17, నవంబర్ 2023, శుక్రవారం

మూడున్నరాంధ్రులు

 మూడున్నరాంధ్రులు-  


అప్పట్లో  అనగా 1950  లలో  మన నెహ్రూ గారికి  చైనా అంటే పిచ్చి ప్రేమ ఉండేది .. ఆలా మనకు వారికీ సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని తెలపడానికి హిందీ చీనీ భాయి భాయి అంటూ నినాదాన్ని కూడా లేవనెత్తారు . చివరకు అది మన దేశం యొక్క పుట్టి ముంచి  దాదాపు 90 , 000  ఎకరాల  భౌమిని చైనా పాలయ్యేలా చేసింది అది వేరే కథ అనుకోండి . 


నెహ్రూ గారికి సోషలిజం మీద ఉన్న అవ్యాజానురాగ ప్రేమతో మన భారత దేశం నుండి సాంస్కృతిక రాయ భార సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసి  చైనా కి పంపారు. అందులో పద్నాలుగు మంది సభ్యులు . వీరంతా చైనాకి వెళ్లి అక్కడ వేరు వేరు ప్రాంతాలలో అక్కడి అధికారులు, మంత్రులను కలవడం మనకూ చైనా కు అనాదిగా వస్తున్న సంబంధాన్ని గూర్చి వివరించడం వీరు చేసే పని.


ఆ రాయబార సంఘములో  మన తెలుగు వెలుగు దుర్గాబాయమ్మ  , సూరి భగవంతం,  చలపతిరావు  మరియు మన దేశ స్వతంత్ర  సమరయోధురాలు  సరోజినీ నాయుడు కుమార్తె లీలా నాయుడు కూడా అందులో సభ్యులు.


లీలా నాయుడు పద్మజా నాయుడు చెల్లెలు అని గుర్తు తెచ్చుకోండి.. ఆమె బెంగాల్ తరపున వెళ్లారు. సరోజినీ నాయుడు భర్త గోవిందరాజుల నాయుడు తెలుగువారు కాబట్టి అలా లీలా నాయుడు మన తెలుగింటి అమ్మాయే .. కానీ ఆమె బెంగాల్ కి ప్రాతినిధ్యం వహించడం  వలన   ఆమె సగం ఆంధ్రురాలు.  అలా మన దేశం నుండి  వెళ్లిన భారతీయ సాంస్కృతిక రాయబార సంఘములో సభ్యులు అత్యధికులు అంటే పదనాలుగురులో మూడున్నర ఆంధ్రులు  మన తెలుగు వారు కావడం యాదృచ్చికమో ఏమో గానీ అది మన అందరికీ గర్వకారణం. 


నేడు మన తెలుగులు   కులరాజకీయుల  గోలలో పడి భాషను సంస్కృతిని ఏనాడో విస్మరించారు  - ఇంక ముందు ముందు మంచి రోజులు వస్తాయన్న ఆశా లేదు.  నేడు పాలకుల మూర్ఖత్వం వలన తెలుగు సంసృతియే కాదు భాషకు కూడా దుర్దినాలు ఆరంభం అయ్యాయి.  తెలుగు తల్లీ ఏవీ నిరుడు కురిసిన హిమసమూహమ్ములు - నేడు  ఐక్యతా శూన్యతతో ఒక సరి అయిన మార్గదర్శనం లేక కొట్టు మిట్టాడుతున్నారు అవశేషాంధ్ర   తెలుగులు .

కామెంట్‌లు లేవు: