16, ఆగస్టు 2023, బుధవారం

76 సంవత్సరాల స్వతంత్ర భారతం -

 ॐ 76 సంవత్సరాల స్వతంత్ర భారతం - 

                ఆత్మవిమర్శ చేసుకొనే విషయాలు  


2. రాజ్యాంగ ప్రవేశిక - "సామ్యవాద, లౌకిక" పదాల చేర్పు 


అ) రాజ్యాంగ సభ అమోదించిన 26/11/1949 తేదీనగానీ,     

     అమలులోకి వచ్చిన 26/1/1950 తేదీనగానీ, 

     ప్రవేశికలో 

"సర్వసత్తాక 

 ప్రజస్వామ్య 

 గణతంత్ర రాజ్యం" అని మాత్రమే ఉంది. 


ఆ) "సామ్యవాద, లౌకిక" అనే రెండు పదాలూ, 

    

    సర్వసత్తాక గణతంత్ర దేశమైన తరువాత 26 సంవత్సరాలకి,  

    1976 అత్యవసర పరిస్థితిలో, 

    42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చుకొన్నాం. 


* అంటే, రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 నుండీ 24 సంవత్సరాల కాలం, ఈ సవరణ జరిగేంతవరకూ, మన దేశం లౌకిక (Secular) రాజ్యం కాదు. 


ఇ) మధ్యలో వచ్చిన ఆ పదాలు పౌరులు అంగీకరించారా? 


    ఈ రెండు పదాలూ, అధికార పార్టీ ప్రవేశపెట్టి, పార్లమెంటుద్వారా సవరణ చేసింది. 

    ఈ మార్పు తేనున్నట్లు ఆ పార్టీ, అంతకుముందెప్పుడూ, తమ ఎన్నికల ప్రణాళికలలో తెలుపలేదు. 

    వెంటనే 1977లో జరిగిన ఎన్నికల్లో, ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 

     అప్పుడు, ఆ సవరణని ప్రజలు తిరస్కరించినట్లే కదా! 

     కొత్త ప్రభుత్వం 43 రాజ్యాంగ సవరణ ద్వారా, 42వ సవరణలోని వాటిని అనేకం రద్దుచేసినా, 

    ఈ రెండు పదాలూ తొలగించే విధంగా సవరింపబడక, అలాగే ఉంచబడ్డాయి. 

    మరి ఆ పదాల చేరికకి ఏ విధంగా పవిత్రత ఉన్నట్లు ? 


ఈ) విచిత్రం ఏమంటే, రాజ్యాంగ ప్రవేశికలో, ఈ రెండు పదాలూ, 

    సవరణవలన చేర్చబడినట్లు కనబడక, 

    మొదటినుంచీ ఉన్నవి అన్నవిధంగా కనిపిస్తాయి.  


ఉ) మధ్యలో వచ్చిన, ఆ రెంటి వలనా 

  - ఏదైనా ఉపయోగం ఉందా? 

  - ఇబ్బందులేనా? 

  - సవరణ ముందుకీ, అనంతరమూ మార్పువల్ల ఫలితం బేరీజువేసుకొన్నామా? 

    అనే విషయాలు విశ్లేషించుకోవాలి కదా! 


                                  సశేషం


              భారత్ మాతాకీ జై 

                వందే మాతరమ్  


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

కామెంట్‌లు లేవు: