కాకినల్లన పికమును కాకివోలు
భేదమేమి రెండింటను విడిగతెలియ?
ఆమనియె భూమికిన్ ప్రాప్తమైనయపుడు
కాకి కాకియౌ! కోకిల కోకిలగును.
నీచులనెపుడు ఆశ్రయమందినిలువరాదు
ఉన్నతుల ఆశ్రయించుటే ఉత్తమమయ.
హరుని భూషయై నాగమ్ము వెరపులేక
అరి గరుడుని క్షేమమ్మునే యడుగగలిగె.
విద్య తపము దానము జ్ఞానవృద్ధి శీల
సుగుణ ధర్మ శూన్యులు, కారె క్షోణిభార
భూతులైనట్టివార, లాపురుషులెపుడు
మనుజరూపులౌ మృగములు కనగమతిని.
(అనువదింపబడినవిమాత్రమే)
రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.
భేదమేమి రెండింటను విడిగతెలియ?
ఆమనియె భూమికిన్ ప్రాప్తమైనయపుడు
కాకి కాకియౌ! కోకిల కోకిలగును.
నీచులనెపుడు ఆశ్రయమందినిలువరాదు
ఉన్నతుల ఆశ్రయించుటే ఉత్తమమయ.
హరుని భూషయై నాగమ్ము వెరపులేక
అరి గరుడుని క్షేమమ్మునే యడుగగలిగె.
విద్య తపము దానము జ్ఞానవృద్ధి శీల
సుగుణ ధర్మ శూన్యులు, కారె క్షోణిభార
భూతులైనట్టివార, లాపురుషులెపుడు
మనుజరూపులౌ మృగములు కనగమతిని.
(అనువదింపబడినవిమాత్రమే)
రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి