12, సెప్టెంబర్ 2020, శనివారం

రామాయణమ్..59


...
రామా ! కులమునకు కళంకము తెచ్చే సామాన్య స్త్రీ ని కాను నేను !
.
నీవు తప్ప మరొకరిని మనస్సుచేత కూడా చూడను !
.
స్వయంతు భార్యాం కౌమారీమ్ ....నేను నీ భార్యను ,యవ్వనములో ఉన్నదానిని ,భార్యను ఇతరులకు అప్పగించి జీవించువాడివలే నన్నిక్కడ వదిలేసి వెళతావా?.
.
నీవు ఎవరి హితము గురించి మాటలాడుతున్నావో నీవే వారికి విధేయుడిగా ఉండు ! నేనెందుకుండాలి? నేనెవరికీ ఇచట విధేయురాలిగా ఉండవలసిన అవసరములేదు .అసలు అవి అయుక్తమైన మాటలు!.
.
నీవుండే చోటు నాకు స్వర్గము ,నీ సాన్నిధ్యము లేకపోతే నాకేదీ రుచింపదు ,.
.
మార్గంలో ముళ్ళు ఉంటాయంటావా ! అవన్నీ నాకు దూదితో సమానము ,పెనుగాలులు రేగి దుమ్ము కప్పి వేస్తుందంటావా నీ ప్రక్కన ఉంటే అదే నాకు మంచిగంధమవుతుంది రామా!.
.
వనములలో పచ్చికబయళ్ళమీద పడుకుంటే చిత్రమైన కంబళ్ళు కప్పిన పడకలకంటే సుఖము రామా ! నీ ప్రక్కన ఉంటే ప్రపంచంలో ఏదయినా నాకు అత్యంత సుఖకరమైనవే ! నన్ను నీవు ఇక్కడనే శత్రువుల పరంచేసి వెడతానంటే మాత్రము ఈక్షణమే ! ఇప్పుడే విషంతాగి చావనయినా చస్తాను కానీ వైరులవశం మాత్రంకాను...
.
నీవు అంతకాలం కనపడకపోతే దుఃఖంతో ఎప్పుడో ఒకప్పుడు చావవలసినదానినే ! ఆ చావు ఇప్పుడే నన్ను వరించనీ ! .
.
అని ఏడుస్తూ తనను కౌగలించుకొన్న సీత చుబుకము ఎత్తిపట్టి మెల్లగా ప్రేమగా అనునయిస్తూ నీవులేకుండా నేను మాత్రం ఒక్కక్షణమైనా ఉండగలనా ? నీ అభిప్రాయము తెలుసుకొకుండా నేను నిన్ను అడవికి ఎలా తీసుకెళతాను ?
.
ఆత్మాభిమానము కలవాడు తన కీర్తిని ఎలా విడువజాలడో ఆవిధముగా నేను నిన్ను విడువజాల!.
.
సీతా ! పితృవాక్పాలనము నా ధర్మము !
సీతా, తల్లికి ,తండ్రికి లొంగి ఉండటమే ధర్మము .
అలాంటి ధర్మాన్ని విడిచి నేను జీవించను.
.
కనపడే దేవతలు తల్లీ, తండ్రీ,గురువులు! అలాంటి వారిని విడిచి మనకు అందుబాటులో లేని దైవాన్ని ఆరాధించటమెందుకు?.
.
అస్వాధీనమ్ కధం దైవమ్ ప్రకారైరభిరాధ్యతే
స్వాధీనమ్ సమతిక్రమ్య మాతరం పితరం గురుమ్!.
.
తల్లి,తండ్రి,గురువులు ముగ్గురూ మూడులోకములు వీరితో సమానమైన వారు ఈ భూలోకంలో లేరు !అందుకే వారి సేవ చేయవలెను! .
.
తండ్రి సేవను మించిన బలకరమైనది ఏదీ లేదు! తండ్రి ఆజ్ఞ పాటించుటవలన మనిషికి సకలైశ్వర్యములు సమకూరగలవు! .
.
నా తండ్రి ఆజ్ఞ పాటించాలని ,ఆయన ఇష్టానికి అనుగుణంగా నడుచుకోవాలనీ నేను కోరుకుంటున్నాను! ఇదే సనాతన ధర్మము!.
.
సీతా నీవు నాకు సహధర్మచారిణివి ! నీవు నాకూ,నీకూ మేలుకూర్చే మంచి నిర్ణయము తీసుకొన్నావు !
.
వెంటనే బయలుదేరదాము ! నీ వద్ద ఉన్న విలువైన వస్తువులన్నీ దానం చేసెయ్ !..
.
ఇంతకు మునుపే రామాంతఃపురమునకు వచ్చిన లక్ష్మణుడు అన్నావదినల సంభాషణ అంతా విన్నాడు..
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: