*భారతరత్న మన వాజపేయి కి ఘనతర నివాళి*
శా॥
ధీరత్వమ్మున సాటిలే రమలమౌ తేజమ్మునన్ రారు ధీ
శూరత్వమ్మున నిల్వబోరు ఘన వాక్శోభలన్ బోల రే
రీ రాజ్యాంగవిచారసారమతు లీ శ్రీలన్ విచారించగా
వారాహీసమ! *వాజపేయి!* వినుత దీవ్యచ్ఛుభాకారుడా! ~1
మ॥
కలలోనైనను దల్వ జంకు, మదిలో కంపమ్ము, నిద్రాస్థలిన్
చెలితో నుండగ భీతిభావనలు, వాసింగాంచని యాలోచనా
కీలలున్, ఏ ప్రతిపక్షవర్గమునకున్ కేళిం గొనం దిప్పలున్
విలువల్ నిండిన *వాజపేయి* నిలువన్ పెన్ సింగమై కన్పడన్ ~2
*కవితాభారతి*
*~శ్రీశర్మద*
8333844664
(శేషభాగం మధ్యాహ్నం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి