20, ఫిబ్రవరి 2021, శనివారం

❤*అన్నదానం*❤ "ఏమండీ!! ఒక్క నిమిషం!! ఆగండి... ప్యాకింగ్ చేయడం అయిపోయింది. ఇదిగో నండీ ఈ పార్సిల్ తీసుకెళ్ళండి" హడావిడిగా తడిచేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ బయటకు వచ్చి పురుషోత్తంకు కవరు అందించింది సుశీల... "సూర్యభగవానుడు ఒకరోజు అయినా తూర్పున ఉదయించడం మర్చిపోతాడేమెా!! కానీ నువ్వు మాత్రం ఈ పార్సిల్ చేసిన కవరు నాకివ్వడం మర్చిపోవుకదా!!" "అసలు ఇంతమంచి అలవాటు నీకున్నందుకు, మనం తినేదానిలో ఒక్కరికి అయినా అన్నం పెట్టి మనం తినాలని ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఆచరిస్తున్నందుకు నీకు అభినందనలు సుశీలా"!! "నన్ను పొగడ్తలతో ముంచకండి!! మీకు ఆఫీసుకు టైమ్ అయింది మీరు వెళ్లండి"!! అంటూ సుశీల నవ్వుకుంటూ లోపలకి వెళ్లి పోయింది... పురుషోత్తం ఆఫీసుకు వెళుతూ దారిలో ముసలివాడు కనిపిస్తే అతనికి అన్నం కవరు ఇచ్చి ఆఫీసుకు వెళ్లి పోయాడు.. పెళ్లి అయిన కొత్తలో "నీకేం కావాలో చెప్పు? ఏంకావాలన్నా కొంటాను? ఎంత ఖరీదైన దయినా ఫరవాలేదు"? అని పురుషోత్తం పదిసార్లు అడిగితే అప్పుడు మెుహమాటపడుతూ "నేను ఏం అడిగినా కాదనకూడదు మరి నా కోరిక విని నవ్వకూడదు"అని ముందే షరతు విధించింది. సుశీల... అడిగిన కోరిక విని మతిపోయినంత పని అయింది. ఖరీదైన నగలు చీరలు కోరుకుంటుంది లేదా విదేశాలకు తీసుకెళ్ల మంటుందని ఊహించాడు కానీ ఇంత గొప్ప...కోరికా! అని ఆశ్చర్య పోయాడు పురుషోత్తం... "ఏమండీ!! చిన్నప్పుడు మా బామ్మగారు చెప్పేవారు అన్ని దానాలలో అన్నదానం గొప్పదని!! అది నా మనసులో నాటుకు పోయింది నేను రోజూ ఒకరికయినా అన్నదానం చేయాలి. నా ఒంట్లో ఓపిక వున్నంతవరకూ నేను చేయగలిగినన్ని రోజులు ఎవరో ఒకరికైనా అన్నం పెట్టాలి. ఇదీ నా కోరిక ఒప్పుకుంటారా" !! ఇది నేను కలలో కూడా ఊహించలేదు. ఎంత గొప్ప కోరిక కోరావు సుశీలా!! తప్పకుండా ఆచరిద్దాం. "భగవంతుడు దయవలన మనకి ఆర్థిక ఇబ్బందులు లేవు. మీరు ఉద్యోగంలో మంచి పొజిషన్ లో వున్నారు. ఒకరికి అన్నం పెట్టినంత మాత్రాన మన ఆస్థులు ఏమీ తరిగిపోవు ఏమంటారు మీరు"? "నువ్వు ఇంత మంచి పని చేస్తానంటే నేను ఎందుకు కాదంటాను. తప్పకుండా అలాగే చేద్దాం"!! పురుషోత్తం ఆనందంగా ఒప్పుకున్నాడు... ఒక్కక్క సారి మంచి చేసినాకూడా చెడు ఎదురు పడుతుంది అంటారు. అది నిజమే అన్పిస్తుంది. ఒకోసారి భోజనం టైమ్ వరకు ఎదురు చూసినా ఎవరు దొరికేవారు కాదు. ఎవరికైనా భోజనం పెడితేగానీ భోజనం చేయననేది సుశీల. పెడదామంటే ఎవరూ దొరికేవారు కాదు..అప్పుడు పక్క అపార్ట్మెంట్ వాచ్ మేన్ ని పిలిచి భోజనం పెట్టి తను తినేది. ఆ వాచ్ మేన్ తాగుబోతు ఎప్పుడూ మత్తులోనే వుండేవాడు... ఇది చూసి పురుషోత్తం ఒక ఐడియా చెప్పాడు "నేను ఆఫీసు కు వెళ్లే టైమ్ కి వంట ఎలాగా అయిపోతుంది. అన్నీ పేక్ చేసి ఇచ్చేయి. బైక్ లో వెళుతూ ముసలివారు గానీ అంగవైకల్యం గల వాళ్లు పని చేయడానికి శక్తి లేనివాళ్ళు ఆకలితో వున్న వాళ్లు గానీ కనిపిస్తే ఇస్తాను. నువ్వు కూడా టైమ్ కి భోజనం చేసేయచ్చు అని చెప్పి ఒప్పించాను ".. "అప్పుడు ఈ ఐడియా బావుంది కానీ మీకు ఇబ్బంది అవుతుంది కదా"!! అంది. "నాకేం ఇబ్బంది లేదు నువ్వు చేసే పని ముందు నాదెంత"!! అని సుశీలని ఒప్పించి అప్పటి నుంచీ పార్సిల్ చేసి తీసుకెళ్లి ముసలివారికి,అంగవైకల్యం వున్న వారికి, చిన్న పిల్లల తల్లులకు, పిల్లలకు ఇవ్వడం చేయసాగాడు పురుషోత్తం... రెండు విస్తరాకులు ఒకదాని మీద ఒకటి వేసి ఇద్దరికి సరిపడా అన్నం పెట్టి లాక్డ్ కవర్లలో కూర ఒక కవరు, సాంబారు లేక రసం ఒక కవరులో, పచ్చడి లేక ఆవకాయ ఒక కవరు, ఆకుకూర పప్పు ఒక కవరు, పెరుగు ఒక కవరు,ఒక వాటర్ బాటిల్ ఇవన్నీ దేనికి దానికి సెపరేట్ గా పేక్ చేసి ఒక కవరులో పెట్టి ఇవ్వడం మెుదలు పెట్టింది. ఆ భోజనం తిన్నవారు ఎవరైనా సరే కడుపు ఫుల్ గా నిండి పోవలసిందే !! నెలకి నాలుగు ఆదివారాలు మిగతా సెలవు దినాల్లో పనిమనిషికి పెట్టేది. పండగలలో మాత్రం వీధులు తుడిచేవాళ్లని, పనిమనిషి కుటుంబాన్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పిల్లలకు బట్టలు చీరలు దుప్పట్లు కొని ఇచ్చేది సుశీల... సుశీల చేసిన ఏ పనికి అడ్డు చెప్పేవాడు కాదు పురుషోత్తం. తనకోసం ఏనాడు నగలు చీరలు కొనమని అడిగేది కాదు.. సుశీల డెలివరీకి పుట్టింటికి వెళ్లి నపుడు మాత్రం సుశీల అత్తగారు వంటచేసి పేక్ చేయడం చేసేవారు. అమ్మా! నీకు ఇబ్బందిగా వుంటే మానేయమ్మా! అని కొడుకు అంటే కోడలు మెుదలు పెట్టిన మంచి కార్యక్రమాన్ని మనం మానేయడమెందుకు ? మనకోసం వండిన పదార్థాలే కొంచెం ఎక్కువ వండుతున్నాను. ఇందులో నాకు శ్రమ ఏముంది అని ఆవిడ కూడా వండిన అన్ని పదార్థాలు పేక్ చేసి ఇచ్చేవారు... ఆ అన్నదానం ఫలితమే అనుకుంటా! వాళ్ల పిల్లలు ఇద్దరు మంచి చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని మంచి జీవిత భాగస్వామిని పొంది చీకూచింత లేకుండా సంతోషంగా జీవితంలో స్ధిరపడ్డారు. "అలా మేలు జరుగుతుందో,లేదో తెలియదు కానీ... ఒక ప్రాణమైతే మాత్రం నిలుస్తుంది కదా మిత్రమా.."🤔 ఈ లాంటి కుటుంబాలు మనకందరికి ఆదర్శ ప్రాయం మిత్రులారా....🙏🙏

 ❤*అన్నదానం*❤

  "ఏమండీ!! ఒక్క నిమిషం!! ఆగండి...

ప్యాకింగ్ చేయడం అయిపోయింది. ఇదిగో నండీ ఈ పార్సిల్ తీసుకెళ్ళండి" హడావిడిగా తడిచేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ బయటకు వచ్చి పురుషోత్తంకు కవరు అందించింది సుశీల...


   "సూర్యభగవానుడు ఒకరోజు అయినా తూర్పున ఉదయించడం మర్చిపోతాడేమెా!! కానీ నువ్వు మాత్రం ఈ పార్సిల్ చేసిన కవరు నాకివ్వడం మర్చిపోవుకదా!!"


  "అసలు ఇంతమంచి అలవాటు నీకున్నందుకు, మనం తినేదానిలో ఒక్కరికి అయినా అన్నం పెట్టి మనం తినాలని ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఆచరిస్తున్నందుకు నీకు అభినందనలు సుశీలా"!!


  "నన్ను పొగడ్తలతో ముంచకండి!! మీకు ఆఫీసుకు టైమ్ అయింది మీరు వెళ్లండి"!! అంటూ సుశీల నవ్వుకుంటూ లోపలకి వెళ్లి పోయింది...


  పురుషోత్తం ఆఫీసుకు వెళుతూ దారిలో ముసలివాడు కనిపిస్తే అతనికి అన్నం కవరు ఇచ్చి ఆఫీసుకు వెళ్లి పోయాడు..


  పెళ్లి అయిన కొత్తలో "నీకేం కావాలో చెప్పు? ఏంకావాలన్నా కొంటాను? ఎంత ఖరీదైన దయినా ఫరవాలేదు"? అని పురుషోత్తం పదిసార్లు అడిగితే


  అప్పుడు మెుహమాటపడుతూ "నేను ఏం అడిగినా కాదనకూడదు మరి నా కోరిక విని నవ్వకూడదు"అని ముందే షరతు విధించింది.


  సుశీల... అడిగిన కోరిక విని మతిపోయినంత పని అయింది. ఖరీదైన నగలు చీరలు కోరుకుంటుంది లేదా విదేశాలకు తీసుకెళ్ల మంటుందని ఊహించాడు కానీ ఇంత గొప్ప...కోరికా! అని ఆశ్చర్య పోయాడు పురుషోత్తం...


   "ఏమండీ!! చిన్నప్పుడు మా బామ్మగారు చెప్పేవారు అన్ని దానాలలో అన్నదానం గొప్పదని!!


  అది నా మనసులో నాటుకు పోయింది నేను రోజూ ఒకరికయినా అన్నదానం చేయాలి. నా ఒంట్లో ఓపిక వున్నంతవరకూ నేను చేయగలిగినన్ని రోజులు ఎవరో ఒకరికైనా అన్నం పెట్టాలి. ఇదీ నా కోరిక ఒప్పుకుంటారా" !!


  ఇది నేను కలలో కూడా ఊహించలేదు. ఎంత గొప్ప కోరిక కోరావు సుశీలా!! తప్పకుండా ఆచరిద్దాం.


  "భగవంతుడు దయవలన మనకి ఆర్థిక ఇబ్బందులు లేవు. మీరు ఉద్యోగంలో మంచి పొజిషన్ లో వున్నారు. ఒకరికి అన్నం పెట్టినంత మాత్రాన మన ఆస్థులు ఏమీ తరిగిపోవు ఏమంటారు మీరు"?


  "నువ్వు ఇంత మంచి పని చేస్తానంటే నేను ఎందుకు కాదంటాను. తప్పకుండా అలాగే చేద్దాం"!! పురుషోత్తం ఆనందంగా ఒప్పుకున్నాడు...


  ఒక్కక్క సారి మంచి చేసినాకూడా చెడు ఎదురు పడుతుంది అంటారు. అది నిజమే అన్పిస్తుంది. ఒకోసారి భోజనం టైమ్ వరకు ఎదురు చూసినా ఎవరు దొరికేవారు కాదు.


   ఎవరికైనా భోజనం పెడితేగానీ భోజనం చేయననేది సుశీల. పెడదామంటే ఎవరూ దొరికేవారు కాదు..అప్పుడు పక్క అపార్ట్మెంట్ వాచ్ మేన్ ని పిలిచి భోజనం పెట్టి తను తినేది. ఆ వాచ్ మేన్ తాగుబోతు ఎప్పుడూ మత్తులోనే వుండేవాడు...

 

  ఇది చూసి పురుషోత్తం ఒక ఐడియా చెప్పాడు "నేను ఆఫీసు కు వెళ్లే టైమ్ కి వంట ఎలాగా అయిపోతుంది. అన్నీ పేక్ చేసి ఇచ్చేయి. బైక్ లో వెళుతూ ముసలివారు గానీ అంగవైకల్యం గల   వాళ్లు పని చేయడానికి శక్తి లేనివాళ్ళు ఆకలితో వున్న వాళ్లు గానీ కనిపిస్తే ఇస్తాను. నువ్వు కూడా టైమ్ కి భోజనం చేసేయచ్చు అని చెప్పి ఒప్పించాను "..


  "అప్పుడు ఈ ఐడియా బావుంది కానీ మీకు ఇబ్బంది అవుతుంది కదా"!! అంది. "నాకేం ఇబ్బంది లేదు నువ్వు చేసే పని ముందు నాదెంత"!! అని సుశీలని ఒప్పించి అప్పటి నుంచీ పార్సిల్ చేసి తీసుకెళ్లి ముసలివారికి,అంగవైకల్యం వున్న వారికి, చిన్న పిల్లల తల్లులకు, పిల్లలకు ఇవ్వడం చేయసాగాడు పురుషోత్తం...


  రెండు విస్తరాకులు ఒకదాని మీద ఒకటి వేసి ఇద్దరికి సరిపడా అన్నం పెట్టి లాక్డ్ కవర్లలో కూర ఒక కవరు, సాంబారు లేక రసం ఒక కవరులో, పచ్చడి లేక ఆవకాయ ఒక కవరు, ఆకుకూర పప్పు ఒక కవరు, పెరుగు ఒక కవరు,ఒక వాటర్ బాటిల్ ఇవన్నీ దేనికి దానికి సెపరేట్ గా పేక్ చేసి ఒక కవరులో పెట్టి ఇవ్వడం మెుదలు పెట్టింది. ఆ భోజనం తిన్నవారు ఎవరైనా సరే కడుపు ఫుల్ గా నిండి పోవలసిందే !!


  నెలకి నాలుగు ఆదివారాలు మిగతా సెలవు దినాల్లో పనిమనిషికి పెట్టేది. పండగలలో మాత్రం వీధులు తుడిచేవాళ్లని, పనిమనిషి కుటుంబాన్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పిల్లలకు బట్టలు చీరలు దుప్పట్లు కొని ఇచ్చేది సుశీల...


  సుశీల చేసిన ఏ పనికి అడ్డు చెప్పేవాడు కాదు పురుషోత్తం. తనకోసం ఏనాడు నగలు చీరలు కొనమని అడిగేది కాదు..


  సుశీల డెలివరీకి పుట్టింటికి వెళ్లి నపుడు మాత్రం సుశీల అత్తగారు వంటచేసి పేక్ చేయడం చేసేవారు.

  అమ్మా! నీకు ఇబ్బందిగా వుంటే మానేయమ్మా! అని కొడుకు అంటే కోడలు మెుదలు పెట్టిన మంచి కార్యక్రమాన్ని మనం మానేయడమెందుకు ? మనకోసం వండిన పదార్థాలే కొంచెం ఎక్కువ వండుతున్నాను. ఇందులో నాకు శ్రమ ఏముంది అని ఆవిడ కూడా వండిన అన్ని పదార్థాలు పేక్ చేసి ఇచ్చేవారు...


  ఆ అన్నదానం ఫలితమే అనుకుంటా! వాళ్ల పిల్లలు ఇద్దరు మంచి చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని మంచి జీవిత భాగస్వామిని పొంది చీకూచింత లేకుండా సంతోషంగా జీవితంలో స్ధిరపడ్డారు.

   "అలా మేలు జరుగుతుందో,లేదో తెలియదు కానీ... ఒక ప్రాణమైతే మాత్రం నిలుస్తుంది కదా మిత్రమా.."🤔

          ఈ లాంటి కుటుంబాలు మనకందరికి ఆదర్శ ప్రాయం మిత్రులారా....🙏🙏

కామెంట్‌లు లేవు: