శ్రీ వినాయక
మిత్రులార/తెలుగు భాషాభిమానులారా
పిన్నలకు శుభ అశీస్సులు, పెద్దలకు నంస్కారములు. మన అంధ్ర రాష్ట్రములో మన మాతృభాష అయిన తెలుగు కను మరుగు అవుతున్న తరుణములో మన తెలుగు ఉనికిని కాపాడుటకు నా వంతుగా నేను స్వల్ప ప్రయత్నము చేయు చున్న వాడను.
మీరు తెలుగు భాషాభి మానులా? మీరు తెలుగు మాధ్యమములో చదువు కున్నారా? మీకు తెలుగు అంటే చాలా మక్కువ గా ఉందా? మీకు తెలుగులో పద్యములు చంధో బధ్ధముగా వ్రాయదలచు కున్నారా ? అయితే ఇదిగో మీకు ఒక చక్కని అవకాశము.
తెలుగు మొలకలు అను వాట్సప్ సమూహము ద్వారా నేను మన తెలుగు రాష్ట్రములోను మరియు ఇతర రాష్ట్రములొని తెలుగు భాషాభిమానులకు ఉచితముగ 2019 సెప్టెంబరు నుంచి ఉచితముగా పద్యములు వ్రాయుట నేర్పుతున్నాను. ఇప్పటి వరకు అరవై మంది పైగా తెలుగు ఉపాధ్యాయులు కూడా నేర్చుకున్నారు ఇది పూర్తిగా ఉచితము ఏమి డబ్బు కట్ట నవసరము లేదు సుమారుగా 100 రోజుల ప్రణాళిక ఈ వంద రోజులలో మీరు చందోబధ్ధముగా పద్యములు వ్రాయుట మొదలు పెట్ట గలరు . ఇది ఖచ్చితము. ఇప్పటికి అయిదు జట్లు (బ్యాచిలు) అయిపోయాయి. ఆరవ జట్టు మే నుంచి మొదలు అగును. మీరు నేర్చుకోదలచుకున్న నాకు అభ్యర్ధన పత్రము వెంటనే పంప గలరు. ఇప్పటి వరకు జరిగిన అయిదు జట్లలో సుమారుగా 45 మంది శతకములు వ్రాయు స్ధాయికి వచ్చారు.
పద్యములు నేర్చు కొనుటకు అర్హతలు
మీ వయసు కనీసము 20 సం దాటి ఉండాలి
గరిష్ట వయో పరిమితి లేదు.
పదవ తరగతి వరకు తెలుగు మీడియములో చదివి ఉండాలి.
రోజు ఒక గంట కష్ట పడ గలగాలి
వాట్సప్ మాధ్యమము ద్వారా నేర్ప బడును.
ఒక నిర్ధిష్ట మైన సమయము లేదు.
మీరు ఉద్యొగస్తులు గాని ఏ ఇతర వ్యాపకములు ఉన్న వారైనా చేరవచ్చు
ఒక నిర్దిష్ట సమయములో వాట్సప్ లో ఖచ్చితముగా ఉండవలసిన అవసరము లేదు
నేను నేర్పు పాఠములు వాట్సప్ ద్వారా మీకు ఖాళీగా ఉన్న సమయములో చూసుకొనవచ్చు
కాని రోజు ఖచ్చితముగా ఒక గంట కష్ట పడాలి
వారమున కొక సారి జూమ్ ద్వారా వీడియో క్లాసులు ( సుమారుగా ఒక గంటన్నర)నిర్వ హించ బదును
మీరు పై నియమములు పాటించ దలచు కున్న చక్కగా పద్యములు నేర్చు కోవచ్చు. మరొక మారు తెలుపుతున్నాను ఇది పూర్తిగా ఉచితము. దీనితో బాటు జత పరచిన అభ్యర్ధన పత్రము చూసి దాని ప్రకారము స్వంత దస్తూర్తి తో అభ్యర్ధన పత్రము వ్రాసి ఒక పోటో తీసి నా వాట్సప్ నెంబరుకు పంప వలెను
ఒక సమూహమునకు 25 మంది మాత్రమే అవకాశము ఉండును ఆవశ్యక్యత ను బట్టి కొందరికి సడలింపు ఇవ్వ గలను. మీ అభ్యర్ధన పత్రము నా కార్యాలయములో నమోదు చెసుకొనుటకు మీరు వెంటనె అభ్యర్ధన పత్రము పంప వలెను
ఆరవ జట్టు మే ఒకటి నుంచి మొదలు అగును మీ అభ్యర్ధన పత్రములు చేఱుటకు అఖరు తేది 15/4/21 మాత్రమే తర్వాత వచ్చిన అభ్యర్ధన పత్రములు సప్తమ జట్టు (బ్యాచి)కు పరిగణించగలను.
పూసపాటి కృష్ణ సూర్య కుమార్
చిత్ర బంధ కవి గుంటూరు
5/4/21
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి