14, అక్టోబర్ 2023, శనివారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||

రెండేళ్ళ తరవాత మళ్ళీ గర్భం ధరించాను. సర్వశుభలక్షణ సంయుతుడై మళ్ళీ మగపిల్లవాడే

జన్మించాడు. ఇతడికి సుధన్వుడని పేరు పెట్టారు.

ఇలా నాకు మొత్తం పన్నెండుమంది మగపిల్లలు కలిగారు. వాళ్ళ ఆలనాపాలనలతో నేను

పూర్తిగా సమ్మోహంలో మునిగిపోయాను. ఆ తరవాత మరో ఎనిమిదిమందిని ప్రసవించాను. నా గార్హస్థ్య

జీవితం పరిపూర్ణంగా చరితార్థమయ్యిందని సంబరపడ్డాను. ఎంతగానో మురిసిపోయాను.

యుక్తవయస్సులు రాగానే అందరికీ యథాక్రమంగా వివాహాలు జరిపించాము. కోడళ్ళతో

మనుమలూ మనుమరాండ్రతో నిరంతరం కోలాహలంగా జీవితం గడిచింది. ఒక్కొక్కసారి వీళ్ళకి

చిన్నచిన్న అనారోగ్యాలు చెయ్యడం దానికి నేను విలవిలలాడిపోవడం, మరొకప్పుడు వీళ్ళలో వీళ్ళు

కలహించుకోవడం, నేను బాధపడటం. కోడళ్ళ తగువులు. మనుమళ్ళ గిల్లికజ్జాలు. మనుమరాండ్ర

ఆటపాటలూ, సుఖదుఃఖాల సమ్మిశ్రంగా సాగుతున్న సంసారమహార్ణవంలో నిండా మునిగిపోయాను.

పూర్వపు విజ్ఞానమూ శాస్త్రజ్ఞానమూ అంతా మరుగున పడిపోయింది. స్త్రీస్వభావంతో ఇంటి

పనుల్లో తలమునిగిపోయాను. నాలో ఒక అహంకారం బయలుదేరింది. నా పుత్రులు మహాబలశాలులు.

నా కోడళ్ళు గుణవంతురాండ్రు. నా మనమలూ మనమరాండ్రూ ఆరోగ్యవంతులు. ఈ లోకంలో నాకన్నా

ధన్యురాలెవరు? ఇలాంటి ఆలోచనలతో అహంకరించానే తప్ప, అయ్యో! నేను నారదుణ్ణి కదా,

భగవంతుడు వంచించాడు. ఇలా ఆడదానినై సంసారకూపంలో పడిపోయానుగదా అని ఏనాడూ

విచారించలేదు. అటువంటి ఆలోచనే రాలేదనలు. కృష్ణద్వైపాయనా! నేను మహారాజ్ఞిని. శుభాచారను.

బహుపుత్రవతిని పతివ్రతను. పరమధన్యురాలనుకదా అనుకుంటూ సంసారసమ్మోహమే పొందాను.

నారదో ఽహం భగవతా వంచితో మాయయా కిల |

న కదాచి న్మయాప్యేవం చింతితం మనసా కిల ॥

రాజపత్నీ శుభాచారా బహుపుత్రా పతివ్రతా |

ధన్యాహం కీల సంసారే కృష్ణైవం మోహితస్త్యహమ్ ॥ (29 - 39, 40

కామెంట్‌లు లేవు: