సంస్కృతీవైభవమ్!
*జ్యేష్ఠ మాసమంటే ....*
1జ్యేష్ఠులకు వివాహము చేయవచ్చునా ?
సమాధానం.వధువు , వరుడు ఇద్దరు జ్యేష్ఠులు అయినప్పుడు నిరభ్యంతరముగా వివాహము చేయవచ్చు . జ్యేష్ఠమాసము లో వివాహము జరిపించ కుండా మిగిలిన మాసములలో జరిపించవచ్చు . . కానీ త్రి జ్యేష్ట కాకూడదు .
2 . త్రి జ్యేష్ఠఅంటే ఏమిటి ?
సమాధానం.వధూ వరులు ఇద్దరు { మొదటి సంతానము} జ్యేష్టు లైనపుడు జ్యేష్ట మాసమునందు వివాహము చేయకూడదు ఇద్దరిలో ఏ ఒక్కరూ జ్యేష్ఠనక్షత్రము లో గానీ , జ్యేష్ఠమాసము నందు గానీ , జన్మించి ఉండకూడదు .
ఈ విధముగా త్రి జ్యేష్ఠను తెలుసుకోవాలి .
౩. ఒకే రాశి లో గానీ , ఒకే నక్షత్రములో గానీ జన్మించిన వారికి పెండ్లి జరపవచ్చా ?
సమాధానం.ఒకే రాశిలో వేర్వేరు నక్షత్రములలో పుట్టిననూ , ఒకే నక్షత్రములో వేర్వేరు రాశులలో జన్మించిననూ వివాహము చేయవచ్చును . ఒకే నక్షత్రములో జన్మించిననూ పాదముల తేడా ఉన్నప్పుడు పెండ్లి జరిపించ వచ్చు .
4 . కొంతమంది జాతకములు చూసుకొని సంబంధములు కుదుర్చుకొంటారు.జాతకము ఒకరికి ఉండి మరొకరికి లేనప్పుడు ఏంచెయ్యాలి ?
సమాధానం.జాతకములు వదూవరులకు ఇద్దరికీ ఉన్నప్పుడు వారియొక్క జన్మ నక్షత్రముల ప్రకారమే వివాహ లగ్నము నిర్ణయించుకోవాలి .వరుని జన్మ నక్షత్రము వధువు నామ నక్షత్రము కలిపి వివాహలగ్నం నిర్ణయించ వచ్చు . నామ నక్షత్రము కూడా సరిపడక పొతే వధువుకు పేరు మార్చి అనుకూలమైన పేరు పెట్టి వివాహము చేయవచ్చు . కానీ ఎట్టి పరిస్థితులలోనూ వరుని నామము మార్చకూడదు .
5. ఇక్కడ చాలామందికి అనుమానము వస్తుంది . అమ్మాయి పేరే ఎందుకు మార్చాలి . అబ్బాయి పేరు ఎందుకు మార్చకూడదు .అని .?
సమాధానం.ఎందుకంటే భారతీయ వివాహ వ్యవస్థలో వివాహం జరిగిన తరువాత స్త్రీ కి ఇంటి పేరు మారుతుంది . అదేవిధముగా పిలుపు పేరు కూడా మార్చుకో వచ్చునని తెల్పితిరి .
6. సొంత అన్న తమ్ములకు ఒకే ముహూర్తములో వివాహము చేయవచ్చునా ?
సమాధానం.అన్న తమ్ములకు ఒకే ముహూర్తములో వివాహము చేయకూడదు .
ఆరు మాసముల తేడా ఉండాలి . తెలుగు సంవత్సరముల ప్రకారము ఉగాది ముందు వచ్చే మాఘ , పాల్గుణ మాసములలో ఒకరికి , ఉగాది తరువాత వచ్చే వైశాఖ, జ్యేష్ట మాసములలో మరియొకరికి వివాహము చేయవచ్చు ఒకే తల్లికి జన్మించిన స్త్రీ పురుషులకు ఈ సూత్రము వర్తించదు . ముందు కుమార్తె వివాహముచేసి ఆతరువాత ఎప్పుడైనా కుమారుని వివాహము చేయవచ్చు .🙏🙏🙏🌷👌👌
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి