_*శ్రీరమణీయం* *-(137)*_
🕉🌞🌎🌙🌟🚩
_*"నా ప్రమేయం లేకుండా నా శరీరంలో జరిగే పనులకు కర్త ఎవరు ?"*_
_*అది తెలుసుకునేందుకే ఆత్మవిచారణ ! ఆధ్యాత్మిక సాధనలోని కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాలన్నీ ఆత్మవిచారణలో సమన్వయాన్ని పొందుతాయి. "యోగః కర్మసు కౌశలం" అనే ఉపదేశంలో 'కర్మలోని కౌశలమే యోగం' అనే అర్థం ఇమిడి ఉంది. కర్తవు నీవు కాదని గుర్తించటమే నిజమైన కౌశలం. అప్పుడే ఫలం కోసం ఎదురు చూడని పనులను మనం చేయగలుగుతాం. శరీరంతో చేసే పనులన్నీ మనవేనని భావిస్తూ కర్తృత్వాన్ని పెంచుకుంటాం. మన ప్రమేయం లేకుండా శరీరంలో జరిగే అనేక పనులకు మనం కర్తలం కాదు. ఆకలి, నిద్ర, శ్వాస, హృదయ స్పందన ఇవన్నీ మన ఆధీనంలో లేనప్పుడు శరీర క్రియలు మాత్రం మనవి ఎలా అవుతాయి ? ఇక్కడ కర్తృత్వమే అజ్ఞానంగా ఉంది. అంటే ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునే జ్ఞానం లేకుండా పోయింది అన్న మాట !*_
_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_
_*'ఆత్మవిచారణతో అన్ని మార్గాలు సమన్వయం !'*-
🕉🌞🌎🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి