12, సెప్టెంబర్ 2020, శనివారం

అలభ్యయోగం

🙏
తిథుల ప్రకారం అలభ్యయోగం.‌


వైశాఖీ కార్తీకీ మాఘీ
తిథయో౭ తీవ పూజితాః!
స్నాన దాన విహినాస్తా
ననేయాః పాండునందన!!

అన్ని పూర్ణిమల్లోకి మఘ, కార్తీక, వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతొ ఉత్కృష్టమైనవి.

మాఘ పూర్ణిమ నాడు " అలభ్య యోగం " అని కూడా అంటారు.
అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా
అది గొప్ప యోగ మవుతుంది.
అది అంత తేలికగా లభించేది కాదు.
ఈ సమయములో ఇష్టదేవతారాధన, ధ్యాన జపాది అనుష్టానాలు మహిమాన్వితమైన ఫలాన్ని ఇస్తాయి.

స్నానదాన జపాది సత్కర్మలు లేకుండా వృథాగా
ఈ మూడు మాసాలు పూర్ణిమలను
 వ్యర్ధంగా గడుపరాదుని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.🙏

కామెంట్‌లు లేవు: