🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *భాగం 89*
శ్రీరామకృష్ణులు అవతార పురుషుడనే విషయాన్ని పరీక్షించాలనే ఆలోచన నరేంద్రునిలో తలెత్తింది....... ఆ రోజు భరించరాని నొప్పితో శ్రీరామకృష్ణులు తల్లడిల్లిపోతున్నారు. ' 'శారీరక వ్యాధి వలన ఇంతగా తల్లడిల్లిపోతున్న ఈ స్థితిలో కూడా ఆయన తమను అవతారపురుషునిగా వచించే పక్షంలో, ముమ్మాటికీ ఆయన అవతారపురుషులేనని నమ్ముతాను' అని నరేంద్రుడు అనుకొన్నాడు.
ఇలా అతడు అనుకోవడమే ఆలస్యం, పడక మీద పడుకొనివున్న శ్రీరామకృష్ణులు తమ శక్తినంతా కూడదీసుకొని లేచి కూర్చుని సుస్పష్టమైన స్వరంలో ఇలా అన్నారు: "నరేన్! మునుపు ఎవరు రాముడుగాను, కృష్ణుడుగాను. అవతరించారో, వారే ఇప్పుడు రామకృష్ణులుగా ఈ శరీరంలో ఉన్నారు. కాని నీ వేదాంత భావన ప్రకారం కాదు." ఎన్నో దివ్య దృశ్యాలూ, శక్తులూ ఆయనలో చూసిన తరువాత కూడా ఇంకా తనకు సంశయం నివృత్తి కాకపోయినందుకు నరేంద్రుడు సిగ్గుతో, అవమానంతో తలవంచాడు.
ఒక రోజు శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి తప్ప తక్కిన తమ యువశిష్యులను పిలిపించారు. ఆయన మాట్లాడలేకపోతున్నారు. అయినప్పటికీ అతి మెల్లని స్వరంలో, "ఇదిగో చూడండి! మిమ్మల్ని నరేంద్రుని బాధ్యతలో వదలి పోతున్నాను. అతడు చెప్పినట్లు మెలగండి. అతడి ఆరోగ్యాన్నీ, శ్రేయస్సునూ గమనించి మసలుకోండి" అన్నారు.
ఆ తరువాత నరేంద్రుణ్ణి పిలిచి, "ఇదిగో చూడు నాయనా, నరేన్! ఈ నా బిడ్డలనందరిని నీకు అప్పగించిపోతున్నాను. అందరిలోను బుద్ధిశాలివీ, ప్రతిభావంతుడివీ నువ్వు ప్రేమతో వారికి నేతృత్వం వహించు. నా కోసం పనిచేయి” అన్నారు.🌹
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి