*_ఉద్ధరేదాత్మ నాత్మానం_*
*ఎవరి మంచి చెడులకు వారే కారణం*
*ఉద్ధరేదాత్మ నాత్మానం*
*ఆత్మాన మవసాదయేత్*
*ఆత్మైవ హ్యాత్మోనో బంధుః*
*ఆత్మైవ రిపురాత్మనః*
*మన మనసు కున్న శక్తితో మనలను మనమే ఉద్ధరించు కోవాలి. అంతే తప్ప నాశనం చేసుకో కూడదు. మన మనసే మనకు చుట్టం. అదే మనకు శత్రువు కూడా అవుతుందని అంటుంది భగవద్గీత.*
*అర్థమయ్యేలా చెప్పు కోవాలంటే...తల్లి దండ్రులైనా, గురువులైనా, శ్రేయోభిలాషులైనా.. మన మంచి కోరి, మంచి మాటలు చెబుతారు. కొందరు మిత్రులుగా, బంధువులుగా మనం పక్కనుంటూ మన చెడు కోరుకునే వారు చెడ్డ దారులు పట్టిస్తారు.*
*మంచి మాటలు వినాలా చెడు మార్గంలో సాగాలా? అనే నిర్ణయం తీసుకోవాల్సింది మనం మాత్రమే.*
*మన ఇంద్రియాలు తరచుగా మనల్ని తప్పు దోవల్లోకి లాక్కు పోతాయి. వాటికి లొంగి పోయామా.. పతనం తప్పదు!*
*వాటిని మన అదుపులో పెట్టుకుంటేనే మనం జయిస్తాం. ఇది జీవిత రహస్యం.*
*విజయం సాధించడాని కైనా, ఓడిపోవడాని కైనా మూల కారణం మనమే. చాలా మంది తమ ఓటములకు, తాము జీవితంలో ఎదగక పోవడానికి ఇతరులే కారణమని చెబు తుంటారు.*
*మరి కొందరేమో.. పరిస్థితుల ప్రభావం అంటుంటారు.*
*తరచిచూస్తే.. చాలా మంది విజేతల కుటుంబ పరిస్థితులు మన కంటే ప్రతి కూలంగా ఉంటాయి. కానీ వారు ప్రతీ దాన్నీ తమకు అనుకూలంగా మార్చు కుంటారు. ప్రతి ఓటమిని, ప్రతికూల పరిస్థితులను కూడా సోపానాలుగా మార్చు కుంటారు. దీనికి కారణం.. వారికి ఉండే వివేక జ్ఞానం!*
*ఈ ప్రపంచాన్ని ఒక్కసారి గమనించి నట్లయితే ఎన్నో అద్భుతాలు గోచరిస్తాయి.*
*అచేతనాలుగా పరిగణించ బడే రాళ్లు, రప్పలు మొదలు కొని ప్రాణమున్న జీవుల్లో గొప్పవాడనిపించు కున్న మానవుడి దాకా అంతా ప్రపంచమే. రాళ్లు, రప్పలకు అసలు ప్రాణమే ఉండదు. పశు పక్ష్యాదులకు ప్రాణం, జ్ఞానం ఉన్నా.. ఆ జ్ఞానం వాసనా జ్ఞానమే కానీ, వివేకం ఉండదు. వివేకంతో కూడిన జ్ఞానం ఉండేది ఒక్క మనుషులకే. అంత గొప్ప సామర్థ్యం ఉన్న మనిషి ఎప్పుడూ నిరాశ చెందకూడదు. చిన్న చిన్న వైఫల్యాలకు కుంగిపోకూడదు.*
*ఆ వైఫల్యాలకు ఇతరులను, పరిస్థితులను కారణంగా చూప కూడదు. ఈ ప్రపంచంలో మానవులుగా పుట్టినందుకు.. వివేకంతో కూడిన జ్ఞానాన్ని కలిగి ఉన్నందుకు మనం ఎంతో అదృష్ట వంతులం.*
*పంచ భూతాలు మనకు అనేక రకాలుగా ఉపయోగ పడుతున్నాయి. ఎన్నో రకాల ప్రాణులు మన జీవనాన్ని సుఖ మయం చేస్తున్నాయి.*
*ఇన్ని అనుకూల పరిస్థితులు ఉన్న మనిషి స్వశక్తిని నమ్ముకుని మనసా, వాచా, కర్మణా కృషి చేస్తే సాధించ లేనిది ఏదీ లేదు. ఆధ్యాత్మిక ఉన్నతికైనా.. జీవితంలో పురోగతికైనా అదే ముఖ్యం!*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి