🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 53*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*విభక్తత్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా*
*విభాతి త్వన్నేత్ర త్రితయ మిద మీశానదయితే |*
*పునస్ర్సష్టుం దేవాన్ ద్రుహిణ హరి రుద్రానుపరతాన్*
*రజ స్సత్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివ ‖*
ఈశ్వరుడి ప్రియురాలా (ఈశానదయితే)
కాటుక అలదుకొన్న(లీలాంజన తయా) నీ త్రినేత్రములు
ఏ ఏ వర్ణములను వెలారుస్తున్నాయి?
తెలుపు, నలుపు, ఎరుపు రంగులను కలిగి వున్నాయి. ఆరోగ్యవంతమైన కన్నులలో సన్నని ఎర్రజీర ఉండటం సహజం. అయితే ఇక్కడ ఈ వర్ణములు పగలు, రాత్రి, సంధ్యా సమయాలుగా, సత్త్వ రజస్తమో గుణాలకు ప్రతీకలుగా వాటిని నియంత్రించే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా సూచింపబడుతున్నాయి.
ఈ త్రిమూర్తులను నీవే నియంత్రిస్తున్నానని చెప్పటానికన్నట్లుగా ఈ వర్ణములను నీ కళ్ళలో చూపిస్తున్నావు తల్లీ!
ఆమె కన్నులనుండే సృష్టి, స్థితి, లయాలు జరుగుతున్నాయి. కనురెప్ప తెరిస్తే సృష్టి, మూస్తే లయ. ఆవిడ మాత్రం సాక్షీభూతురాలై చూస్తూ ఉంటుంది జగత్తును. *ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః* అని లలిత సహస్రనామాల్లో అమ్మవారి ఒక నామం.
సత్వ గుణం (బ్రహ్మ)
*క* కారము గానూ,
రజః గుణం (విష్ణు)
*అ* అకారము గానూ,
తమో గుణం (రుద్ర)
*మ* కారము గానూ చెప్పబడుతాయి.
ఈ మూడింటినీ
క + అ +మ = కామ
అమ్మవారు *అక్షి* (కన్ను) యందు ఉంచుకొని నియంత్రిస్తుంది కనుక ఆవిడ కామాక్షి.
శ్రీ కామాక్షై నమః🙏🏻.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి