18, మే 2024, శనివారం

విచ్చలవిడిగా విడాకులు

 కాఫీ కబుర్లు 


 -- విచ్చలవిడిగా విడాకులు.


.  కుప్పకూలుతున్న వివాహ వ్యవస్థ..  ---- కొన్ని కొన్ని మాటలు పదాలు తొలగిపోతున్నాయి.. సామెతలకి అర్ధాలు మారిపోతున్నాయి.  పురుషాధిక్యతకి కాలం చెల్లింది.  ఆడది అబల కాదు సబల అని అందరికీ తెలిసింది.   దౌర్బల్యం కాదు.. మనోబలమే ఆడదాని ఆయుధం.  ఉద్యోగ వివాహ రీత్యా కొత్త జీవితం చవి చూడబోతున్న సగటు స్త్రీ ఆలోచనల్లో పెనుమార్పులు.. ఊహించని వాస్తవాలు.  అప్పట్లో సగటు స్త్రీ కోరుకునేది.. తనని ప్రేమించే భర్త, చక్కటి సంసార బంధం, ముత్యాల్లాంటి పిల్లలు.. ఇవే.  ఇప్పుడు యువతి కోరుకునేది.‌.  లక్షకి పైన జీతం ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న భర్త, మూడో వ్యక్తి ప్రమేయం లేని సంసారం, ఆధునిక జీవనశైలి.  ఆడపిల్లలు కూడా ఉద్యోగస్తులే, భర్తల ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న భార్యలు ఉన్నారు.  అంటే ఇంకొకరిపై ఆధారపడవలసిన అవసరంలేదు. స్వేచ్ఛగా ఉండొచ్చు.. యథేచ్ఛగా ఖర్చు పెట్టుకోవచ్చు.  ఎవరిని కేర్ చేయాల్సిన అవసరమే లేదు.  సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటే దూరప్రాంతాలే, దూరదేశాలే.  ఐనవాళ్ళకి బంధువులకి దూరంగా.. పూర్తి స్వాతంత్ర్యం జీవితం.  భర్త చాటుమాటున్న భార్య..  ఇప్పుడు తన భర్తనే ఒకాట ఆడించేస్తుంది.. కబాడీ ఆడేసుకుంటుంది..  సంపాదన స్టేటస్, లైఫ్ స్టైల్ ముఖ్యం అంటోంది‌‌.. అందాన్ని హరించే మాతృత్వం అవసరం లేదంటోంది.. జీవితాన్ని హాయిగా అనుభవిస్తూ యాభై ఏళ్ల జీవితం చాలంటోంది.. అనారోగ్య బాధలతో అరవై దాటిన వృద్ధాప్యం ఎందుకని ప్రశ్నిస్తోంది..  30 సంవత్సరాల తరువాత జీవితం గురించి ఆలోచనే వ్యర్ధం అంటోంది..  ఫాస్ట్ ఫుడ్స్, రెస్టారెంట్ల ఫుడ్డే కావాలంటోంది..  వంటగది వ్యర్ధం అంటోంది..  హాయిగా ఉన్న ప్రతీరోజూ పండుగే అంటోంది.  భర్త ఆలోచనలు గుణాలు ఏమాత్రం నచ్చకపోయినా అవసరం లేదని విడాకుల వైపు పరుగెడుతోంది.  సహజీవనం ఉత్తమం అంటోంది.  భారతీయ వనిత ఎంతగా ఎదిగిపోయింది.. ఫలితంగా పెద్దలకి భావి జీవితం అయోమయం.  తప్పు పట్టాల్సిన అవసరంలేదు.  కాలం ఆధునికత సంతరించుకుంది.  పప్పన్నం ఎప్పుడు పెడతారు..  సంవత్సరం తిరిగేసరికి పండంటి మనవణ్ణో మనవరాలినో చేతిలో పెట్టాలి కోడలా .. వంటి డైలాగ్స్ కి కూడా కాలం చెల్లిపోయింది.  గొడ్రాలు అంటే ఏమిటో నేటి యువతకి తెలియదు.  డిటాచ్మెంట్ యుగంలో ఉన్నాం. ఎక్కడో ఉన్న   మన పిల్లలకి మన గురించి పట్టించుకునే తీరిక ఓపిక ఉండవు.  ఐనా అరుదుగా.. దూరంలో ఉన్నా తల్లిదండ్రుల బాధ్యతల్ని పట్టించుకుంటూ అవసరాలు సమకూరుస్తున్న పిల్లలు కూడా లేకపోలేదు.  ఈ కోవలో ఉన్న పెద్దలు అదృష్టవంతులే కదా..  ----- సేకరణ

కామెంట్‌లు లేవు: