7, ఏప్రిల్ 2022, గురువారం

మనం చేసిన మంచే!

 మనం చేసిన మంచే!

మనకి చేదుగా మారి

ఎదురు తిరుగుతున్న వేళ!

మనో రంగాన విషాదం

వరదలై పొంగుకొస్తున్న వేళ!

ఆత్మీయతలో ఇంత చేదు

దాగుందని అంతరంగం

గుర్తెరుగుతున్న వేళ!

శోధిస్తున్నా పరిష్కారం కోసం!

సాగిలపడుతున్నా!

ఆ దైవం ముందు!

అయినా!...

నాకు తెలియక అడుగుతున్నా!

దేవుడే పగబడితే !

మరి ఇక దిక్కెవ్వరు మనిషికని!

దోస పాటి.సత్యనారాయణ మూర్తి

సామర్లకోట

9866631876

కామెంట్‌లు లేవు: