🌸
*శ్రీ రామచన్ద పరబ్రహ్మణే నమః*
*సీతారామాంజనేయ సంవాదము.*
*ప్రథమాధ్యాయము*
*భాగము - 10*
కం.ఆ దత్తాత్రేయ గురు
శ్రీ దివ్య పదారవింద, సేవాది శ్రీ మోదుఁడు ప్రత్యక్ష ప్ర
హ్లాదుం దిన శ్రీ జనార్ధ : నాహ్వయుఁ డొప్పు.
తాత్పర్యము:
శ్రీ దత్తనాధుని కరుణాపాత్రుడు, అభినవ ప్రహ్లాదుడని చెప్పుకొను వీలయిన ఆచార్యుడు, "జనార్ధను"డను పేరుగల పుణ్యమూర్తి శ్రీ దత్తనాథుని శిష్యనిగా విరాజిల్లుతున్న
దివ్యమూర్తికి వందనం.
కం.తన సౌశీల్యము శాస్త్ర చింతనము నా
త్మజ్ఞానముం జూచి హె చ్చినకూర్మి న్నిజదివ్య రూపములతో
శ్రీ భారతీ మోక్ష కా
మిను లే తెంచి యహర్నిశంబుఁదను
నె మ్మిం గొల్వఁగా శ్రీ జనా
ర్ద నయోగీశ్వరుఁ డొప్పె నెల్లెడ నవి ద్యాధ్వంత మార్తాండుఁ డై.
తాత్పర్యము.
పరమపుణ్యుడైన జనార్ధుని చూచి, అతడు తన అయి వుండునని లక్ష్మి కాదు తన పతియని పార్వతి, కాదు కాదు నా పతి యని సరస్వతి,
తను తమ రూపములో శ్రీ గురుసేవకు వచ్చారు.
ఇది అజ్ఞానముచే వచ్చిన మాయగా, శ్రీ గురువులు తమ శిష్యులకు జ్ఞాన, ధర్మ మార్గములను బోధించు
శ్రీ గురువులని, తమదీ ఆ శిష్యుల చిత్తమేనని తరలిపోయారు.
కం. ఆ జనార్దన గురున క ; త్యద్భుతముగ శ్రీమదేకోగురుస్వామి ; శిష్యుఁ డయ్యె మును వసిష్ఠ మహామునీం ద్రునకు నర్థి దాశరథి భక్తుఁ డైన చం; దంబు దనర.
తాత్పర్యము.
అటువంటి దివ్యమూర్తి జనార్ధనులకు "ఏకో గురుమూర్తి" గురుమూర్తి కంటే అన్యము లేదను తత్వమూర్తి వశిష్ఠునకు రామునివలె శిష్యుడయ్యాడు. ఈ ఏకోగురువునకు సర్వము తన గురువులు శ్రీ జనార్ధనులవారే.
*సేకరణ : సకల దేవత సమాచారం గ్రూపు.*
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి