12, సెప్టెంబర్ 2020, శనివారం

*ధార్మికగీత - 18*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
                           
                                       *****
            *శ్లో:- పుస్తకం వనితా విత్తమ్ ౹*
                    *పరహస్తం గతం గతః ౹*
                    *అథ వా పున రాయాతి ౹*
                    *జీర్ణ భ్రష్టా చ ఖండశ: ౹౹*
                                     *****
*భా:- మానవ జీవిత వికాసానికి దేవుడిచ్చిన అపురూప వరాలు మూడు. పుస్తకము, వనిత , విత్తము. 1.పుస్తకము:- మన జన్మకు విజ్ఞానాన్ని , వివేకాన్ని,అర్థాన్ని, పరమార్థాన్ని చేకూర్చి, మోక్షమార్గమును చూపే సాధనము పుస్తకము. గురు శిష్యులకు చక్కని వారధి. అలాంటి పుస్తకం పరుల చేతికి పోతే రానేరాదు. వచ్చినా చినిగి, నలిగి, మాసిపోయి వస్తుంది. 2."వనిత":- గగనతలంలో రెపరెపలాడే గాలిపటం వంటి పురుషునికి, "నేర్పు" అనే సూత్రం కట్టి, ఓర్పుతో నియంత్రించే సూత్రధారి స్త్రీమూర్తి. బుద్ధికుశలతతో సంసారాన్ని చక్కదిద్దగల విదుషీ మణి. బాల్యంలో తల్లిదండ్రులు, యౌవనంలో భర్త, ముదిమిలో బిడ్డలు ఆమెకు సంరక్షకులు. అట్టి స్త్రీ గీత దాటితే జరిగే ఘోరాలు, నేరాలు వేరే చెప్పనక్కరలేదు. 3. "విత్తము":- "ధనమూలమిదం జగత్" అన్నారు. అన్ని అవసరాలను తీర్చేది డబ్బే. దాని వల్లే అన్ని అర్థాలు, అనర్థాలు కూడా. నెయ్యానికి,వియ్యానికి కయ్యానికి కారణం డబ్బే. ఆ డబ్బు చేయి దాటితే తిరిగి రానేరాదు. ఒకవేళ వచ్చినా ముక్కలు ముక్కలు గానే. ప్రతి ఒక్కరి జీవితంలో కీలకపాత్ర వహిస్తున్న యీ మూడు వరాల పాత్రను, పాత్రతను, పవిత్రతను, మూల్యాన్ని, ప్రాథమ్యాన్ని, పారమ్యాన్ని గుర్తించి చక్కని అవగాహనతో మెలగాలని, వినియోగంలో కృతకృత్యులు కావాలని సారాంశము.*
                                 *****
                  *సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: