కార్తీక మాస విశేషాలు 3
పుట్టలో పాలు పోయడానికి సంతానం కలగడానికి సంబంధమేమిటి ?
పాములందు అనేక జాతులున్నాయి. మనము నాగు పామును మాత్రమే పూజిస్తాము. వేరు పాములను పూజించము. పాములకు కాళ్ళు లేవన్న సంగతి అందరికి తెలిసిందే. పాములు తమ పొట్టతో చలించును. వాని జననేంద్రియములు పొట్ట అడుగు భాగమున ఉండును. సామాన్యముగా ఇవి తమ వర్షకాలము చలి కాలములో మాత్రమే లైంగిక క్రియ జరుపును, ఆడపాము ఈ కాలమందు గర్భము ధరించి ఎండాకాలము నాటికి గ్రుడ్లు పెట్టును. ఆ ఎండ వేడికి అవే పిల్లలగును. లైంగిక క్రియకు పాల్గొను సమయానికి ముందు ఆడ పాములకు ఋతు స్రావము జరుగును. దీనిని re productive cycle అని చెప్పుదురు. ఈ కాలములో ఇవి ప్రాకునప్పుడు చలించునప్పుడు విసర్జించబడు రజస్సు భూమికి చేరును. అందును పుట్టపై ఇవి ప్రాకుతూ ప్రవేశము చేయునప్పుడు పుట్ట మన్ను ఈ రజస్సును పీల్చుకొనును. ఇదే విధముగా మగ సర్పపు వీర్యము కూడా అది చలించునప్పుడు పుట్టకు అంటుకొనును. ఈ విధంగా పుట్టను పెట్టే white ants (చెదలు) నోటి జలము సర్పముల వీర్యము రజస్సుల చే తడపబడిన పుట్టమట్టి మన్నుకు నీరు గాని పాలు తేనే గాని తగిలిన ఒక సుమధురమైన వాయువు ఉత్పన్నమగును. ఈ వాయువు సేవనము చే మనుష్యుని మనస్సుపై శరీర ఆరోగ్యముపై మంచి ప్రభావము కలుగుటయే కాక జననేంద్రియములపైనను (re productive organs)పై మంచి ప్రభావం పడును. నాగుపాము సంపర్కము పొందిన పుట్ట మన్ను నందు ఉన్న దీని ప్రభావం వలన మనుజులకు సంతానోత్పత్తి జరుగుతున్నట్లు తెలియ వచ్చుచున్నది. ఆయుర్వేద శాస్త్రములో కూడా నాగు పాము కుబుసముతో వైద్యము చేసి సంతానం కలగకుండా కారణమయ్యే దోషాలను ననివారించు ప్రక్రియ కలదు.
ఈ విధమైన శాస్ర్రీయ దృక్పధముతోనే సంతానము లేని వారికి పుట్టకు పూజచేయించే ఆచారాన్ని మన మహర్షులు మనకు అందించారని గ్రహించ వచ్చు (ఆధారం- ఆచారాలు శాస్త్రీయత)
శుభం భూయాత్ !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి