20, ఫిబ్రవరి 2021, శనివారం

తేనె గురించి సంపూర్ణ వివరణ - 2 .

 తేనె గురించి సంపూర్ణ వివరణ - 2 . 


       అంతకు ముందు పోస్టు నందు తేనె యందలి రకాలు మరియు తేనె సేవించటం వలన తగ్గు వ్యాధుల గురించి వివరించాను. ఇప్పుడు మీకు తేనెలోని రకాల గురించి మీకు వివరిస్తాను. 


 * అర్ఘ్యం అను తేనె - 


        ఇది పెద్దజాతికి చెందిన కొన్ని తేనెటీగల చేత పెట్టబడును. పసుపుపచ్చ రంగులా కనిపించును . వగరు రుచి కలిగి ఉండును. కొంచం చేదు రుచి అనిపించును . ఇది చాలా బలాన్ని ఇచ్చును . వాతము , పిత్తము , శ్లేష్మము మూడింటిని హరించును . 


 * చాద్రం అనే తేనె - 


         ఇది చూచుటకు పసుపు వర్ణం కలిగి కొంచం నలుపు వర్ణం కలగలసి ఉండును. మామూలు తేనె కన్నా ఇది చాలా చిక్కగా , తీపి ఎక్కువ కలదిగా ఉండి రక్తపిత్త రోగములు , పిత్త రోగములు , క్రిమిరోగములు పోగొట్టును . మందుల అనుపానముకు ఇది అత్యంత శ్రేష్టం అయినది. ఇది హిమత్పర్వత ప్రాంతముల యందు లభ్యం అగును. తక్కిన ప్రాంతముల యందు లభించుట అత్యంత కష్టసాధ్యం . ఇది ఎక్కువ మోతాదు తీసుకోరాదు అతిదాహామును పుట్టించును . 


  * చిన్నపువ్వు తేనె - 


          ఒక విధమగు చెట్లలో మామూలు తేనెటీగలు గాక ప్రత్యేకమైన ఒక జాతి ఈగలచే తేనెతుట్టె పెట్టబడును. ఇది మామూలు తేనె వలే ఉండక పలుకులు పలుకులుగా ఉండును. ఎలాంటి మేహరోగములు అయినను ఇది తగ్గించును . నాలుకకు రుచి లేకపోవటం , చర్ది , మధుమేహము వంటి సమస్యలను దూరం చేయును . ఈ తేనెను కొందరు "మధుశర్కర" అని పిలుస్తారు . అమితమైన తియ్యగా ఉండును. వాతము , మేహము , ఉన్మాదము , గ్రహణి రోగములను , రక్తపిత్త రోగములను జయించును. చాలా శ్రేష్టమైనది . దొరుకుట దుర్లభము . 


      తరవాతి పోస్టు నందు మరికొంత విలువైన సమాచారం మీకు అందిస్తాను. నేను రచించిన గ్రంథముల యందు మరింత విలువైన సమాచారం ఇవ్వడం జరిగింది . 


     గమనిక -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కామెంట్‌లు లేవు: