సుభాషితం:
అభివాదన శీలస్య-నిత్యం వృద్ధోప సేవిన:
1 చత్వారి తస్య వర్ధంతే-కీర్తి రాయు ర్యశో బలం11
తేటగీతి:
మనసు దీర పెద్దలకు నమస్కరించి
ప్రతి దినము వారి సేవలో బరగువార్కి
మహిత కీర్తి, యాయుషు, శక్తి, మంచి పేరు
తప్పక లభించు నాలుగు గొప్పగాను.
భావం: ప్రతి రోజూ పెద్దవారికి నమస్కరించి,
సేవ చేసే వారికి కీర్తి, ఆయుష్షు, మంచి పేరు, శక్తి..అనేవి నాలుగు తప్పకుండా లభిస్తాయి.
పెద్దవారు ఎదురైనప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారము చేయువారికి మంచి జరుగుతుంది అనడంలో సందేహములేదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి