సమంజసంకాదు. నేను కులస్త్రీని భర్తను

విడిచిపెట్టి పరుణ్ణి వరిస్తానా? ఈమాట అనడానికి మీకు నోరు ఎలావచ్చింది? అసారమైన ఈ సంసారంలో

ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో ఆమాత్రం తెలుసుకోలేకపోయారా? ఇక చాలు. సంతోషించాను మీ

తెలివితేటలకి. మర్యాదగా, వచ్చినదారిని వెళ్ళండి. లేదంటే శపిస్తాను. జాగ్రత్త. నేను సుకన్యను.

శర్యాతిమహారాజు కూతురిని. చ్యవనమహర్షి ఇల్లాలిని.


యథేచ్ఛం గచ్ఛతం దేవౌ శాపం దాస్యామి వానఘౌ |

సుకన్యాహం చ శర్యాతే: పతిభక్తిపరాగయణా॥

493

(5-6)

నాసత్యులు నివ్వెరపోయ ఈవిడే శపిస్తుందో చ్యవనుడే శపిస్తాడో అని భయపడ్డాడు.

తెలివిగా ఈవిడను ప్రసన్నురాలిని చేసుకుని తప్పించుకుందామని నిశ్చయించుకున్నారు.

+ దేవీమహిమతో పరీక్షలో నెగ్గిన సుకన్య

సాధ్వీమణీ! విజయం సాధించావు. నీ సౌశీల్యానికి ప్రసన్నులమయ్యాం. నీ శ్రేయస్సు కోరినవాళ్ళం.

ఏదైనా వరం కోరుకో. ఇస్తాం. మేము అశ్వినులం. దేవవైద్యులం. తెలుసుగదా! నీ భర్తను రూపయౌవన

సంపన్నుడైన యువకుడుగా మార్చేస్తాం. మాతో సమానుణ్ణి చేస్తాం. అప్పుడు మా ముగ్గురిలో నీ భర్తను 

గుర్తుపట్టి నీ చాతుర్యం చూపించు. సంతోషిస్తాం.

ఇప్పుడు ఆశ్చర్యపోవడం సుకన్యవంతు అయ్యింది. త్వరత్వరగా వెళ్ళి ఈ అద్భుతాన్ని తన 

భర్తకు విన్నవించింది. నాథా! ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? దేవమాయ దుర్భయమంటారు. ఇదేమన్నా

అశ్వినుల కపటోపాయమా? నాకేమీ తెలియడంలేదు. అంతా అయోమయంగా ఉంది. నువ్వు సర్వజ్ఞుడవు.

ఆజ్ఞాపించు. నువ్వు ఏమి చెయ్యమంటే అది చేస్తాను. నీ అభీప్సితమేమిటో తెలియజెయ్యి- అని అభ్యర్థించింది

Bhagavthgeeta yenduku


 

జ్ఞానమార్గంలో

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

ప్ర: జ్ఞానమార్గంలో ఉన్నవారు క్షేత్ర తీర్థయాత్రలు చేయాలా?

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

జ: 'మార్గం'లో ఉన్నారు కనుక, గమ్యాన్ని చేరడానికి తీర్థక్షేత్రయాత్రలు సహకరిస్తాయి. చిత్తశుద్ధి కలిగితే కానీ జ్ఞానం లభించదు. చిత్తశుద్ధికి తోడ్పడే నిత్యనైమిత్తికాది కర్మలతోపాటు, తీర్థక్షేత్ర యాత్రలు కూడా ప్రాముఖ్యాన్ని వహిస్తున్నాయి.

అంతేకాదు జ్ఞానసిద్ధిని పొందిన తరువాత కూడా జీవన్ముక్తులు పవిత్రభూముల్లో సంచరిస్తుంటారు. వారివలన తీర్థాలకు మరింత శక్తి కలుగుతుంది. జ్ఞాన, ధ్యాన, భక్తి సాధనల్లో దేనికైనా తీర్థక్షేత్రయాత్రలు సహకరిస్తాయి. పవిత్రక్షేత్రాదులలో సహజంగా ఉండేశక్తి, శీఘ్రంగా పాపక్షయం చేసి, సాధనను త్వరగా, పూర్ణంగా ఫలింపజేస్తుంది.

జ్ఞానమార్గగాములు, జ్ఞానసిద్ధిని పొందిన వారు మహాత్ములు శ్రీరమణమహర్షి అరుణాచల క్షేత్రానికి చేరడం, అక్కడే జ్ఞానసిద్ధినీ, నిర్యాణాన్నీ కూడా పొందడం- ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. యుగాలనుండి వివిధ ఆధ్యాత్మిక మార్గాల్లో సాధన చేసినవారు, సిద్ధి పొందినవారు - ఎందరో యోగులు, మహర్షులు, తపస్సులు తీర్థ క్షేత్రాలను ఆశ్రయించిన పురాణగాథలు ఎన్నో ఉన్నాయి. చారిత్రకంగా నేటికీ అందుకు తార్కాణాలున్నాయి. ఏ విధమైన ఆధ్యాత్మిక సాధనకైనా పుణ్యక్షేత్ర, తీర్థ యాత్రలు బలాన్నిస్తాయి, ఫలాన్నిస్తాయి అనడంలో సందేహం లేదు. దీనికి శాస్త్ర ప్రమాణమూ, మహాత్ముల అనుభవ ప్రమాణములూ ఉన్నాయి.

అతిథికి స్వాగతం

 *_𝕝𝕝ॐ𝕝𝕝 - సుభాషితమ్- 𝕝𝕝卐𝕝𝕝_* 


శ్లో𝕝𝕝 స్వాగతేనాగ్నయ స్తృప్తా ఆసనేన శతక్రతుః। 

పాదశౌచేన పితరః అర్ఘ్యాచ్ఛమ్భుస్తథాతిథేః॥


*--- _పఞ్చతన్త్రమ్_ ---*


తా𝕝𝕝 అతిథికి స్వాగతం పల్కడంతో అగ్ని, ఆసనదానంతో ఇంద్రుడు, పాదాలు కడుగడంతో పితృదేవతలు, అర్థ్యంతో (ఫల, పుష్ప నైవేద్యాదులచే) పరమేశ్వరుడు సంతోషం పొందుదురు...

Rendu naadulu


 

ప్రపంచం సరిగా కనబడదు

 *1978*

*కం*

సిరులను తులతూగునపుడు

సరిగానగుపడదు జగము జనులకు నెపుడున్.

సిరిదరివీడగ జనులను

మరిగానక రారెవరును(రాదు జగము) మహిలో సుజనా.

*భావం*:-- ఓ సుజనా! సిరిసంపదలతో తులతూగేటప్పుడు జనులకు ప్రపంచం సరిగా కనబడదు. అదే సిరిసంపదలు పోయినప్పుడు ఈ భూలోకంలో ఆ జనులను చూడటానికి ఎవరూ (ప్రపంచం) ఉండరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*