ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
1, జనవరి 2024, సోమవారం
తారల వెలుగు!*
*🌹🌹నూతన సంవత్సర శుభాకాంక్షలు*🌹🌹
వేదన వదన గతం పోయింది!
ఆశల పువ్వుల వర్తమానం పూసింది!
గగనం నుండి రంగుల పతంగి నెక్కి!
నవ్వుతు నింగినే అరచేతిలో పట్టుకుని!
నూత్న తేజస్సుతో వరాల మూట తెచ్చింది!!
నక్షంత్రాలను నేలకు దించ్చి!
ఆశలకు రూపం నిచ్చి!
క్రొత్త ఆశలతో మురిపించి!
గాయల గతాన్ని మరిపించి!
నేస్తమై బహుమతి తెచ్చింది!2024 సం"!!
*తారల వెలుగు!*
*పువ్వుల నవ్వు!*
*పున్నమి వెన్నెల!*
*ఆయురారోగ్యంలు తీసుకొని !*
*వరాల కిరీటమై వచ్చింది*!
*మీ కోసం పండుగల ప్రమిద క్రొత సం" 2024 !!*
మీకు, మీ కుటుంబానికి *నూతన సంవత్సర శుభాకాంక్షలు*...🌹🌹🌹🌹🌹🌹🌹🌹
హాస్య కథ//
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
//చిన్న హాస్య కథ//
"నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వకూడ ఇవ్వను" అని జమీందారు SV రంగారావు గద్దించాడు...
నీ డబ్బు నాకు అవసరం లేదు అని ఎన్టీఆర్ చెప్పాడు ...
నా పేరు కూడా ఎక్కడా వాడుకోకుండా బతికి చూపించు అని SVR సవాల్ చేశాడు ...
చూపిస్తాను అని ఎన్టీఆర్ తన భుజానికి ఉన్న కోటు అక్కడే పారేసి సావిత్రి తో కలిసి వెళ్లి పోతుంటే ....
ఏమండీ వాడు వెళ్ళిపోతున్నాడు అని అంజలీ దేవి ఏడ్చింది... SVR తల పక్కకి తిప్పుకున్నాడు శూన్యం లోకి చూస్తూ...
-----
కొంత కాలం గడిచింది...
-----
SVR భవనాన్ని వేలం వేస్తున్నారు...
నాగభూషణం చేసిన మోసంతో SVR రోడ్డున పడ్డాడు...
వేలం పాటలో ఒకరిని మించి ఒకరు వేలం పాడుతున్నారు...
అప్పుడే అక్కడికి కారు వచ్చి ఆగింది ... ముందు కాలు దిగింది... ఆ కారులో నుంచే వినిపించిన అంకె విని అంతా షాక్.... ఎవరు కూడా వేలంలో అతనితో పోటీ పడలేక పోయారు...
కారులోని ఎన్టీఆర్ తరపున పద్మనాభం సూట్ కేసు తెరిచి డబ్బులు ఇచ్చి భవనం కాగితాలు తీసుకున్నాడు...
అటు తర్వాత...
ఒకే షాట్ లో SVR, అంజలీ దేవి దేవుడి పటాన్ని పట్టుకొని కట్టుబట్టలతో భవనం నుంచి బయటకు వస్తుంటే... బయటి నుంచి SVR, అంజలీ దేవి ఫోటోతో ఎన్టీఆర్ భవనం లోపలికి వస్తున్నారు...
బాబూ అని అంజలీ దేవి ఎన్టీఆర్ ను దగ్గరికి తీసుకుంటే...
SVR గంభీరంగా ఇంత డబ్బు, ఇంత తక్కువ టైంలో నీకు ఎక్కడి నుంచి వచ్చింది ... తప్పు చేశావు కదూ!? అని నిలదీశాడు...
నీ కొడుకు తప్పు చేయడు నాన్నా... తప్పు చేయడు...
మరి ఈ డబ్బు ఎక్కడిది ?
ఇంటి నుంచి వెళ్ళాక ఎటు వెళ్లాలో ఏం చేయాలో తెలియలేదు... నిద్ర, తిండి లేని రోజులు గడిపాను...
చివరకు తెలంగాణకు వెళ్లి జెరాక్స్ సెంటర్ పెట్టి *"ప్రజా పాలన"* దరఖాస్తులు, ఆధార్ కార్డులు జిరాక్స్ తీసి ఇంత వాడిని అయ్యాను నాన్నా అని ఎన్టీఆర్ గర్వంగా చెప్పాడు....!
అప్పుడు SVR కూడా ఎన్టీఆర్ ను గుండెలకు హత్తుకున్నాడు...
ఇద్దరూ కడివెడు ఆనంద బాష్పాలు రాల్చారు.
చూసిన అంజలీ దేవి, విన్న సావిత్రి కూడా తమ కొంగులు పిండితే వరదలు వచ్చేలా ఆనంద బాష్పాలు రాల్చారు.
😂
సేకరణ:- శ్రీ రమణ గారి వాట్సాప్ పోస్ట్.
భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*ప్రథమ స్కంధము*
*వైరుల్ గట్టిన పుట్టముల్ విడువగా వారింప నావల్లభుల్*
*రారీవేళ ఉపేక్షసేయ దగవే? రావే? నివారింపవే?*
*లేరే? త్రాతలు కృష్ణ! యంచు సభలో లీనాంగియై కుయ్యిడన్*
*కారుణ్యంబున భూరివస్త్రకలితంగా చేయడే; ద్రౌపదిన్.*
పగవారు పరమనీచులు. నీతిమాలినవారు. గొప్పకులంలో పుట్టి గొప్పవారిని చేపట్టిన పరమ పవిత్ర అయినపాంచాలిని నిండుసభలో బట్టలను ఊడదీయటానికి ప్రయత్నించారు. అన్నా! కృష్ణా! నా భర్తలు ఈ నీచమైన పనిని నిలువరించటానికి రాకున్నారు. నీవు కూడా ఉపేక్ష చేస్తే ఎలా! రావయ్యా! ఈ ఘోరకృత్యాన్ని ఆపవయ్యా! నన్ను రక్షింపగలవారు ఇంకెవరూ లేరు కదయ్యా! అంటూ సభలో మొరపెట్టుకున్న ద్రౌపదికి అంతటా అన్నిటా అన్ని కాలాలలో ఉండే స్వామి ఆమెకు పెద్దయెత్తున వస్త్రాలనిచ్చి కాపాడాడు కదయ్యా!
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
శ్రీమద్భగవద్గీత
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
. *🌹శ్రీమద్భగవద్గీత🌹*
. *ప్రధమ అధ్యాయము*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
. *అర్జున విషాద యోగము*
. *శ్లోకము 8*
🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷
*శ్లోకము 8*
*భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ*
*కృపశ్చ సమితింజయః ।*
*అశ్వత్థామా వికర్ణశ్చ*
*సౌమదత్తిస్తథైవ చ ।।*
(భవాన్ — భీష్మః — చ — కర్ణః— చ — కృపః — చ — సమితింజయః — అశ్వత్థామా —వికర్ణ — చ — సౌమదత్తిః — తథా — ఏవ — చ)
భవాన్ — స్వయంగా మీరు; సమితింజయః — యుద్ధంలో విజయుడు; సౌమదత్తిః — భూరిశ్రవుడు (సోమదత్తుని కుమారుడు); తథా — ఈ విధంగా; ఏవ — కూడా; చ — మరియు.
*భావము:*
మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు - వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే.
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
. *శ్లోకము 9*
*శ్లోకము*
*అన్యే చ బహవః శూరా*
*మదర్థే త్యక్తజీవితాః ।*
*నానాశస్త్ర ప్రహరణాః*
*సర్వే యుద్ధవిశారదాః ।।*
అన్యే — ఇతరులు; చ
బహవః — చాలామంది;
శూరాః — వీర యోధులు;
మదర్థే — నా కోసం;
త్యక్త-జీవితాః — ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు;
నానా-శస్త్ర ప్రహరణాః — అనేక ఆయుధములు కలిగినవారు;
సర్వే — అందరూ;
యుద్ధ-విశారదాః — యుద్ద రంగంలో నిపుణులు..
*భావము:*
మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు - వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
. *🌹శ్రీమద్భగవద్గీత🌹*
. *ప్రధమ అధ్యాయము*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
. *అర్జున విషాద యోగము*
. *శ్లోకము 10*
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
*అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం।*
*పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం ।।*
*భావము:*
మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము, కానీ, భీముడిచే రక్షింపబడుచున్న పాండవసైన్యం పరిమితమైనది.
*వివరణ:*
దుర్యోధనుడి ప్రగల్భాలు సొంత గొప్పలు చెప్పుకునేవాడికి సాధారణమే. గొప్పలకు పోయేవారు, అంత్య కాలం సమీపించినప్పుడు, పరిస్థితిని నిజాయితీతో అంచనావేయకుండా అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు. భీష్ముడిచే రక్షింపబడుచున్న తనసైన్యం అపరిమితమైనది అన్నప్పుడే దుర్యోధనుడి దౌర్భాగ్యం తెలిసిపోతోంది.
భీష్మపితామహుడు కౌరవ పక్షానికి సర్వసైన్యాధ్యక్షుడు. తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి అతన్ని ఓడించటం చాలా కష్టం. పాండవపక్షం వైపు సైన్యాన్ని దుర్యోధనుడి బద్ధ శత్రువు అయిన భీముడు పరిరక్షిస్తున్నాడు. ఈ విధంగా దుర్యోధనుడు, భీష్ముడి సామర్ధ్యాన్ని భీముడి బలం తో పోల్చాడు. కానీ, భీష్ముడు కౌరవులకి, పాండవులకీ కూడా పితామహుడే, ఇరు పక్షాల క్షేమం కోరేవాడే. పాండవులపై అతనికి (భీష్ముడికి) వున్న ప్రేమ, తనను మనస్పూర్తిగా యుద్ధం చేయనివ్వదు. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మ వున్న ఈ పవిత్రయుద్ధంలో, భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా అధర్మ పక్షానికి గెలుపుని సాధించలేదు, అని భీష్ముడికి తెలుసు. కానీ, హస్తినాపుర వాసులకి, కౌరవులపట్ల తనకున్న నైతిక నిబద్ధత కారణంగా, భీష్ముడు, పాండవులతో ప్రతిపక్షంలో యుద్ధం చేయటానికి నిశ్చయించాడు. ఈ నిర్ణయం భీష్ముడి నిగూఢమైన వ్యక్తిత్వాన్ని తెలుపుతోంది.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*
🌷🌷🌷
*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - పంచమి - మఘా / పూర్వఫల్గణి - ఇందు వాసరే* *(01-12-2023)*
ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/drr8PtJqYcQ?feature=shared
🙏🙏
రాశిఫలాలు
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️
━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
*01-01-2024 / సోమవారం / రాశిఫలాలు*
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
మేషం
ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు తప్పవు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.
---------------------------------------
వృషభం
వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
---------------------------------------
మిధునం
నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోదాలుంటాయి. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధన వ్యవహారాలు అంతగా కలసిరావు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి.
---------------------------------------
కర్కాటకం
ఇంటాబయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులు సహాయంతో పనులు సకాలంలో పూర్తిచేస్తారు.
---------------------------------------
సింహం
ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి.
---------------------------------------
కన్య
వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చూడతారు. మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత ఋణాలు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి.
---------------------------------------
తుల
వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించిన ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.
---------------------------------------
వృశ్చికం
వృత్తి వ్యాపారాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. ఇంటాబయట ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పితృవర్గం వారితో మాట పట్టింపులుంటాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.
---------------------------------------
ధనస్సు
దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కాదు.
---------------------------------------
మకరం
వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది. గృహనిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఇతరుల అవసరానికి సైతం ధన సహాయం చేస్తారు.
---------------------------------------
కుంభం
ఆర్థిక వ్యవహారాలు ఆశజానాకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
---------------------------------------
మీనం
నూతన పెట్టుబదుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఉద్యోగమున చిన్న పాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడుతాయి.
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
🍁 *శుభం భూయాత్* 🍀