🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 13*
నరేంద్రుని దివ్య దర్శనాలలో ఒకటి బుద్ధ దర్శనం దానిని స్వామి వివేకానంద వచనాలలో విందాం...
"బడిలో చదువుకొంటున్న రోజుల్లో ఒకసారి గది తలుపులు గడియ పెట్టి ధ్యానం చేసుకొంటున్నాను. మనస్సు ఏకాగ్రత చెందివుంది. ఆ స్థితిలో ఎంతసేపు ఉండిపోయానో తెలియదు. ధ్యానానంతరం ఆసనం మీద కూర్చున్నాను. అప్పుడు ఆ గది దక్షిణపు గోడ నుండి తేజో విరాజమానుడైన ఒక వ్యక్తి వచ్చి నా ముందు నిలబడ్డాడు. ప్రశాంతతే మూర్తీ భవించిన ఒక సన్న్యాసి ఆయన.
ఆయన ముఖారవిందం నుండి అద్భుత ప్రకాశం ప్రసరిస్తున్నది. ఆయన దివ్యమయ ముఖమండలం అనిర్వచనీయ ప్రశాంతతతో ఒప్పారుతూ, శాంత సముద్రాన్ని పోలివుంది. శిరోముండనం గావించుకొని చేత దండ కమండలాలు ధరించి ఉన్నాడు. నాతో ఏదో చెప్ప నభిలషిస్తున్నట్లు నన్నే తదేకంగా చూస్తూ కాసేపు నిలబడ్డాడు. నేను చేష్టలుదక్కి కూర్చుని ఉండి పోయాను.
హఠాత్తుగా ఏదో తెలియరాని భయం నన్ను ఆవరించింది. తక్షణమే ఠక్కున లేచి, గది తలుపు తెరచుకొని బయటికి పరుగెత్తాను. కాని ఆ తరువాత అలా పలాయనం చిత్తగించడం మూర్ఖత్వమనీ, లేకపోయుంటే ఆయన నాతో ఏదో చెప్పివుండేవారనీ భావించాను.
ఆ తరువాత ఆయన దర్శనం నాకు కలుగ లేదు. ఈసారి ఆయనను దర్శించగలిగితే భయపడకుండా ఆయనతో మాట్లాడాలని అనేకసార్లు అనుకొన్నాను. కాని మళ్లీ ఆయన నా వద్దకు రానేలేదు..... బహుశా బుద్ధుడై ఉండవచ్చునని ఇప్పుడు అనుకొంటున్నాను.”🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి