ఇంట్లో మగవాడి కర్తవ్యం:
1) స్టవ్ మీదున్న కుక్కర్ వేసే 3 విజిల్స్ లెక్కబెట్టి 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేయడం.
2) స్టవ్ మీద పెట్టిన పాలు పొంగబోయే ముందే తెలివిగా స్టవ్ ఆఫ్ చేయడం.
3) డోర్ బెల్ అటెండ్ అవ్వడం.
4) అటకపైన పెట్టిన సామాను కిందికి దించడం.
5) గట్టిగా మూత బిగించినవి తీసివ్వడం.
6) సాస్, జామ్ మూతలు ఓపెన్ చేసి ఇవ్వడం.
7) ఇంట్లో బల్లి, బొద్దింకలవంటి భయంకరమైన జీవులను కొట్టి బయట పడేయడం.
8) సిలెండర్ ఖాళీ అయిన వెంటనే మార్చడం.
9) భార్య చెపితే మాత్రమే పిల్లలను తిట్టి కంట్రోల్ చేయడం.
10) డోర్ దగ్గర పడి ఉన్న న్యూస్ పేపర్ వెంటనే చదివేయాలి లేదంటే,'పేపర్ మానేద్దాం, చదవరు పెట్టరు డబ్బు వేస్ట్ ' అని నిందిస్తుంది.
11) షాపింగ్ చేసేటప్పుడు నసపెట్టకుండా భార్య వెంట ఏ షాప్ అంటే ఆ షాపులోకి వెళ్లి కొన్నదానికి నోర్ముసుకొని బిల్ పే చేయడం.
12) ఇంట్లో చిన్న చిన్న ఎల్కట్రిక్ ప్లంబింగ్ పనులు చేయడం.
13) టాయిలెట్ క్లీన్ చెయ్యటం
14) తనని అందంగా ఉన్నావని పొగుడుతూ ఉండటం
15) సీరియల్స్ నడిచేటప్పుడు నిశ్శబ్దముగ ఉండటం
16)ఫోన్ బిల్లులు, ఇంటర్నెట్ బిల్ సరిఅయిన టైం కి కట్టి తనకు కోపము రాకుండా చూసుకోవడం
17) కూరగాయలు తరిగి ఇవ్వటం
18) కొబ్బరికాయ పీచు తీసి ఇవ్వటం
19) అయిదు వందలు, రెండు వేలు నోట్లకు క్షణాల్లో చిల్లర తెచ్చి పెట్టటం
20) మళ్ళీ ఒక్కో సారి, తనకు పర్సు లో తేలిగ్గా ఉండటానికి వందనోట్లన్నీటి బదులు పెద్ద నోట్లు ఏర్పాటు చేసి పెట్టటం.
ఈ 20 పనులు చక్కగా నిర్వహించడం భర్త కర్తవ్యం.🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి